హిపోక్రాట్
బాగా ఆలోచిస్తే ...
ఈ ప్రపంచంలో ...
అతిపెద్ద హిపోక్రాట్ అద్దమే1
మన ముఖమెంత ముదిరిపోయినా
'స్కిన్ టోన్ అద్భుతం' అనిపించేలా చూపిస్తుంది.
మన ముఖం వైపు మరోసారి మరెవ్వరూ చూడకపోయినా ...
మనం మాత్రం మాటిమాటికి చూసుకునేలా చేస్తుంది.
'మన బదులు ఐశ్వర్యారాయ్ మిస్ వరల్డ్ ఎలా అయ్యింది?'
అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
'అభిషేక్ నాకన్నా అందగాడా ఐష్ వరించడానికి?'
అనే ఆలోచనను కలిగిస్తుంది.
లంబోదరులకు, గజకాయులకు
'పర్లేదు, మరీ లావేం లేవు.' అని ఓదార్పు నిస్తుంది
బ్రహ్మానందానికి 'బిగ్ బి ' ననే ఫీలింగును,
కోవై సరళకు కరీనా కళను కలగజేస్తుంది.
వర్ణభేదాలు, వయసుతేడాలు
ఏమాత్రం తన హిపోక్రసీని కరిగించలేవు.
ఎందుకంటే .....
అద్దం మన ప్రతిబింబం.
అంటే అంతరాత్మకు ప్రతిరూపం.
అంతరాత్మ పరమాత్మకు అనుసంధానం.
అదే ఇచ్చింది దానికి ఈ నొప్పించని నైజం.
అందుకే అద్దం.....
అతిపెద్ద హిపోక్రాట్
ఇది నిజం.
%%%%%%
- సాహిత్య ప్రస్థానం ఆగష్ట్ 2011
కూపస్థ లేక కూప[వ్యవ]స్థ
ఇదో కూపం.
ఇందులో పడ్డ ఎవరైనా మునగానాం.......తేలానాం.
మునుగుతూనే బుర్ర బద్ధకిస్తుంది.
ఇంతకంటే మరో ప్రపంచం ఉంటుందనే ఆలోచన మందగిస్తుంది.
దాంతో ఆ ప్రపంచంలో అస్తిత్వానికై మొదలైన యావ
ఆధిపత్యం వరకు కొనసాగుతుంది .
రాజారాణీలలా చెలాయింపు .......
కూపంలోని గూళ్ళలోనే బదలాయింపు .
పదిమందిని చంపిన డాక్టర్ గొప్ప వైద్యుడై నట్లు
'పని' మందిని అణిచేసినవాడు గొప్ప 'పని'మంతుడు అక్కడ .
'పని=మనీ' ఇది ప్రాథమికసూత్రం .
'మనీ + షి = మనిషి ' ఇది అనునిత్యసత్యం .
పైరవీలు ,పదవీపోరులు కంపరపు స్థాయిని దాటిన కఠోరదృశ్యం.
దుండగాలు ,దుస్తంత్రాలు దృశ్యమానమయ్యే కరాళనృత్యం .
మానవత్వం ,తార్కికజ్ఞానం - ఇవి నిఘంటువు నుండి లుప్తం .
అతితెలివితనం, అవినీతికోణం ఈ కూపపు కుడ్యాల్లో స్థగితం .
......ప్రతి అవసరార్థం .
మొహమెచ్చులు , మెహర్బానీలు - లాక్షణికం .
మూతివిరుపులు , చెవికొరుకులు -సార్వజనీనం .
ఇంకా అర్థం కాలేదా ?
అది ప్రభుత్వ కార్యాలయం .
&&&&&&&&&
ఇదంతే
ఏంటిదంతా అని ఆశ్చర్యపోకు
ఇదంతే ------ఇలాగే వుంటుంది
నీ ముఖం ఆశ్చర్యార్థకచిహ్నంగా మారినంత మాత్రాన
మాపనులకేమి ఫుల్ స్టాప్ పెట్టం .
నీ ఆశ్చర్యాన్ని చూస్తుంటే ........
నీవు ఏ పాతరాతియుగంలోనో కోమాలో కెళ్ళి ,
దాని క్కాస్త కామా పెట్టి వచ్చినట్లనిపిస్తోంది .
నీ వనుకుంటున్న అర్థం లేని విలువలను
'అర్ధ' వంతంగా మార్చుకోగలిగిన బుద్ధిశాలులం మేం.
సభ్యత, సంస్కారం అని నువ్వు వల్లె వేసే పాఠాలు
అన్నివేళలా చూపడం అవజ్ఞత.
అవసరమైనచోట ప్రదర్శించడమే నేడు విజ్ఞత .
దారి తప్పి తబ్బిబ్బు అవుతున్నావా?
ఓ అపరిపక్వవ్యక్తీ !
చేతనైతే ఇలా మారు.
చేవ లేదా చచ్చి బతుకు.
ఇదింతే !!!!!!!!
సిటీ గాళ్
సిగ్గుదొంతరలతో వారింపులు ఆశించకు
శిథిలమైన నా సిగ్గు ఉనికి సిగ్గు వదిలిన స్టార్ కనెక్షన్ కు తెలుసు.
శృంగారపు కబుర్లకు కవ్వింతలు ఆశించకు.
కొయ్యబారిన నా కవ్వింతల ఉనికి ఈవ్ టీజర్స్ బండ జోకులకు తెలుసు
నీ మృదు స్పర్శలకు నా పులకింత లాశించకు
బండబారిన నా పులకరింత ఉనికి కాలుదూరని సిటీ బస్సుకే తెలుసు .
జోడుగా నీతో సయ్యాటాడే ఈడును నువ్వా శించకు
ఇంచు మించు మెనోపాజ్ చేరిన నా ఈడు ఉనికి
మొయ్యలేని చదువుకు
. ఇవ్వలేని కట్నానికి
కలవలేని జాతకాలకే మా బాగా తెలుసు
మనోశీలాన్ని నీవు మరి అసలాశించకు
శరీరానికే ఆగిన నా శీలపు ఉనికి
అడుగుగడుగున దిగజారిన సంఘపు పోకడకు తెలుసు
కార్యేషు దాసంటి గుణములను ఆశించకు
అమ్మలనాడే ఆగిన ఆ ధర్మపు ఉనికి
చెయ్యక తప్పని నా ఉద్యోగపు ఉరికి తెలుసు .
నవ్య వారపత్రిక , ఫిబ్రవరి, 2012
ఒరే ! - ఒసే
ఏంట్రా అలా చూస్తున్నావ్?
ఏంటా ఉలికిపాటు?
ఓహో! ఒరే అన్నాననా?
ఆరే ! కల్చర్ద్ సొసైటీ కన్నెపిల్ల
.లేటెస్ట్ పిలుపది తెలీదూ!
మన తెలుగు సినిమాలు త్రవ్వి పోస్తున్నాయ్ . వినలేడూ !
ఏంటంతలోనే అంత ఉత్సాహంగా ఉబుకుతున్నావ్ ?
ఓ! నీలోనుండీ ఒసే అనే పిలుపు వొరుసుకు వస్తోందా!
ఓకేరా !దాందేముంది ? అలాగే కానీరా!
నిన్నటి ఆ కుసంస్కారపు పిలుపులే
నేడు అతిసారపు వయ్యాయోయ్!
సహజమేగా ! ఆదిమానవుని గోచిలాంటి
అతిచిన్నగుడ్డపేలికలేగా
నిన్నటి నిండు వస్త్రధారణను కాల్తో తన్ని
నేటి మోడ్రన్ ఏజ్ ను
మోకాళ్ళ పైన ఏలుతున్నాయ్ !
అందుకేరా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్ ' అన్నారు
కళ్ళలో ఒత్తు లేసుకుని కామిక్సేం చదవక్కర్లే------
మరో మూడేళ్ళల్లో మనమేరా 'కానిబల్స్ '
ఎన్. జి ఓ.
టెన్ టు ఫైవ్ జాబ్
వైట్ కాలర్ జాబ్
కుళ్ళుకుంటున్నావా?
నన్ను చూచి ఏడవకోయ్ పిచ్చోడా !
ఇది నథింగ్ బట్ తల తాకట్టు .
నా వేళలు నావి కావు
నా రోజులు నావి కావు
ట్రాఫిక్ జామైనా , బహుజరూరు కామున్నా
అఘమేఘాల మీద ఆఫీసులో వాలాల్సిందే !
లేకుంటే లేట్ లిస్టులో చేరాలి
మూడుసార్లు 'లేట్' అయితే [అపార్థం చేసుకోకండి - అటెండెన్స్ లో] మటాష్ .
.బాగా పని చేసినందుకు కిరీటాలు , ముఖ్యమైన సీట్లు .
ముఖ్యమైన సీట్లలో ఉంటే సాయంత్రాలు . యంత్రాలు
పరపతి ,గౌరవం ఎట్సెట్రా వెయ్యుంటాయి
కానీ వాటికి షుగరు , బీ పీ జోడౌతాయ్
ఏ/సిలు ,కూలర్లు ఉంటాయి కాని
అవి ఎప్పుడు పనిచేస్తాయి?
అదృష్టముంటే ఆఫీసర్ గా ఎగబాకు !
అవకాశముంటే అటెండర్ గా దిగజారు !
అంతే గాని-----
ఎన్ - నడిమధ్యన
జీ - గతిలేని
ఓ - ఓ వుద్యోగివి మాత్రం కాకు .
-- ఎంప్లాయీస్ వాయిస్ , 2011
గృహ ప్రవేశం
అక్కడ గృహప్రవేశాలేవీ జరగవు
గంటకో గృహం వెలుస్తున్నా !
అక్కడ ఇల్లు కట్టడానికి ఎవరికీ బ్యాంక్ లోన్ అక్కరలేదు
సొంతఇల్లు కడుతున్నా.
ఇల్లుకట్టడం వీళ్ళకు నీళ్ళప్రాయం
పోలీస్ లొచ్చి పీకేసి వెళ్ళేది ఎంకరోచ్మెంట్ అని వీళ్ళ ఇళ్ళనే
వాళ్ళ చెయ్యి తడిపేందుకు వీళ్ళకు కరువు నీళ్ళకూ
అయినా బాధలేదు వీళ్ళు పేద్ద లాండ్ లార్డ్ లు, కబ్జాకోరు రియాల్టర్లు
నగరంలో ఫుట్ పాత్ లన్నీ వీళ్ళవే!
ఇళ్లు కట్టుకునేందుకు మూలధనం
కుప్పతొట్లే సాధనం
బాండ్ మేళాలుండవు బంధువుల వేళాకోళాలుండవు
అయినా గంటకో గృహం అవిశ్రాంతంగా వెలుస్తూనే ఉంటుంది
ఆమె భారతమాత కాదు
భారతమాత - మన భారతమాత
అరవై సంవత్సరాలు దాటిన స్వతంత్ర జీవనం తర్వాత కూడా
స్వయంసమృద్ధి చిన్నెలు నోచుకోలేదు ఆమె రాత
'పారతంత్ర్యపు పాయసం కన్నా స్వాతంత్ర్యపు గంజి మేలు ' అన్నది ఓ కవి పాట
బహుశా పాడి ,పాడి దేశమాతకు లక్ష్మణగీతను చేశామేమో ఆ మాట
ఆ గంజిని దాటి ఆమె ముందడుగు వేయలేకుంది ఏ పూటా
అందుకే మన భారతమాత స్వయంప్రతిపత్తికి నోచుకోని ఓ సీత
అసలా 'మాత' అనే పిలుపులోనే గోచరిస్తోంది లోపమంతా !
ఎందుకంటే ----
మాత ఎంత ప్రేమగా పెంచినా,ఎంత అనురాగం పంచినా
బరువే అవుతుంది మనపై ఆధారపడే సమయాన .
బహుశా 'చెట్టుకు కాయ భారమా !' అనే తల్లికి అన్వయించే సామెతను
సరిగ్గా వెనుదిప్పి తమకు అన్వయింపచేసుకుంటారేమో పిల్లలంతాను
అందుకే -----
'కాయకు చెట్టెపుడూ భారమే '
పెద్దలైన పిల్లలకు తల్లెప్పుడూ కారమే '
కన్నతల్లి నెప్పుడూ కాల్చుకుతినే మనం
మన పిల్లల కాలి చిటికెనవేలునైనా కందనీయం
అట్లే దేశమాత ఒడిలోని అన్ని వనరులనూ భోంచేస్తాం
అట్లే దేశమాత ఒడిలోని అన్ని వనరులనూ భోంచేస్తాం
ఆమె కష్టనష్టాల సమయంలో ముఖం చాటేస్తాం
మనం నేతులు తాగిన తాతల వాసన మిగిలిన మూతులం
నేతకు ,గాంధీతాతకు వారసులౌ కుక్కమూతి పిందెలం
కడుపులో పడగానే మనకు పుట్టబోయే పిల్లల
పురోభివృధికి బాటలు వేసే మనం
కన్నతల్లికి కడుపు నిండా తిండి పెట్టడం కూడా అనుకుంటాం వ్యయం
అదే కడుపులో ఓనాడు ఆమె ఆహారాన్ని మింగేస్తూ తెగ బలిసుంటాం మనం
కన్న పిల్లల కెరీర్ కోసమో కట్నం కోసమో
తమ తల్లి కిడ్నీని అమ్మడానికైనా సిద్దం జనం
ఆ యత్నంలో ఆమె ప్రాణం పోతే ఓల్డేజ్ హోమ్ ఖర్చు
మిగిలిపోయిందని ఆనందంగా నిట్టూరుస్తుంది మనం
ఇలాంటిదేగా నేటి దేశ రాజకీయాల వైనం
దేశమాతను క్రమంగా విదేశీపాదాల క్రిందికి చేరుస్తున్న విధానం
దేశీవిజ్ఞానాన్నంతా పరదేశపాలు చేస్తున్న కథనం
ప్రతిపక్షం పేరిటా అభివృధికి అడ్డుపడే సుగుణం
ప్రజాస్వామ్యాన్ని పెనుమంటల పాలు చేసే జతనం
దేశమాతకు మరోసారి సంకెళ్ళు పడితే
రావ్ బాహద్దూర్లు, సర్ బిరుదులూ దొరల చేతుల మీదుగా
పొందవచ్చునని ఆనందించేంత బానిసగుణం
పంచవర్ష , వింశతివర్ష ప్రణాళికలు కాగితంఫై కూడా
చూపించ నక్కరలేదనే స్థాయి దిగజారుడుతనం .
దీనికంతా కారణం మనం దేశాన్ని ముసలిమాతగా తలచడమే!
అందుకే నేటి మన దేశదుస్థితి తొలగాలంటే
ముందుగా 'భారతమాత' అనే పిలుపు మారాలి
భారతాన్ని అనుకోవాలి మన ముద్దుబిడ్డగా
భారతాన్ని అనుకోవాలి మన ముద్దుబిడ్డగా
ఇకఫై పిలవాలి ఆమెను భారతసుతగా.
అప్పుడే మసలుకుంటాం మనం జాగ్రత్తగా.
నడిపిస్తాం ఆమెను ఎంతో బాధ్యతగా.
ఆ తర్వాత చూడండి మన భారతి భవిత
అతిత్వరలో అవుతుంది ఆమె జగజ్జేత.
అమ్మా! నీ వొక బొమ్మవా ?
అమ్మా! నీ వొక బొమ్మవా ?
అన్న అమెరికా చదువు కోసం నీ ప్రతిభను పరిషత్ బడికి పరిమితం చేస్తే
చాకలిపద్దులు చదవనూ, మహారాజరాజశ్రీ శ్రీవారి పాదపద్మములకు నమస్కరిస్తూ లేఖాంశములు వ్రాయనూ వచ్చిందిగా అంటూ
అసంతృప్తిని ఆనందపు టూర్పుగా మలచగలిగావే !
ఎందుకమ్మా! నీ వొక బొమ్మవా?
పుట్టింటికి రాబోయే లక్షల సాయం కోసం
ముందుభార్యను మర్డర్ చేసిన మగాడికి
రెండో భార్యగా రగిలే గుండెను వెచ్చని కన్నీళ్ళతోనే చల్లార్చి
రాగా లొలకబోస్తూ వెళ్లావే !
ఏమ్మా ! నీ వొక బొమ్మవా?
నాకేం? నే మగాడిని నా కెన్ని ఇండ్లైనా ఉండొచ్చని
మీ ఆయన గర్వంగా మీసం మెలేస్తే
ఆక్రోశించే గుండెను అడకత్తెరలో వేస్తూ
ముసిముసినవ్వులు చిందావే?
ఔనామ్మా? నీ వొక బొమ్మవా?
ఆడపిల్లను కన్నావని ఛీత్కారాలు
మగబిడ్డను కన్నావని నజరానాలూ
ఆడదాని వయ్యుండీ మౌనంగా అందుకున్నావే ?
చెప్పమ్మా ! నీ వొక బొమ్మవా?
సంపాదించేంతవరకే సమానత్వం అంటూ
నీ నెలజీతాన్ని అకౌంటెంట్ టేబుల్ మీది నుంచే
తన జేబులో వేసుకునే నీ భర్త సంపాదనను
నీవూ అలా హాండ్ బాగ్ లో వేసుకోలేక
"ఏమండీ ! పాస్ కొనాలి డబ్బివ్వరూ"
అంటూ ప్రాధేయపడతావే!
ఏంటమ్మా ! నీ వొక బొమ్మవా?
ఆఫీస్ లో అరవచాకిరీ చేసి అయిదింటికి నీవు
పడుతూ లేస్తూ ఇంటికి వచ్చి
'ఏంటా ఏడుపుమొహం' అంటాడని
M TV చూస్తూ ఆరాంగా ఆపసోపాలు పడుతూ
M TV చూస్తూ ఆరాంగా ఆపసోపాలు పడుతూ
కూర్చున్న ఇంటాయనకు
నవ్వులు పులుముకొని టీ టిఫిన్లు అందిస్తావే !
ఇదేంటమ్మా ! నీ వొక బొమ్మవా?
' ఏం ఆడవాళ్లైతే మాతో సమానంగా జీతాలు తీసుకోవడంలేదా?'
అనే అక్కసుబోతులను
'మీలా టీలు, సిగరెట్లూ అంటూ నేను
గంటల తరబడి సీటు వదిలి సరదా చేస్తున్నానా ?'
అని నిలదీయక
ప్రకృతిధర్మంగా ష్త్రీ కొచ్చే అన్ని ఇబ్బందులనూ
పావుగంటైనా పర్మిషన్ తీసుకోకుండా
పంటిబిగువున భరిస్తావేమ్మా!
నీ వొక బొమ్మవా?
రెడ్ లైట్ వీధిలోనైనా, వైట్ హౌస్ పరిధిలో ఉన్నా
నిన్ను అవసరానికి వాడుకున్న మగాడు
ఆడదాని చొరవే అనర్ధాలకు హేతువని
ఉవాచలు విసురుతుంటే
అసహాయంగా కన్నీళ్లు కారుస్తావే తప్ప
అమ్మగా అందమైన ఆడబొమ్మగా కూడా
నేనేనోయ్ నీ ఆకలి (ళ్ళు) తీర్చగలిగేదానినని
చనుబాలు కక్కేలా సమాధానం ఇవ్వవేమ్మా !
నీ వొక బొమ్మవా?
- భూమిక, జూలై 2011
ఎంత బాగుండేది ?
ఓ పువ్వు నైనా ఎంత బాగుండేది ?
ప్రతిఫలాపేక్ష లేకుండా అందంతో , సుగంధంతో
అందరినీ అలరించి ఉండేదాన్ని.
ఓ ఆకునైనా ఎంత బాగుండేది?
స్వార్థానికి తావు లేకుండా పచ్చదనంతో
వాతావరణ సమతౌల్యానికి వెచ్చదనాన్నిచ్చేదాన్ని.
ఓ పండునైనా ఎంత బాగుండేది?
స్వప్రయోజనాన్ని కోరకుండా కమ్మదనంతో, తియ్యదనంతో
ఓ ఆకలి కడుపును నింపి ఉండేదాన్ని
ఓ జలబిందువునైనా ఎంత బాగుండేది ?
ఎలాంటి కుయుక్తులకూ లోనుకాకుండా ఆర్ద్రతతో
ఓ ఎండుమొలకనైనా చక్కగా బ్రతికించేదాన్ని
ఓ మండునాలుకనైనా చల్లగా తడిపి ఉండేదాన్ని .
ఓ బుల్లిపిట్టనైనా ఎంత బాగుండేది ?
నాకేంటని అనకుండా ముక్కుపట్టుతోనో , చిన్నిరెట్టతోనో
ఫలదీకరణానికో, పలుమొక్కలు మొలచటానికో
సాయపడి ఉండేదాన్ని.
ఇవేవిగానూ కాకుండా
స్వార్థంతో , సంకుచితత్వంతో కుళ్ళిపోతున్న
నీచమానవజన్మ నా కెందుకిచ్చావ్ ప్రభూ !
ఇది ఏ జన్మలో నే చేసిన పాపానికి నీవిచ్చిన శాపం?
"అవును. మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించాం!"
శ్రీశైలశిఖరాన్ని దర్శించే పుణ్యపురుషు లెవరికైనా
మరోజన్మంటూ ఉండదట.
స్కానింగ్ యంత్రాన్ని సందర్శించే స్త్రీ శిశువుకు
అసలు ఈ జన్మే ఉండదట.
కాబట్టి మగాళ్ళ కన్నా మేమే ముందున్నాం.
ఔను! మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించాం.
మగాళ్ళతో పాటుగా మేమూ ఉద్యోగాలు చేస్తున్నాం
ఆపై మగాడు వీధిన పడితే
వంటింటి ఆధిపత్యం కూడా మేమేగా చేస్తున్నాం.
అందుకే మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించాం.
రేజర్ బ్లేడ్ నుంచి అండర్వేర్ దాకా అన్ని యాడ్లలో మేమున్నాం.
మగవస్తువైనా అర్ధనగ్నపు ఆడప్రకటనే గతిగున్నాం.
కాదనగలరా ! మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించామంటే.
సమాన చదువులు చదివిన వరుణ్ణి కట్నమిచ్చి మేం కొంటున్నాం.
భార్యాభర్తల వ్యాపారంలో యజమానిని హోదా పొందుతున్నాం.
ఇప్పుడు చెప్పండి. మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించామా? లేదా?
మగాడితో సమానంగా మేమూ వేతనం అందుతున్నాం.
ఉద్యోగపు స్థాయి ఏదైనా అదనంగా లైంగికవేదనం పొందుతున్నాం.
ఇది సమానత్వం కన్నా ఎక్కువ సాధించడమేగా?
ఎ వేళైనా వీధిన తిరిగే మగాడెప్పుదూ ఒంటరి.
అన్నివేళలా మా వెనువెంట అన్నో, తమ్ముడో కాపరి.
అర్ధరాత్రి వరకెందుకూ పట్టపగలే మాకు అంగరక్షకుల సిరి.
ఎవరక్కడ ఇంకా సమానత్వం అంటున్నది.
మేం అంతకన్నా ఎక్కువే సాధించాం.
అసామాజికంగా పొందే ఆనందంలో ఇద్దరం భాగస్వాములమే అయినా
ఫలితాన్ని మాత్రం మేమేగా పొందుతున్నాం.
సమాజం ముందు వేదికపై వేడుకగా నిలబెట్టబడుతున్నాం.
కాబట్టి ఓ మగమహాశయా!
ఇందుమూలంగా మేం ప్రకటిస్తున్నాం.
మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించాం.
దీపావళి
వెల్డర్ చేతిలో వెలిగే వెన్నముద్దలు
కమ్మరి కొలిమి చిమ్ము చిచ్చుబుడ్లు
కుమ్మరి వాకిట తిరిగే భూచక్రాలు
వడ్రంగి ఉలిసుత్తుల డాం టపాసులు
ఫాక్టరీ లెగయు పొగల పాం బిళ్ళలు
దారిద్ర్య నరకుని శ్రమశక్తి భామ
నాశనము చేస్తోందని
శ్రామికకార్మికులంతా చేసెడి దీపావళిది.
ఇవి చల్లగా ఉన్నన్నాళ్ళు అనునిత్యదీపావళి.
ఈ సంబరం మూత పడిన రోజు పున్నమైనా
దేశమాత కంటినిండా కన్ను పొడిచినా కానరాని
కటిక అమావాస్యే!
అమ్మ
అమ్మ ఒడి వెచ్చదనమే కాదు
అమ్మ పాల కమ్మదనమే కాదు
అమ్మ మేని బిరుసుదనం
అమ్మ రక్తపు ఉప్పదనం కూడా
ఆమె కడుపును చల్లగా కాచాయి.
ఆమె కన్నకొడుకుకు ఊపిరు లూడాయి.
అంటారుగా ఏనుగు చచ్చినా బతికినా అమూల్యమని -- ధర కట్టినపుడు.
చూశారుగా అమ్మ ప్రేమ ఊపిరున్నా లేకున్నా సజీవమని -- ధర కదిలినపుడు.
( బూచ్ గ్రామంలో కూలిన భవనపు శిధిలాల క్రింద కొయ్యబారిన తన ఒడిలో ఉన్న పసికూనకు స్థన్యం ఆగిపోతే తన నుండి కారుతున్న రక్తాన్నిచ్చి బతికించుకున్న నిర్జీవ మాతృమూర్తి సజీవప్రేమ స్మృతికి అంకితం.)
రాజకీయం
ఓ కుందేటి ముసుగు లోని తోడేలు
ఓ వానపాములా అగుపడే త్రాచుపాము
ఓ మేక ముఖమున్న మెకము
ఓ చిలుకలా కనబడే గ్రద్ద
ఓ ఆవులా అనిపించే అడవి సింహం
వీరే మన రాజకీయనాయకులు.
వీరిలో ఎవరిని ఎన్నుకుంటారో మీ ఇష్టం.
సుభద్ర దు:ఖం - సిటీ బస్సు రూపం
ఎంత దురదృష్టపు కడుపురా నాది అభిమన్యా !
పాలు కారే నిన్ను ఆ పాపి పద్మవ్యూహపు పాల్జేశాను.
ఎంత పని జరిగింది నాయనా !
ఈ గర్భశోకం మరే తల్లికీ రానీకు అన్నా కృష్ణా !
కనికరం లేని కఠినదైవతములారా!
నా ఆక్రోశం మీ కర్ణకాననముల పడలేదా ?
సరే కానిండు.
తల్లులారా ! మీ రెవ్వరూ భయపడకుడు.
కాలిన తల్లికడుపు ఇస్తున్న అప్రతిహత అభయమిది.
ఇక నా చిట్టితండ్రినిలా మీ బిడ్డలను
ఏ పద్మవ్యూహమూ చీకాకు పెట్టకుండా
మీ యుగంలో సిటీ బస్సులు ఏర్పడి
వారల నేర్పరుల చేయుగాత !
స్నేహం
దీని మారుపేరు అవసరం .
తీరనంతవరకూ అది వరం .
ఏరు దాటాక అది తగలబడే పడవ రకం
మరవకు అది తుమ్మితే ఊడే నాసికం
దాని పైనా నీ ఆశలు
అయ్యో అది నదిలో చింతపండు పిసకడం
తివిరి ఇసుమున తైలమ్ము తీయడం .
తీరనంతవరకూ అది వరం .
ఏరు దాటాక అది తగలబడే పడవ రకం
మరవకు అది తుమ్మితే ఊడే నాసికం
దాని పైనా నీ ఆశలు
అయ్యో అది నదిలో చింతపండు పిసకడం
తివిరి ఇసుమున తైలమ్ము తీయడం .
అంపకాలు
K G చదువుల భారాన్ని మోసి క్రుంగిపోయింది నా కన్నతల్లి
ఓ మామగారూ! నా బిడ్డ పైన బాధ్యతల బరువుల్ని తోసేయ్యకయ్యా!
సిటీబస్సుల్లో ఒత్తిళ్ళ తోటి వడలిపోయింది నా చిన్నితల్లి !
ఓ అత్తగారూ ! పెత్తనం అంటూ నా కూతు నింకా వేధించకమ్మా !
టీనేజ్ నుండి టీజర్స్ మాటలకు విసిగిపోయింది నా చంటితల్లి.
ఓ ఆడబిడ్డా ! అర్ధమొగుడి నంటూ నా పిల్ల నింకేమి సాధించకమ్మా !
మేధావి చదువుల్లో రాగింగ్ తోటి రంపాల పాలైంది నా ముద్దుతల్లి !
ఓ అల్లుడుగారూ ! భార్యేగా అంటూ రాత్రైనా పగలైనా నొప్పించకండి
వంటిల్లు - ఓ సెల్లు
కేంద్రకారాగారం ఈ ఇల్లు - అందులో సాలిటరీ సెల్లు వంటిల్లు .
కళాకారిణిగా గుర్తింపు కోసం నేను వేదన పడే సమయంలో
'ముందు సక్రమమైన గృహిణిగా అన్నం వండి పెట్టు '
అని దెప్పి పొడిపించే ఆ వంటిల్లే నాకు వద్దు .
గృహిణీత్వానికి గీటురాయిగా తరతరాలుగా నాటుకుపోయిన
ఆ పాతవంటింటి ప్రమాణం నాకు కాదు ముద్దు
గృహిణి గీర్వాణి కూడా అని చాటి చెప్పగలిగేలా
చూడకూడదని నాకేం లేదు జిద్దు
అలాకాక మధ్యకాలపు మగువల్లా వంటింటి కుందేలు
కావడం నా తత్వానికి కాదు కద్దు
'అమ్మా ! ముందు నీ పిచ్చిగీతలు , రాతలు ఆపి నా ఆకలి
సంగతి చూడ' మని అమ్మను కొడుకు అడిగేలా
చేసే వంటిల్లు నాకో హద్దు .
ఎవరికి ఓపిక ఉంటే వారు , ఎప్పుడు ఆసక్తి కలిగితే
అప్పుడు వంట చేసే సామ్యవాద వంటరికం బహుపసందు
అదే కావాలి నాకు మున్ముందు
పనిలేకున్నా పోజులు కొడుతూ వంటమనిషిని ఏర్పాటు చేనుకునే
తాహతున్న అమ్మలకు కావచు వంటిల్లు థ్రిల్లు
వనిత = వంటిల్లు అనే దిగువమధ్యతరగతి కుటుంబంలోని
ఓ కళాకారగృహిణిగా నాకది క్షణం క్షణం గుండెలోతుల్లో గిల్లు
కళాకారిణిగా గుర్తింపు కోసం నేను వేదన పడే సమయంలో
'ముందు సక్రమమైన గృహిణిగా అన్నం వండి పెట్టు '
అని దెప్పి పొడిపించే ఆ వంటిల్లే నాకు వద్దు .
గృహిణీత్వానికి గీటురాయిగా తరతరాలుగా నాటుకుపోయిన
ఆ పాతవంటింటి ప్రమాణం నాకు కాదు ముద్దు
గృహిణి గీర్వాణి కూడా అని చాటి చెప్పగలిగేలా
స్వచ్చందంగా మనగలగాలంటే కావాలి వంటిల్లు రద్దు
వంటను విధిగా కాక కళగా చూడగలిగిననాడు అటువైపు చూడకూడదని నాకేం లేదు జిద్దు
అలాకాక మధ్యకాలపు మగువల్లా వంటింటి కుందేలు
కావడం నా తత్వానికి కాదు కద్దు
'అమ్మా ! ముందు నీ పిచ్చిగీతలు , రాతలు ఆపి నా ఆకలి
సంగతి చూడ' మని అమ్మను కొడుకు అడిగేలా
చేసే వంటిల్లు నాకో హద్దు .
ఎవరికి ఓపిక ఉంటే వారు , ఎప్పుడు ఆసక్తి కలిగితే
అప్పుడు వంట చేసే సామ్యవాద వంటరికం బహుపసందు
అదే కావాలి నాకు మున్ముందు
పనిలేకున్నా పోజులు కొడుతూ వంటమనిషిని ఏర్పాటు చేనుకునే
తాహతున్న అమ్మలకు కావచు వంటిల్లు థ్రిల్లు
వనిత = వంటిల్లు అనే దిగువమధ్యతరగతి కుటుంబంలోని
ఓ కళాకారగృహిణిగా నాకది క్షణం క్షణం గుండెలోతుల్లో గిల్లు
ప్రమాదకుబేరులు
అన్యాయాలకు ఆకటిల్లిన పుడమితల్లి ఓ చోట బీటలు వారితే -------
తన చెలి భూమి రోదనను సహింపలేక మరోచోట
సంద్రుడు ఉప్పొంగి ఊళ్ళను తుడిచేస్తే ------
రైలు ఎక్కడైనా పట్టాలు తప్పితే ------
బస్సు ఇంకెక్కడైనా బోల్తా పడితే --------
బొట్టు పెట్టి ఎవ్వరూ పిలవాల్సిన అవసరం లేకుండా వీరు అచట హాజరు
రెక్కలు కట్టుకొని వాలిపోతారు
సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతారు
'అమ్మా!' అంటూ ఎక్కడో లోతుల్లో వినిపించే మూలుగును
ఆసరాగా చేసుకొని ఆమెను చేరుతారు
అసహాయురాలైన ఆమె నగలను తమ వద్ద భద్రపరచుకుంటారు
తన కూతురి పెళ్లి కోసం అప్పు చేసి తీసుకెళుతున్న డబ్బుసంచి
ఎక్కడో పడిపోయిందని కదలలేక విలపించే
కాళ్ళు విరిగిన తండ్రి ఆత్మశాంతించేలా
ఆమూటను తమ కూతురి పెళ్లికి భద్రం చేస్తారు
నగలు , సంపదలు మిథ్య అని విన్న వీరు
వాటిఫై మమకారంతో పూర్తిగా ప్రాణాలుపోక కొట్టుకులాడే వారికి
వాటిని లాగేసి శాశ్వతముక్తిని ప్రసాదిస్తారు
పుట్టినప్పుడు వచ్చినట్లుగానే పోయేటప్పుడు వెళ్ళాలని ఎరిగిన వీరు
శవాలకు నిలువుదోపిడీ చేసి మరీ సాంప్రదాయాన్ని నిలబెడతారు
తుచ్చమైన మానవజన్మలకు పట్టులైన దేహాలపట్ల అభిమానం తుంచుకున్న వీరు
కుప్పలుగా పడిపోయిన శవాలను పెకలించి , మాంసఖండాలను విభజించి
నాశం కాని బంగారం, సంపదలను వెలికితీసుకుంటారు
కూలిపోయిన భవనాల అడుగున వీరు పడ్డ శ్రమలకు ఫలితంగా
కళ్ళు తిరిగే భవంతులు ఊళ్ళలో వీరి పేరున రూపు దిద్దుకుంటాయి
ఉప్పెనల్లో వీరుపడ్డ వేసటలకు ప్రతీకగా వెరైటి కార్లు వీరి సంపదకు జత కూడుతాయి
వీరు ఏ ప్రమాదస్థలాల్లోనూ పతకాల కోసం పేర్లు నమోదుచేసుకోరు
పక్కవాడికి కూడా తమ చిరునామా చెవి నేయరు
గుప్తసేవకులు వీరు
జీవిక కోసం వెంపర్లాడుతూ సమయం వృధా చేస్తూ కూర్చోక
ఇలాంటి సేవలకే జీవితాలను చేస్తారు అంకితం
అందుకే అమూల్యమైన వీరి సేవలకు వీరే సేకరించుకుంటారు మూల్యం
ఓనాడు దరిద్రులైనా ఇలాంటి సేవలే వారికి కూర్చాయి సంపదలు.
"అందుకే వీరు ప్రమాదకుబేరులు "
ఇలాంటి సేవలకే జీవితాలను చేస్తారు అంకితం
అందుకే అమూల్యమైన వీరి సేవలకు వీరే సేకరించుకుంటారు మూల్యం
ఓనాడు దరిద్రులైనా ఇలాంటి సేవలే వారికి కూర్చాయి సంపదలు.
"అందుకే వీరు ప్రమాదకుబేరులు "
అచ్చు
.
అదో అచ్చోసే ఆగారం .
అల్లాటప్పా కాదండి ! అది ఏలినవారి సత్కారం
అక్కడ అచ్చొత్తించుకోడానికి అంతులేని పోటీ !
రకరకాల అర్హతలతో లక్షలలో భేటీ !
అధికబరువు పెట్టిన వారికి
అత్యధికమాట వినిపించినవారికే
ఆ అచ్చులు పరిమితం .
ఆ సర్కారీ అచ్చులోనూ తరగతులు కద్దు .
అర్హులకే అందేనా ? అనే పృచ్చ లొద్దు.
అల్లాటప్పా కాదండి ! అది ఏలినవారి సత్కారం
అక్కడ అచ్చొత్తించుకోడానికి అంతులేని పోటీ !
రకరకాల అర్హతలతో లక్షలలో భేటీ !
అధికబరువు పెట్టిన వారికి
అత్యధికమాట వినిపించినవారికే
ఆ అచ్చులు పరిమితం .
ఆ సర్కారీ అచ్చులోనూ తరగతులు కద్దు .
అర్హులకే అందేనా ? అనే పృచ్చ లొద్దు.
అచ్చెంత పరిమాణం అయితే మాత్రమేం?
ఆ ఫైన సోమరిగా ఆహా ! ఆ సుఖమేం ?
అచ్చోసిన ఆంబోతులు ఉరికొకటి ఆనాడు .
అచ్చోసిన ఆకృతులే ప్రతిరంగాన ఈనాడు.
నిస్తేజం, నిర్లిప్తం, నిర్వీర్యం చిరునామా !
ఉదాసీనం , స్వార్థగుణం ఎడబాయవు ముఖాన !
చిన్నివారి బొజ్జ లెపుడు శ్రీరామరక్షగుంటే
దేశమేమైతే మాత్రమేమి వారి కన్నులెదుటే !
గాడిదలా చాకిరీ నాటి బానిస బతుకైతే
గానుగెద్దులా బతకడం వీరి బానిసత్వం !
వృత్తులను మంటగలిపి , అభివృద్ధిని అంట బొడిచి
అచ్చోయించుకో నురికే జీవచ్చవముల్లారా !
ఆక్రోశపు బానిసత్వం ఆనాటి దుస్థితి .
అంగలార్చి తెచ్చుకొన్నది మీ బానిస సంస్కృతి .
మేత వేస్తే మెడ నరికించుకునే మేక మొద్దుతనం.
వేట తిని వలలో చిక్కుకునే చిలువ మజ్జుతనం .
జామపండు కోసం పంజరంలో కెక్కే రామచిలుక వెర్రితనం .
ఇంకా ఎంత కాలం ?
కూటి కొరకు కోటివిద్యలుండగా
అచ్చే కావాలంటూ ఆందోళన సబబా ?
చేవ చచ్చిన వారి లాగ ఎన్నాళ్ళీ వేలంవెర్రి ?
జీర్ణతృణముకై కేసరెపుడైన వెంపర్లాడటం చూశామా?
ఆకలైనా అంచ నీళ్ళను త్రాగడం వినసాధ్యమా ?
రక్షణ దొరకునని బెబ్బులి తనుగా బోనులో చేరి నిలిచేనా ?
జంతుజాలమే చిక్కని జాలములోన చిక్కి
[ఉక్కిరిబిక్కిరై ] చట్రమ్ములో బతుకు గడిపే
స్వయంకృత అపరాధ మేల ?
మేధ కలిగిన జీవరాశిగా మిమ్ము మీరే మరతురా ?
స్వతంత్రపుమొక్కను నాటినది మీరిట్లు మానై పుచ్చనా ?
దేశస్వాతంత్రము వచ్చి ఆత్మగౌరవం చచ్చెనా ?
పరాయీల పీడ వదిలి సొంత చీడ పట్టెనా ?
వివేకమ్మును పుటము పెట్టే వైద్యుడు వేరే కావలెనా ?
సుదృఢవ్యవస్థామూలాన్ని కూకటివేళ్ళతో పెకలిస్తున్న
అచ్చు పిచ్చికి ఇకనైనా అంతిమగీతం పలికి
ఆలోచనా సానరాయితో మొద్దుబారిన మెదడును
ఎర్రగా పదును పెట్టుకోండి .
అప్పుడే స్ఫురిస్తుంది అసలైన కర్తవ్యం
తామరతంపరగా వర్ధిల్లుతుంది దేశసౌభాగ్యం [భవితవ్యం ]
మగ బస్సు
తల్లీ చెల్లీ భార్యా కూతురూ ఉన్నా కుటుంబయజమాని మగాడు .
అందుకే కుటుంబం పితృస్వామ్యం .
ఆడప్రయాణీకులూ కొండొకచో ఆడకండక్టర్ ఉన్నా కూడా
మగడ్రైవర్ మూలంగా బస్సు ఔతోంది మగబస్సు .
ఓ చేత్తో బస్సు స్టీరింగును
మరో చేత్తో శరీరపు యాక్సిలేటర్ను పట్టుకొని
కొండొకచో రెండు చేతులూ ఫైకెత్తేస్తూ --------
తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ -----
ఎక్కే ప్రతిస్త్రీని శల్యపరీక్షిస్తూ --------
దిగే ప్రతి స్త్రీని వెకిలిగా వ్యాఖ్యానిస్తూ .
ఎదురు జవాబిస్తే , మొహం బద్దలు చేస్తే --------
రోజూ అదే రూటులో వెళ్ళే తమకు
బస్సు ఎక్కే అవకాశం లేకుండా చేసి ,
ఆలస్యానికి ఇంట్లో సంజాయిషీలు,
నడిచి నడిచి మరింత బడలే శరీరానికి మలాముపూతలు
అవసరమయ్యేలా చేయగల
ఆ డ్రైవర్ నియంత ఆగడాలను అసహనాన్ని అణచి భరిస్తూ ------------
వెకిలితనానికి మురిసినట్లు నటిస్తూ -----------
తమకై ప్రత్యేకించిన సీట్లను దురాక్రమించిన కుసంస్కారులను
జుట్టు పట్టి లేపలేక ,భూదేవి సహనాన్ని బాడుగకు తీసుకొని ,
సందట్లో సమారాధనలా ప్రభుత్వరాయితీతో ముందె క్కిన సీనియర్ సిటిజన్ల
చేతుల చేతలను అడ్డగించ ప్రయత్నిస్తూ -------
అప్పటికే ఇంటి పనుల ప్లానింగ్ లో మునిగిపోయిన మనస్సులతో
అవకాశం దొరికిందని అతుక్కుపోవడానికి ప్రయత్నించే ---------
పురుషపుంగవుల చేష్టలు కనులు గమనిస్తున్నా --------
మొద్దుబారిన నామమాత్ర శరీరాల స్పర్శాలేమికి ధన్యవాదాలర్పిస్తూ ----------
సమాజంలో తన ఉనికి స్థాయిని సింబాలిక్ గా తెల్పుతూ --------
కబేళాలో సగం చచ్చిన కళేబరాల్లాంటి స్త్రీలతో
బుద్ధి పుట్టిన చోట ఆగుతూ సాగుతోంది ఆ
అందుకే కుటుంబం పితృస్వామ్యం .
ఆడప్రయాణీకులూ కొండొకచో ఆడకండక్టర్ ఉన్నా కూడా
మగడ్రైవర్ మూలంగా బస్సు ఔతోంది మగబస్సు .
ఓ చేత్తో బస్సు స్టీరింగును
మరో చేత్తో శరీరపు యాక్సిలేటర్ను పట్టుకొని
కొండొకచో రెండు చేతులూ ఫైకెత్తేస్తూ --------
తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ -----
ఎక్కే ప్రతిస్త్రీని శల్యపరీక్షిస్తూ --------
దిగే ప్రతి స్త్రీని వెకిలిగా వ్యాఖ్యానిస్తూ .
ఎదురు జవాబిస్తే , మొహం బద్దలు చేస్తే --------
రోజూ అదే రూటులో వెళ్ళే తమకు
బస్సు ఎక్కే అవకాశం లేకుండా చేసి ,
ఆలస్యానికి ఇంట్లో సంజాయిషీలు,
నడిచి నడిచి మరింత బడలే శరీరానికి మలాముపూతలు
అవసరమయ్యేలా చేయగల
ఆ డ్రైవర్ నియంత ఆగడాలను అసహనాన్ని అణచి భరిస్తూ ------------
వెకిలితనానికి మురిసినట్లు నటిస్తూ -----------
తమకై ప్రత్యేకించిన సీట్లను దురాక్రమించిన కుసంస్కారులను
జుట్టు పట్టి లేపలేక ,భూదేవి సహనాన్ని బాడుగకు తీసుకొని ,
సందట్లో సమారాధనలా ప్రభుత్వరాయితీతో ముందె క్కిన సీనియర్ సిటిజన్ల
చేతుల చేతలను అడ్డగించ ప్రయత్నిస్తూ -------
అప్పటికే ఇంటి పనుల ప్లానింగ్ లో మునిగిపోయిన మనస్సులతో
అవకాశం దొరికిందని అతుక్కుపోవడానికి ప్రయత్నించే ---------
పురుషపుంగవుల చేష్టలు కనులు గమనిస్తున్నా --------
మొద్దుబారిన నామమాత్ర శరీరాల స్పర్శాలేమికి ధన్యవాదాలర్పిస్తూ ----------
సమాజంలో తన ఉనికి స్థాయిని సింబాలిక్ గా తెల్పుతూ --------
కబేళాలో సగం చచ్చిన కళేబరాల్లాంటి స్త్రీలతో
బుద్ధి పుట్టిన చోట ఆగుతూ సాగుతోంది ఆ
"మగబస్సు"
మావి ' కొమ్మ '
మావి వధువు
కావిచిగురు చీరకట్టి ,
చిరుమువ్వల పనితనపు లేలేత పూతల మేలిముసుగును
అలవోకగ పైన కప్పి
ఉత్తరాది పెళ్ళికూతురై
కాన్పట్టెను మావి ' కొమ్మ '
రాడేమని ప్రియుడు స్తబ్దుగా తా కనిపించును .
ఆడుగడుగో వచ్చెనదే అని తల నోరగ ఊచును .
గాలికేలు సాచి యతడు గిలిగింతలు పెట్టగా ,
కిలారుమని నవ్వి నవ్వి నిలువెల్లా ఊయలౌను ,
మేలిముసుగు కొంత జరిపి సౌందర్యము చూరనిచ్చు
కన్నె వోలె కనిపించు కొమ్మ చేతులను సాచి ,
విభుని వెంట పోవుటకు ఇచ్చగించని ముగ్ధ తా
ఆభరణముల రాల్చునటుల పూతల రాల్చేనదే !
చిరుమువ్వల పనితనపు లేలేత పూతల మేలిముసుగును
అలవోకగ పైన కప్పి
ఉత్తరాది పెళ్ళికూతురై
కాన్పట్టెను మావి ' కొమ్మ '
రాడేమని ప్రియుడు స్తబ్దుగా తా కనిపించును .
ఆడుగడుగో వచ్చెనదే అని తల నోరగ ఊచును .
గాలికేలు సాచి యతడు గిలిగింతలు పెట్టగా ,
కిలారుమని నవ్వి నవ్వి నిలువెల్లా ఊయలౌను ,
మేలిముసుగు కొంత జరిపి సౌందర్యము చూరనిచ్చు
కన్నె వోలె కనిపించు కొమ్మ చేతులను సాచి ,
విభుని వెంట పోవుటకు ఇచ్చగించని ముగ్ధ తా
ఆభరణముల రాల్చునటుల పూతల రాల్చేనదే !
కడుపు తీపి
బడి ఎందుకే నీకు బుజ్జితల్లీ !
ఆకలైనా , ఆపదైనా ఆదరించే
అమ్మ ఒడి వుండగా వేరె బడి కెళ్ళాలా?
బడికి పొయ్యేం చెయ్ ను ?
కరెంటుకు బలికానా ?మంటలకు కరుగనా ?
అన్నమనే విషమును ఆబగా మింగనా ?
ఎన్ని కష్టాలకో ఓర్చి నిను కన్నది .
పరుల చేతికి ఇచ్చి చంపించనా ?
చదివేమి చేస్తావు ?
నీ తప్పే లేకుండా ఏ పైశాచిక ప్రియుడో
యాసిడ్ ను చల్లనా ? కత్తితో నరకనా ?
కొలువిప్పిస్తానని ఏ పురుషపుంగవుడో
నీ గుప్తశీలాన్కి కన్నెరికమే చెయ్ నా ?
పై దేశ మెళ్ళినా పెద్ద ఉద్యోగం చేసినా
కట్నం తక్కువని మొగుడు ముక్కలుగ తరగనా ?
చదువొద్దు , మనువొద్దు. మనికి ఉంటే చాలు .
మనిషిగా నా ఎదుట నడయాడితే చాలు .
పువ్వులా నా ఇంట పరిమళిస్తే చాలు .
.
రావణకాష్టం రిజర్వేషన్లు .
ఛీత్వం - స్త్రీత్వం
ఛీ ! - ఎంత అర్ధరాత్రి దాకా - తరతరాల మేలుకొలుపు
మారణం
పచ్చని చెట్ల పచ్చిక బయళ్ళ
అబ్బా ! నొప్పి ! - ఓర్చుకోమ్మా పెద్ద మనిషి వయ్యావ్ ! ---- పరిణీత నొప్పి .
నేనో పిన్ కుషన్ ని .
ఆమె
ఆమె వదనం ఓ నిశ్చల సరోవరం .
అందులో అప్పుడప్పుడు రెక్కలు విదుల్చుకునే
రాజహంసలు కన్నులు .
మధుపాన్ని కలిగిన తామర మగుడ
ఆభరణమున్న ఆమె నాసిక.
సూర్యరశ్మితో ఎర్రనై ఎదురుపడే జంట అలలు
ఆమె ఆధరములు .
పుట్టిన క్షణంనుండి ఆడపిల్లని అదృష్టంగా భావించే రోజు లొచ్చాయ్
రావణకాష్టం
రావణకాష్టం రిజర్వేషన్లు .
అర్హతకు [కుక్కమూతి పిందె] కల్లు తాగిన కోతి డెఫినిషన్లు .
ఆ 'అర్హులు ' లేకుంటే ప్రిజర్వేషన్లు .
మతమే అమానుషమన్న సెక్యులర్ దేశంలో
కులాల కోసం కదను తొక్కే అజిటేషన్లు.
కులం పేరు నువ్వెత్తితే .
అది నీకు తెస్తుంది పెనుముప్పు .
అదే కులాన్ని నేను తగలించుకుంటే అది డప్పు .
శవాన్ని తలకెత్తుకున్న విక్రముని మేకప్పు .
స్టార్ సోషియల్ స్టాటస్ నీ దైనా
'దళితుడు 'నీ ఇంటి పేరు .
వలసలు , ఆత్మహత్యలే శరణ్యమైనా
'అగ్రకులజుడు ' వాడి ఒంటిపేరు .
ప్రజాస్వామ్యపాలనకు ఇది నాయక నిర్వచనం
సమతామమతల కలలకు ఇది చక్కని వ్యాఖ్యానం .
ఛీత్వం - స్త్రీత్వం
ఛీ ! - ఎంత అర్ధరాత్రి దాకా - తరతరాల మేలుకొలుపు
మేల్కుంటే మాత్రం
ఇంతసేపు నిద్రా ?
నీ వసలు స్త్రీవేనా ?
ఛీ ! - ఎప్పుడూ ఈ పరుగు పరుగు - కోడలికి ఉద్యోగమైనా
పప్పు చారేనా ? మా మొహాన అందుకు అర్హతైనా
ఎప్పుడన్నా ఇంత ఉండాలని తెగ వెదికి
మజ్జిగపులుసు పోశావా ? కోడలిని తెచ్చుకున్న
మంచికోదలివే ?? అత్తమామలు .
మంచికోదలివే ?? అత్తమామలు .
ఛీ ఛీ ! - ఆఫీస్ !ఆఫీస్ ! అంటావు . - నాన్నకు తెలీకుండా
ఆలస్యమౌతోంది అంటావు . నాకు పాకెట్ మనీ
హడావుడిగా కుక్కడమే కాని ఇవ్వవూ అనే
ఎప్పుడైనా ఆప్యాయంగా సమయస్పూర్తి
అన్నం పెట్టావా ? గల సంతానం .
నీవు అమ్మవేనా ?
ఛీ ఛీ ! - భర్త అనేవాడు బతికి - వేడినీళ్ళకు
ఉన్నాడనే స్పృహైనా చల్లనీళ్ళలా
నీకుందా ? అన్నిటికీ సంపాదనలో
సాకుగా బోడి తోడు ఉండమన్న
ఉద్యోగ మొక్కటి ! నీవూ ప్రత్యక్షదైవం
ఒక భార్యవు ! పతిదేవుడు .
ఛీ ఛీ ఛీ ! - బస్సెక్కడానికి ఇంతసేపా ? - R T C బస్సును
బొమ్మా ? బొరుసా ? . తన స్వంతమనుకునే
వేస్తున్నావా ? సంస్కారి
పాసిచ్చిందిగా ప్రభుత్వం సిటీ బస్ డ్రైవర్ .
అదీ ఆ ధీమా !
ఛీ ఛీ ఛీ ! - జనం సందులో పడిచావక - నేను మాత్రం
ఎవరికీ ఇబ్బంది లేకపోతే కష్టపడి , మీరంతా
మాత్రం , ప్రశాంతంగా రాడ్ ఎందుకు సుఖపడాలనే
పట్టుకొని పడకుండా నిలబడ్తావా ? సౌజన్యమూర్తి
షో ! లోపలికి ! సిటీబస్ కండక్టర్ .
ఛీ ఛీ ఛీ ! - పిల్లలకు జ్వరమంటే C L - తన జేబు నుండి
మొగుడికి జలుబంటే E L జీతాలు ఇస్తున్నట్లు
మాట్లాడితే ఇల్లు ఇల్లు . బాధ పడే
మీకెందుకమ్మా ఉద్యోగాలు ? పెద్దకూలీ
మీకెందుకమ్మా ఉద్యోగాలు ? పెద్దకూలీ
హాయిగా అంట్లు తోముకుంటూ ఆఫీసర్ .
కూర్చోక .
ఇన్ని ఛీత్వాల సాకారమే - ఆధునిక స్త్రీత్వం .
నేటి నిజం వారపత్రిక , మార్చి , 2012
నేటి నిజం వారపత్రిక , మార్చి , 2012
మారణం
పచ్చని చెట్ల పచ్చిక బయళ్ళ
వెచ్చని గుహల వేడివాగుల
పక్షి కువకువల నదుల గలగలల
పున్నమి రాత్రుల అమవస అంచుల
స్వచ్చజీవనపు అచ్చపోకడల
చేజేతులా త్రోసిరాజని
నియంత్రించేసి గాలిని , నీటిని ,
నీటిపాల్జేసి నిప్పుని , మన్నుని
వద్దు పొమ్మని చెట్టుని , గుట్టని ,
దూరం చేసేసి అమ్మ ప్రకృతిని ,
చేరదీశాడు రోగపుగనిని
మానవు డెంతటి మూర్ఖ శిఖామణి .
ఆడనొప్పి
అబ్బా ! నొప్పి ! - ఓర్చుకోమ్మా పెద్ద మనిషి వయ్యావ్ ! ---- పరిణీత నొప్పి .
దేవుడా ! నొప్పి ! - నెలసరని నలుగురికీ తెలుస్తుంది. నగుబాటు నోర్మూసుకో ! ---- నెలసరి నొప్పి .
అమ్మా ! నొప్పి ! - సిగ్గుచేటు. శోభనపుగదిలో పెద్దగా అరవకు ---- తియ్యని నొప్పి .
బాబోయ్ ! నొప్పి - కడుపులో బిడ్డ తంతున్నాడా ? భావిజీవితానికి ---- గర్వపు నొప్పి .
సింబాలిక్ నొప్పి
అయ్యో ! నొప్పి ! - నొప్పులు పడితే పడ్డావ్ . బతికి బయటపడ్డావ్ . ---- పునర్జన్మ నొప్పి
అమ్మగా నీ జన్మ ధన్యం .
.
పిన్ కుషన్ 1
నేనో పిన్ కుషన్ ని .
పై నుండే అందమైన వెల్వెట్ గుడ్డ నా శరీరం .
లోనుండే మెత్తని దూది నా మనస్సు .
తీసుకునేందుకు వీలుగా , కనపడేలా సౌకర్యంగా
ఉండేందుకు గుచ్చబడే పిన్నులు
నా ముక్కుపుడకలు, చేతిగాజులు , చెవికమ్మలు , మెడలో దండలు .
స్థోమతను తెలిపే సౌకర్యాన్ని ,
అవసరాలకు తీసి వాడుకునే సౌలభ్యాన్ని
కల్గించే బంగారు పిన్ లు గుచ్చుకునే
మానవ పిన్ కుషన్ ని నేను .
ఇదంతా పైనైని పటాటోపమే .
నా మనస్సు ------కుషన్ డబ్బా లాగే
తెరిస్తే అంతా ఖాళీయే .
పిన్ కుషన్ 2
పిన్ కుషన్ లాంటి నాకు గుచ్చుకునే పిన్నులు
ఈర్ష్యతో చూసే చూపులు , హేళనగా చూసే చూపులు
ఆకలిగా చూసే చూపులు , ఆరాధనగా చూసే చూపులు .
అసహనంతో చూసే చూపులు , ఆగ్రహంతో చూసే చూపులు .
ఆమె
ఆమె వదనం ఓ నిశ్చల సరోవరం .
అందులో అప్పుడప్పుడు రెక్కలు విదుల్చుకునే
రాజహంసలు కన్నులు .
మధుపాన్ని కలిగిన తామర మగుడ
ఆభరణమున్న ఆమె నాసిక.
సూర్యరశ్మితో ఎర్రనై ఎదురుపడే జంట అలలు
ఆమె ఆధరములు .
పట్టుచీర
(08-09-2012,విజేత చిత్రీకరణ సమయంలో )
పదివేలు విరజిమ్మి నిన్ను కొన్నాను
కన్నీళ్ళు తుడవనూ పనికిరావే !
పెళ్ళికని ప్రేమగా కొన్నాను నిన్ను
పాప పొత్తిళ్ళకూ పనికిరావే !
పదిమందిలో గొప్పకని నేను కొన్నాను
పట్టెడన్నము ఆర్చ పనికిరావే !
పేద్ద గొప్పకు పోయికొంటినే కాని
పేదమానము దాచ నీవు ఎగతాళివే !
పరువూప్రతిష్టలు పెంచగలవే గాని
ప్రాణప్రతిష్ట పురుగుకూ చేయలేవే !
ఇంకా ఆడేంటి ? మగేంటి ?
(08-09-2012,విజేత చిత్రీకరణ సమయంలో )
పదివేలు విరజిమ్మి నిన్ను కొన్నాను
కన్నీళ్ళు తుడవనూ పనికిరావే !
పెళ్ళికని ప్రేమగా కొన్నాను నిన్ను
పాప పొత్తిళ్ళకూ పనికిరావే !
పదిమందిలో గొప్పకని నేను కొన్నాను
పట్టెడన్నము ఆర్చ పనికిరావే !
పేద్ద గొప్పకు పోయికొంటినే కాని
పేదమానము దాచ నీవు ఎగతాళివే !
పరువూప్రతిష్టలు పెంచగలవే గాని
ప్రాణప్రతిష్ట పురుగుకూ చేయలేవే !
ఇంకా ఆడేంటి ? మగేంటి ?
పుట్టిన క్షణంనుండి ఆడపిల్లని అదృష్టంగా భావించే రోజు లొచ్చాయ్
అపురూపంగా పెంచే కలలూ వచ్చాయ్ !
ఒకే రకమైన పెంపకం
ఒకే రకమైన గారాబం
ఒకే రకమైన ఆహారం
ఒకే రకమైన విద్యావకాశం
ఈ రోజు తల్లిదంద్రులెవరూ ఆడామగా వివక్ష చూపడం లేదు .
ఆడ పిల్లలదే అన్నిట్లో ముందంజ .
వారి తల్లిదండ్రులకు లేదు వెనుకంజ .
విమానమైనా , విదేశమైనా సై అంటే సై .
రోదసీ అయినా ఫాంటసీ అయినా రెడీ అంటే రెడీ !
ఆటకైనా పాటకైనా డీ కి డీ !
మరీ ఇంకా ఎందుకీ అమ్మాయిలే ఉన్మాదుని కత్తికి బలి ?
వారిపైనే సామూహిక అత్యాచారాల కలి
స్నేహం ముసుగులో దాటిన గీటుకు సమాజంలో వెలి
ఉద్యోగాల్లో లైంగిక వేదనల కౌగిలి .
మీద మీద పడే కల్చర్డ్ మగస్నేహం
శరీరంలో రగిలే కెమిస్ట్రీకి అబార్షన్ చేయగలదా ?
అర్ధరాత్రి దాటాక నైట్ కల్చర్ ఫలితం
తల్లితండ్రుల అనుమతుందని సీమంతం చేసుకోగలదా ?
శరీరంలో రగిలే కెమిస్ట్రీకి అబార్షన్ చేయగలదా ?
అర్ధరాత్రి దాటాక నైట్ కల్చర్ ఫలితం
తల్లితండ్రుల అనుమతుందని సీమంతం చేసుకోగలదా ?
పిచ్చి అభ్యుదయవాదుల్లారా !
సమత్వం , అధిగమనం సామాజిక అభివృద్ధి లోనే కాని
శారీరికంగా ఆడా మగా ఎన్నటికీ ఒకటి కాలేరు , కాబోరు .
ఎందుకా ------????
విజాతిధ్రువాలు ఎప్పుడూ ఆకర్షకాలే కాని సమాంతరాలు కావు .
- సాహితీకిరణం, నవంబర్ , 2011
ఓ ------ నాకు తెలీకేం ?
ఓ !----నాకు తెలీకేం !
గాంధీతాతంటే --------
బోసినవ్వుతో కర్రపట్టుకొని నడుస్తూ --------
అన్ని రూపాయి నోట్ల మీదా ఉంటాడు ఆయనేగా !
ఓ ! ------ నాకు తెలీకేం !
సత్యాగ్రహమంటే ---------
జీతం పెంచలేదని ఈ మధ్య ఓ పదిరోజలు
మేం పెన్ డౌన్ చేసి పనిచేయ్యకుండానే జీతం తీసుకున్నాం . అదేగా !
ఓ ! ----- నాకు తెలీకేం!
రాముడంటే ----------
బాబ్రీ మసీదుని కూలగొట్టి
ఆయన జన్మస్థలం అని కబ్జా చేశారే !----- ఆయనేగా !
నా నైటీ
నిట్టురుస్తూ చూస్తోంది .
ఓ రోజు నా అందాన్ని అద్దినట్లు చూపిన నా నైటీ !
చూచినవారంతా 'చాలా బావుంది ' అన్న నా నైటీ !
నా అలసటను అర్థం చేసుకొని నన్ను అక్కున చేర్చుకున్న నా నైటీ !
నా ఒంటిని అంటినపుడల్లా మా వారు నన్నంటుకుపోయేలా చేసిన నా నైటీ !
మాతృత్వపు అవధిగా తల్లిపాలతో తడిసిన నా నైటీ !
నా కన్నవారి, కట్టుకున్నవారి, కడుపున పుట్టినవారి కన్నీళ్ళు తుడిచిన నా నైటీ !
ఇంటియజమానురాలిగా నా ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించిన నా నైటీ !
కొత్తరకాలెన్ని వచ్చినా తన ప్రత్యేకతను చాటుకున్న నా నైటీ !
పాతదైనా నేను ప్రాణప్రదంగా దాచుకున్న నా నైటీ !
ముసలివగ్గై మూలగది చేర్చబడ్డ నన్ను చిరుగుల అలుకుగుడ్డై వచ్చి చూచి నిట్టూరుస్తోంది
నేటి నిజం వారపత్రిక
ఆ ( !
నా తప్పా ?
సౌకర్యం కోసం వేసుకున్న జీన్స్ , టీషర్టు
సౌందర్యాన్ని ఆరబోస్తాయని
తెలియజెప్పలేకపోయావా
సాంస్కృతిక పరిణామమా !
ఇన్నాళ్ళు మిత్రుడ్ని అంటూ తిరిగినవాడు
నేడు ప్రియురాలిని కాలేనన్నానని
కాలకూటద్రావకాన్ని క్రూరంగా నా మొహాన పోస్తే
అది నా తప్పా ! మీ తప్పా !
సౌందర్య సాగరం
సాగరతీరాన సైకతవేదికపై శతకోటి కాంతులు .
పున్నమిచంద్రుడు దిగివచ్చి విశ్రాంతి గొంటున్నాడా !
కానేకాదు. జాబిలి నిమ్నోన్నతాలకు ఇంత సొబగు ఎక్కడిది ?
అచ్చరభామినియా !- కానే కానేరదు .
వారికి చిత్తచాంచల్యాన్ని కలిగించగల ఈ నిమిషత్వ మెక్కడిది ?
సాగరాన జలకమాడి బడలి విశ్రాంతిగొంటున్న ఈ అతిలోకసౌందర్యం .
ఖచ్చితంగా సాగరుణ్ణి రససాగరుణ్ణి చేసిందని .
రసాస్వాదకుడిని చేసిందనేందుకు గుర్తుగా వడలిన వనిత -------
మతిపోయిన సంద్రుడు ఆమెతో సరాగమాడినట్లు
అంగజుని తాతే వివశుడై ఆమె అణువణువునూ చూరగొన్నట్లుగా
ఆమె సీమంతంలో సిందూరంలా మురుస్తూ నిండిన సైకతరేణువులు
ఆమె అంగాంగానా మిలమిలా మెరుస్తూ స్వేదకణములు .
నాకో......!
నాకు పోయిన సంవత్సరం కొన్న పట్టుచీరే
మరి పక్కింటి పార్వతి పాతికవేలు పోసి పట్టుచీర కొనింది
ఎంత బాగుందో ! మరి నాకో.....!
మా ఇంట్లో రెండేళ్లనాటి ఓల్డ్ వాషింగ్ మషీనే
మా పక్కవీధి ప్రవీణ లేటెస్ట్ వాషింగ్ మెషీన్ కొనిందట పాతది పారేసి.
ఎంత బాగుందో ! మరి నాకో.....!
నాలుగేళ్లనాడు కొన్న నాలుగుపేటల
.చంద్రహారమే నా మొహానికి
వరలక్ష్మీ వ్రతమని వడ్డాణం కొనింది వనజ ఐదులక్షలు అమాంతం ఇచ్చేసి .
ఎంత బాగుందో ! మరి నాకో.....!
అన్ని సెలవులకు మేం తిరుపతి , కాళహస్తే
మొన్న హాలిడేస్ కు హంగరీకి వెళ్లారట పైఇంటివాళ్ళు హ్యాపీగా ఆరులక్షలు అవగొట్టేసి
ఎంత బాగుందోనట ! మరి నాకో.....!
నెలకో రెండుసార్లు షాపింగ్ కు వెళ్ళడమే కాని
మా ఆఫీసులో అయితే ఆడవాళ్ళు అంతా రోజూ షాపింగ్ చేసి
కాస్ట్లీ కాస్ట్లీ చీరలు కొంటారు .
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
ఎప్పుడో కొనుక్కున్న డొక్కు శాంత్రో కారే మాకు
ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడల్లా
కొత్త కొత్త కార్లల్లో వస్తుంది కల్పన
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
పగలు మాత్రం పని చేసి
రాత్రి గుర్రు పెట్టి నిద్రపోతాడు నా మొగుడు పాతిక వేలు తెచ్చినందుకే
రాత్రింబవళ్ళు పనిచేసి లక్షల్లక్షల జీతం తెచ్చి కుమ్మరిస్తాడట మంజులమొగుడు
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
నాకో...!! = అనంతం = అసూయ + ఆశ = ఆధునిక యుగపు నైజం
నేను
నేనొక విషాదగీతికను .
నా నిండా వేదనాస్వరాలే !
నా ఆలాపనలో , తానం పల్లవులలో
వొలికేది కేవలం వ్యధే !
నెర్రెలు చీలిన నెరవల్
రసహీనమైన స్వరకల్పన నా సొత్తు .
వినేవాళ్ళ ఆహా ఓహోలు
నా గుండెను కలిచివేయగల జీవస్వరాలు
శ్రోతలను మూర్చిల్ల చేసే నా మూర్చన
నా దుఃఖానికి నే పరిపూర్ణంగా చేసే అర్చన .
నాలోని ఉదాత్త అనుదాత్తాలు
కావు సామవేద సారాలు
నే సాధించలేని ఎన్నో అంశాలకు ఆకారాలు .
నేను కోరుకున్న నోట పలకలేని పాటను .
ఓ దైవోపహత నడిచే గజిబిజి బాటను
కువకువలు
అది ఒక ఇది
ప్రపంచంతో సంబంధం వద్దనే పరిస్థితి
చుట్టూ వున్నది ఎవ్వరో తోచని వింతగతి
ఇద్దరే ప్రపంచమై, ప్రపంచమా ఇద్దరే అయ్యి,
హద్దులు కరువై, సుద్దులే ఎదలై
తనుస్పందనలే జీవితమై
ఆనందమే సర్వమై
హక్కుల ప్రకటనై, అధికారప్రదర్శనై
అనుబంధాలే అంతా అయ్యి
ఒకరికొకరై, ఇద్దరూ ఒకరై ముగ్గురుకావడమే మనికయ్యే ఓ గమ్మత్తిది .
నీకు....
ఆ నీలిమేఘాన్ని పత్రముగ చేసి,
హరిధనుస్సును లేఖినిగా మార్చి,
తారకల తళుకులను వర్ణాలుగా పేర్చి
రాశాను ఓ లేఖ
మెరుపులే నగిషీగా
చేర్చేది నీకెలా చిరునామ మనసేగా
మట్టి - 'మని'షి
అమ్మయ్యా1 ఇన్ని రోజులుగా వాళ్ళు పడ్డ
కష్టాలన్నిటికీ చరమగీతం .
వాళ్ళ పిల్లలంతా ఎక్కొచ్చారు .
పల్లెలో పుట్టిన వాళ్ళు పరదేశాల కెళ్ళారు .
కూలిపని, సొంతపాడి, సేద్యం -----
జీవాలు , కోళ్ళు ----ఇక ఈ
పనులు వాళ్లకు అవసరం లేదు .
డాలర్లు స్వదేశానికి దిగుమతి ,
తల్లిదండ్రు లప్పుడప్పుడూ విదేశాలకు ఎగుమతి .
కానీ ఎందుకా నిర్వేదం ఆ పండిన ముసలిముఖాల్లో.... ??
అకౌంట్లు, ఫ్రిజ్లు, ప్లాస్మా టీవిలు ------- ఏవి లేవు ?
నగలు, డబ్బు,హా దా--------లేనివి ఇంకేమీ లేవు
కాని ఆ ముఖాల్లో సంతోషలేమి ఎందుకు ?
డబ్బులొచ్చాయి . దాంతోపాటే పొలం పనులొద్దనే
హుకుం లొచ్చాయి
.
ఆస్తులొచ్చాయి. వాటితోపాటే పాడి , జీవాలు
వద్దన్న వారింపులొచ్చాయి.
లేదా మీ ఇష్టం. మేమైతే తిరిగిరాం .
మీకూ, మీ పల్లెకూ రాంరాం అనే
వాగ్బాణాలు గుచ్చాయి .
మట్టే మనికిగా , పల్లే ప్రాణంగా
బతికిన ఆ మట్టిమనుషుల ముందో పెద్ద ప్రశ్నార్థకం .
సమానమైన ప్రేమ పంచి పెంఛినా
వాడుకొని వదిలి వెళ్లి పోయిన పిల్లల ప్రేమ సుఖమా ?
ఆదుకొని వదలని పొలం, పశువులు, మొక్కల సాంగత్యం సుఖమా ?
ఇప్పుడు వాళ్ళ ముఖాల్లోని ప్రశ్న " మాకు వారసు లున్నారా ? "
ఎందుకమ్మా
స్త్రీత్వానికి సరితూనికగా సెబాసులు అందుకున్నావ్
శృంగారంలో రసశిఖరాలు ఎక్కించి మరీ మురిసిపోయావు
మాతృత్వానికి పరాకాష్టగా మమతలను పంచావు
ఎదుగుతున్న కొద్ది దాగి దాగి దోబూచులాడిన
నీకు ఎప్పుడు ఎక్కడ తగిలిందమ్మా ఈ దిష్టి
సమూలంగా తుడిచివేయబడ్డావ్ .
మరీచికల వెంట మారథాన్
ఉన్నదేదో వద్దని లేనిదేదో కావాలని
లేనిదేదో కలిమని ఉన్నదేదో లేమని
ఆత్రంగా పరుగులు
అలసట పుట్టేలా పరుగులు .
అంతులేని పరుగులు
అనంతంలోకి పరుగులు .
ఆసతో పరుగులు
అవకాశం దొరికితే పరుగులు .
పరిగెత్తి పరిగెత్తి (నొప్పులు ) తిప్పలు
దెబ్బ తిన్న దురాశకు (నొప్పులు )
కనిపించే బంధాలకు నొప్పులు
కనిపించని మానవతకు నొప్పులు
పారిపోవ భాధ్యతలకు నొప్పులు
వీడని అభద్రతాభావనకు నొప్పులు
ఎందుకంటే పిచ్చిమనిషి చేస్తోంది మరీచికల వెంట మారథాన్
ఇది జారిపోవ కొనితెచ్చుకున్న కష్టం మది నింపలేని ప్రాప్తం
పత్నీపరాయణత
పతిదేవ్యువాచ :-
నేనెంతో ప్రేమిస్తున్నాగా నిన్ను - నాకు కలిగినంత
నేనెంతో సుఖపెడుతున్నాగా నిన్ను - నాకు తోచినంత
నేనెంతో అందిస్తున్నాగా - నీకు నాకు నచ్చినంత
ఇంకా ఎందుకా వాపిరిగొట్టుమొహం ఏదీ లేనిదాన్లా అష్టదరిద్రురాలిలా.
ఏం చెయ్యాలి
గుండె చిక్క పట్టుకొని
మనసు నొడిసి పట్టుకొని
ప్రాణాలు అరచేత పట్టుకొని
పెంచుకోవలసి వస్తోంది భావిమాతృమూర్తులని
ఎలా చేయాలి ధైర్యం ఆడపిల్లను కనను,
ఆకాశంలో సగమంటూ గర్వంగా పెంచను .
చదవకుంటే మొద్దు అని సమాజంలో చిన్నచూపు .
.చదువుకని పంపిస్తే అడుగగుడున విషపుచూపు .
ఇండివిజ్యువాలిటి అని ఆడ అయితే ఏమిటని
ఎక్కించాం వెన్నలాంటి ఆడపిల్ల మనసులోకి
వదిలిపోనీ తుమ్మబంక.
నా ఇష్టం నా బతుకు అనే పడికట్టు పదాలు
పాలవంటి మనసులో పడ్డ ఉప్పుకల్లులు
భవిష్యమును కననివ్వని కనికట్టు పరదాలు .
మానైన మానిని కొమ్మకాదు కాండమే.
వ్యక్తిత్వం వివేకం కంటితడుపు కోసమే .
నిజంగా
ఆకాసంలో ఎప్పుడూ ఓ భీతావహ అరుణవర్ణం
అదేదో క్రాంతి కారక అభివృద్దికి అభివ్యక్తి అనుకునేదాన్ని
చెప్పొద్దూ -------
పరికించి చూస్తే తరతరాల రక్తార్పణ మరకలు దృశ్యమానమై
మనసును మథిస్తాయని భయం
"నిర్భయం"గా ఈ రోజు పరిశీలిస్తే
ఆకాశంలో నా సగం రుదిరధారలతో రోదిస్తోంది
నైర్మల్యత లేని ఆ సగపు వాటా నాకెందుకు ?
దురాక్రమణలకు గురౌతుందని కూడా నినదించే అధికారం లేని
ఆ నామమాత్రపు హక్కు నాకెందుకు ?
నవ్వులుపాలు కానా ? నాలో మిథ్యాగౌరవాన్ని పెంచనా?
నా అసంతృప్త చిచ్చుకు చిచ్చి కొట్టనా ?
------------------*-----------------------
వంట చెయ్యడానికా
పెళ్ళిళ్ళు చేసేది .
వంటింట్లో మగ్గదానికా
పెళ్ళాలు అయ్యేది
ఆడది ఆడది ఆడది
ముద్దుమురిపాలు , మమతానురాగాలు ఎంత పంచినా
పుట్టిల్లు అంటుంది - ఆడది అని
శరీరాన్ని పంచి , వంశాన్ని పెంచి ఎంత శ్రమించినా
అత్తిల్లూ అంటుంది - ఆడది అని
రక్తాన్ని ఇచ్చి , శరీరాన్ని పెంచి , కృశించి నశించినా
కన్నసంతానమూ అంటుంది - ఆడది అని
ఇంతకూ ఈ ఆడది ఏడది ??
చింతపండుకు కొలమానం - కిలోలు
ఆడతనానికి కొలమానం -పనితనం
మగవాడికి కొలమానం - పుట్టుక
కన్నవాడి నుండి కనబడ్డ వాడి వరకు
కనిపెంచినవాడి నుండి కనిపించినవాడి వరకు
మొత్తం కుట్రదారులే !
మొత్తంగా కుట్రదారులే !
కూతురివైనా కొడుకువే ననే తండ్రి
బాధ్యతలు బదలాయించే కుట్రదారు
అక్కవైనా అన్నవే అంటూ
హక్కులు భుక్తంచేసే సోదరులు కుట్రదారులు
పెళ్ళామంటే ప్రాణార్థమంటూ
పనులు జరుపుకునే మొగుడు కుట్రదారు
అమ్మే లోకమంటూ ఆమె కన్నీళ్ళను
పన్నీరులా చల్లుకుని మురిసే కొడుకులు కుట్రదార్లు
మహిళామణి వంటూ వహవాలతో
వలలేసి వేళ కొరకు పొంచుండే మగడేగలు కుట్రదార్లు
ఈ అన్ని కుట్రలూకుతంత్రాలు ఆదర్శస్త్రీసుమాన్ని
పహరా కాసే కుహనా రక్షక కంటకాలు
* * *
ఎంత ఇరుకు మనసు మొత్తం
ఎంత బరువు తనువు చిత్రం
అయిదు అడుగులకు కుంచించుకు బతకడం
ఐదుఅడుగుల పైని కాయం
అంగుళంలా అనిపించేయడం
ఇవ్వడం తప్ప యాచించుట తెలియని
సాయము చేయడమే
కాని చేయిజాపను నేర్వలేని
మనసుకు తనువుకు ఇది సంకటం కంటకసదృశం
* * *
పలికెడిది భాగవతమట
పలికించెడివాడు రామభద్రుండట
భవహరమగుటకు పలికెను పోతనార్యుండట
అలతిఅలతి పదాల అచ్చతెనుగట
కందమూలాలకై తప్ప కనకభూషలకై కాదట
ముక్తిసదనానికై తప్ప మరకతశిలాస్థగితసౌధాలకై కాదట
శారద నమ్మగా కొల్చుటకే గాని
శారద నమ్మగా కొల్చు కనకములకై కాదట
చెదల లాగ పుట్ట నింపుటెందుకన్న చదలు నింపు పట్టుతేనె ఊట కవి పోతన్న
( అక్టోబర్ 16 )
* * *
ఆస లెందుకు బాధపడాలి నీచులనూ నికృష్టులనూ చూసి
ఆస లెందుకు వాపోవాలి పతితులనూ భ్రష్టులనూ తలచి
ఆస లెందుకు కుమలాలి కుళ్ళుబోతులను కామాతురులనూ కాంచి
నవ్వుకో విరగబడి నవ్వుకో పగలబడి నవ్వుకో
ఏడ్పుగా కాదు కన్నీళ్ళను నవ్వులో కార్చుకో
దైన్యంతో శుష్కహాసం వద్దు ధైర్యంతో విజయహాసం నేర్చుకో
ప్రతికూలపరిస్థితిని అనుకూలం అనుకో
26-5-2014
* * *
కరెంట్ కోత మిగిల్చింది కడుపు కోత
ఏ తల్లి కన్నదో అన్నా నిన్ను ఎ కంటివెలుగుగా ఉన్నావో ఇన్నాళ్ళు
నీ మింటినీ మంటినీ కలిపిన కన్నీళ్ళైనా ఆర్పలేక పోయాయా కరెంట్ చిచ్చును
లోకాన్నంతా వెలుగుతో నింపిన విజ్ఞ్యానశాస్త్రం నీ బతుకును ఆర్పేసే సాయం చేసిందా పాపం
ఈనాడు సైన్స్ ఆవిష్కరణలు కాదు
కావాలి మనిషికి మనసులో మానవత్వాన్ని పొదిగే ఆపరేషన్లు
(ట్రాన్స్ఫార్మర్ పై పడి మనిషి ఆత్మహత్య నేపథ్యంలో అక్తోబర్ 2 )
ఒకడి చావు పూలదారి
వేరొకడి బతుకే ముళ్ళదారి
ఒక శవపు అంతిమయాత్రకు అడుగుమడుగు
మరో జీవచ్చవపు జీవనయాత్రే అడుగుబొడుగు
(ఆగస్ట్ 26 )
ఏమిటీ అంధకారం
ఎందుకీ అగమ్యం
ఏదీ అవసరం లేనట్టుగా ఎవరూ పట్టనట్టుగా
మనసు మరణించినట్లుండే దుస్థితి
యోగులకు కావొచ్చు నిర్వికల్ప స్థితి
తపసులకు కావచ్చు వినిర్ముక్తస్ఠితి
అసామాన్యులకు కావచ్చు సమాధి స్ఠితి
నా బోంట్లకు మాత్రం అది
భరింపరాని ఆందోళనకరస్థితి
ఊపిరాడని వూబిలోకి జారుకుంటున్న స్థితి
జనమేజయుని సర్పయాగంలోకి ఈడ్చబడుతున్న నిస్సహాయస్థితి
(సెప్టంబర్ 5 )
జిల్లు జిల్లు మనిపించే ఐస్ క్రీమే నా అందం
జల్లు జల్లు మనిపించే సొగసు నా సొంతం
వెనీలా చెక్కిళ్ళు స్ట్రాబెరి నా కళ్ళు`
మొత్తంగా అల్ మిక్స్ ఐస్ క్రీమె నా వొళ్ళు
(ఆగష్టు 14)
నువ్వు - నేను
సమత్వం , అధిగమనం సామాజిక అభివృద్ధి లోనే కాని
శారీరికంగా ఆడా మగా ఎన్నటికీ ఒకటి కాలేరు , కాబోరు .
ఎందుకా ------????
విజాతిధ్రువాలు ఎప్పుడూ ఆకర్షకాలే కాని సమాంతరాలు కావు .
- సాహితీకిరణం, నవంబర్ , 2011
ఓ ------ నాకు తెలీకేం ?
ఓ ! ---- నాకు తెలీకేం !
ఆగష్ట్ పదిహేనంటే ------
పబ్లిక్ హాలిడేనేగా !
ఓసారైతే రెండ్రోజులు వేరే హాలిడేస్ తో కలిసొచ్చింది .
హాయిగా ఎంజాయ్ చేశా !
ఓ !---- నాకు తెలీకేం !
జాతీయపతాకమంటే ----
మా ఆఫీస్ వాచ్ మన్ ఎగరేస్తుంటాడు .
అన్నట్లు అప్పుడప్పుడూ అతడు అడిగితే
మా వేస్ట్ మెటీరియల్ రూం నుంచి దాన్ని నేనే తీసిస్తాగా !
ఓ !----నాకు తెలీకేం !
గాంధీతాతంటే --------
బోసినవ్వుతో కర్రపట్టుకొని నడుస్తూ --------
అన్ని రూపాయి నోట్ల మీదా ఉంటాడు ఆయనేగా !
ఓ ! ------ నాకు తెలీకేం !
సత్యాగ్రహమంటే ---------
జీతం పెంచలేదని ఈ మధ్య ఓ పదిరోజలు
మేం పెన్ డౌన్ చేసి పనిచేయ్యకుండానే జీతం తీసుకున్నాం . అదేగా !
ఓ ! ----- నాకు తెలీకేం!
రాముడంటే ----------
బాబ్రీ మసీదుని కూలగొట్టి
ఆయన జన్మస్థలం అని కబ్జా చేశారే !----- ఆయనేగా !
ఓ !------- నాకు తెలీకేం !
తెలుగు జాతి రత్నాలు
నన్నయ ,తిక్కన , కృష్ణదేవరాయలు ,అల్లూరిసీతారామరాజు అంటే --------
మొన్న టాంక్ బండ్ మీద విగ్రహాలు పగలగొట్టామే వాళ్ళేగా !
ఓ ! ------ నాకు తెలీకేం !
తెలుగు భాషంటే ----
వాట్ యార్ ! తుమ్ సమజ్ రహేహో కీ
I DONT KNOW టెల్గూ ! I AM ALSO టెల్గూవాలా BRO.!
నా నైటీ
నిట్టురుస్తూ చూస్తోంది .
ఓ రోజు నా అందాన్ని అద్దినట్లు చూపిన నా నైటీ !
చూచినవారంతా 'చాలా బావుంది ' అన్న నా నైటీ !
నా అలసటను అర్థం చేసుకొని నన్ను అక్కున చేర్చుకున్న నా నైటీ !
నా ఒంటిని అంటినపుడల్లా మా వారు నన్నంటుకుపోయేలా చేసిన నా నైటీ !
మాతృత్వపు అవధిగా తల్లిపాలతో తడిసిన నా నైటీ !
నా కన్నవారి, కట్టుకున్నవారి, కడుపున పుట్టినవారి కన్నీళ్ళు తుడిచిన నా నైటీ !
ఇంటియజమానురాలిగా నా ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించిన నా నైటీ !
కొత్తరకాలెన్ని వచ్చినా తన ప్రత్యేకతను చాటుకున్న నా నైటీ !
పాతదైనా నేను ప్రాణప్రదంగా దాచుకున్న నా నైటీ !
ముసలివగ్గై మూలగది చేర్చబడ్డ నన్ను చిరుగుల అలుకుగుడ్డై వచ్చి చూచి నిట్టూరుస్తోంది
నేటి నిజం వారపత్రిక
ఆ ( ! ఆ భార్యాభర్తల మధ్య కీచులాటలే లేవా ?
ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేని అధములేమో !
ఆ ( ! ఆ అన్నదమ్ముల మధ్య గొడవల్లేవా ?
ఆస్తిపాస్తుల్లేని దరిద్రులేమో !
ఆ ( ! ఆ తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకున్నాడా ?
ఆ ( ! ఆ తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకున్నాడా ?
ఎవ్వరూ ప్రేమించనంత ఛండాలపుముఖమేమో !
ఆ ( ! హైస్కుల్లోనే కాదు , కాలేజీలో కూడా అఫైర్ లేదా ?
ఐతే ఖచ్చితంగా తేడాగాడే !
ఆ ( ! తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడ్డం లేదా ?
స్నేహితులతో తెలుగు సినిమాలు చూడ్డం లేదేమో !
ఆ ( ! మనసులో ఒకటి బయటి కొకటి లేదా?
బతకడం రాని బడుద్ధాయేమో !
ఆ ( ! వాళ్ళింట్లో T.V సీరియల్స్ చూడరా ?
లోకజ్ఞానం బొత్తిగా అక్కర్లేదేమో !
ఆ ( ! కాలేజ్ కు బంక్ కొట్టి బజార్లో తిరగడం లేదా ?
సక్రమమైన స్నేహితులు లేరేమో !
- ముంబై వన్ [పక్షపత్రిక] 01 - 01 - 2012 - 15- 01-2012
- ముంబై వన్ [పక్షపత్రిక] 01 - 01 - 2012 - 15- 01-2012
అమ్మాయికి అబ్బాయికి ఏం తేడా లేదని
పెద్దచదువులు చదివించారు సరే !
కానీ ఆమాట నా ఫ్రెండ్ ద్రుహిణ్ తో
బైక్ లో తిరిగేటప్పుడు వర్తించదని
నాకెందుకు చెప్పలేదు నాన్నా !
నాన్నైతే సరే మగాడు . మగాడితో స్నేహం
మాటల వరకైతే పర్లేదు కాని
అర్థరాత్రి వరకూ షికార్లకు పనికి రాదని
నువ్వైనా చెప్పలేదేం అమ్మా !
పని చేసేచోట నా తెలివితేటలు ,
పనిసామర్థ్యాలు కూడా నా ఆడతనానికి
పనిసామర్థ్యాలు కూడా నా ఆడతనానికి
అదనపు ఆకర్షణ కూరుస్తాయని
ముందుగానే నాకెందుకు చెప్పలేదు
ఓ నవసమాజమా !
సౌకర్యం కోసం వేసుకున్న జీన్స్ , టీషర్టు
సౌందర్యాన్ని ఆరబోస్తాయని
తెలియజెప్పలేకపోయావా
సాంస్కృతిక పరిణామమా !
ఇన్నాళ్ళు మిత్రుడ్ని అంటూ తిరిగినవాడు
నేడు ప్రియురాలిని కాలేనన్నానని
కాలకూటద్రావకాన్ని క్రూరంగా నా మొహాన పోస్తే
అది నా తప్పా ! మీ తప్పా !
సౌందర్య సాగరం
సాగరతీరాన సైకతవేదికపై శతకోటి కాంతులు .
పున్నమిచంద్రుడు దిగివచ్చి విశ్రాంతి గొంటున్నాడా !
కానేకాదు. జాబిలి నిమ్నోన్నతాలకు ఇంత సొబగు ఎక్కడిది ?
అచ్చరభామినియా !- కానే కానేరదు .
వారికి చిత్తచాంచల్యాన్ని కలిగించగల ఈ నిమిషత్వ మెక్కడిది ?
సాగరాన జలకమాడి బడలి విశ్రాంతిగొంటున్న ఈ అతిలోకసౌందర్యం .
ఖచ్చితంగా సాగరుణ్ణి రససాగరుణ్ణి చేసిందని .
రసాస్వాదకుడిని చేసిందనేందుకు గుర్తుగా వడలిన వనిత -------
మతిపోయిన సంద్రుడు ఆమెతో సరాగమాడినట్లు
అంగజుని తాతే వివశుడై ఆమె అణువణువునూ చూరగొన్నట్లుగా
ఆమె సీమంతంలో సిందూరంలా మురుస్తూ నిండిన సైకతరేణువులు
ఆమె అంగాంగానా మిలమిలా మెరుస్తూ స్వేదకణములు .
నాకో......!
నాకు పోయిన సంవత్సరం కొన్న పట్టుచీరే
మరి పక్కింటి పార్వతి పాతికవేలు పోసి పట్టుచీర కొనింది
ఎంత బాగుందో ! మరి నాకో.....!
మా ఇంట్లో రెండేళ్లనాటి ఓల్డ్ వాషింగ్ మషీనే
మా పక్కవీధి ప్రవీణ లేటెస్ట్ వాషింగ్ మెషీన్ కొనిందట పాతది పారేసి.
ఎంత బాగుందో ! మరి నాకో.....!
నాలుగేళ్లనాడు కొన్న నాలుగుపేటల
.చంద్రహారమే నా మొహానికి
వరలక్ష్మీ వ్రతమని వడ్డాణం కొనింది వనజ ఐదులక్షలు అమాంతం ఇచ్చేసి .
ఎంత బాగుందో ! మరి నాకో.....!
అన్ని సెలవులకు మేం తిరుపతి , కాళహస్తే
మొన్న హాలిడేస్ కు హంగరీకి వెళ్లారట పైఇంటివాళ్ళు హ్యాపీగా ఆరులక్షలు అవగొట్టేసి
ఎంత బాగుందోనట ! మరి నాకో.....!
మా ఆఫీసులో అయితే ఆడవాళ్ళు అంతా రోజూ షాపింగ్ చేసి
కాస్ట్లీ కాస్ట్లీ చీరలు కొంటారు .
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
ఎప్పుడో కొనుక్కున్న డొక్కు శాంత్రో కారే మాకు
ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడల్లా
కొత్త కొత్త కార్లల్లో వస్తుంది కల్పన
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
పగలు మాత్రం పని చేసి
రాత్రి గుర్రు పెట్టి నిద్రపోతాడు నా మొగుడు పాతిక వేలు తెచ్చినందుకే
రాత్రింబవళ్ళు పనిచేసి లక్షల్లక్షల జీతం తెచ్చి కుమ్మరిస్తాడట మంజులమొగుడు
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
నాకో...!! = అనంతం = అసూయ + ఆశ = ఆధునిక యుగపు నైజం
నేను
నేనొక విషాదగీతికను .
నా నిండా వేదనాస్వరాలే !
నా ఆలాపనలో , తానం పల్లవులలో
వొలికేది కేవలం వ్యధే !
నెర్రెలు చీలిన నెరవల్
రసహీనమైన స్వరకల్పన నా సొత్తు .
వినేవాళ్ళ ఆహా ఓహోలు
నా గుండెను కలిచివేయగల జీవస్వరాలు
శ్రోతలను మూర్చిల్ల చేసే నా మూర్చన
నా దుఃఖానికి నే పరిపూర్ణంగా చేసే అర్చన .
నాలోని ఉదాత్త అనుదాత్తాలు
కావు సామవేద సారాలు
నే సాధించలేని ఎన్నో అంశాలకు ఆకారాలు .
నేను కోరుకున్న నోట పలకలేని పాటను .
ఓ దైవోపహత నడిచే గజిబిజి బాటను
కువకువలు
అది ఒక ఇది
ప్రపంచంతో సంబంధం వద్దనే పరిస్థితి
చుట్టూ వున్నది ఎవ్వరో తోచని వింతగతి
ఇద్దరే ప్రపంచమై, ప్రపంచమా ఇద్దరే అయ్యి,
హద్దులు కరువై, సుద్దులే ఎదలై
తనుస్పందనలే జీవితమై
ఆనందమే సర్వమై
హక్కుల ప్రకటనై, అధికారప్రదర్శనై
అనుబంధాలే అంతా అయ్యి
ఒకరికొకరై, ఇద్దరూ ఒకరై ముగ్గురుకావడమే మనికయ్యే ఓ గమ్మత్తిది .
నీకు....
ఆ నీలిమేఘాన్ని పత్రముగ చేసి,
హరిధనుస్సును లేఖినిగా మార్చి,
తారకల తళుకులను వర్ణాలుగా పేర్చి
రాశాను ఓ లేఖ
మెరుపులే నగిషీగా
చేర్చేది నీకెలా చిరునామ మనసేగా
మట్టి - 'మని'షి
అమ్మయ్యా1 ఇన్ని రోజులుగా వాళ్ళు పడ్డ
కష్టాలన్నిటికీ చరమగీతం .
వాళ్ళ పిల్లలంతా ఎక్కొచ్చారు .
పల్లెలో పుట్టిన వాళ్ళు పరదేశాల కెళ్ళారు .
కూలిపని, సొంతపాడి, సేద్యం -----
జీవాలు , కోళ్ళు ----ఇక ఈ
పనులు వాళ్లకు అవసరం లేదు .
డాలర్లు స్వదేశానికి దిగుమతి ,
తల్లిదండ్రు లప్పుడప్పుడూ విదేశాలకు ఎగుమతి .
కానీ ఎందుకా నిర్వేదం ఆ పండిన ముసలిముఖాల్లో.... ??
అకౌంట్లు, ఫ్రిజ్లు, ప్లాస్మా టీవిలు ------- ఏవి లేవు ?
నగలు, డబ్బు,హా దా--------లేనివి ఇంకేమీ లేవు
కాని ఆ ముఖాల్లో సంతోషలేమి ఎందుకు ?
డబ్బులొచ్చాయి . దాంతోపాటే పొలం పనులొద్దనే
హుకుం లొచ్చాయి
.
ఆస్తులొచ్చాయి. వాటితోపాటే పాడి , జీవాలు
వద్దన్న వారింపులొచ్చాయి.
లేదా మీ ఇష్టం. మేమైతే తిరిగిరాం .
మీకూ, మీ పల్లెకూ రాంరాం అనే
వాగ్బాణాలు గుచ్చాయి .
మట్టే మనికిగా , పల్లే ప్రాణంగా
బతికిన ఆ మట్టిమనుషుల ముందో పెద్ద ప్రశ్నార్థకం .
సమానమైన ప్రేమ పంచి పెంఛినా
వాడుకొని వదిలి వెళ్లి పోయిన పిల్లల ప్రేమ సుఖమా ?
ఆదుకొని వదలని పొలం, పశువులు, మొక్కల సాంగత్యం సుఖమా ?
ఇప్పుడు వాళ్ళ ముఖాల్లోని ప్రశ్న " మాకు వారసు లున్నారా ? "
ఎందుకమ్మా
స్త్రీత్వానికి సరితూనికగా సెబాసులు అందుకున్నావ్
శృంగారంలో రసశిఖరాలు ఎక్కించి మరీ మురిసిపోయావు
మాతృత్వానికి పరాకాష్టగా మమతలను పంచావు
ఎదుగుతున్న కొద్ది దాగి దాగి దోబూచులాడిన
నీకు ఎప్పుడు ఎక్కడ తగిలిందమ్మా ఈ దిష్టి
సమూలంగా తుడిచివేయబడ్డావ్ .
మరీచికల వెంట మారథాన్
ఉన్నదేదో వద్దని లేనిదేదో కావాలని
లేనిదేదో కలిమని ఉన్నదేదో లేమని
ఆత్రంగా పరుగులు
అలసట పుట్టేలా పరుగులు .
అంతులేని పరుగులు
అనంతంలోకి పరుగులు .
ఆసతో పరుగులు
అవకాశం దొరికితే పరుగులు .
పరిగెత్తి పరిగెత్తి (నొప్పులు ) తిప్పలు
దెబ్బ తిన్న దురాశకు (నొప్పులు )
కనిపించే బంధాలకు నొప్పులు
కనిపించని మానవతకు నొప్పులు
పారిపోవ భాధ్యతలకు నొప్పులు
వీడని అభద్రతాభావనకు నొప్పులు
ఎందుకంటే పిచ్చిమనిషి చేస్తోంది మరీచికల వెంట మారథాన్
ఇది జారిపోవ కొనితెచ్చుకున్న కష్టం మది నింపలేని ప్రాప్తం
పత్నీపరాయణత
పతిదేవ్యువాచ :-
నేనెంతో ప్రేమిస్తున్నాగా నిన్ను - నాకు కలిగినంత
నేనెంతో సుఖపెడుతున్నాగా నిన్ను - నాకు తోచినంత
నేనెంతో అందిస్తున్నాగా - నీకు నాకు నచ్చినంత
ఇంకా ఎందుకా వాపిరిగొట్టుమొహం ఏదీ లేనిదాన్లా అష్టదరిద్రురాలిలా.
బీళ్ళు - బళ్ళు
మొన్నటి పచ్చని పొలాలు నేడు మొలకెత్తని బీళ్ళు
మట్టిని నమ్ముకున్నవారు మట్టికొట్టుకుపోయేలా మంత్రాంగం
ఆన్నం పెట్టేందుకు అలసే అలవాటున్న చేతులకు నిర్భంధవిద్యాహక్కు
అన్నమో రామచంద్రా అని అలమటించేలా చేయడం
స్వచ్చందంగా చేస్తూన్న పనిని నిర్బంధంగా మాన్పించి
అనుభవాన్ని అసహ్యంగా మలచి భోజనం పండవలసిన చోట
భవంతులను లేపి మన తిండికి మనమే కట్టుకుంటున్నాం చలువరాతి సమాధి
అదే మనకి తినిపిస్తుంది రేపు బూది
ఆడపిల్ల
``అబ్బా ఈ కాలంలో ఆడపిల్లలే నయం
మనకు కన్ను నొచ్చినా కాళ్ళు నొచ్చినా ఆడపిల్లైతేనే చేస్తుంది
ఇద్దరూ మగపిల్లలేనా!!
కోడళ్లెక్కడ చేస్తారూ!!``
అమ్మా !!అయ్యా!! ఆపుతారా మీ సుభాషితాలు!!
ఆడపిల్ల అంటే మన కడుపున పుడితేనేనా!!
మనింటి కొచ్చేదీ ఆడపిల్లే!!
ఆ ఆడపిల్ల , ఆ ఇంటికి ఆడపిల్లే!!
ఆ తల్లిదండ్రులకు ఆసరా ఇచ్చే కూతురే !!
మామంచి మన కూతురూ ఓ ఇంటిని ఆశాంతిపాలు చేసే కోడలే
ఆడపిల్ల అనబడే వ్యక్తి
కూతురిగా ఒకరకం
కోడలిగా సంకరమా !
ఇదెక్కడి కుతర్కం!!
మార్పు రావలసింది మన మాటల్లో, బుర్రల్లో
అప్పుడే అవుతుంది మన ఆడపిల్ల అత్తింటికీ ఆడపిల్లగా .
అదే మనకి తినిపిస్తుంది రేపు బూది
ఆడపిల్ల
``అబ్బా ఈ కాలంలో ఆడపిల్లలే నయం
మనకు కన్ను నొచ్చినా కాళ్ళు నొచ్చినా ఆడపిల్లైతేనే చేస్తుంది
ఇద్దరూ మగపిల్లలేనా!!
కోడళ్లెక్కడ చేస్తారూ!!``
అమ్మా !!అయ్యా!! ఆపుతారా మీ సుభాషితాలు!!
ఆడపిల్ల అంటే మన కడుపున పుడితేనేనా!!
మనింటి కొచ్చేదీ ఆడపిల్లే!!
ఆ ఆడపిల్ల , ఆ ఇంటికి ఆడపిల్లే!!
ఆ తల్లిదండ్రులకు ఆసరా ఇచ్చే కూతురే !!
మామంచి మన కూతురూ ఓ ఇంటిని ఆశాంతిపాలు చేసే కోడలే
ఆడపిల్ల అనబడే వ్యక్తి
కూతురిగా ఒకరకం
కోడలిగా సంకరమా !
ఇదెక్కడి కుతర్కం!!
మార్పు రావలసింది మన మాటల్లో, బుర్రల్లో
అప్పుడే అవుతుంది మన ఆడపిల్ల అత్తింటికీ ఆడపిల్లగా .
ఏం చెయ్యాలి
గుండె చిక్క పట్టుకొని
మనసు నొడిసి పట్టుకొని
ప్రాణాలు అరచేత పట్టుకొని
పెంచుకోవలసి వస్తోంది భావిమాతృమూర్తులని
ఎలా చేయాలి ధైర్యం ఆడపిల్లను కనను,
ఆకాశంలో సగమంటూ గర్వంగా పెంచను .
చదవకుంటే మొద్దు అని సమాజంలో చిన్నచూపు .
.చదువుకని పంపిస్తే అడుగగుడున విషపుచూపు .
ఇండివిజ్యువాలిటి అని ఆడ అయితే ఏమిటని
ఎక్కించాం వెన్నలాంటి ఆడపిల్ల మనసులోకి
వదిలిపోనీ తుమ్మబంక.
నా ఇష్టం నా బతుకు అనే పడికట్టు పదాలు
పాలవంటి మనసులో పడ్డ ఉప్పుకల్లులు
భవిష్యమును కననివ్వని కనికట్టు పరదాలు .
మానైన మానిని కొమ్మకాదు కాండమే.
వ్యక్తిత్వం వివేకం కంటితడుపు కోసమే .
నిజంగా
ఆకాసంలో ఎప్పుడూ ఓ భీతావహ అరుణవర్ణం
అదేదో క్రాంతి కారక అభివృద్దికి అభివ్యక్తి అనుకునేదాన్ని
చెప్పొద్దూ -------
పరికించి చూస్తే తరతరాల రక్తార్పణ మరకలు దృశ్యమానమై
మనసును మథిస్తాయని భయం
"నిర్భయం"గా ఈ రోజు పరిశీలిస్తే
ఆకాశంలో నా సగం రుదిరధారలతో రోదిస్తోంది
నైర్మల్యత లేని ఆ సగపు వాటా నాకెందుకు ?
దురాక్రమణలకు గురౌతుందని కూడా నినదించే అధికారం లేని
ఆ నామమాత్రపు హక్కు నాకెందుకు ?
నవ్వులుపాలు కానా ? నాలో మిథ్యాగౌరవాన్ని పెంచనా?
నా అసంతృప్త చిచ్చుకు చిచ్చి కొట్టనా ?
------------------*-----------------------
వంట చెయ్యడానికా
పెళ్ళిళ్ళు చేసేది .
వంటింట్లో మగ్గదానికా
పెళ్ళాలు అయ్యేది
ఆడది ఆడది ఆడది
ముద్దుమురిపాలు , మమతానురాగాలు ఎంత పంచినా
పుట్టిల్లు అంటుంది - ఆడది అని
శరీరాన్ని పంచి , వంశాన్ని పెంచి ఎంత శ్రమించినా
అత్తిల్లూ అంటుంది - ఆడది అని
రక్తాన్ని ఇచ్చి , శరీరాన్ని పెంచి , కృశించి నశించినా
కన్నసంతానమూ అంటుంది - ఆడది అని
ఇంతకూ ఈ ఆడది ఏడది ??
చింతపండుకు కొలమానం - కిలోలు
ఆడతనానికి కొలమానం -పనితనం
మగవాడికి కొలమానం - పుట్టుక
కన్నవాడి నుండి కనబడ్డ వాడి వరకు
కనిపెంచినవాడి నుండి కనిపించినవాడి వరకు
మొత్తం కుట్రదారులే !
మొత్తంగా కుట్రదారులే !
కూతురివైనా కొడుకువే ననే తండ్రి
బాధ్యతలు బదలాయించే కుట్రదారు
అక్కవైనా అన్నవే అంటూ
హక్కులు భుక్తంచేసే సోదరులు కుట్రదారులు
పెళ్ళామంటే ప్రాణార్థమంటూ
పనులు జరుపుకునే మొగుడు కుట్రదారు
అమ్మే లోకమంటూ ఆమె కన్నీళ్ళను
పన్నీరులా చల్లుకుని మురిసే కొడుకులు కుట్రదార్లు
మహిళామణి వంటూ వహవాలతో
వలలేసి వేళ కొరకు పొంచుండే మగడేగలు కుట్రదార్లు
ఈ అన్ని కుట్రలూకుతంత్రాలు ఆదర్శస్త్రీసుమాన్ని
పహరా కాసే కుహనా రక్షక కంటకాలు
* * *
ఎంత ఇరుకు మనసు మొత్తం
ఎంత బరువు తనువు చిత్రం
అయిదు అడుగులకు కుంచించుకు బతకడం
ఐదుఅడుగుల పైని కాయం
అంగుళంలా అనిపించేయడం
ఇవ్వడం తప్ప యాచించుట తెలియని
సాయము చేయడమే
కాని చేయిజాపను నేర్వలేని
మనసుకు తనువుకు ఇది సంకటం కంటకసదృశం
* * *
పలికెడిది భాగవతమట
పలికించెడివాడు రామభద్రుండట
భవహరమగుటకు పలికెను పోతనార్యుండట
అలతిఅలతి పదాల అచ్చతెనుగట
కందమూలాలకై తప్ప కనకభూషలకై కాదట
ముక్తిసదనానికై తప్ప మరకతశిలాస్థగితసౌధాలకై కాదట
శారద నమ్మగా కొల్చుటకే గాని
శారద నమ్మగా కొల్చు కనకములకై కాదట
చెదల లాగ పుట్ట నింపుటెందుకన్న చదలు నింపు పట్టుతేనె ఊట కవి పోతన్న
( అక్టోబర్ 16 )
* * *
ఆస లెందుకు బాధపడాలి నీచులనూ నికృష్టులనూ చూసి
ఆస లెందుకు వాపోవాలి పతితులనూ భ్రష్టులనూ తలచి
ఆస లెందుకు కుమలాలి కుళ్ళుబోతులను కామాతురులనూ కాంచి
నవ్వుకో విరగబడి నవ్వుకో పగలబడి నవ్వుకో
ఏడ్పుగా కాదు కన్నీళ్ళను నవ్వులో కార్చుకో
దైన్యంతో శుష్కహాసం వద్దు ధైర్యంతో విజయహాసం నేర్చుకో
ప్రతికూలపరిస్థితిని అనుకూలం అనుకో
26-5-2014
* * *
కరెంట్ కోత మిగిల్చింది కడుపు కోత
ఏ తల్లి కన్నదో అన్నా నిన్ను ఎ కంటివెలుగుగా ఉన్నావో ఇన్నాళ్ళు
నీ మింటినీ మంటినీ కలిపిన కన్నీళ్ళైనా ఆర్పలేక పోయాయా కరెంట్ చిచ్చును
లోకాన్నంతా వెలుగుతో నింపిన విజ్ఞ్యానశాస్త్రం నీ బతుకును ఆర్పేసే సాయం చేసిందా పాపం
ఈనాడు సైన్స్ ఆవిష్కరణలు కాదు
కావాలి మనిషికి మనసులో మానవత్వాన్ని పొదిగే ఆపరేషన్లు
(ట్రాన్స్ఫార్మర్ పై పడి మనిషి ఆత్మహత్య నేపథ్యంలో అక్తోబర్ 2 )
ఒకడి చావు పూలదారి
వేరొకడి బతుకే ముళ్ళదారి
ఒక శవపు అంతిమయాత్రకు అడుగుమడుగు
మరో జీవచ్చవపు జీవనయాత్రే అడుగుబొడుగు
(ఆగస్ట్ 26 )
ఏమిటీ అంధకారం
ఎందుకీ అగమ్యం
ఏదీ అవసరం లేనట్టుగా ఎవరూ పట్టనట్టుగా
మనసు మరణించినట్లుండే దుస్థితి
యోగులకు కావొచ్చు నిర్వికల్ప స్థితి
తపసులకు కావచ్చు వినిర్ముక్తస్ఠితి
అసామాన్యులకు కావచ్చు సమాధి స్ఠితి
నా బోంట్లకు మాత్రం అది
భరింపరాని ఆందోళనకరస్థితి
ఊపిరాడని వూబిలోకి జారుకుంటున్న స్థితి
జనమేజయుని సర్పయాగంలోకి ఈడ్చబడుతున్న నిస్సహాయస్థితి
(సెప్టంబర్ 5 )
జిల్లు జిల్లు మనిపించే ఐస్ క్రీమే నా అందం
జల్లు జల్లు మనిపించే సొగసు నా సొంతం
వెనీలా చెక్కిళ్ళు స్ట్రాబెరి నా కళ్ళు`
మొత్తంగా అల్ మిక్స్ ఐస్ క్రీమె నా వొళ్ళు
(ఆగష్టు 14)
నువ్వు - నేను
1) నీవు లేని నేను నిలువెల్ల గరళమును .
నీదు రాక కురియు అమృతమ్మును .
త్రావి తావిని కల్గు పూరాణి నయ్యేను .
ఎంత రమ్యమో ఈ బంధ మంత నూతనం .
* * *
2 ) నీవు లేని అనుక్షణం నిట్టూర్పైనా లేని శూన్యం .
నీవు రాని ప్రతిదినము నిశ్శబ్దపు కాసారము .
* * *
౩ ) నీవు చెంత ఉన్ననాడు
బావి లోని కప్పను నేను .
నీవు దూరమైన వేళ
బయట పడిన చేపను నేను .
* * *
4) నీ వలపు కన్నులలో నీలాంబరదర్శనం.
నీ కౌగిలి రక్షణలో ఎనలేని సాంత్వనం .
నీ చిరుఅలకలలోన నులివెచ్చని అనుభవం .
లోకముతో నాకేమని అనిపించును క్షణక్షణం .
* * *
5) ఆనాటి నీ తలపున ఈనాటికీ రోమాంచం .
ఆనాటి నీ చేతకు ఈనాటికీ మృదుహాసం.
ఈనాటి నీ స్పర్శకు ఆనాటి చిరుకంపం .
ఏనాటికీ కాదోయీ మన ప్రేమ దివంగతం .
* * *
6) నీవు దీపము కావు .
నేను శలభము కానే కాను .
భ్రాంతి లోన కొనసాగే
ఆకర్షణ మనది కాదు
* * *
7) ఏమౌతావు నీవు నాకని అడిగే జిజ్ఞాసులకు
అంతేనా అని చప్పరించే నీరసహృదయులకు
ఏమని చెప్పను మనసు విప్పి
నీవే నా మనుగడవని తప్ప
* * *
8) నీ వున్నప్పుడు ఆలస్యంగా పూచే యీ గులాబీకి
నీవు లేనపుడింత తొందరెందుకో !
నిన్ను పొందినందుకు నాపై మత్సరమా !
తనను మించు నా మోము నేడు నీకై వాడేనని ముదమా !
* * *
9) పిచ్చిదని పదిమంది పరిహసించినా
బీదనని బంధువులు అపహసించినా
నవ్వుకుంటాను నేను వారికేం తెలుసునని
నీ కళ్ళు నాపై కురియు ఆ ప్రేమే నా నిధియని.
* * *
10) తనువులోని ఆణువణువూ వేచిఉండడం .
నిలువెల్లా కన్నులు చేసుకొని చూడడం
కన్నులు కాయలు కాయడం కేవలం కవిభావనే కాదని
నాకు తెలిసిందసలు నీ నిరీక్షణలోనే .
* * *
11) ప్రేమికుల అనుభూతికి
అతీతమైన దేదీ
లేదనే అమరసత్యాన్ని
తెల్పింది నీపైని నా ప్రేమే !
* * *
12) వాళ్ళోచ్చారు వీళ్ళోచ్చారని
ఉత్సాహంతో ఉరుకుతుంటారు .
వచ్చినది నీవు కానపుడు
వారెవరైతే నాకెందుకు ?
* * *
13) ఏ పనికై నే మళ్ళినా
మనసును మరలించే ధ్యాసే .
ఎక్కడెక్కడికి నే వెళ్ళినా
నీ వొచ్చుంటావని ఆశే !
* * *
14) నీ పలుకే నాకు ప్రాణం .
నీ ఊపిరే నాకు నాదం .
ఆ రెండూ లేక నేనున్నా లేనట్లే !
మరి నేనున్నానో లేదో తేల్చాలిక నీవే !
* * *
15) ఎవరన్నారో విరహం మధురంగా ఉంటుందని
బహుశా అది కేవలం ఊహతో అన్నారేమో !
గుండెను పిండేస్తుంది . మనసుకు చిల్లేస్తుంది .
అనుభవంతో ఎవరైనా ఇది మధురం అనగలరా ?
* * *
16) నిను తలచువేళ నా మన:స్థితి వర్ణనాతీతము .
నువు చేరువేళ నా తనుస్థితి వ్యక్తాతీతము .
నను వదలువేళ నా గ్రహస్థితి ఊహాతీతము
అయినా నీ పైనే నా ప్రాణమెందుకో భావాతీతము .
* * *
17) పులకరింతలు ,పలవరింతలు
పలకరింతలు , వలపువింతలు
అన్ని నాలో నీకే నీకే
మన సంగమంలో నిను అలరించడానికే .
* * *
18) నిన్నేదో ఊరించి ఉడికించానని అనుకున్నా
నిన్ను కవ్వించానని నే నవ్వుకున్నా
కానీ ఇప్పుడేగా తెలుస్తోంది .
నేనే ఉడుకుతున్నానని స్వయంగా నవ్వులపాలయ్యానని .
* * *
19) అడుగుల సడి అనిపిస్తే అలవోకగా వినిపిస్తే
పులకరించి పూరెమ్మె కదిలే ఈ మనసు
నీవు కాదని కంటికి తెలిసిన క్షణకణములోనె
నీరసించి నిట్టూర్చి నీరుకారిపోవునేల ?
* * *
20) గేటు చప్పుడైన క్షణము జల్లుమనే గుండెసడి
అడుగు అడుగు నెంచుకుంటు ఆత్రంగా మ్రోగుతుంది .
ప్రతి అడుగుకు యోజనాల దూరం పరుగెడుతుంది .
నీవేమోనన్న ఊహే ఇంతపని చేస్తుంది .
* * *
21) ఆగిపోవు కాలగమన మాగిపోవు బతుకుపయన
మాగిపోవు హృదయవేగ మాగిపోవు నయనచలన
మాగిపోవు శ్వాసకార్య మారిపోవు ప్రాణదీపం .
నీవు దూరమైననాడు శూన్యమౌను సృష్టి మొత్తం .
* * *
22) ఎందుకింత వేదన నీవు లేని క్షణమున
గుండెలోన శోధన మనసు పడే యాతన .
నిన్నటి దాకా మనము నీవెవరో నేనెవరో
నేడు 'నేను ' లేనేలేను అంతా ' నీవే ' గా .
* * *
23) అదుపులోన పెట్టలేను మనసు పడే యాతన .
అనుభూతికి ఆవల నిలిచియున్న భావన .
ఎందుకిలా ఒడుపుగా నా మదిలో చేరావు ?
వాటమెరిగి నన్నిలా నలిబిలి చేస్తున్నావు .
* * *
24) కనులు వెదకె నీ కొరకు
మనసు కలచె నీ కొరకు
నీవు రాని క్షణమిలా
నిలిచిపోదుగా కడవరకూ !
* * *
25) నీ కోసం నేను ఎదురు చూస్తున్నానని
నవ్విపోయిన పోదురు నలుగురితో నాకేమి ?
ప్రాణం కోసం దేహం ఎదురు చూస్తుంటే
వెక్కిరించువారి చూచి జాలి కాక ఏమి ?
* * *
26) ఏమిటి ఈవింత ?ఎందుకింత కవ్వింత ?
ఎగసిపడే గుండె అలల కొచ్చెనులే పులకింత .
కనులు కనులు కలసి పాడు పల్లవి ఒక తుళ్ళింత .
మధురమైన ఊహ సేయు సవ్వడి ఇది రవ్వంత
* * *
27) ఉన్నట్లో లేనట్లో తెలియనిదీ కొత్తస్థితి
ఔనో కాదో తెలియని వలపులతో నిండె మది .
కావాలో వద్దో మరి సుఖమో అది దు:ఖమో !
కావాలో వద్దో మరి సుఖమో అది దు:ఖమో !
కలివిడిగా నన్నిట్లా కలవరమున ముంచినవి .
* * *
28) మధురంగా మనసిజుడే పదిలంగా నిలిచి
మధించగా హృదయంలో పుట్టినట్టి వస్తువిది .
అమృతమై నరనరముల ఉత్తేజము నింపును .
హాలాహలమో అనునటు గుండెల కాల్చేయును .
* * *
29) నీ వొస్తావని కలలతో రేయంతా తెల్లవారె .
వస్తుంటావని ఆశతో పగలంతా పొద్దుపోయె
భ్రమలతోనే బ్రతుకంతా ఇలా గడిచిపోయె .
కల్లలైన కలలతో కాలము చెల్లిపోయె .
* * *
30) నీ తలపుల తలుపు మూసి మదిని జోకొడితే
నిదురించి అంతలోనె ఉలికిపడి లేచి
మారాము చేసేటి గారాల బిడ్డవలె
నీవే కావాలంటూ ఆగమే చేసె .
* * *
31) అక్కడున్నా నీవు ఒక్కసారైనా
నను తలచి ఉంటావు అను ఊహ చాలు .
ఎక్కడో ఉండి నను తలచేందుకన్నా
రోజుకో కడగంటి నీ వీక్షణము మేలు .
* * *
32) ఎదురుగా నీవు ఉన్న రోజు కన్న నాకు
లేని రోజు మరెంతో ప్రీతిగాను తోచు
కనిపించే నీ కన్నా లేనప్పటి నీ ధ్యాసే
నీ పైన నాకున్న ప్రేమనెంతో పెంచు .
* * *
33) నీ తలపున నా పెదవిపై కదిలిన చిరునవ్వు
అలవోకగా మది తోటలో విరిసిన తొలిపువ్వు.
నీ పలుకుకు నా మదిలో కలిగిన పులకింత
పూవింటితో మదనుడు ఎద కలిగించిన వంత .
* * *
34) నీ చూపుజల్లు తడిపినంత వానజల్లు తడుపలేదు .
నీ చేతివేళ్ళు తాకినంత చీర నన్ను తాకలేదు .
నీ వయసు నన్ను ఆపినంత నా మనసు నన్ను ఆపలేదు .
నీకు నేను తెలిసినంత నాకు నేను తెలియదు .
* * *
35) కావొచ్చునేమో లక్ష్మి విష్ణుని పాదరేణువు .
అయివుండవచ్చు సీత రాముని చేతిధనువు
కాబోలు ఆ రాధ కృష్ణుడు మ్రోయించు వేణువు
నేను మాత్రం ఎప్పుడూ నీ పెదవిపై మెరియు నవ్వు .
* * *
36) రెండు రోజాల మేల్ కలయికా !
రెండు చంద్రవంకల నిండు సంగమమా !
రెండు అమృతకలశాల సమ్మేళనమా !
తెలియకున్నదోయీ మన పెదవుల మధురిమ !
* * *
37) రాతిరిలో నిద్దురవు .
నిద్దురలో చిరుకలవు .
కలలోని మెలుకువవు.
నీవే నీవే నీవే !
* * *
38) భవబంధం తుచ్చమట
అనుబంధం బూటకమట.
మరి నను అమరను చేసే
నీ ప్రేమది ఏంటట?
* * *
39) కనులలో కలవరం
మనసులో పరవశం .
వేశావు సుమశరం
అయ్యాను నీ వశం [పరం ]
* * *
40) నడకలలో రాయంచ గొప్పదైన నాకేమి ?
పలుకులలో రాచిల్క మిన్నయైన నాకేమి ?
అందములో చందమామ అగ్రమైన నాకేమి ?
నిన్ను గెలుచుకున్న నాకు వాటితో పోటీ ఏమి ?
* * *
41) కమలమెలా సూర్యోదయంతో విచ్చుకుంటుందో
కలువ ఎలా చంద్రోదయంతో విరిసిపోతుందో
నాకు తెలిసిందెపుడో తెలుసా ?
నీ రాకతో నా ముఖం వికసించినపుడే !
* * *
42) యీ చేతులేగా నన్ను లాలించేది
యీ పెదవులేగా నన్ను శోధించేది
యీ నవ్వులేగా నన్ను అలరించేది
యీ అన్ని కలసిన నీవెగా నన్ను
సౌఖ్యాల తీరాన్ని చేర్చి మురిపించేది .
* * *
43) దేవుడు ఎదురై ఏం కావాలని అడిగితే
మరుజన్మలో కూడా నీ తోడే కావాలని కోరను .
నీవు తోడున్న ఈ జన్మే అయిపోకుండా
ఇలాగే నిలిచిపోవాలని కోరుకుంటాను .
* * *
44) ముంతాజ్ లా పాలరాతి సమాధి నా కొద్దు
నా కోసం నీ గుండెను గుడిగా మలచే ప్రయాస నీ కొద్దు .
అది గుడిశైనా నా ఊసులు పదిలంగా
ఎప్పటికీ మురిపంగా నిలిచుంటే చాలోయీ !
* * *
45) నీ వెవ్వరివి ?
గుర్తొస్తే చాలు నా ఒళ్ళంతా కలిగే పులకింతవా ?
గుర్తొస్తే చాలు నా ఒళ్ళంతా కలిగే పులకింతవా ?
తలచినంతనే నా పెదవుల మొలిచే చిరునవ్వువా ?
ఎదురుగా ఉన్నా కలలా అనిపించే అరుదైన అనుభూతివా ?
నిలువెల్లా కనులు చేసి నే చూసే ఎదురుచూపువా ?
* * *
46) ఈ ప్రేమ ఆవేగాన్ని భరించలేకున్నాను
అది కలిగించే ఆనందాన్ని వదలలేకున్నాను
ప్రేమ గనుక పిచ్చైతే ఆ పిచ్చి నాకానందం .
ఈ ప్రేమ గుడ్డిదైతే గాంధారే నాకాదర్శం
* * *
47) అడవి గాచు వెన్నెలైన కలువకు మోదము గూర్చు .
కడలి కురియు వానయైన ముత్యపు చిప్పలో మెరియు .
నే చేసుకొన్న అలంకరణ నీవు రాని నాడు
బూడిదలో కలిపినట్టి పన్నీరై పోవు చూడు .
* * *
48) అనుక్షణం నా చూపుతో నిన్ను నిలుపుకోవడం నచ్చక
ఆపలేని మత్తుతో నిద్ర నన్ను ఆవరింప చూస్తోంది
కళ్ళు మూసినా నా కలలో నీవే కనిపిస్తావని తెలుసుకోక
పాపం ! వృధాప్రయాస పడే నిద్రను చూస్తే నాకు జాలేస్తోంది .
* * *
49) స్వాతంత్ర్యమె మిన్నంటారు అంతా పారతంత్ర్యము కన్న .
నీవు లేక ఏ బంధన లేనట్టి స్వేచ్చ కన్న
నీ కౌగిలి సంకెలలో కదలక బంధింపబడిన
ఖైదు లోనే నేనెంతో హాయి ఉందంటున్నా !!
* * *
50) ఆనాడు విషాగ్నితో కంటమును కాల్చుకొని
లోకముల గాచెనని శివుని సేవింతురు .
ఈనాడు విరహాగ్నిని దాచి మదిని కాల్చుకొని
ప్రేమకు నెలవైన నన్ను మన్నింపరెందుకో !
* * *
51) చివురు మావి మేత లేక
కోయిల పాడలేదు .
నీ చివురు ప్రేమ ఊతలేక
నా మనసు పలుకలేదు .
* * *
52) నాకు పొద్దు పొడిచేది
నువు నవ్వినపుడే
నాకు చీకటయ్యేది
నువు వెళ్ళినపుడే.
* * *
53) జన్మ నిచ్చింది అమ్మ
ప్రాణమిచ్చాడు నాన్న .
కానీ నాకు నవ్వు నేర్పిన నీవు
వారి కన్నా ఎంతో మిన్న .
* * *
54) నీ నవ్వు నా కివ్వు నీ మనసు నా కివ్వు
బదులుగా నేనిచ్చేది అది నీకెంతో నచ్చేది .
ఊహలకు అందనిది ఊపిరిగా నిలిచేది .
తనువుల ఊసే లేనిది . తపనను సృష్టించేది .
* * *
55) చెలియలి కట్టను ఒరుసుకు సంద్రం చేసే సందడి .
పిడికెడు గుండియ చేస్తే భరిస్తుందా పూబోడి .
అందుకే
కళ్ళలో ఆ కిలకిల వన్నెలలో ఈ మిలమిల
మదిలో ఏదో గుసగుస పైకే ఈ రుసరుస
* * *
56) ఏదో చెప్పాలని తపన
ఏదేదో చెయ్యాలని కామన .
కానీ ఏం చెప్పాలో తెలియడం లేదు .
ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు .
ఇదేనా ప్రేమభావన ?
* * *
57) చెట్టు మీది పిట్ట పైన
వేటగాని గురి .
నా మదిలోని మాట పైన
చెలికానికి గురి .
* * *
58) శృతి చేసిపోయావు మదివీణను .
మ్రోయింప రావేమి నువు ఇంకను .
ఏమి పలకాలో తెలీక తన్యత నోపలేక
వేచి వేసారి దుర్బలనై కంపించుతున్నాను .
పలికింపరావోయి వేడుకలు చాలును.
* * *
59) అందుతుందట అమృతం తపస్సు చేస్తే
ఏముందందులో ఒక్కసారిగా తాగేసేస్తే .
అనుక్షణం నను అమరను చేసే నీ మాటకన్న గొప్పయా ?
అణువణువును మధురోహల ఊపే నీ ఊసుకన్న మిన్నయా ?
* * *
60) కొమ్మను విడిచిన ఆకు
పువ్వును విడిచిన రేకు
నిప్పును తాకిన పటాకు
వీటికున్న ఆస్థిత్వమే నీవులేని నాకు .
* * *
61) చూశావు నీవు కదిలాను నేను .
నవ్వావు నీవు నడిచాను నేను .
పిలిచావు నీవు పలికాను నేను .
నీ క్రియలన్నిటికీ ప్రతిక్రియలే తప్ప
వేరు జీవనక్రియలు నాకు లేవోయీ !
* * *
62) నను తలచావని నీవు తెలుపకనే తెలిసే
అందమైన అనుభూతేనా అనురాగం అంటే ?
నను వలచావని నీవు చెప్పకనే చెప్పే
కనుబాసల భాషేనా కాదల్ అని అంటే ?
* * *
63) నీ వన్నమాట నన్ను ముగ్ధను చేసేసింది .
నీ చేత ఆ పైన మంత్రం వేసేసింది .
ఇలా నీ వలన మంత్రముగ్ధనైన నేను
మరణవు తంత్రాన్నైనా సులువుగ ఛేదించగలను .
* * *
64) చంద్రుని చూసిన కమలపు ఛవి తగ్గిపోవునట.
సూర్యుని చూసిన కుముదపు కళ సన్నగిల్లునట.
అవి పరస్పరశత్రువులనుట లోకాచారము . కాని ,
మన ప్రేమ లోకమునకు శత్రువు కావడము
ఏ సిద్ధాంతం మేరకు సబబగు ఆచారము .
* * *
65) మనసుకో తలుపుంటుందని
అది ఓ మధురమంత్రం వింటే తెరుచుకుంటుందని
ఆలస్యంగానైనా అనుభూతి చెందాను .
తలుపు తెరిపించిన నిన్నే మదిలో బంధించివేశాను .
* * *
66) నీవు లేని వేళ నా మనసు పూజ్యము
నీవు రాని వేళ నా మనికి పూజ్యము
నీవు చెంత లేక నా ఉనికి పూజ్యము
నీవుంటే చాలు ఈ పూజ్యములే పూజ్యము .
* * *
67) ఏమని ఊహించను ? ఏమి ఆశించను ?
ఊహలకు నీవే ఊపిరైనప్పుడు .
ఆశలకు నీవే ఆలంబనవైనప్పుడు
నీవు కానిదేదైనా నిన్ను కానిదేదైనా
ఏమని ఊహించను ? ఏమి ఆశించను ?
* * *
68) నీ కనుసైగల తూపుల పాల్బడి
మదనుని శరాఘాతపు కైవడి
నీ పెదవుల తమకంపు సవ్వడి (ఒత్తిడి )
నిలువనీక చేర్చె నన్ను నీ ఒడి .
* * *
69) నా మనసే స్వాధీనమైన నీకు
మరి మంత్రము లేల ?
నా ఒడలు మరువజేయు నీకు
మనసిజు సాయము లేల ?
* * *
70) నీ తలపు మది తొలుపు
నీ ఊర్పు మరుతీర్పు .
నీ వలపు సురకైపు
కనుమలపు పెనుగెలుపు .
* * *
71) నాకు అన్ని ఎక్కువై బాధ .
(ధైర్యము ,తెగువ ,సాహసము ,చొరవ )
(లోయలు , శిఖరాలు , పీట్టభాగాలు , మైదానాలు )
నీకు అన్నీ తక్కువై బాధ .(ధైర్యము ,తెగువ ,సాహసము ,చొరవ )
* * *
72) నేను నీకు ప్రేరకాన్ని
నీవు నాకు ఉత్ప్రేరకమవు .
మన సంయోగమే ఓ
స 'రసాయనిక చర్య' .
* * *
73) ప్రేమపిపాసినైన నన్ను
ప్రేమసుధాపానమత్తగా మలచిన నీవు
కామకాదంబరిని నేను కోరుదునేమోనని
కలనైన తలపోయుట న్యాయమా ప్రియా !
* * *
74) అణువణువూ రసస్థానం అని తెలిసేలా చేస్తూ
ఒడలంతా అలదిన నీ అధరామృతమును
స్నానం చేయాలంటూ రంగూరుచీతావీ లేని శుష్కనీరంతో
కడిగివేయు నంతటి అవివేకినా చెప్పు ?
* * *
75) స్వప్నమున ప్రేమతపము కన్నులెదుట మారాకారసాక్షాత్కారం
తప:తీవ్రతానిదర్శనము తనివార సందర్శనము .
దృజ్మైథునము సద్వోఊహాగర్భము
(ఆత్మ) తుష్టి (దేహ) పుష్టి బాలక జననము .
* * *
76) నీ వీక్షణామృతము నీ గానామృతము
నీ అధరామృతము నీ ప్రేమామృతము
నీ రేతామృతము
ఈ పంచామృత సుస్నాతను నేను .
ఆ వలపు సామ్రాజ్య మూర్థాభిషిక్తను నేను .
* * *
77) ఏమిటి నీ స్థితి అంటే ఏమని చెప్పను ?
మధురమగు అధరము, స్పందించు హృదయము .
సరిగమల స్వానము గలగలా పాతము
ఒక్కచో నెలకొంటే అదేగా నాకము
* * *
* * *
78) .బింబోష్టిని పక్వము గావించిన దెవరే చెలీ ?
శుకుడా ? పికుడా ? నఖుడా ?
అయ్యో ! ఎంతటి అమాయికవే చెలీ !
శుకపికనఖ సన్నిభుడగు సఖుడే !
* * *
79) నీవెందుకు నాకు దగ్గరయ్యావు ?
నేనెలా నీకు చేరువ కాగలిగాను ?
నీ లోని సంగీతవధూటిని నేనే గనుక .
నీలోని శృంగారవీటిని నేనే కనుక .
నీలోని నిజహృదయవీక్షిని నేనే గనుక
నీలోని రసకోశగవాక్షిని నేనే గనుక
* * *
* * *
80) కొండల ఔన్నత్యమును లోయల గహనత్వమును (గుహ్యత్వమును )
పీటపు మృదులత్వమును మరీమరీ స్మరియించి .
తనివార దర్శించి మురిసిపోయావు .
ఆదమరచి హాయిగా ఆ ప్రకృతి ఒడిలో
వలపుపూడోలలో మైమరచి ఊగుమా!
* * *
81) ఇంత ప్రేమ ఎద దాచుకొని
ఇంత కాలమెలా ఊర్కున్నావు ?
కాకితో కబురంపి ఉండినా నే కాదని ఉండేదానినా ?
కంటితో సూచించి ఉండినా కైవశం కాకపోయేదానినా ?
* * *
82) పూర్ణకుంభాలను ఎదురుగా ఉంచుకొని
గొంతు తడారిపోతోందని తపిస్తావు .
ఇదేమి అమాయకత్వమోయీ ప్రియా !
లేక అడగకనే అందుకోవాలన్న జాణతనమా !
* * *
83) నీవు రావడం ఓ రోజేగా ఆలస్యమౌతుందని నీ వున్నావు .
కానీ నీ నిరీక్షణలో క్షణ మొక యుగంగా గడిపే నాకు
ఆ ఆలస్యం ఎన్ని లక్షల యుగాలౌతుందో చూడు
ఇప్పుడు చెప్పు నేనా నిరీక్షణ భరించగలనా ?
* * *
84) నా గుండెసడి నీకు వినబడుతోందా! అన్నావు .
వినడానికి ఆ సడి తెలిసిన నా గుండె సలు పనిచేస్తూంటే కదా !
నీ గొంతు నా చెవిలో వినబడగానే
మిగిలిన అవయవాలన్నీ మాయమై
ఒడలంతా చెవి అయిపొయింది .
* * *
85) దారీతెన్నూ లేని కష్టాల కడలిలో దీపస్తంభం నీవు .
గాఢనిబిడాంధకార దుర్గమ కాననాన వెల్గు చుక్కవు నీవు .
రాల్ పగులు రోహిణీ కార్తెలో నీవు ఘననీల అంబుదమువు.
రాజీ పడి బ్రతికే యాంత్రిక జీవనాన నీవు రసరమ్య అనుభూతివి .
* * *
86) నీ తోటి నెయ్యం కాదనిపిస్తోంది నూతనం .
నీతో మాటాడినా నీతో అడుగేసినా
ఇంతకు ముందెపుడో అది జరిగినట్టి జ్ఞాపకం .
అందుకే ఈ బంధం కాదోయీ నూతనం అనునిత్యనూతనం .
* * *
87) నేనెలా వ్రాయను నీ ఈ పాటలను
అడుగడుగున నీ తలపే అడ్డు వస్తుంటే
* * *
ఎలా పూర్తి చేయను నీ విచ్చిన పనిని .
నీ వెచ్చని కౌగిలే మదిని మథిస్తుంటే.
* * *
88) నీ కీరవాణి రాగం కా కరముల బంధనం .
నీ ఆగని తమకం నా తపనకు ఇంధనం
నీ చిలిపి సన్నలే నా , నీ చెలిమికి ఓదనం
నీ భావుకహృదయమే నాకు దొరికిన పెనుధనం.
* * *
89) నీ వెచ్చని కౌగిలి కోరేనోయి ఈ చలి .
ఈ కలిలో ఆపలేను నేను 'ఆ ' ఆకలి
మదాళివై నన్ను పెట్టకుమా గిలిగిలి .
విరాళితో నేను వేగుచుంటి సొక్కిలి.
* * *
90) ఇదేనా మదనావస్థ ?
అందుకేనేనా దీనిని వద్దంటుందీ వ్యవస్థ
ఏమీ చెయ్యనివ్వదూ ఎటకూ పోనివ్వదు.
స్పృహలోన ఉండేటి కోమాయే ఈ స్థితి .
* * *
91) ఎట దాచను ఈ మేనివంపులు
నీ ఒడి నాకు దూరమున్నపుడు .
ఎచట పొదగను ఉబుకుసొంపులు
నీ వేడి పరువం చెంతలేనపుడు .
* * *
92) ఎందుకీ ఆనందం ?ఉవ్వెత్తున ఎగిసే మోదతరంగం ?
గాలికన్న చులకనై వీచినట్టి భావన
ధూళికన్న చిన్ననై ఎగిసిన ఆలాపన
నీ మాటే చేసింది ఇంతటి జాలం .
నీ పలుకే వేసింది నా మనసుకు గాలం .
* * *
93) కలిసి చేసే పనులు కామునికే నెలవులు
కలిసి పాడే పాటలు పంచబాణు ములుకులు
కలిసి ఆడే ఆటలు అలరువిల్తు కోటలు .
కలిసి పొందు కలుములు కందర్పుపూజాఫలములు .
* * *
94) ఈ ముద్దు . ఇది తొలిముద్దు
ఇరుగుండెల చప్పుళ్ళతో కలబోసినది .
ఈ ముద్దు ఇది మలిముద్దు
మధురోహలు మది మెదిలి ఇస్తున్నది .
మధురోహలు మది మెదిలి ఇస్తున్నది .
ఆ పైన కొసరేటి ప్రతి ముద్దూ
అనురాగార్ణవముకు వంతెన వేస్తున్నది .
* * *
96) ఎందుకింతగా ఆకర్షించావు నన్ను
నీవు లేని ప్రతిక్షణం భరించడం అసాధ్యం
శివుని వదలి ప్రాణత్యాగం చేసుకునేతప్పటి
సతికి కలిగినలాంటి నాలో మెదిలే భావం .
* * *
97) నీవు గంభీరంగా పనిచేసుకుంటున్నావని
అలిగానని నను కించగా ఎంచకు
నిజానికి నా మనసులో నేనే నీ పనినై పోయి
నీవు తేలికగా చెయ్యగలిగేలా చెయ్యాలని ఉంది.
* * *
98) కామెర్లరోగి కంటికి లోకమంతా పచ్చనేనట .
ప్రేమరోగముతోన సొక్కి సొమ్మసిల్లే నాకు మాత్రం .
లోకమందున మనది మాత్రమే ప్రేమ అని అనిపించడం
ఎంత చిత్రం ! అందుకే ప్రేమ భాష్యాలకు అతీతం .
* * *
99) సూర్యుడొచ్చిన తర్వాత వికసించి అలంకరించుకుంటుంది కమలం .
చంద్రుడు చేతితో తట్టి లేపిన తర్వాతే బద్ధకంగా తయారౌతుంది కుముదం .
నీవు వస్తావన్న ఊహ కలిగితే చాలు నాకు ఏ క్షణం
నిలువెల్లా అలంకరించుకొని నిలిచి ఉంటున్నా రాదే నీకు కనికరం
* * *
100) నేను ఊహనైతే నీవు అందున్న భావానివి .
నే కవితనైతే నీ వందులోని అర్థానివి .
పువ్వు - పరిమళంలా , అందం - అలరింతలా
మొగుడూ పెళ్ళాలైన చక్కనిబంధం మనది .
* * *
101) ఎప్పుడైనా విన్నావా ?ఎక్కడైనా కన్నావా ?
ఓ పువ్వు మరో పువ్వు నుండి మధువు గ్రోలడం .
నా పెదవిని తరచే నీ పెదవేనోయీ
ఆ వివశత్వపు విడ్డూరానికి ఉదాహరణం .
* * *
102) ఇంతటి నీ ఆరాధనకు నే నర్హురాలిని కావాలనుకున్నా
అందుకే నీలో ఐక్యమైపోయి ఆస్థిత్వాన్ని వదలి
అర్హతానర్హతల చర్చకు పాడాను చరమగీతిక
దిగంతాలు కలిసే చోట నేలనింగిల సమానత్వాల బేరీజుకు తావేదీ ఇక !
* * *
103) ఈ గోడలు ఎందుకింత స్తబ్దంగా నిశ్సబ్దంగా ఉన్నాయి ?
నీవున్నప్పటిలా ఉత్సాహంగా ఊగిపోకుండా !
నీవు లేక ఒంటరితనంతో వేగే నన్ను చూస్తే
బహుశా వాటికీ జాలేసిందేమో అంతగా !
* * *
104) నీవు లేని ప్రతిసెకనూ
సుడులు లేని కొలను
* * *
105) తాకితేనే చాలు
తలమించు మోహాలు
చూపు మీటిన చాలు
శృతి మించు దాహాలు
* * *
106) నా ఆశాభంగపు కన్నీళ్ళు
నిన్ను మరుని తూపులై వేచుగాక !
నా విరహిత ద్రుక్కులు
నిన్ను ప్రేమదవానలంలో మాడ్చుగాక !
నా గుండెలో సుడులు తిరిగే భాధ
నిను వలపు సుడిగుండంలోకి ఈడ్చుగాక !
* * *
107) వెన్నెల కురిసి మురిపించి విరబూయించిన చంద్రుడు
దిగిరమ్మన్నా రాకుండా ఉండిపోతే -----
ఏడ్చి ఊర్కునే బేలకలువను కాను .
తూడునే తూణీరం చేసి
మొగ్గనే శీలీముఖం చేసి
చంద్రుడినే గురిచూసి వలపుగాయం చేసే
వలరాజు వలపుసాయకమైన నీలోత్పలాన్ని నేను .
* * *
108) ఏవీ చందన చర్చలు ? ఏవీ శీతల సేవలు ?
ఏవీ పువ్వులసెజ్జలు ? ఏవీ ఊరటపల్కులు ?
ఓహో ! అవన్నీ రాకుమారికలకే చెల్లునంటారా ?
కానీ ఆ తారతమ్యం ఆ మనసులేని మనసిజుడికి లేదే !
ఏం చెయ్యను ? అయినా కానీ నాకేం పరవాలేదు .
నా ప్రియుని వస్త్రమే నాకు పూలశయ్య
నా సఖుని తలపే నాకు శీతలసేవ
నా విభుని వలపే నాకు చందనచర్చ .
నా మరుని ఊర్పే నాకు ఊరటమాట .
* * *
109) నవ్వుకో !నవ్వుకో! నన్ను చూచి నవ్వుకో
ప్రేమబాణంతో కొట్టి గిలగిలలాడే పిట్టను
వోదార్చ మనసు లేని కరకువేటగానివా ?
వలపు పంజరాన పెట్టి గిజగిజలాడే చిలుకను
విలాసంగ నవ్వుకుంటు చూచే యజమానివా ?
నీలిమేఘమును చూచి నాట్యమాడు మయూరిని
క్రుంగజేయు క్రూరమైన సుడిగాలివే నీవా ?
* * *
వోదార్చ మనసు లేని కరకువేటగానివా ?
వలపు పంజరాన పెట్టి గిజగిజలాడే చిలుకను
విలాసంగ నవ్వుకుంటు చూచే యజమానివా ?
నీలిమేఘమును చూచి నాట్యమాడు మయూరిని
క్రుంగజేయు క్రూరమైన సుడిగాలివే నీవా ?
* * *
110) సమున్నత శిఖరాగ్రం నుండి దూకే
జలపాతపు హోరును తలపించే ఆ తొలినాళ్ళ ప్రేమావేగం
చల్లారిపోయిందనుకున్నాను .
కానీ , అది గాఢమైన లోతు కలిగిన
ప్రశాంతమందాకినీనదంగా
మారి నిలకడై సాగుతోందని నేడే తెలుసుకున్నాను .
* * *
* * *
114) నీవో అచంచల దీక్షాబద్దుడివి.
* * *
* * *
సరిసరి నను మరి ఉడికించకు మిక
నీ సరి లేరని తలచితి నేడే !
యవ్వనమంతయు నీకై దాగిన
వైనము వాడిగ వెడలెనులే !
ఆకుకు చాటుగ దాగిన పువ్వుకు
నీ దయతో తెర తొలిగెనులే !
* * *
117) కన్నుల కికపై కాయలు కాచే
* * *
118) మనిద్దరి పెదవులు జతబడి
ముడిపడి విడివిడి కాలేక తడబడి
తేనెలు తొణికించే ఆ రోజెప్పుడో !!
* * *
119) రాలేను , రాలేను ,అని ఏడిపిస్తావు .
* * *
120) నువ్వు లేని లోకంతో నాకేంటి అవసరము
నువ్వు రాని ఊరితో నాకేంటి అనుబంధం
నువ్వు కాని విషయం నాకేంటి ఆసక్తికరం
నువ్వు వున్న హృదయమే నాపాలి అంతరాళం (అంతఃపురం)
* * *
121) నీవు నా జీవన గమనంలో దొరికిన నిధివా ?
* * *
122) ఉష్ణం ఉష్ణేన శీతలం
సలిపే నా సొంపులకు నలిపే నీ చేతులే ఔషధం
* * *
123) మల్లెల మాలలో నా చేత బందీ అవుతూ
మా వుసురు నీకు తగిలి
నీవు నీ ప్రియుడి చేతుల్లో బందీగా
చిక్కకపోతావా అని నిట్టూర్పులు
విడుస్తున్నట్లు
మల్లెసౌరభం అంతటా వ్యాపిస్తోంది గుములుగుములుగా
* * *
124) నిద్రకై బలుపైన పాలింద్ల మధ్య చిక్కుకొని
బయటకు రావడం ఇష్టం లేక
ఊపిరికై కదులుతున్న మిషతో
సుఖానుభూతి జుర్రుకుంటున్న నీ తలకు
క్షణక్షణానికో ముద్దుతో మదనాభిషేకం .
* * *
125) చందమామ ఎంత దూరాన ఉన్నా
కాదనగలడా చకోరి మానసాకాశాన్ని
అందులోని తన స్థానాన్ని .
* * *
126) నేను కూడా తమాషా అనే అనుకున్నా
కొన్ని కోట్ల క్షణాలు ఎదురు చూసే కోట్లక్షణాలను
తెంచేసేదాకా
భ్రమేనేమో అనుకున్నా
బదులే రాని సందేశాలు బరువును గుండెల్లో
పెంచేసేదాకా
నేనూ నిజం కాదేమో అనే అనుకున్నా
నిర్దయకు ఉప్పొంగిన నరాలు రక్తాన్ని
కన్నీళ్ళుగా కార్చేదాక
నేనూ సరదాయేమోనని సరి చెప్పుకున్నా
సరిహద్దులేని విచారం సున్నాగా సంతోషాన్ని
మృగతృష్ణలా మార్చేదాకా !
* * *
127) నా గుండె చప్పుడు నువ్వే కాబట్టి
అదెక్కడ ఎక్కిళ్ళు రూపంలో
నిన్ను బాధిస్తుందోనని
శ్వాసక్రియలో సంధించి వదిలే
నిర్దయ నటిస్తున్నా .
* * *
128) పొరపడినా త్వరపడినా నీ ద్యాసే కన్నా
కించగా ఎంచకు నేను నీ కోసమే ఉన్నా
ఈరోజు బాకీ పడినవన్నీ వడ్డీ తో సహా తీరుస్తానని
కామునికి ముడుపు కట్టుకున్నా
జాబిలికూనకు సంజాయిషీ చెప్పుకున్నా
* * *
129) ఎంత జ్ఞాపకాల దుప్పటి కప్పుతున్నా
ఆగని చెలిమి చలి
ఊసుల కొలిమిలో కాచుకోక తప్పదని
మారాం చేస్తే అది ఎవరి తప్పు చెప్పు ?
ఎలా దాటాలి ఈ ముప్పు ?
* * *
130) నువ్వు మారపు నన్ను ఆరడి పెట్టడం మానవు .
నేనూ మారాను నీ కోసం ఎదురుచూపులు మానవు .
ఇదో నిరంతర ప్రహసనం .
నిర్విరామ ధారావాహికం విరక్తి కలిగించేలా !
* * *
131) తార లెన్ని ఉన్నా చందమామ కనబడనప్పుడు
ఆకాశవీధి చిన్నబోతుంది .
మాట లెన్నున్నా నీవు వినబదనప్పుడు
మనోవీధి మూగబోతుంది .
* * *
132) ఉలిక్కిపడి లేచి ఆత్రంగా చూసుకున్నాను
ఆనాటిలా ఆలస్యంగా అయినా సందేశానికి
ప్రతిస్పందించావేమోనని
కంగారుగా మేల్కొని పదకనంతా తదిమేశాను
ఓనాటిలా నిద్రమత్తులో దూరంవెళ్ళిపోయావేమోనని
తత్తరబాటుతో తిరిగి తిరిగి చూసా
ఆ ఓనాటిలా నాతో మాట్లాడాలనుకుంటే
పట్టించుకోలేదేమోనని కానీ ---------
అవేవి కావు ----- నీవు లేవు
ఎందుకంటే ఈనాడు ఆ ఏనాడూ కాదు కదా !
* * *
133) గుండె నిందా గుసగుసలు
కంటం నిండా కబురు
కళ్ళ నిండా కోరికలు
ఫలితమేంటి చందమామా!
ఎదురుచూపులు నిట్టూర్పులు తప్ప .
* * *
134) మల్లెలను ఒంటిగా మంచంపై నలపడం .
మదవతికి ఎంత కష్టం ?
* * *
135) నిర్దయద ఆకాశం నిండా నిండుగా
గుండుగా మనసు పరాభవంతో మండేలా ----
పరితాపంతో ఎండేలా
భంగపాటుకు కృంగేలా .
* * *
136) ఊహలమాలికలో మైమరచి
పక్కపై ఉంచుకున్న మల్లెమాలపై బడి నలిపేకాను
నీ ఊహలమాల నన్ను నలిపేసి నిట్టూర్పులు మిగిలిస్తే
నాచే నలుపబడ్డ మల్లెలమాల
నాకు సుగంధాలు పులిమి నన్నూరడించింది
నీతి:మంచి వారిని అకారణంగా శిక్షించినా మేలే చేస్తారు
* * *
137) నీ చూపు సోకితే నా మనసంతా తమకం
నీ చేయి తాకితే నా తనువంతా గమకం
నీ నామమే నమకం చమకం
నీవు లేవన్న క్షణమైనా నాకే నరకం .
* * *
138) నా బతుకు నడపడానికి నీ బాసట కావాలి
నా అడుగు పడాలంటే నీ ఆసరా కావాలి
నే నవ్వాలంటే నీ నయగారం కావాలి
నే అన్నం తినాలంటే నీ ముద్దుల ముద్దలు కావాలి
నే ఊపిరి పీల్చాలంటే నీ ఊహల గాలి కావాలి .
* * *
139) మనసుకు లేదు ఒంటరితనం
ఎందుకంటే అది నీ తలపుల లావాతో
రగిలే అగ్నిపర్వతం కానీ
ఊపిరి సలపని ఉక్కపోత
క్షణంక్షణం ఎందుకంటే ఆ ఊహలో
వేడికి నేనైపోతున్నా కాలే పెనం.
* * *
140) I WANT YOUR TOUCH ON BACK
2
ప్రియా ! నీవు చెంతలేని దివారాత్రములు అతి నిరాసక్తములు ,కడు సుదీర్ఘములై అనేక ఊహలకు తావిచ్చుచు ఒక పరి చల్లని గాలిని చేసి , నిను సుతిమెత్తగా స్పృశింపజేయుచు, మరియొకపరి మందగమనయైన అంబుదముగా రూపింపజేసి ,నిను ప్రేమామృత ధారల అభిషేకింప జేయుచు , వేరొకపరి చకోరచెలిని జేసి , నీ వదనరాకాచంద్ర నిర్గమ చంద్రికల తనివార గ్రోల జేయుచు , స్వైరవిహారియైన సుమశరుని బారిసేసి , అంతలోనే అంతయూ మటుమాయ మొనరించి , అలోకాంధకారమందు నను ఏకాకిని సేయుచు, నిన్ను చేరు దారిలేక , నిన్ను మరువ వీలు కాక , నిట్టార్పుల నిలువునా నను నలుపుతున్నవోయీ !
౩
ఆహా ! ఏమీ నా ఈ మనసు ? నీ వెదుట లేని క్షణమున కూడా నిను మరువనేరక ,నీ ఊహామూర్తిని ఔదల దాల్చి ,గగనాంతరగుహ్యసీమలకు చేర్చి , నాకనారీమణులు నిను గాంచి ,కంతజయంతభ్రాంతితో డాయుదురేమో నని భయమొంది ,తారావల్లభు చాటుగా ,పర్జన్యుల మాటుగా నిను తరలించి ,సురఝరిని అనురాగరసఝరిగా మలచి , నిన్నందు ఓలలాడించి , సురపారిజాత సుమసౌరభమును మించు ,తన మనోమోహసుగంధమున తనియించి ,నిను చేరవచ్చిన శ్రీగంధసంభరితమలయానిలమును కేలనే పరిహరించి , అంతర్విరహూద్భూత ఉష్ణ మిళితములైన తన శ్వాసలచే నీ ఒడలి తడియార్చి , అనుక్షణం తవ చింతనాఫలములుగా తనలో విరియబూచిన వలపుపూవుల గుది గ్రుచ్చి , హేలగా నీ కంఠసీమను అలంకరించుచున్దోయీ సఖా !
4
చెలికాడా !ఏమి ఈ బంధము ?శ్రీగంధసంవహ వృక్షములను అలవోకగా పెకలించు ఝంఝామారుతమై నన్నూ పిరి త్రిప్పుకోనీక చుట్టివేసి , నాలోని వివేచనను సమూలముగా పెకలించి ,నన్ను మత్తను చేయుచూ, చిత్తమును వేరొకచో నిలువనీక నీ యందే లగ్నమనస్కను చేయుచూ, నీ అనురాగపూరంబులైన దృక్కుల నను జలకమాడించుచూ ఒక పరి , నీ కాంక్షాపూరిత వీక్షణముల పాల్జేసి , ఒడలెల్ల పులకలు రేగజేయుచూ ఒకపరి ,నీ బద్ధ కార్యాదీక్షాపరిపూరిత శూన్యచూడ్కుల విముఖను చేసి వేరొక పరి , నీ ప్రియక్రియాతను స్పర్శల సుముఖను జేయుచూ మరొకపరి ,అలరించి , అపారమైన , అపూర్వమైన , అనంతమైన , అమేయమైన నీ ప్రేమాపయోధారల నను అభిషిక్తను చేసి ,దివ్యమహారాజ్ఞీత్వ మాపాదించి ,అత్యున్నత ప్రేమికాపీఠమున నీ సరసన కూర్చుండబెట్టుచున్నది .
5
ఎంత సుందరమైనది ఆ మానసరోవరం ! సుజలసుహృద్యమమై , నిర్మలనేత్రోత్సవమై , ఒకచో అగాధమై , దాపుననే ఉన్నతమై , ఒక్కచో విశాలమై , సమీపముననే సంకుచితమై , తాకినంత అలలై ఉవ్వెత్తున పడుచూ ,ఎగయుచూ , స్పృశించినంత ఎడదరీతి స్పందించుచూ ,పరివేష్టిత కృష్ణ తృణ సంపదార్ణవమై , (దినకర) కరతాడనమున మనోజ్ఞముగా కాన్పడుచూ , చూపరుల కదలనీక కట్టేదుటనే నిలవేయుచూ , గుహ్యమై , గహనమై , అలభ్యమై కవ్వించుచూ నిరంతరస్రవిత సుగంధరసముచే ఊరించుచు , మౌనులనైనా తలపెట్టుగోర జేయుచూ తన విలాసమ్ముతో మరులుగొల్పుచున్నది.
మారి నిలకడై సాగుతోందని నేడే తెలుసుకున్నాను .
* * *
111) ఈ భాధ్యతలూ బంధనాలూ
ఈ సంసారాలూ సంపాదనలూ
ఈ సంకటాలూ ఝంఝాటాలూ
ఏవీ లేని ఆ అద్భుతలోకం ,
ఎక్కడైతే ప్రేమే గాలిగా , ప్రేమే ఆకాశంగా
ప్రేమే పృథ్విగా , ప్రేమే నీరంగా ,ప్రేమే తేజంగా ఉంటుందో
అక్కడికి నన్ను తీసుకోనిపోవూ ప్రియా !
ఆ పంచప్రేమభూతాలసాక్షిగా
నా ప్రేమార్తిని చల్లర్చవూ !
* * *
112) చెలియలికట్ట హద్దుగా
ఉత్సాహపు అలలు ఆపుకునే సంద్రుడవీవు .
పరిమితులే లేక పరుగుపరుగున సాగే స్రవంతిని నేను.
అల్పురాలినైన నేను
నీ అపరిమిత జలవాహినిలో తల్లీనం కావడానికి
ఎంత దూరమని పరుగిడగలను ?
నా కోసం -------నీవే గమ్యంగా కల నా కోసం
కాస్త నీ హద్దులు చెరుపుకొని వచ్చి
నీకూ నా పై ప్రేమ ఉందని
నిరూపించుకోవూ చెలికాడా ?
* * *
113) ఎందుకింత వేదన ? ఎదలో ఏదో యాతన ?
ఎంత తాగినా తీరని దాహం
ఎంత పొందినా ఆరని మోహం
నీ సాన్నిధ్వమే దానికి పరిష్కారం
.
.
* * *
114) నీవో అచంచల దీక్షాబద్దుడివి.
నిన్ను భంగపరచకూడదనుకుంటాను .
కానీ నీ సాహచర్యం తప్ప
వేరేదీ నన్ను మురిపించనప్పుడు
ఎలా మౌనంగా ఉండగలను ?
ఏం చెయ్యమంటావు ? నీవే చెప్పు .
* * *
115) నిజంగా నీకు నాపై ప్రేమ ఉందా ?
నా మనస్సనే త్రాసులో
ఒక్కోసారి నీ ఉరకలు వేసే
ఉత్సాహం క్రిందికి తూగుతుంది .
మరోసారి నీ సాదాసీదా వర్తన
క్రిందికి మొగ్గుతుంది .
అలాంటప్పుడు
ఏది నిజమైన బరువున్నదో ఎలా తేల్చను ?
నా ఎదలోని భారాన్ని ఎలా దించను ?
* * *
116) నిను గని మురిసెను నా మది
ఈ ఇది ఏమిటో ఇపుడే తెలిసెనులే !సరిసరి నను మరి ఉడికించకు మిక
నీ సరి లేరని తలచితి నేడే !
యవ్వనమంతయు నీకై దాగిన
వైనము వాడిగ వెడలెనులే !
ఆకుకు చాటుగ దాగిన పువ్వుకు
నీ దయతో తెర తొలిగెనులే !
* * *
117) కన్నుల కికపై కాయలు కాచే
ఆ శ్రమలే మరి ఉండవులే !
బుగ్గన పూచే సిగ్గుల మొగ్గలు
పూలై నీదరి చేరునులే !
కమ్మని ఊహల కిప్పుడు
తియ్యని వలపుల తావులు అబ్బెనులే !
మనలను గాంచిన కంతదంపతుల
ఓర్వమి విరహము ఆయెలే !
* * *
118) మనిద్దరి పెదవులు జతబడి
ముడిపడి విడివిడి కాలేక తడబడి
తేనెలు తొణికించే ఆ రోజెప్పుడో !!
* * *
119) రాలేను , రాలేను ,అని ఏడిపిస్తావు .
పోతాను ,పోతాను అని ఏడిపిస్తావు .
ఇన్ని రకాలుగా నువ్వు ఏడిపిస్తున్నా------
నేనెందుకు నీ రాకకై ఎదురుచూస్తున్నా !
* * *
120) నువ్వు లేని లోకంతో నాకేంటి అవసరము
నువ్వు రాని ఊరితో నాకేంటి అనుబంధం
నువ్వు కాని విషయం నాకేంటి ఆసక్తికరం
నువ్వు వున్న హృదయమే నాపాలి అంతరాళం (అంతఃపురం)
* * *
121) నీవు నా జీవన గమనంలో దొరికిన నిధివా ?
లేక నా తలరాత రాసిన విధివా ?
వెచ్చని ఆలంబనవా ?
నులివెచ్చని ఆనంద భాష్పానివా ?
అతివెచ్చని విషాదనిశ్వాసానివా ?
* * *
122) ఉష్ణం ఉష్ణేన శీతలం
సలిపే నా సొంపులకు నలిపే నీ చేతులే ఔషధం
* * *
123) మల్లెల మాలలో నా చేత బందీ అవుతూ
మా వుసురు నీకు తగిలి
నీవు నీ ప్రియుడి చేతుల్లో బందీగా
చిక్కకపోతావా అని నిట్టూర్పులు
విడుస్తున్నట్లు
మల్లెసౌరభం అంతటా వ్యాపిస్తోంది గుములుగుములుగా
* * *
124) నిద్రకై బలుపైన పాలింద్ల మధ్య చిక్కుకొని
బయటకు రావడం ఇష్టం లేక
ఊపిరికై కదులుతున్న మిషతో
సుఖానుభూతి జుర్రుకుంటున్న నీ తలకు
క్షణక్షణానికో ముద్దుతో మదనాభిషేకం .
* * *
125) చందమామ ఎంత దూరాన ఉన్నా
కాదనగలడా చకోరి మానసాకాశాన్ని
అందులోని తన స్థానాన్ని .
* * *
126) నేను కూడా తమాషా అనే అనుకున్నా
కొన్ని కోట్ల క్షణాలు ఎదురు చూసే కోట్లక్షణాలను
తెంచేసేదాకా
భ్రమేనేమో అనుకున్నా
బదులే రాని సందేశాలు బరువును గుండెల్లో
పెంచేసేదాకా
నేనూ నిజం కాదేమో అనే అనుకున్నా
నిర్దయకు ఉప్పొంగిన నరాలు రక్తాన్ని
కన్నీళ్ళుగా కార్చేదాక
నేనూ సరదాయేమోనని సరి చెప్పుకున్నా
సరిహద్దులేని విచారం సున్నాగా సంతోషాన్ని
మృగతృష్ణలా మార్చేదాకా !
* * *
127) నా గుండె చప్పుడు నువ్వే కాబట్టి
అదెక్కడ ఎక్కిళ్ళు రూపంలో
నిన్ను బాధిస్తుందోనని
శ్వాసక్రియలో సంధించి వదిలే
నిర్దయ నటిస్తున్నా .
* * *
128) పొరపడినా త్వరపడినా నీ ద్యాసే కన్నా
కించగా ఎంచకు నేను నీ కోసమే ఉన్నా
ఈరోజు బాకీ పడినవన్నీ వడ్డీ తో సహా తీరుస్తానని
కామునికి ముడుపు కట్టుకున్నా
జాబిలికూనకు సంజాయిషీ చెప్పుకున్నా
* * *
129) ఎంత జ్ఞాపకాల దుప్పటి కప్పుతున్నా
ఆగని చెలిమి చలి
ఊసుల కొలిమిలో కాచుకోక తప్పదని
మారాం చేస్తే అది ఎవరి తప్పు చెప్పు ?
ఎలా దాటాలి ఈ ముప్పు ?
* * *
130) నువ్వు మారపు నన్ను ఆరడి పెట్టడం మానవు .
నేనూ మారాను నీ కోసం ఎదురుచూపులు మానవు .
ఇదో నిరంతర ప్రహసనం .
నిర్విరామ ధారావాహికం విరక్తి కలిగించేలా !
* * *
131) తార లెన్ని ఉన్నా చందమామ కనబడనప్పుడు
ఆకాశవీధి చిన్నబోతుంది .
మాట లెన్నున్నా నీవు వినబదనప్పుడు
మనోవీధి మూగబోతుంది .
* * *
132) ఉలిక్కిపడి లేచి ఆత్రంగా చూసుకున్నాను
ఆనాటిలా ఆలస్యంగా అయినా సందేశానికి
ప్రతిస్పందించావేమోనని
కంగారుగా మేల్కొని పదకనంతా తదిమేశాను
ఓనాటిలా నిద్రమత్తులో దూరంవెళ్ళిపోయావేమోనని
తత్తరబాటుతో తిరిగి తిరిగి చూసా
ఆ ఓనాటిలా నాతో మాట్లాడాలనుకుంటే
పట్టించుకోలేదేమోనని కానీ ---------
అవేవి కావు ----- నీవు లేవు
ఎందుకంటే ఈనాడు ఆ ఏనాడూ కాదు కదా !
* * *
133) గుండె నిందా గుసగుసలు
కంటం నిండా కబురు
కళ్ళ నిండా కోరికలు
ఫలితమేంటి చందమామా!
ఎదురుచూపులు నిట్టూర్పులు తప్ప .
* * *
134) మల్లెలను ఒంటిగా మంచంపై నలపడం .
మదవతికి ఎంత కష్టం ?
* * *
135) నిర్దయద ఆకాశం నిండా నిండుగా
గుండుగా మనసు పరాభవంతో మండేలా ----
పరితాపంతో ఎండేలా
భంగపాటుకు కృంగేలా .
* * *
136) ఊహలమాలికలో మైమరచి
పక్కపై ఉంచుకున్న మల్లెమాలపై బడి నలిపేకాను
నీ ఊహలమాల నన్ను నలిపేసి నిట్టూర్పులు మిగిలిస్తే
నాచే నలుపబడ్డ మల్లెలమాల
నాకు సుగంధాలు పులిమి నన్నూరడించింది
నీతి:మంచి వారిని అకారణంగా శిక్షించినా మేలే చేస్తారు
* * *
137) నీ చూపు సోకితే నా మనసంతా తమకం
నీ చేయి తాకితే నా తనువంతా గమకం
నీ నామమే నమకం చమకం
నీవు లేవన్న క్షణమైనా నాకే నరకం .
* * *
138) నా బతుకు నడపడానికి నీ బాసట కావాలి
నా అడుగు పడాలంటే నీ ఆసరా కావాలి
నే నవ్వాలంటే నీ నయగారం కావాలి
నే అన్నం తినాలంటే నీ ముద్దుల ముద్దలు కావాలి
నే ఊపిరి పీల్చాలంటే నీ ఊహల గాలి కావాలి .
* * *
139) మనసుకు లేదు ఒంటరితనం
ఎందుకంటే అది నీ తలపుల లావాతో
రగిలే అగ్నిపర్వతం కానీ
ఊపిరి సలపని ఉక్కపోత
క్షణంక్షణం ఎందుకంటే ఆ ఊహలో
వేడికి నేనైపోతున్నా కాలే పెనం.
* * *
140) I WANT YOUR TOUCH ON BACK
I WANT YOUR TOUCH IN FRONT
I WANT YOUR TOUCH ON A WHOLE
I WANT YOUR TOUCH EVEN ON SOLE .
* * *
1
ప్రియా ! అని సంబోధించనా ! నీనా ప్రియత్వము ఆ పిలుపుకు అందనంత అనంత సుదూర మధురమనోహరవీధుల విహంగమై స్వేచ్చాసామ్రాజ్యపు టెల్లల జూచుచు అగోచర మనోదృక్కుల ఊయల లూగుచు , అద్వితీయమై ,అమేయమై ,అర్పిత హృదయ హృద్యమరీతుల మధురోహల సేయుచు .కలకోకిల కూజితములు ,మంద్రమారుతములు , మల్లెల సారభములు,మనసిజు ఆగడములు విరహిత ఎడదలకు చందన చర్చ కాగా , సమీరునితో సయ్యాటలాడుచు , మేరువుకు మారుబల్కుచు ,సురగంగన తానమాడుచు ,రసలోకపు వీణియ మీటుచు , అచ్చరయై ఆడుచు , కిన్నెరయై షాడుచు , అలోకపు లోకమై , నీరవమధురవమై , చుంబిత శశితరణీ పథమై కడువయారములు పోవుచున్నది .
2
ప్రియా ! నీవు చెంతలేని దివారాత్రములు అతి నిరాసక్తములు ,కడు సుదీర్ఘములై అనేక ఊహలకు తావిచ్చుచు ఒక పరి చల్లని గాలిని చేసి , నిను సుతిమెత్తగా స్పృశింపజేయుచు, మరియొకపరి మందగమనయైన అంబుదముగా రూపింపజేసి ,నిను ప్రేమామృత ధారల అభిషేకింప జేయుచు , వేరొకపరి చకోరచెలిని జేసి , నీ వదనరాకాచంద్ర నిర్గమ చంద్రికల తనివార గ్రోల జేయుచు , స్వైరవిహారియైన సుమశరుని బారిసేసి , అంతలోనే అంతయూ మటుమాయ మొనరించి , అలోకాంధకారమందు నను ఏకాకిని సేయుచు, నిన్ను చేరు దారిలేక , నిన్ను మరువ వీలు కాక , నిట్టార్పుల నిలువునా నను నలుపుతున్నవోయీ !
౩
ఆహా ! ఏమీ నా ఈ మనసు ? నీ వెదుట లేని క్షణమున కూడా నిను మరువనేరక ,నీ ఊహామూర్తిని ఔదల దాల్చి ,గగనాంతరగుహ్యసీమలకు చేర్చి , నాకనారీమణులు నిను గాంచి ,కంతజయంతభ్రాంతితో డాయుదురేమో నని భయమొంది ,తారావల్లభు చాటుగా ,పర్జన్యుల మాటుగా నిను తరలించి ,సురఝరిని అనురాగరసఝరిగా మలచి , నిన్నందు ఓలలాడించి , సురపారిజాత సుమసౌరభమును మించు ,తన మనోమోహసుగంధమున తనియించి ,నిను చేరవచ్చిన శ్రీగంధసంభరితమలయానిలమును కేలనే పరిహరించి , అంతర్విరహూద్భూత ఉష్ణ మిళితములైన తన శ్వాసలచే నీ ఒడలి తడియార్చి , అనుక్షణం తవ చింతనాఫలములుగా తనలో విరియబూచిన వలపుపూవుల గుది గ్రుచ్చి , హేలగా నీ కంఠసీమను అలంకరించుచున్దోయీ సఖా !
4
చెలికాడా !ఏమి ఈ బంధము ?శ్రీగంధసంవహ వృక్షములను అలవోకగా పెకలించు ఝంఝామారుతమై నన్నూ పిరి త్రిప్పుకోనీక చుట్టివేసి , నాలోని వివేచనను సమూలముగా పెకలించి ,నన్ను మత్తను చేయుచూ, చిత్తమును వేరొకచో నిలువనీక నీ యందే లగ్నమనస్కను చేయుచూ, నీ అనురాగపూరంబులైన దృక్కుల నను జలకమాడించుచూ ఒక పరి , నీ కాంక్షాపూరిత వీక్షణముల పాల్జేసి , ఒడలెల్ల పులకలు రేగజేయుచూ ఒకపరి ,నీ బద్ధ కార్యాదీక్షాపరిపూరిత శూన్యచూడ్కుల విముఖను చేసి వేరొక పరి , నీ ప్రియక్రియాతను స్పర్శల సుముఖను జేయుచూ మరొకపరి ,అలరించి , అపారమైన , అపూర్వమైన , అనంతమైన , అమేయమైన నీ ప్రేమాపయోధారల నను అభిషిక్తను చేసి ,దివ్యమహారాజ్ఞీత్వ మాపాదించి ,అత్యున్నత ప్రేమికాపీఠమున నీ సరసన కూర్చుండబెట్టుచున్నది .
5
ఎంత సుందరమైనది ఆ మానసరోవరం ! సుజలసుహృద్యమమై , నిర్మలనేత్రోత్సవమై , ఒకచో అగాధమై , దాపుననే ఉన్నతమై , ఒక్కచో విశాలమై , సమీపముననే సంకుచితమై , తాకినంత అలలై ఉవ్వెత్తున పడుచూ ,ఎగయుచూ , స్పృశించినంత ఎడదరీతి స్పందించుచూ ,పరివేష్టిత కృష్ణ తృణ సంపదార్ణవమై , (దినకర) కరతాడనమున మనోజ్ఞముగా కాన్పడుచూ , చూపరుల కదలనీక కట్టేదుటనే నిలవేయుచూ , గుహ్యమై , గహనమై , అలభ్యమై కవ్వించుచూ నిరంతరస్రవిత సుగంధరసముచే ఊరించుచు , మౌనులనైనా తలపెట్టుగోర జేయుచూ తన విలాసమ్ముతో మరులుగొల్పుచున్నది.
1) హక్కుభుక్తమైన దానిని అడుక్కోవడం .
అర్హతలేని దానిని ఆశించడం
అవకాసం లేకపోయినా అర్రులు చాచడం .
ఆకాశకుసుమాన్ని అందుకోవాలనుకోవడం అవివేకం
2) మంచి వయసులో ఉన్నవారికి
అరిటిపండు వలిచి రుచి నోట్లో కుక్కి
నీళ్ళు పోసి మింగించే ప్రక్రియనే
సాహిత్యంలో పుస్తక,సమీక్ష అంటారు
3) ఈ చేతులతో పెట్టిన ముద్దలేగా
కారుచీకటులు కమ్మించేది .
ఈ చూపులతో కురిసిన కరుణేగా
కాలకూట విషమయ్యేది .
ఈ నవ్వులలో చూపిన నెనరేగా
నవ్వుల పాలయ్యేది .
ఈ మనసుతో చూపిన ప్రేమేగా
అవమానం పాలయ్యేది .
4) ఇతరుల పిల్లలను ఎంత ముద్దు చేసినా
పరాయి వస్తువులను ఎంత
మెరుగు పెట్టినా ఫలితం సూన్యం .
అవి వారివాడి ఇంటికే చేరతాయి .
5) ముఖాన్ని చూసి వేయకు అంచీనా
అది అంత సులభం కాని సాధన
కన్యావరయితే రూపం అను వాదన
ఆనాటికీ నాటికీ చక్కని సూచన
నేడు సబలవైనా తప్పడం లేదు నీకు వంచన .
6) పరభాష మోజుతో అమ్మ చీరను విప్పి
అమ్మ ముద్దలా కమ్మదనము మరిచారు
అక్షరాలెక్కవని అమ్మ భాషను చీల్చి
పలుకు బడిలు గందరగోళాలు సృష్టించి
మమ్మి డాడీ లంటూ రైసు సాల్టూ అంటూ
3 పీసు మిడ్డీలు తొడిగినారు.
7) తీరని ఈ దాహాన్ని తీర్చే నీరేది ?
ఆరని ఈ ఆకలిని ఆర్పే తిండేది ?
చేరని ఈ దూరాన్ని చేర్చే నావేది ?
ఆగని ఈ కన్నీళ్ళను తుడిచే చేయ్యేది ?
8) నీటికి ఎండమావివెంట
దూదిమబ్బులు చూసి వానకై అర్రులు .
ఇసుకను పిండి తైలంపు తీతలు
ప్రేమకై నీ వెంట పడుతలు .
9) ఎవరి కొరకు ఆగకు
ఎవ్వరితో సాగకు
10) ఈలోకంలో ప్రతి ఒకరో ఒంటరి
జనఘోషల మధ్య నీరవనిశ్శబ్ద తెంపరి
సాంద్ర తమాల తిమిర మానసాన
ఆగమ్య తెరువరి .
11) తెలుగు తెలుగననేల తెలుగు నాదననేల
నీవు మంటాడేది తెలుగేనటే బేల .
పరభాష మెండాయె క్రియలొక్కలే మిగిలే
కర్తలూ కర్మలూ కర్మ కెళ్ళే పోయే .
12) హద్దు లేని మోమాతాలు
రద్దు కాని బులబాటాలు
సద్దు చేయని ఏకాంతాలు
పద్దు వద్దను పులకాంగాలు.
13) తెలివి గల వనిత పేరిడి
పిలవకనే తన ప్రియుని కుయ్యిడి
అతడు వడి 'వడి' చేరినంతనె .
కడకు పరువిడి పెట్టె నారడి .
14) జాణకు , జవ్వనముఖవీణకు ,
కిణ 'కిణ' నిక్వణ చానకు ,
ఘనతర పుష్పాంగ పంచబాణకు నాకున్
కానని ఆరని మధు సేవన సౌఖ్యములు
మీనకేతన స్వామిచ్చు గాత ఏవేళైనన్
15) ఓ అందగాడా ! నీదే ఈ శిల్పం .
నీ చూపుల ఉలితో చెక్కిన ఒంపులు
నీకేగా సొంతం
16) కడునిరుపేదను నేను .
నవనిధివై వచ్చి తీవు .
నా జీవన గమనములో
నిలిచిన పెన్నిధి నీవు .
17) క్షుధాతృఫార్తనైన నాకు
మృష్టభోజ్యమయ్యావు
చవులెరుగని నా బ్రతుకున
షడ్రసములు కురిశావు .
18) సిరులేవీ లేని నాకు
శాంతియైన లేని నాకు
నిలింపశాఖవై వచ్చి
సౌభాగ్యము లిచ్చావు .
19) మన ఇరువురి సంగము
ప్రణయ భావ భరితం .
No comments:
Post a Comment