హిపోక్రాట్
బాగా ఆలోచిస్తే ...
ఈ ప్రపంచంలో ...
అతిపెద్ద హిపోక్రాట్ అద్దమే1
మన ముఖమెంత ముదిరిపోయినా
'స్కిన్ టోన్ అద్భుతం' అనిపించేలా చూపిస్తుంది.
మన ముఖం వైపు మరోసారి మరెవ్వరు చూడకపోయినా ...
మనం మాత్రం మాటిమాటికి చూసుకునేలా చేస్తుంది.
'మన బదులు ఐశ్వర్యారాయ్ మిస్ వరల్డ్ ఎలా అయ్యింది?'
అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
'అభిషేక్ నాకన్నా అందగాడా ఐష్ వరించడానికి?'
అనే ఆలోచనను కలిగిస్తుంది.
లంబోదరులకు, గజకాయులకు
'పర్లేదు, మరీ లావేం లేవు.' అని ఓదార్పు నిస్తుంది
బ్రహ్మానందానికి 'బిగ్ బి ' ననే ఫీలింగును,
కోవై సరళకు కరీనా కళను కలగజేస్తుంది.
వర్ణభేదాలు, వయసుతేడాలు
ఏమాత్రం తన హిపోక్రసీని కరిగించలేవు.
ఎందుకంటే .....
అద్దం మన ప్రతిబింబం.
అంటే అంతరాత్మకు ప్రతిరూపం.
అంతరాత్మ పరమాత్మకు అనుసంధానం.
అదే ఇచ్చింది దానికి ఈ నొప్పించని నైజం.
అందుకే అద్దం.....
అతిపెద్ద హిపోక్రాట్
ఇది నిజం.
%%%%%%
- సాహిత్య ప్రస్థానం ఆగష్ట్ 2011
కూపస్థ లేక కూప[వ్యవ]స్థ
ఇదో కూపం.
ఇందులో పడ్డ ఎవరైనా మునగానాం.......తేలానాం.
మునుగుతూనే బుర్ర బద్ధకిస్తుంది.
ఇంతకంటే మరో ప్రపంచం ఉంటుందనే ఆలోచన మందగిస్తుంది.
దాంతో ఆ ప్రపంచంలో అస్తిత్వానికై మొదలైన యావ
ఆధిపత్యం వరకు కొనసాగుతుంది .
రాజారాణీలలా చెలాయింపు .......
కూపంలోని గూళ్ళలోనే బదలాయింపు .
పదిమందిని చంపిన డాక్టర్ గొప్ప వైద్యుడై నట్లు
'పని' మందిని అణిచేసినవాడు గొప్ప 'పని'వంతుడు అక్కడ .
'పని=మనీ' ఇది ప్రాథమికసూత్రం .
'మనీ + షి = మనిషి ' ఇది అనునిత్యసత్యం .
పైరవీలు ,పదవీపోరులు కంపరపు స్థాయిని దాటిన కఠోరదృశ్యం.
దుండగాలు ,దుస్తంత్రాలు దృశ్యమానమయ్యే కరాళనృత్యం .
మానవత్వం ,తార్కికజ్ఞానం - ఇవి నిఘంటువు నుండి లుప్తం .
అతితెలివితనం, అవినీతికోణం ఈ కూపపు కుడ్యాల్లో స్థగితం .
......ప్రతి అవసరార్థం .
మొహమెచ్చులు , మెహర్బానీలు - లాక్షణికం .
మూతివిరుపులు , చెవికొరుకులు -సార్వజనీనం .
ఇంకా అర్థం కాలేదా ?
అది ప్రభుత్వ కార్యాలయం .
&&&&&&&&&
ఇదంతే
ఏంటిదంతా అని ఆశ్చర్యపోకు
ఇదంతే ------ఇలాగే వుంటుంది
నీ ముఖం ఆశ్చర్యార్థక చిహ్నంగా మారినంత మాత్రాన
మాపనులకేమి ఫుల్ స్టాప్ పెట్టం .
నీ ఆశ్చర్యాన్ని చూస్తుంటే ........
నీవు ఏ పాతరాతియుగంలోనో కోమాలో కెళ్ళి ,
దాని క్కాస్త కామా పెట్టి వచ్చినట్లనిపిస్తోంది .
నీ వనుకుంటున్న అర్థం లేని విలువలను
'అర్ధ' వంతంగా మార్చుకోగలిగిన బుద్ధిశాలులం మేం.
సభ్యత, సంస్కారం అని నువ్వు వల్లె వేసే పాఠాలు
అన్నివేళలా చూపడం అవజ్ఞత.
అవసరమైనచోట ప్రదర్శించడమే నేడు విజ్ఞత .
దారి తప్పి తబ్బిబ్బు అవుతున్నావా?
ఓ అపరిపక్వవ్యక్తీ 1
చేతనైతే ఇలా మారు.
చేవ లేదా చచ్చి బతుకు.
ఇదింతే !!!!!!!!
సిటీ గాళ్
సిగ్గుదొంతరలతో వారింపులు ఆశించకు
శిథిలమైన నా సిగ్గు ఉనికి సిగ్గు వదిలిన స్టార్ కనెక్షన్ కు తెలుసు.
శృంగారపు కబుర్లకు కవ్వింతలు ఆశించకు.
కొయ్యబారిన నా కవ్వింతల ఉనికి ఈవ్ టీజర్స్ బండ జోకులకు తెలుసు
నీ మృదు స్పర్శలకు నా పులకింత లాశించకు
బండబారిన నా పులకరింత ఉనికి కాలుదూరని సిటీ బస్సుకే తెలుసు .
జోడుగా నీతో సయ్యాటాడే ఈడును నువ్వా శించకు
ఇంచు మించు మెనోపాస్కు చేరిన నా ఈడు ఉనికి
మొయ్యలేని చదువుకు
. ఇవ్వలేని కట్నానికి
కలవలేని జతకలకే మా బాగా తెలుసు
మనోశీలాన్ని నీవు మరి అసలాశించకు
శరీరానికే ఆగిన నా శీలపు ఉనికి
అడుగుగడుగున దిగజారిన సంఘపు పోకడకు తెలుసు
కార్యేషు దాసంటి గుణములను ఆశించకు
అమ్మలనాడే ఆగిన ఆ ధర్మపు ఉనికి
చెయ్యక తప్పని నా ఉద్యోగపు ఉరికి తెలుసు .
నవ్య వారపత్రిక , ఫిబ్రవరి, 2012
ఒరే ! - ఒసే
ఏంట్రా అలా చూస్తున్నావ్?
ఏంటా ఉలికిపాటు?
ఓహో! ఒరే అన్నాననా?
ఆరే ! కల్చర్ద్ సొసైటీ కన్నెపిల్ల
.లేటెస్ట్ పిలుపది తెలీదూ!
మన తెలుగు సినిమాలు త్రవ్వి పోస్తున్నాయ్ . వినలేడూ !
ఏంటంతలోనే అంత ఉత్సాహంగా ఉబుకుతున్నావ్ ?
ఓ! నీలోనుండీ ఒసే అనే పిలుపు వొరుసుకు వస్తోందా!
ఓకేరా !దాందేముంది ? అలాగే కానీరా
నిన్నటి ఆ కుసంస్కారపు పిలుపులే
నేడు అతిసారపు వయ్యాయోయ్!
సహజమేగా ! ఆదిమానవుని గోచిలాంటి
అతి చిన్న గుడ్డపేలికలేగా
నిన్నటి నిండు వస్త్రధారణను కాల్తోతన్ని
నేటి మోడ్రన్ ఏజ్ ను
మోకాళ్ళ పైన ఏలుతున్నాయ్ !
అందుకేరా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్ ' అన్నారు
కళ్ళలో ఒత్తు లేసుకుని కామిక్సేం చదవక్ఖర్లే------
మరో మూడేళ్ళల్లో మనమేరా 'కానిబల్స్ '
ఎన్. జి ఓ.
టెన్ టు ఫైవ్ జాబ్
వైట్ కాలర్ జాబ్
కుళ్ళుకుంటున్నావా?
నన్ను చూచి ఏడవకోయ్ పిచ్చోడా !
ఇది నథింగ్ బట్ తల తాకట్టు .
నా వేళలు నావి కావు
నా రోజులు నావి కావు
ట్రాఫిక్ జామైనా , బహుజరూరు కామున్నా
అఘమేఘాల మీద ఆఫీసులో వాలాల్సిందే !
లేకుంటే లేట్ లిస్టులో చేరాలి
మూడుసార్లు 'లేట్' అయితే [అపార్థం చేసుకోకండి - అటెండెన్స్ లో] మటాష్ .
.బాగా పని చేసినందుకు కిరీటాలు , ముఖ్యమైన సీట్లు .
ముఖ్యమైన సీట్లలో ఉంటే సాయంత్రాలు . యంత్రాలు
పరపతి ,గౌరవం ఎట్సెట్రా వెయ్యుంటాయి
కానీ వాటికి షుగరు , బీ పీ జోడౌతాయ్
ఏ/సిలు ,కూలర్లు ఉంటాయి కాని
అవి ఎప్పుడు పనిచేస్తాయి?
అదృష్టమంటే ఆఫీసర్ గా ఎగబాకు !
అవకాశముంటే అటెండర్ గా దిగజారు !
అంతే గాని-----
ఎన్ - నడిమధ్యన
జీ - గతిలేని
ఓ - ఓ వుద్యోగివి మాత్రం కాకు .
-- ఎంప్లాయీస్ వాయిస్ , 2011
గృహ ప్రవేశం
అక్కడ గృహప్రవేశాలేవి జరగవు
గంటకో గృహం వెలుస్తున్నా !
అక్కడ ఇల్లు కట్టడానికి ఎవరికీ బ్యాంక్ లోన్ అక్కరలేదు
సొంతఇల్లు కడుతున్నా.
ఇల్లుకట్టడం వీళ్ళకు నీళ్ళప్రాయం
పోలీస్ లొచ్చి పీకేసి వెళ్ళేది ఎంకరోచ్మెంట్ అని వీళ్ళ ఇళ్ళనే
వాళ్ళ చెయ్యి తడిపేందుకు వీళ్ళకు కరువు నీళ్ళకూ
అయినా బాధలేదు వీళ్ళు పేద్ద లాండ్ లార్డ్ లు, కబ్జాకోరు రియాల్టర్లు
నగరంలో ఫుట్ పాత్ లన్నీ వీళ్ళవే!
ఇళ్లు కట్టుకునేందుకు మూలధనం
కుప్పతొట్లే సాధనం
బాండ్ మేళాలుండవు బంధువుల వేళాకోళాలుండవు
అయినా గంటకో గృహం అవిశ్రాంతంగా వెలుస్తూనే ఉంటుంది
ఆమె భారతమాత కాదు
భారతమాత - మన భారతమాత
అరవై సంవత్సరాలు దాటిన స్వతంత్ర జీవనం తర్వాత కూడా
స్వయంసమృద్ధి చిన్నెలు నోచుకోలేదు ఆమె రాత
'పారతంత్ర్యపు పాయసం కన్నా స్వాతంత్ర్యపు గంజి మేలు ' అన్నది ఓ కవి పాట
బహుశా పాడి ,పాడి దేశమాతకు లక్ష్మణగీతను చేశామేమో ఆ మాట
ఆ గంజిని దాటి ఆమె ముందడుగు వేయలేకుంది ఏ పూటా
అందుకే మన భారతమాత స్వయంప్రతిపత్తికి నోచుకోని ఓ సీత
అసలా 'మాత' అనే పిలుపులోనే గోచరిస్తోంది లోపమంతా !
ఎందుకంటే ----
మాత ఎంత ప్రేమగా పెంచినా,ఎంత అనురాగం పంచినా
బరువే అవుతుంది మనపై ఆధారపడే సమయాన .
బహుశా 'చెట్టుకు కాయ భారమా !' అనే తల్లికి అన్వయించే సామెతను
సరిగ్గా వెనుదిప్పి తమకు అన్వయింపచేసుకుంటారేమో పిల్లలంతాను
అందుకే -----
'కాయకు చెట్టెపుడూ భారమే '
పెద్దలైన పిల్లలకు తల్లెప్పుడూ కారమే '
కన్నతల్లి నెప్పుడూ కాల్చుకుతినే మనం
మన పిల్లల కాలి చిటికెనవేలునైనా కందనీయం
అట్లే దేశమాత ఒడిలోని అన్ని వనరులనూ భోంచేస్తాం
అట్లే దేశమాత ఒడిలోని అన్ని వనరులనూ భోంచేస్తాం
ఆమె కష్టనష్టాల సమయంలో ముఖం చాటేస్తాం
మనం నేతులు తాగిన తాతల వాసన మిగిలిన మూతులం
నేతకు ,గాంధీతాతకు వారసులౌ కుక్కమూతి పిందెలం
కడుపులో పడగానే మనకు పుట్టబోయే పిల్లల
పురోభివృధికి బాటలు వేసే మనం
కన్నతల్లికి కడుపు నిండా తిండి పెట్టడం కూడా అనుకుంటాం వ్యయం
అదే కడుపులో ఓనాడు ఆమె ఆహారాన్ని మింగేస్తూ తెగ బలిసుంటాం మనం
కన్న పిల్లల కెరీర్ కోసమో కట్నం కోసమో
తమ తల్లి కిడ్నీని అమ్మడానికైనా సిద్దం జనం
ఆ యత్నంలో ఆమె ప్రాణం పోతే ఓల్డేజ్ హోమ్ ఖర్చు
మిగిలిపోయిందని ఆనందంగా నిట్టూరుస్తుంది మనం
ఇలాంటిదేగా నేటి దేశ రాజకీయాల వైనం
దేశమాతను క్రమంగా విదేశీపాదాల క్రిందికి చేరుస్తున్న విధానం
దేశీవిజ్ఞానాన్నంతా పరదేశపాలు చేస్తున్న కథనం
ప్రతిపక్షం పేరిటా అభివృధికి అడ్డుపడే సుగుణం
ప్రజాస్వామ్యాన్ని పెనుమంటల పాలు చేసే జతనం
దేశమాతకు మరోసారి సంకెళ్ళు పడితే
రావ్ బాహద్దూర్లు, సర్ బిరుదులూ దొరల చేతుల మీదుగా
పొందవచ్చునని ఆనందించేంత బానిసగుణం
పంచవర్ష , వింశతివర్ష ప్రణాళికలు కాగితంఫై కూడా
చూపించ నక్కరలేదనే స్థాయి దిగజారుడుతనం .
దీనికంతా కారణం మనం దేశాన్ని ముసలిమాతగా తలచడమే!
అందుకే నేటి మన దేశదుస్థితి తొలగాలంటే
ముందుగా 'భారతమాత' అనే పిలుపు మారాలి
భారతాన్ని అనుకోవాలి మన ముద్దుబిడ్డగా
భారతాన్ని అనుకోవాలి మన ముద్దుబిడ్డగా
ఇకఫై పిలవాలి ఆమెను భారతసుతగా.
అప్పుడే మసలుకుంటాం మనం జాగ్రత్తగా.
నడిపిస్తాం ఆమెను ఎంతో భాద్యతగా.
ఆ తర్వాత చూడండి మన భారతి భవిత
అతిత్వరలో అవుతుంది ఆమె జగజ్జేత.
అమ్మా! నీ వొక బొమ్మవా ?
అమ్మా! నీ వొక బొమ్మవా ?
అన్న అమెరికా చదువు కోసం నీ ప్రతిభను పరిషత్ బడికి పరిమితం చేస్తే
చాకలిపద్దులు చదవనూ, మహారాజరాజశ్రీ శ్రీవారి పాదపద్మములకు నమస్కరిస్తూ లేఖాంశములు వ్రాయనూ వచ్చిందిగా అంటూ
అసంతృప్తిని ఆనందపు టూర్పుగా మలచగలిగావే !
ఎందుకమ్మా! నీ వొక బొమ్మవా?
పుట్టింటికి రాబోయే లక్షల సాయం కోసం
ముందుభార్యను మర్డర్ చేసిన మగాడికి
రెండో భార్యగా రగిలే గుండెను వెచ్చని కన్నీళ్ళతోనే చల్లార్చి
రాగా లొలకబోస్తూ వెళ్లావే !
ఏమ్మా ! నీ వొక బొమ్మవా?
నాకేం? నే మగాడిని నా కెన్ని ఇండ్లైనా ఉండొచ్చని
మీ ఆయన గర్వంగా మీసం మెలేస్తే
ఆక్రోశించే గుండెను అడకత్తెరలో వేస్తూ
ముసిముసినవ్వులు చిందావే?
ఔనామ్మా? నీ వొక బొమ్మవా?
ఆడపిల్లను కన్నావని ఛీత్కారాలు
మగబిడ్డను కన్నావని నజరానాలూ
ఆడదాని వయ్యుండీ మౌనంగా అందుకున్నావే ?
చెప్పమ్మా ! నీ వొక బొమ్మవా?
సంపాదించేంతవరకే సమానత్వం అంటూ
నీ నెలజీతాన్ని అకౌంటెంట్ టేబుల్ మీది నుంచే
తన జేబులో వేసుకునే నీ భర్త సంపాదనను
నీవూ అలా హాండ్ బాగ్ లో వేసుకోలేక
"ఏమండీ ! పాస్ కొనాలి డబ్బివ్వరూ"
అంటూ ప్రాధేయపడతావే!
ఏంటమ్మా ! నీ వొక బొమ్మవా?
ఆఫీస్ లో అరవచాకిరీ చేసి అయిదింటికి నీవు
పడుతూ లేస్తూ ఇంటికి వచ్చి
'ఏంటా ఏడుపుమొహం' అంటాడని
M TV చూస్తూ ఆరాంగా ఆపసోపాలు పడుతూ
M TV చూస్తూ ఆరాంగా ఆపసోపాలు పడుతూ
కూర్చున్న ఇంటాయనకు
నవ్వులు పులుముకొని టీ టిఫిన్లు అందిస్తావే !
ఇదేంటమ్మా ! నీ వొక బొమ్మవా?
' ఏం ఆడవాల్లైతే మాతో సమానంగా జీతాలు తీసుకోవడంలేదా?'
అనే అక్కసుబోతులను
'మీలా టీలు, సిగరెట్లూ అంటూ నేను
గంటల తరబడి సీటు వదిలి సరదా చేస్తున్నానా ?'
అని నిలదీయక
ప్రకృతిధర్మంగా ష్త్రీ కొచ్చే అన్ని ఇబ్బందులనూ
పావుగంటైనా పర్మిషన్ తీసుకోకుండా
పంటిబిగువున భరిస్తావేమ్మా!
నీ వొక బొమ్మవా?
రెడ్ లైట్ వీధిలోనైనా, వైట్ హౌస్ పరిధిలో ఉన్నా
నిన్ను అవసరానికి వాడుకున్న మగాడు
ఆడదాని చొరవే అనర్ధాలకు హేతువని
ఉవాచలు విసురుతుంటే
అసహాయంగా కన్నీళ్లు కారుస్తావే తప్ప
అమ్మగా అందమైన ఆడబొమ్మగా కూడా
నేనేనోయ్ నీ ఆకలి (ళ్ళు) తీర్చగలిగేదానినని
చనుబాలు కక్కేలా సమాధానం ఇవ్వవేమ్మా !
నీ వొక బొమ్మవా?
- భూమిక, జూలై 2011
ఎంత బాగుండేది ?
ఓ పువ్వు నైనా ఎంత బాగుండేది ?
ప్రతిఫలాపేక్ష లేకుండా అందంతో , సుగంధంతో
అందరినీ అలరించి ఉండేదాన్ని.
ఓ ఆకునైనా ఎంత బాగుండేది?
స్వార్థానికి తావు లేకుండా పచ్చదనంతో
వాతావరణ సమతౌల్యానికి వెచ్చదనాన్నిచ్చేదాన్ని.
ఓ పండునైనా ఎంత బాగుండేది?
స్వప్రయోజనాన్ని కోరకుండా కమ్మదనంతో, తియ్యదనంతో
ఓ ఆకలి కడుపును నింపి ఉండేదాన్ని
ఓ జలబిందువునైనా ఎంత బాగుండేది ?
ఎలాంటి కుయుక్తులకూ లోనుకాకుండా ఆర్ద్రతతో
ఓ ఎండుమొలకనైనా చక్కగా బ్రతికించేదాన్ని
ఓ మండునాలుకనైనా చల్లగా తడిపి ఉండేదాన్ని .
ఓ బుల్లిపిట్టనైనా ఎంత బాగుండేది ?
నాకేంటని అనకుండా ముక్కుపట్టుతోనో , చిన్నిరెట్టతోనో
ఫలదీకరణానికో, పలుమొక్కలు మొలచటానికో
సాయపడి ఉండేదాన్ని.
ఇవేవిగానూ కాకుండా
స్వార్థంతో , సంకుచితత్వంతో కుళ్ళిపోతున్న
నీచమానవజన్మ నా కెందుకిచ్చావ్ ప్రభూ !
ఇది ఏ జన్మలో నే చేసిన పాపానికి నీవిచ్చిన శాపం?
"అవును. మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించాం!"
శ్రీశైలశిఖరాన్ని దర్శించే పుణ్యపురుషు లెవరికైనా
మరోజన్మంటూ ఉండదట.
స్కానింగ్ యంత్రాన్ని సందర్శించే స్త్రీ శిశువుకు
అసలు ఈ జన్మే ఉండదట.
కాబట్టి మగాళ్ళ కన్నా మేమే ముందున్నాం.
ఔను! మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించాం.
మగాళ్ళతో పాటుగా మేమూ ఉద్యోగాలు చేస్తున్నాం
ఆపై మగాడు వీధిన పడితే
వంటింటి ఆధిపత్యం కూడా మేమేగా చేస్తున్నాం.
అందుకే మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించాం.
రేజర్ బ్లేడ్ నుంచి అండర్వేర్ దాకా అన్ని యాడ్లలో మేమున్నాం.
మగవస్తువైనా అర్ధనగ్నపు ఆడప్రకటనే గతిగున్నాం.
కాదనగలరా ! మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించామంటే.
సమాన చదువులు చదివిన వరుణ్ణి కట్నమిచ్చి మేం కొంటున్నాం.
భార్యాభర్తల వ్యాపారంలో యజమానిని హోదా పొందుతున్నాం.
ఇప్పుడు చెప్పండి. మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించామా? లేదా?
మగాడితో సమానంగా మేమూ వేతనం అందుతున్నాం.
ఉద్యోగపు స్థాయి ఏదైనా అదనంగా లైంగికవేదనం పొందుతున్నాం.
ఇది సమానత్వం కన్నా ఎక్కువ సాధించడమేగా?
ఎ వేళైనా వీధిన తిరిగే మగాడెప్పుదూ ఒంటరి.
అన్నివేళలా మా వెనువెంట అన్నో, తమ్ముడో కాపరి.
అర్ధరాత్రి వరకెందుకూ పట్టపగలే మాకు అంగరక్షకుల సిరి.
ఎవరక్కడ ఇంకా సమానత్వం అంటున్నది.
మేం అంతకన్నా ఎక్కువే సాధించాం.
అసామాజికంగా పొందే ఆనందంలో ఇద్దరం భాగస్వాములమే అయినా
ఫలితాన్ని మాత్రం మేమేగా పొందుతున్నాం.
సమాజం ముందు వేదికపై వేడుకగా నిలబెట్టబడుతున్నాం.
కాబట్టి ఓ మగమహాశయా!
ఇందుమూలంగా మేం ప్రకటిస్తున్నాం.
మేం సమానత్వం కన్నా ఎక్కువే సాధించాం.
దీపావళి
వెల్డర్ చేతిలో వెలిగే వెన్నముద్దలు
కమ్మరి కొలిమి చిమ్ము చిచ్చుబుడ్లు
కుమ్మరి వాకిట తిరిగే భూచక్రాలు
వడ్రంగి ఉలిసుత్తుల డాం టపాసులు
ఫాక్టరీ లెగయు పొగల పాం బిళ్ళలు
దారిద్ర్య నరకుని శ్రమశక్తి భామ
నాశనము చేస్తోందని
శ్రామికకార్మికులంతా చేసెడి దీపావళిది.
ఇవి చల్లగా ఉన్నన్నాళ్ళు అనునిత్య దీపావళి.
ఈ సంబరం మూత పడిన రోజు పున్నమైనా
దేశమాత కంటినిండా కన్ను పొడిచినా కానరాని
కటిక అమావాస్యే!
అమ్మ
అమ్మ ఒడి వెచ్చదనమే కాదు
అమ్మ పాల కమ్మదనమే కాదు
అమ్మ మేని బిరుసుదనం
అమ్మ రక్తపు ఉప్పదనం కూడా
ఆమె కడుపును చల్లగా కాచాయి.
ఆమె కన్నకొడుకుకు ఊపిరు లూడాయి.
అంటారుగా ఏనుగు చచ్చినా బతికినా అమూల్యమని -- ధర కట్టినపుడు.
చూశారుగా అమ్మ ప్రేమ ఊపిరున్నా లేకున్నా సజీవమని -- ధర కదిలినపుడు.
( బూచ్ గ్రామంలో కూలిన భవనపు శిధిలాల క్రింద కొయ్యబారిన తన ఒడిలో ఉన్న పసికూనకు స్థన్యం ఆగిపోతే తన నుండి కారుతున్న రక్తాన్నిచ్చి బతికిన్చుకున్న నిర్జీవ మాతృమూర్తి సజీవప్రేమ స్మృతికి అంకితం.)
రాజకీయం
ఓ కుందేటి ముసుగు లోని తోడేలు
ఓ వానపాములా అగుపడే త్రాచుపాము
ఓ మేక ముఖమున్న మెకము
ఓ చిలుకలా కనబడే గ్రద్ద
ఓ ఆవులా అనిపించే అడవి సింహం
వీరే మన రాజకీయనాయకులు.
వీరిలో ఎవరిని ఎన్నుకుంటారో మీ ఇష్టం.
సుభద్ర దు:ఖం - సిటీ బస్సు రూపం
ఎంత దురదృష్టపు కడుపురా నాది అభిమన్యా !
పాలు కారే నిన్ను ఆ పాపి పద్మవ్యూహపు పాల్జేశాను.
ఎంత పని జరిగింది నాయనా !
ఈ గర్భశోకం మరే తల్లికీ రానీకు అన్నా కృష్ణా !
కనికరం లేని కఠినదైవతములారా!
నా ఆక్రోశం మీ కర్ణకాననముల పడలేదా ?
సరే కానిండు.
తల్లులారా ! మీ రెవ్వరూ భయపడకుడు.
కాలిన తల్లికడుపు ఇస్తున్న అప్రతిహత అభయమిది.
ఇక నా చిట్టితండ్రినిలా మీ బిడ్డలను
ఏ పద్మవ్యూహమూ చీకాకు పెట్టకుండా
మీ యుగంలో సిటీ బస్సులు ఏర్పడి
వారల నేర్పరుల చేయుగాత !
అంపకాలు
K G చదువుల భారాన్ని మోసి క్రుంగిపోయింది నా కన్నతల్లి
ఓ మామగారూ! నా బిడ్డ పైన బాధ్యతల బరువుల్ని తోసేయ్యకయ్యా!
సిటీబస్సుల్లో ఒత్తిళ్ళ తోటి వడలిపోయింది నా చిన్నితల్లి !
ఓ అత్తగారూ ! పెత్తనం అంటూ నా కూతు నింకా వేధించకమ్మా !
టీనేజ్ నుండి టీజర్స్ మాటలకు విసిగిపోయింది నా చంటితల్లి.
ఓ ఆడబిడ్డా ! అర్ధమొగుడి నంటూ నా పిల్ల నింకేమి సాధించకమ్మా !
మేధావి చదువుల్లో రాగింగ్ తోటి రంపాల పాలైంది నా ముద్దుతల్లి !
ఓ అల్లుడుగారూ ! భార్యేగా అంటూ రాత్రైనా పగలైనా నొప్పించకండి
వంటిల్లు - ఓ సెల్లు
కేంద్రకారాగారం ఈ ఇల్లు - అందులో సాలిటరీ సెల్లు వంటిల్లు .
కళాకారిణిగా గుర్తింపు కోసం నేను వేదన పడే సమయంలో
'ముందు సక్రమమైన గృహిణిగా అన్నం వండి పెట్టు '
అని దెప్పి పొడిపించే ఆ వంటిల్లే నాకు వద్దు .
గృహిణీత్వానికి గీటురాయిగా తరతాలుగా నాటుకుపోయిన
ఆ పాతవంటి ప్రమాణం నాకు కాదు ముద్దు
గృహిణి గీర్వాణి కూడా అని చాటి చెప్పగలిగేలా
చూడకూడదని నాకేం లేదు జిద్దు
అలాకాక మధ్యకాలపు మగువల్లా వంటింటి కుందేలు
కావడం నా తత్వానికి కాదు కద్దు
'అమ్మా ! ముందు నీ పిచ్చిగీతలు , రాతలు ఆపి నా ఆకలి
సంగతి చూడ' మని అమ్మను కొడుకు అడిగేలా
చేసే వంటిల్లు నాకో హద్దు .
ఎవరికి ఓపిక ఉంటే వారు , ఎప్పుడు ఆసక్తి కలిగితే
అప్పుడు వంట చేసే సామ్యవాద వంటరికం బహుపసందు
అదే కావాలి నాకు మున్ముందు
పనిలేకున్నా పోజులు కొడుతూ వంటమనిషిని ఏర్పాటు చేనుకునే
తాహతున్న అమ్మలకు కావచు వంటిల్లు థ్రిల్లు
వనిత = వంటిల్లు అనే దిగువమధ్యతరగతి కుటుంబంలోని
ఓ కళాకారగృహిణిగా నాకది క్షణం క్షణం గుండెలోతుల్లో గిల్లు
కళాకారిణిగా గుర్తింపు కోసం నేను వేదన పడే సమయంలో
'ముందు సక్రమమైన గృహిణిగా అన్నం వండి పెట్టు '
అని దెప్పి పొడిపించే ఆ వంటిల్లే నాకు వద్దు .
గృహిణీత్వానికి గీటురాయిగా తరతాలుగా నాటుకుపోయిన
ఆ పాతవంటి ప్రమాణం నాకు కాదు ముద్దు
గృహిణి గీర్వాణి కూడా అని చాటి చెప్పగలిగేలా
స్వచ్చందంగా మనగాలగాలంటే కావాలి వంటిల్లు రద్దు
వంటను విధిగా కాక కళగా చూడగలిగిననాడు అటువైపు చూడకూడదని నాకేం లేదు జిద్దు
అలాకాక మధ్యకాలపు మగువల్లా వంటింటి కుందేలు
కావడం నా తత్వానికి కాదు కద్దు
'అమ్మా ! ముందు నీ పిచ్చిగీతలు , రాతలు ఆపి నా ఆకలి
సంగతి చూడ' మని అమ్మను కొడుకు అడిగేలా
చేసే వంటిల్లు నాకో హద్దు .
ఎవరికి ఓపిక ఉంటే వారు , ఎప్పుడు ఆసక్తి కలిగితే
అప్పుడు వంట చేసే సామ్యవాద వంటరికం బహుపసందు
అదే కావాలి నాకు మున్ముందు
పనిలేకున్నా పోజులు కొడుతూ వంటమనిషిని ఏర్పాటు చేనుకునే
తాహతున్న అమ్మలకు కావచు వంటిల్లు థ్రిల్లు
వనిత = వంటిల్లు అనే దిగువమధ్యతరగతి కుటుంబంలోని
ఓ కళాకారగృహిణిగా నాకది క్షణం క్షణం గుండెలోతుల్లో గిల్లు
ప్రమాదకుబేరులు
అన్యాయాలకు ఆకటిల్లిన పుడమితల్లి ఓ చోట బీటలు వారితే -------
తన చెలి భూమి రోదనను సహింపలేక మరోచోట
సంద్రుడు ఉప్పొంగి ఊళ్ళను తుడిచేస్తే ------
రైలు ఎక్కడైనా పట్టాలు తప్పితే ------
బస్సు ఇంకెక్కడైనా బోల్తా పడితే --------
బొట్టు పెట్టి ఎవ్వరూ పిలవాల్సిన అవసరం లేకుండా వీరు అచట హాజరు
రెక్కలు కట్టుకొని వాలిపోతారు
సేవా కార్యక్రమాల్లో దుసుకుపోతారు
'అమ్మా!' అంటూ ఎక్కడో లోతుల్లో వినిపించే మూలుగును
ఆసరాగా చేసుకొని ఆమెను చేరుతారు
అసహాయురాలైన ఆమె నగలను తమ వద్ద భద్రపరచుకుంటారు
తన కూతురి పెళ్లి కోసం అప్పు చేసి తీసుకెళుతున్న డబ్బుసంచి
ఎక్కడో పడిపోయిందని కదలలేక విలపించే
కాళ్ళు విరిగిన తండ్రి ఆత్మశాంతించేలా
ఆమూటను తమ కూతురి పెళ్లికి భద్రం చేస్తారు
నగలు , సంపదలు మిథ్య అని విన్న వీరు
వాటిఫై మమకారంతో పూర్తిగా ప్రాణాలుపోక కొట్టుకులాడే వారికి
వాటిని లాగేసి శాశ్వతముక్తిని ప్రసాదిస్తారు
పుట్టినప్పుడు వచ్చినట్లుగానే పోయేటప్పుడు వెళ్ళాలని ఎరిగిన వీరు
శవాలకు నిలువుదోపిడీ చేసి మరీ సాంప్రదాయాన్ని నిలబెడతారు
తుచ్చమైన మానవజన్మలకు పట్టులైన దేహాలపట్ల అభిమానం తుంచుకున్న వీరు
కుప్పలుగా పడిపోయిన శవాలను పెకలించి , మాంసఖండాలను విభజించి
నాశం కాని బంగారం, సంపదలను వెలికితీసుకుంటారు
కూలిపోయిన భవనాల అడుగున వీరు పడ్డ శ్రమలకు ఫలితంగా
కళ్ళు తిరిగే భవంతులు ఊళ్ళలో వీరి పేరున రూపు దిద్దుకుంటాయి
ఉప్పెనల్లో వీరుపడ్డ వేసటలకు ప్రతీకగా వెరైటి కార్లు వీరి సంపదకు జత కూడుతాయి
వీరు ఏప్రమాదస్థలాల్లోనూ పథకాల కోసం పేర్లు నమోదుచేసుకోరు
పక్కవాడికి కూడా తమ చిరునామా చెవి నేయరు
గుప్త సేవకులు వీరు
జీవిక కోసం వెంపర్లాడుతూ సమయం వృధా చేస్తూ కూర్చోక
ఇలాంటి సేవలకే జీవితాలను చేస్తారు అంకితం
అందుకే అముల్యమైన వీరి సేవలకు వీరే సేకరించుకుంటారు మూల్యం
ఓనాడు దరిద్రులైనా ఇలాంటి సేవలే వారికి కూర్చాయి సంపదలు.
"అందుకే వీరు ప్రమాదకుబేరులు "
ఇలాంటి సేవలకే జీవితాలను చేస్తారు అంకితం
అందుకే అముల్యమైన వీరి సేవలకు వీరే సేకరించుకుంటారు మూల్యం
ఓనాడు దరిద్రులైనా ఇలాంటి సేవలే వారికి కూర్చాయి సంపదలు.
"అందుకే వీరు ప్రమాదకుబేరులు "
అచ్చు
.
అదో అచ్చోసే ఆగారం .
అల్లాటప్పా కాదండి ! అది ఏలినవారి సత్కారం
అక్కడ అచ్చొత్తించుకోడానికి అంతులేని పోటీ !
రకరకాల అర్హతలతో లక్షలలో భేటీ !
అధికబరువు పెట్టిన వారికి
అత్యధికమాట వినిపించినవారికే
ఆ అచ్చులు పరిమితం .
ఆ సర్కారీ అచ్చులోనూ తరగతులు కద్దు .
అర్హులకే అందేనా ? అనే పృచ్చ లొద్దు.
అల్లాటప్పా కాదండి ! అది ఏలినవారి సత్కారం
అక్కడ అచ్చొత్తించుకోడానికి అంతులేని పోటీ !
రకరకాల అర్హతలతో లక్షలలో భేటీ !
అధికబరువు పెట్టిన వారికి
అత్యధికమాట వినిపించినవారికే
ఆ అచ్చులు పరిమితం .
ఆ సర్కారీ అచ్చులోనూ తరగతులు కద్దు .
అర్హులకే అందేనా ? అనే పృచ్చ లొద్దు.
అచ్చెంత పరిమాణం అయితే మాత్రమేం?
ఆ ఫైన సోమరిగా ఆహా ! ఆ సుఖమేం ?
అచ్చోసిన ఆంబోతులు ఉరికొకటి ఆనాడు .
అచ్చోసిన ఆకృతులే ప్రతిరంగాన ఈనాడు.
నిస్తేజం, నిర్లిప్తం, నిర్వీర్యం చిరునామా !
ఉదాసీనం , స్వార్థగుణం ఎడబాయవు ముఖాన !
చిన్నివారి బొజ్జ లెపుడు శ్రీరామరక్షగుంటే
దేశమేమైతే మాత్రమేమి వారి కన్నులేదుటే !
గాడిదలా చాకిరీ నాటి బానిస బతుకైతే
గానుగెద్దులా బతకడం వీరి బానిసత్వం !
వృత్తులను మంటగలిపి , అభివృద్ధిని అంట బొడిచి
అచ్చోయించుకోనురికే జీవచ్చవముల్లారా !
ఆక్రోశపు భానిసత్వం ఆనాటి దుస్థితి .
అంగలార్చి తెచ్చుకొన్నది మీ బానిస సంస్కృతి .
మేత వేస్తే మెడ నరికించుకునే మేక మొద్దుతనం.
వేట తిని వలలో చిక్కుకునే చిలువ మజ్జుతనం .
జామపండు కోసం పంజరంలో కెక్కే రామచిలుక వెర్రితనం .
ఇంకా ఎంత కాలం ?
కూటి కొరకు కోటివిద్యలుండగా
అచ్చే కావాలంటూ ఆందోళన సబబా ?
చేవ చచ్చిన వారి లాగ ఎన్నాళ్ళీ వేలంవెర్రి ?
జీర్ణతృణముకై కేసరెపుడైన వెంపర్లాడటం చూశామా?
ఆకలైనా అంచ నీళ్ళను త్రాగడం వినసాధ్యమా ?
రక్షణ దొరకునని బెబ్బులి తనుగా బోనులో చేరి నిలిచేనా ?
జంతుజాలమే చిక్కని జాలములోన చిక్కి
[ఉక్కిరిబిక్కిరై ] చట్రమ్ములో బతుకు గడిపే
స్వయంకృత అపరాధ మేల ?
మేధ కలిగిన జీవరాశిగా మిమ్ము మీరే మరతురా ?
స్వతంత్రపుమొక్కను నాటినది మీరిట్లు మానై పుచ్చానా ?
దేశస్వాతంత్రము వచ్చి ఆత్మగౌరవం చచ్చెనా ?
పరాయీల పీడ వదిలి సొంత చీడ పట్టెనా ?
వివేకమ్మును పుటము పెట్టే వైద్యుడు వేరే కావలెనా ?
సుదృఢ వ్యవస్థామూలాన్ని కూకటివేళ్ళతో పెకలిస్తున్న
అచ్చు పిచ్చికి ఇకనైనా అంతిమగీతం పలికి
ఆలోచనా సానరాయితో మొద్దుబారిన మెదడును
ఎర్రగా పదును పెట్టుకోండి .
అప్పుడే స్ఫురిస్తుంది అసలైన కర్తవ్యం
తామరతంపరగా వర్ధిల్లుతుంది దేశసౌభాగ్యం [భవితవ్యం ]
మగ బస్సు
తల్లీ చెల్లీ భార్యా కూతురూ ఉన్నా కుటుంబయజమాని మగాడు .
అందుకే కుటుంబం పితృస్వామ్యం .
ఆడ ప్రయాణీకులూ కొండొకచో ఆడకండక్టర్ ఉన్నా కూడా
మగడ్రైవర్ మూలంగా బస్సు ఔతోంది మగబస్సు .
ఓ చేత్తో బస్సు స్టీరింగును
మరో చేత్తో శరీరపు యాక్సి లేటర్ను పట్టుకొని
కొండొకచో రెండు చేతులూ ఫైకెత్తేస్తూ --------
తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ -----
ఎక్కే ప్రతిస్త్రీని శల్యపరీక్షిస్తూ --------
దిగే ప్రతి స్త్రీని వెకిలిగా వ్యాఖ్యానిస్తూ .
ఎదురు జవాబిస్తే , మొహం బద్దలు చేస్తే --------
రోజూ అదే రూటులో వెళ్ళే తమకు
బస్సు ఎక్కే అవకాశం లేకుండా చేసి ,
ఆలస్యానికి ఇంట్లో సంజాయిషీలు,
నడిచి నడిచి మరింత బడలే శరీరానికి మలాముపూతలు
అవసరమయ్యేలా చేయగల
ఆ డ్రైవర్ నియంత ఆగడాలను అసహనాన్ని అణచి భరిస్తూ ------------
వెకిలితనానికి మురిసినట్లు నటిస్తూ -----------
తమకై ప్రత్యేకించిన సీట్లను దురాక్రమించిన కుసంస్కారులను
జుట్టు పట్టి లేపలేక ,భూదేవి సహనాన్ని బాడుగకు తీసుకొని ,
సందట్లో సమారాధనలా ప్రభుత్వరాయితీతో ముందె క్కిన సీనియర్ సిటిజన్ల
చేతుల చేతలను అడ్డగించ ప్రయత్నిస్తూ -------
అప్పటికే ఇంటి పనుల ప్లానింగ్ లో మునిగిపోయిన మనస్సులతో
అవకాశం దొరికిందని అతుక్కుపోవడానికి ప్రయత్నించే ---------
పురుషపుంగవుల చేష్టలు కనులు గమనిస్తున్నా --------
మొద్దుబారిన నామమాత్ర శరీరాల స్పర్శాలేమికి ధన్యవాదాలర్పిస్తూ ----------
సమాజంలో తన ఉనికి స్థాయిని సింబాలిక్ గా తెల్పుతూ --------
కబేళాలో సగం చచ్చిన కళేబరాల్లాంటి స్త్రీలతో
బుద్ధి పుట్టిన చోట ఆగుతూ సాగుతోంది ఆ
అందుకే కుటుంబం పితృస్వామ్యం .
ఆడ ప్రయాణీకులూ కొండొకచో ఆడకండక్టర్ ఉన్నా కూడా
మగడ్రైవర్ మూలంగా బస్సు ఔతోంది మగబస్సు .
ఓ చేత్తో బస్సు స్టీరింగును
మరో చేత్తో శరీరపు యాక్సి లేటర్ను పట్టుకొని
కొండొకచో రెండు చేతులూ ఫైకెత్తేస్తూ --------
తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ -----
ఎక్కే ప్రతిస్త్రీని శల్యపరీక్షిస్తూ --------
దిగే ప్రతి స్త్రీని వెకిలిగా వ్యాఖ్యానిస్తూ .
ఎదురు జవాబిస్తే , మొహం బద్దలు చేస్తే --------
రోజూ అదే రూటులో వెళ్ళే తమకు
బస్సు ఎక్కే అవకాశం లేకుండా చేసి ,
ఆలస్యానికి ఇంట్లో సంజాయిషీలు,
నడిచి నడిచి మరింత బడలే శరీరానికి మలాముపూతలు
అవసరమయ్యేలా చేయగల
ఆ డ్రైవర్ నియంత ఆగడాలను అసహనాన్ని అణచి భరిస్తూ ------------
వెకిలితనానికి మురిసినట్లు నటిస్తూ -----------
తమకై ప్రత్యేకించిన సీట్లను దురాక్రమించిన కుసంస్కారులను
జుట్టు పట్టి లేపలేక ,భూదేవి సహనాన్ని బాడుగకు తీసుకొని ,
సందట్లో సమారాధనలా ప్రభుత్వరాయితీతో ముందె క్కిన సీనియర్ సిటిజన్ల
చేతుల చేతలను అడ్డగించ ప్రయత్నిస్తూ -------
అప్పటికే ఇంటి పనుల ప్లానింగ్ లో మునిగిపోయిన మనస్సులతో
అవకాశం దొరికిందని అతుక్కుపోవడానికి ప్రయత్నించే ---------
పురుషపుంగవుల చేష్టలు కనులు గమనిస్తున్నా --------
మొద్దుబారిన నామమాత్ర శరీరాల స్పర్శాలేమికి ధన్యవాదాలర్పిస్తూ ----------
సమాజంలో తన ఉనికి స్థాయిని సింబాలిక్ గా తెల్పుతూ --------
కబేళాలో సగం చచ్చిన కళేబరాల్లాంటి స్త్రీలతో
బుద్ధి పుట్టిన చోట ఆగుతూ సాగుతోంది ఆ
"మగబస్సు"
స్నేహం
దీని మారుపేరు అవసరం .
తీరనంతవరకూ అది వరం .
ఏరు దాటాక అది తగలబడే పడవ రకం
మరవకు అది తుమ్మితే ఊడే నాసికం
దాని పైనా నీ ఆశలు
అయ్యో అది నదిలో చింతపండు పిసకడం
తివిరి ఇసుమున తైలమ్ము తీయడం .
తీరనంతవరకూ అది వరం .
ఏరు దాటాక అది తగలబడే పడవ రకం
మరవకు అది తుమ్మితే ఊడే నాసికం
దాని పైనా నీ ఆశలు
అయ్యో అది నదిలో చింతపండు పిసకడం
తివిరి ఇసుమున తైలమ్ము తీయడం .
మావి ' కొమ్మ '
మావి వధువు
కావిచిగురు చీరకట్టి ,
చిరుమువ్వల పనితనపు లేలేత పూతల మేలిముసుగును
అలవోకగ పైన కప్పి
ఉత్తరాది పెళ్ళికూతురై
కాన్పట్టెను మావి ' కొమ్మ '
రాడేమని ప్రియుడు స్తబ్దుగా తా కనిపించును .
ఆడుగడుగో వచ్చెనదే అని తల నోరగ ఊచును .
గాలికేలు సాచి యతడు గిలిగింతలు పెట్టగా ,
కిలారుమని నవ్వి నవ్వి నిలువెల్లా ఊయలౌను ,
మేలిముసుగు కొంత జరిపి సౌందర్యము చూరనిచ్చు
కన్నె వోలె కనిపించు కొమ్మ చేతులను సాచి ,
విభుని వెంట పోవుటకు ఇచ్చగించని ముగ్ధ తా
ఆభరణముల రాల్చునటుల పూతల రాల్చేనదే !
చిరుమువ్వల పనితనపు లేలేత పూతల మేలిముసుగును
అలవోకగ పైన కప్పి
ఉత్తరాది పెళ్ళికూతురై
కాన్పట్టెను మావి ' కొమ్మ '
రాడేమని ప్రియుడు స్తబ్దుగా తా కనిపించును .
ఆడుగడుగో వచ్చెనదే అని తల నోరగ ఊచును .
గాలికేలు సాచి యతడు గిలిగింతలు పెట్టగా ,
కిలారుమని నవ్వి నవ్వి నిలువెల్లా ఊయలౌను ,
మేలిముసుగు కొంత జరిపి సౌందర్యము చూరనిచ్చు
కన్నె వోలె కనిపించు కొమ్మ చేతులను సాచి ,
విభుని వెంట పోవుటకు ఇచ్చగించని ముగ్ధ తా
ఆభరణముల రాల్చునటుల పూతల రాల్చేనదే !
కడుపు తీపి
బడి ఎందుకే నీకు బుజ్జితల్లీ !
ఆకలైనా , ఆపదైనా ఆదరించే
అమ్మ ఒడి వుండగా వేరె బడి కెళ్ళాలా?
బడికి పొయ్యేం చెయ్ ను ?
కరెంటుకు బలికానా ?మంటలకు కరుగనా ?
అన్నమనే విషమును ఆబగా మింగనా ?
ఎన్ని కష్టాలకో ఓర్చి నిను కన్నది .
పరుల చేతికి ఇచ్చి చంపించనా ?
చదివేమి చేస్తావు ?
నీ తప్పే లేకుండా ఏ పైశాచిక ప్రియుడో
యాసిడ్ ను చల్లనా ? కత్తితో నరకనా ?
కొలువిప్పిస్తానని ఏ పురుషపుంగవుడో
నీ గుప్తశీలాన్కి కన్నెరికమే చెయ్ నా ?
పై దేశ మెళ్ళినా పెద్ద ఉద్యోగం చేసినా
కట్నం తక్కువని మొగుడు ముక్కలుగ తరగనా ?
చదువొద్దు , మనువొద్దు. మనికి ఉంటే చాలు .
మనిషిగా నా ఎదుట నడయాడితే చాలు .
పువ్వులా నా ఇంట పరిమళిస్తే చాలు .
.
రావణకాష్టం రిజర్వేషన్లు .
ఛీ ! - ఎంత అర్ధరాత్రి దాకా - తరతరాల మేలుకొలుపు
మారణం
పచ్చని చెట్ల పచ్చిక బయళ్ళ
అబ్బా ! నొప్పి ! - ఓర్చుకోమ్మా పెద్ద మనిషి వయ్యావ్ ! ---- పరిణీత నొప్పి .
నేనో పిన్ కుషన్ ని .
ఆమె
ఆమె వదనం ఓ నిశ్చల సరోవరం .
అందులో అప్పుడప్పుడు రెక్కలు విదుల్చుకునే
రాజహంసలు కన్నులు .
మధుపాన్ని కలిగిన తామర మగుడ
ఆభరణమున్నఆమె నాసిక.
సూర్యరశ్మితో ఎర్రనై ఎదురుపడే జంట అలలు
ఆమె ఆధరములు .
ఇంకా ఆడేంటి ? మగేంటి ?
పుట్టిన క్షణంనుండి ఆడపిల్లని అదృష్టంగా భావించే రోజు లొచ్చాయ్
రావణకాష్టం
రావణకాష్టం రిజర్వేషన్లు .
అర్హతకు [కుక్కమూతి పిందె] కల్లు తాగిన కోతి డెఫినిషన్లు .
ఆ 'అర్హులు ' లేకుంటే ప్రిజర్వేషన్లు .
మతమే అమానుషమన్న సెక్యులర్ దేశంలో
కులాల కోసం కదను తొక్కే అజిటేషన్లు.
కులం పేరు నువ్వెత్తితే .
అది నీకు తెస్తుంది పెనుముప్పు .
అదే కులాన్ని నేను తగలించుకుంటే అది డప్పు .
శవాన్ని తలకెత్తుకున్న విక్రముని మేకప్పు .
స్టార్ సోషియల్ స్టాటస్ నీ దైనా
'దళితుడు 'నీ ఇంటి పేరు .
వలసలు , ఆత్మహత్యలే శరణ్యమైనా
'అగ్రకులజుడు ' వాడి ఒంటిపేరు .
ప్రజాస్వామ్యపాలనకు ఇది నాయక నిర్వచనం
సమతామమతల కలలకు ఇది చక్కని వ్యాఖ్యానం .
ఛీత్వం - స్త్రీత్వం
ఛీ ! - ఎంత అర్ధరాత్రి దాకా - తరతరాల మేలుకొలుపు
మేల్కుంటే మాత్రం
ఇంతసేపు నిద్రా ?
నీ వసలు స్త్రీవేనా ?
ఛీ ! - ఎప్పుడూ ఈ పరుగు పరుగు - కోడలికి ఉద్యోగమైనా
పప్పు చారేనా ? మా మొహాన అందుకు అర్హతైనా
ఎప్పుడన్నా ఇంత ఉండాలని తెగ వెదికి
మజ్జిగపులుసు పోశావా ? కోడలిని తెచ్చుకున్న అత్తమామలు .
మంచి కోడలివే ?
ఛీ ఛీ ! - ఆఫీస్ !ఆఫీస్ ! అంటావు . - నాన్నకు తెలీకుండా
ఆలస్యమౌతోంది అంటావు . నాకు పాకెట్ మనీ
హడావుడిగా కుక్కడమే కాని ఇవ్వవూ అనే
ఎప్పుడైనా ఆప్యాయంగా సమయస్పూర్తి
అన్నం పెట్టావా ? గల సంతానం .
నీవు అమ్మవేనా ?
ఛీ ఛీ ! - భర్త అనేవాడు బతికి - వేడినీళ్ళకు
ఉన్నాడనే స్పృహైనా చల్లనీళ్ళలా
నీకుందా ? అన్నిటికీ సంపాదనలో
సాకుగా బోడి తోడు ఉండమన్న
ఉద్యోగ మొక్కటి ! నీవూ ప్రత్యక్షదైవం
ఒక భార్యవు ! పతిదేవుడు .
ఛీ ఛీ ఛీ ! - బస్సెక్కడానికి ఇంతసేపా ? - R T C బస్సును
బొమ్మా ? బొరుసా ? . తన స్వంతమనుకునే
వేస్తున్నావా ? సంస్కారి
పాసిచ్చిందిగా ప్రభుత్వం సిటీ బస్ డ్రైవర్ .
అదీ ఆ ధీమా !
ఛీ ఛీ ఛీ ! - జనం సందులో పడిచావక - నేను మాత్రం
ఎవరికీ ఇబ్బంది లేకపోతే కష్టపడి , మీరంతా
మాత్రం , ప్రశాంతంగా రాడ్ ఎందుకు సుఖపడాలనే
పట్టుకొని పడకుండా నిలబడ్తావా ? సౌజన్యమూర్తి
షో ! లోపలికి ! సిటీబస్ కండక్టర్ .
ఛీ ఛీ ఛీ ! - పిల్లలకు జ్వరమంటే C L - తన జేబు నుండి
మొగుడికి జలుబంటే E L జీతాలు ఇస్తున్నట్లు
మాట్లాడితే ఇల్లు ఇల్లు . బాధ పడే
మీకెందుకమ్మా ఉద్యోగాలు ? పెద్దకూలీ
మీకెందుకమ్మా ఉద్యోగాలు ? పెద్దకూలీ
హాయిగా అంట్లు తోముకుంటూ ఆఫీసర్ .
కూర్చోక .
ఇన్ని ఛీత్వాల సాకారమే - ఆధునిక స్త్రీత్వం .
నేటి నిజం వారపత్రిక , మార్చి , 2012
నేటి నిజం వారపత్రిక , మార్చి , 2012
మారణం
పచ్చని చెట్ల పచ్చిక బయళ్ళ
వెచ్చని గుహల వేడివాగుల
పక్షి కువకువల నదుల గలగలల
పున్నమి రాత్రుల అమవస అంచుల
స్వచ్చజీవనపు అచ్చపోకడల
చేజేతులా త్రోసిరాజని
నియంత్రించేసి గాలిని , నీటిని ,
నీటిపాల్జేసి నిప్పుని , మన్నుని
వద్దు పొమ్మని చెట్టుని , గుట్టని ,
దూరం చేసేసి అమ్మ ప్రకృతిని ,
చేరదీశాడు రోగపుగనిని
మానవు డెంతటి మూర్ఖ శిఖామణి .
ఆడనొప్పి
అబ్బా ! నొప్పి ! - ఓర్చుకోమ్మా పెద్ద మనిషి వయ్యావ్ ! ---- పరిణీత నొప్పి .
దేవుడా ! నొప్పి ! - నెలని నలుగురికీ తెలుస్తుంది. నగుబాటు నోర్మూసుకో ! ---- నెలసరి నొప్పి .
అమ్మా ! నొప్పి ! - సిగ్గుచేటు. శోభనపుగదిలో పెద్దగా అరవకు ---- తియ్యని నొప్పి .
బాబోయ్ ! నొప్పి - కడుపులో బిడ్డ తంతున్నాడా ? భావిజీవితానికి సింబాలిక్ నొప్పి ---- గర్వపు నొప్పి .
అయ్యో ! నొప్పి ! - నొప్పులు పడితే పడ్డావ్ . బతికి బయటపడ్డావ్ . --- పునర్జన్మ నొప్పి
అమ్మగా నీ జన్మ ధన్యం .
.
పిన్ కుషన్ 1
నేనో పిన్ కుషన్ ని .
పై నుండే అందమైన వెల్వెట్ గుడ్డ నా శరీరం .
లో నుండే మెత్తని దూది నా మనస్సు .
తీసుకునేందుకు వీలుగా , కనపడేలా సౌకర్యంగా
ఉండేందుకు గుచ్చబడే పిన్నులు
నా ముక్కుపుడకలు, చేతిగాజులు , చెవికమ్మలు , మెడలో దండలు .
స్థోమతను తెలిపే సౌకర్యాన్ని ,
అవసరాలకు తీసి వాడుకునే సౌలభ్యాన్ని
కల్గించే బంగారు పిన్ లు గుచ్చుకునే
మానవ పిన్ కుషన్ ని నేను .
ఇదంతా పైనైని పటాటోపమే .
నా మనస్సు ------కుషన్ డబ్బా లాగే
తెరిస్తే అంతా ఖాళీయే .
పిన్ కుషన్ 2
పిన్ కుషన్ లాంటి నాకు గుచ్చుకునే పిన్నులు
ఈర్ష్యతో చూసే చూపులు , హేళనగా చూసే చూపులు
ఆకలిగా చూసే చూపులు , ఆరాధనగా చూసే చూపులు .
అసహనంతో చూసే చూపులు , ఆగ్రహంతో చూసే చూపులు .
ఆమె
ఆమె వదనం ఓ నిశ్చల సరోవరం .
అందులో అప్పుడప్పుడు రెక్కలు విదుల్చుకునే
రాజహంసలు కన్నులు .
మధుపాన్ని కలిగిన తామర మగుడ
ఆభరణమున్నఆమె నాసిక.
సూర్యరశ్మితో ఎర్రనై ఎదురుపడే జంట అలలు
ఆమె ఆధరములు .
ఇంకా ఆడేంటి ? మగేంటి ?
పుట్టిన క్షణంనుండి ఆడపిల్లని అదృష్టంగా భావించే రోజు లొచ్చాయ్
అపురూపంగా పెంచే కలలూ వచ్చాయ్ !
ఒకే రకమైన పెంపకం
ఒకే రకమైన గారాబం
ఒకే రకమైన ఆహారం
ఒకే రకమైన విద్యావకాశం
ఈ రోజు తల్లిదంద్రులెవరూ ఆడామగా వివక్ష చూపడం లేదు .
ఆడ పిల్లలదే అన్నిట్లో ముందంజ .
వారి తల్లిదండ్రులకు లేదు వెనుకంజ .
విమానమైనా , విదేశమైనా సై అంటే సై .
రోదసీ అయినా ఫాంటసీ అయినా రెడీ అంటే రెడీ !
ఆటకైనా పాటకైనా డీ కి డీ !
మరీ ఇంకా ఎందుకీ అమ్మాయిలే ఉన్మాదుని కత్తికి బలి ?
వారిపైనే సామూహిక అత్యాచారాల కలి
స్నేహం ముసుగులో దాటిన గీటుకు సమాజంలో వెలి
ఉద్యోగాల్లో లైంగిక వేదనల కౌగిలి .
మీద మీద పడే కల్చర్డ్ మగస్నేహం
శరీరంలో రగిలే కెమిస్ట్రీకి అబార్షన్ చేయగలదా ?
అర్ధరాత్రి దాటాక నైట్ కల్చర్ ఫలితం
తల్లితండ్రుల అనుమతుందని సీమంతం చేసుకోగలదా ?
శరీరంలో రగిలే కెమిస్ట్రీకి అబార్షన్ చేయగలదా ?
అర్ధరాత్రి దాటాక నైట్ కల్చర్ ఫలితం
తల్లితండ్రుల అనుమతుందని సీమంతం చేసుకోగలదా ?
పిచ్చి అభ్యుదయవాదుల్లారా !
సమత్వం , అధిగమనం సామాజిక అభివృద్ధి లోనే కాని
శారీరికంగా ఆడా మగా ఎన్నటికీ ఒకటి కాలేరు , కాబోరు .
ఎందుకా ?
విజాతిధ్రువాలు ఎప్పుడూ ఆకర్షకాలే కాని సమాంతరాలు కావు .
- సాహితీకిరణం, నవంబర్ , 2011
ఓ ------ నాకు తెలీకేం ?
ఓ !----నాకు తెలీకేం !
గాంధీతాతంటే --------
బోసినవ్వుతో కర్రపట్టుకొని నడుస్తూ --------
అన్ని రూపాయి నోట్ల మీదా ఉంటాడు ఆయనేగా !
ఓ ! ------ నాకు తెలీకేం !
సత్యాగ్రహమంటే ---------
జీతం పెంచలేదని ఈ మధ్య ఓ పదిరోజలు
మేం పెన్ డౌన్ చేసి పనిచేయ్యకుండానే జీతం తీసుకున్నాం . అదేగా !
ఓ ! ----- నాకు తెలీకేం!
రాముడంటే ----------
బాబ్రీ మసీదుని కూలగొట్టి
ఆయన జన్మస్థలం అని కబ్జా చేశారే !----- ఆయనేగా !
నా నైటీ
నిట్టురుస్తూ చూస్తోంది .
ఓ రోజు నా అందాన్ని అద్దినట్లు చూపిన నా నైటీ !
చూచినవారంతా 'చాలాబావుంది ' అన్న నా నైటీ !
నా అలసటను అర్థం చేసుకొని నన్ను అక్కున చేర్చుకున్న నా నైటీ !
నా ఒంటిని అంటినపుడల్లా మా వారు నన్నంటుకుపోయేలా చేసిన నా నైటీ !
మాతృత్వపు అవధిగా తల్లిపాలతో తడిసిన నా నైటీ !
నా కన్నవారి, కట్టుకున్నవారి, కడుపున పుట్టినవారి కన్నీళ్ళు తుడిచిన నా నైటీ !
ఇంటియజమానురాలిగా నా ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించిన నా నైటీ !
కొత్తరకాలెన్ని వచ్చినా తన ప్రత్యేకతను చాటుకున్న నా నైటీ !
పాతదైనా నేను ప్రాణప్రదంగా దాచుకున్న నా నైటీ !
ముసలివగ్గై మూలగది చేర్చబడ్డ నన్ను చిరుగుల అలుకు గుడ్డై వచ్చి చూచి నిట్టూరుస్తోంది
నేటి నిజం వారపత్రిక
ఆ ( !
నా తప్పా ?
సౌకర్యం కోసం వేసుకున్న జీన్స్ , టీషర్టు
సౌందర్యాన్ని ఆరబోస్తాయని
తెలియజెప్పలేకపోయావా
సాంస్కృతిక పరిణామమా !
ఇన్నాళ్ళు మిత్రుడ్ని అంటూ తిరిగినవాడు
నేడు ప్రియురాలిని కాలేనన్నానని
కాలకూటద్రావకాన్ని క్రూరంగా నా మొహాన పోస్తే
అది నా తప్పా ! మీ తప్పా !
సౌందర్య సాగరం
సాగరతీరాన సైకతవేదికపై శతకోటి కాంతు లు .
పున్నమి చంద్రుడు దిగివచ్చి విశ్రాంతి గొంటున్నాడా !
కానేకాదు. జాబిలి నిమ్నోన్నతాలకు ఇంత సొబగు ఎక్కడిది ?
అచ్చరభామినియా !- కానే కానేరదు .
వారికి చిత్తచాంచల్యాన్ని కలిగించగల ఈ నిమిషత్వ మెక్కడిది ?
సాగరాన జలకమాడి బడలి విశ్రాంతిగొంటున్న ఈ అతిలోకసౌందర్యం .
ఖచ్చితంగా సాగరుణ్ణి రససాగరుణ్ణి చేసిందని .
రసాస్వాదకుడిని చేసిందనేందుకు గుర్తుగా వడలిన వనిత -------
మతిపోయిన సంద్రుడు ఆమెతో సరాగమాడినట్లు
అంగజుని తాతే వివశుడై ఆమె అణువణువునూ చూరగొన్నట్లుగా
ఆమె సీమంతంలో సిందూరంలా మురుస్తూ నిండిన సైకతరేణువులు
ఆమె అంగాంగానా మిలమిలా మెరుస్తూ స్వేదకణములు .
నాకో......!
నాకు పోయిన సంవత్సరం కొన్న పట్టుచీరే
మరి పక్కింటి పార్వతి పాతికవేలు పోసి పట్టుచీర కొనింది
ఎంత బాగుందో ! మరి నాకో.....!
మా ఇంట్లో రెండేళ్లనాటి ఓల్డ్ వాషింగ్ మషీనే
మా పక్కవీధి ప్రవీణ లేటెస్ట్ వాషింగ్ మెషీన్ కొనిందట పాతది పారేసి.
ఎంత బాగుందో ! మరి నాకో.....!
నాలుగేళ్లనాడు కొన్న నాలుగుపేటల
.చంద్రహారమే నా మొహానికి
వరలక్ష్మీ వ్రతమని వడ్డాణం కొనింది వనజ ఐదులక్షలు అమాంతం ఇచ్చేసి .
ఎంత బాగుందో ! మరి నాకో.....!
అన్ని సెలవులకు మేం తిరుపతి , కాళహస్తే
మొన్న హాలిడేస్ కు హంగరీకి వెళ్లారట పైఇంటివాళ్ళు హ్యాపీగా ఆరులక్షలు అవగొట్టేసి
ఎంత బాగుందోనట ! మరి నాకో.....!
నెలకో రెండుసార్లు షాపింగ్ కు వెళ్ళడమే కాని
మా ఆఫీసులో అయితే ఆడవాళ్ళు అంతా రోజూ షాపింగ్ చేసి
కాస్ట్లీ కాస్ట్లీ చీరలు కొంటారు .
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
ఎప్పుడో కొనుక్కున్న డొక్కు శాంత్రో కారే మాకు
ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడల్లా
కొత్త కొత్త కార్లల్లో వస్తుంది కల్పన
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
పగలు మాత్రం పని చేసి
రాత్రి గుర్రు పెట్టి నిద్రపోతాడు నా మొగుడు పాతిక వేలు తెచ్చినందుకే
రాత్రింబవళ్ళు పనిచేసి లక్షల్లక్షల జీతం తెచ్చి కుమ్మరిస్తాడట మంజులమొగుడు
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
నాకో...!! = అనంతం = అసూయ + ఆశ = ఆధునిక యుగపు నైజం
పట్టుచీర
(08-09-2012,విజేత చిత్రీకరణ సమయంలో )
పదివేలు విరజిమ్మి నిన్ను కొన్నాను
కన్నీళ్ళు తుడవనూ పనికిరావే !
పెళ్ళికని ప్రేమగా కొన్నాను నిన్ను
పాప పొత్తిళ్ళకూ పనికిరావే !
పదిమందిలో గొప్పకని నేను కొన్నాను
పట్టెడన్నము ఆర్చ పనికిరావే !
పేద్ద గొప్పలు పోయికొంటినే కాని
పేద మానము దాచ నీవు ఎగతాళివే !
పరువూప్రతిష్టలు పెంచగలవే గాని
ప్రాణప్రతిష్ట పురుగుకూ చేయలేవే !
కువకువలు
అది ఒక ఇది
ప్రపంచంతో సంబంధం వద్దనే పరిస్థితి
చుట్టూ వున్నది ఎవ్వరో తోచని వింతగతి
ఇద్దరే ప్రపంచమై,ప్రపంచమా ఇద్దరే అయ్యి,
హద్దులు కరువై, సుద్దులే ఎదలై
తనుస్పందనలే జీవితమై
ఆనందమే సర్వమై
హక్కుల ప్రకటనై, అధికారప్రదర్శనై
అనుబంధాలే అంతా అయ్యి
ఒకరికొకరై, ఇద్దరూ ఒకరై ముగ్గురుకావడమే మనికయ్యే ఓ గమ్మత్తిది .
నీకు....
ఆ నీలిమేఘాన్ని పత్రముగ చేసి,
హరిధనుస్సును లేఖినిగా మార్చి,
తారకల తళుకులను వర్ణాలుగా పేర్చి
రాశాను ఓ లేఖ
మెరుపులే నగిషీగా
చేర్చేది నీకెలా చిరునామ మనసేగా
మట్టి - 'మని'షి
అమ్మయ్యా1 ఇన్ని రోజులుగా వాళ్ళు పడ్డ
కష్టాలన్నిటికీ చరమగీతం .
వాళ్ళ పిల్లలంతా ఎక్కొచ్చారు .
పల్లెలో పుట్టిన వాళ్ళు పరదేశాల కెళ్ళారు .
కూలిపని, సొంతపాడి, సేద్యం -----
జీవాలు , కోళ్ళు ----ఇక ఈ
పనులు వాళ్లకు అవసరం లేదు .
డాలర్లు స్వదేశానికి దిగుమతి ,
తల్లిదండ్రులప్పుడప్పుడూ విదేశాలకు ఎగుమతి .
కానీ ఎందుకా నిర్వేదం ఆ పండిన ముసలిముఖాల్లో.... ??
అకౌంట్లు, ఫ్రిజ్లు, ప్లాస్మా టీవిలు ------- ఏవి లేవు ?
నగలు, డబ్బు,హా దా--------లేనివి ఇంకేమీ లేవు
కాని ఆ ముఖాల్లో సంతోషలేమి ఎందుకు ?
డబ్బులొచ్చాయి . దాంతోపాటే పొలం పనులొద్దనే
హుకుం లొచ్చాయి
.
ఆస్తులొచ్చాయి. వాటితోపాటే పాడి , జీవాలు
వద్దన్న వారింపులొచ్చాయి.
లేదా మీ ఇష్టం. మేమైతే తిరిగిరాం .
మీకూ, మీ పల్లెకూ రాంరాం అనే
వాగ్బాణాలు గుచ్చాయి .
మట్టే మనికిగా , పల్లే ప్రాణంగా
బతికిన ఆ మట్టిమనుషుల ముందో పెద్ద ప్రశ్నార్థకం .
సమానమైన ప్రేమ పంచి పెంఛినా
వాడుకొని వదిలి వెళ్లి పోయిన పిల్లల ప్రేమ సుఖమా ?
ఆదుకొని వదలని పొలం, పశువులు, మొక్కల సాంగత్యం సుఖమా ?
ఇప్పుడు వాళ్ళ ముఖాల్లోని ప్రశ్న " మాకు వారసు లున్నారా ? "
మరీ చికల వెంట మారథాన్
ఉన్నదేదో వద్దని లేనిదేదో కావాలని
లేనిదేదో కలిమని ఉన్నదేదో లేమని
ఆత్రంగా పరుగులు
అలసట పుట్టేలా పరుగులు .
అంతులేని పరుగులు
అనంతంలోకి పరుగులు .
ఆసతో పరుగులు
అవకాసం దొరికితే పరుగులు .
పరిగెత్తి పరిగెత్తి (నొప్పులు ) తిప్పలు
దెబ్బ తిన్న దురాశకు (నొప్పులు )
కనిపించే బంధాలకు నొప్పులు
కనిపించని మానవతకు నొప్పులు
పారిపోవ భాధ్యతలకు నొప్పులు
వీడని అభద్రభావనకు నొప్పులు
ఎందుకంటే పిచ్చి మనిషి చేస్తోంది మరీచికల వెంట మారథాన్
ఇది జారిపోవ కొనితెచ్చుకున్న కష్టం మది నింపలేని ప్రాప్తం
ఏం చెయ్యాలి
గుండె చిక్క పట్టుకొని
మనసు నొడిసి పట్టుకొని
ప్రాణాలు అరచేత పట్టుకొని
పెంచుకోవలసి వస్తోంది భావిమాతృ మూర్తులని
ఎలా చేయాలి ధైర్యం ఆడపిల్లను కనను,
ఆకాశంలో సగమంటూ గర్వంగా పెంచను .
చదవకుంటే మొద్దు అని సమాజంలో చిన్నచూపు .
.చదువుకని పంపిస్తే అడుగగుడున విషపుచూపు .
ఇండివిజ్యు వాలిటి అని ఆడ అయితే ఏమిటని
ఎక్కించాం వెన్నలాంటి ఆడపిల్ల మనసులోకి
వదిలి పోనీ తుమ్మబంక.
నా ఇష్టం నా బతుకు అనే పడికట్టు పదాలు
పాలవంటి మనసులో పడ్డ ఉప్పుకల్లులు
భవిష్యమును కననివ్వని కనికట్టు పరదాలు .
మానైన మానిని కొమ్మకాదు కాండమే.
వ్యక్తిత్వం వివేకం కంటితడుపు కోసమే .
ఎందుకమ్మా
స్త్రీత్వానికి సరితూనికగా సేబాసులు అందుకున్నావ్
శృంగారంలో రససికరాలు ఎక్కించి మరి మురిసి పోయావు
మాతృత్వానికి పరాకాష్టగా మమతలను పంచావు
ఎదుగుతున్న కొద్ది దాగి దాగి దోబూచులాడిన
నీకు ఎప్పుడు ఎక్కడ తగిలిందమ్మ ఈ దిష్టి
సమూలంగా తుడిచి వేయబడ్డావ్ .
బీళ్ళు - బళ్ళు
నేను
నేనొక విషాదగీతికను .
నా నిండా వేదనాస్వరాలే !
నా ఆలాపనలో , తానం పల్లవులలో
వొలికేది కేవలం వ్యధే !
నెర్రెలు చీలిన నెరవల్
రసహీనమైన స్వరకల్పన నా సొత్తు .
వినేవాళ్ళ ఆహా ఓహొలు
నా గుండెను కలిచివేయగల జీవస్వరాలు
శ్రోతలను మూర్చిల్ల చేసే నా మూర్చన
నా దుఃఖానికి నే పరిపూర్ణంగా చేసే అర్చన .
నాలోని ఉదాత్త అనుదాత్తాలు
కావు సామవేద సారాలు
నే సాధించలేని ఎన్నో అంశాలకు ఆకారాలు .
నేను కోరుకున్న నోట పలకలేని పాటను .
ఓ దైవోపహత నడిచే గజిబిజి బాటను
నిజంగా
ఆకాసంలో ఎప్పుడు ఓభీతావహ అరుణవర్ణం
అదేదో క్రాంతి కారక అభివృద్దికి అభివ్యక్తి అనుకునేదాన్ని
చెప్పొద్దూ -------
పరికించి చూస్తే తరతరాల రక్తార్పణ మరకలు దృశ్యమానమై
మనసును మతథిస్తాయని భయం "నిర్భయం"గా ఈ రోజు పరిశీలిస్తే
ఆకాసంలో నా సగం రుదిరధారలతో రోదిస్తోంది
నైర్మల్యత లేని ఆ సగపు వాటా నాకెందుకు ?
దురాక్రమనలకు గురౌతుందని కూడా నినదించే అధికారం లేని
ఆ నామమాత్రపు హక్కు నాకెందుకు ?
నవ్వులుపాలు కానా ? నాలోమిథ్యాగౌరవాన్ని పెంచనా?
నా అసంతృప్త చిచ్చుకు చిచి కొట్టనా ?
వంట చెయ్యడానికా
పెళ్ళిళ్ళు చేసేది .
వంటింట్లో మగ్గదానికా
పెళ్ళాలు అయ్యేది
ఆడది ఆడది ఆడది
ముద్దుమురిపాలు , మమతానురాగాలు ఎంతపంచినా
పుట్టిలు అంటుంది - ఆడది అని
శరీరాన్ని పంచి , వంశాన్ని పెంచి ఎంత శ్రమించినా
అత్తిల్లూ అంటుంది - ఆడది అని
రక్తాన్ని ఇచ్చి , శరీరాన్ని పెంచి , కృశించి నశించినా
కన్నబిడ్డలూ అంటారు - ఆడది అని
ఇంతకూ ఈ ఆడది ఏడది ??
చింతపండుకు కొలమానం - కిలోలు
ఆడతనానికి కొలమానం -పనితనం
మగవాడికి కొలమానం - పుట్టుక
కన్నవాడి నుండి కనబడ్డ వాడివరకు
కనిపెంచినవాడి నుండి కనిపించినవాడి వరకు
మొత్తం కుట్రదారులే !
మొత్తంగా కుట్రదారులే !
కూతురివైనా కొడుకువే ననీ తండ్రి
బాధ్యతలు బదలాయించిన కుట్రదారు
అక్కవైనా అన్నవే అంటూ
హక్కులు భుక్తంచేసిన సోదరులు కుట్రదారులు
పెళ్ళామంటే ప్రాణార్థమంటూ
పనులు జరుపుకున్న మొగుడు కుట్రదారు
అమ్మేలోకమంటూ అమమ కన్నీళ్ళను
పంనేరులా చల్లుకుని మురిసే కొడుకులు కుట్రదార్లు
మహిళామణి వంటూ వహవాలతో
వలలేసి వేళకొరకు పొంచుండే మగడేగలు కుత్రదార్లు
ఇన్నీ కుట్రలు కుతంత్రాలు ఆదర్శ స్త్రీ సుమ్మాన్ని
పహరా కాసే కుహనా రక్షక కంటకాలు
పత్నీపరాయణత
పతిదేవ్యువాచ :-
నేనెంతో ప్రేమిస్తున్నాగా నిన్ను - నాకు కలిగినంత
నేనెంతో సుఖపెడుతున్నాగా నిన్ను - నాకు తోచినంత
నేనెంతో అందిస్తున్నాగా - నాకు నచ్చినంత
ఇంకా ఎందుకా వాపిరిగొట్టు మొహం ఏదీ లేనిదాన్లా అస్టదరిద్రురాలిలా.
ఆడపిల్ల
అబ్బా ఈ కాలంలో ఆడపిల్లలే నయం
మనకు కన్ను నొచ్చినా కాళ్ళు నొచ్చినా ఆడపిల్లైతేనే చేస్తుంది
ఇద్దరూ మగపిల్లలేనా!!
కోడళ్లెక్కడ చేస్తారూ!!
అమ్మా !!అయ్యా!! ఆపుతారా మీ సుభాషితాలు!!
ఆడపిల్ల అంటే మన కడుపున పుడితేనేనా!!
మనింటి కొచ్చేదీ ఆడపిల్లే!!
ఆ ఆడపిల్ల , ఆ ఇంటికి ఆడపిల్లే!!
ఆ తల్లిదండ్రులకు ఆసరా ఇచ్చే కూతురే !!
మామంచి మన కూతురూఓ ఇంటిని ఆశాంతిపాలు చేసే కోడలే
ఆడపిల్ల అనబడే వ్యక్తి
కూతురిగా ఒకరకం
కోడలిగా సంకరమా !
ఇదెక్కడి కుతర్కం!!
మార్పు రావలసింది మన మాటల్లో, బుర్రల్లో
అప్పుడే అవుతుంది మన ఆడపిల్ల అత్తింటికీ ఆడపిల్లగా .
ఎంత ఇరుకు మనసు మొత్తం
ఎంత బరువు తనువు చిత్రం
అయిదు అడుగుల ఉంచించుకు బతకడం
ఐదుఅడుగుల పైని కాయం
అంగులంలా అనిపించేయడం
ఇవ్వడం తప్ప యాచించుట
తెలియని సాయము చేయడమే
కాని చేయిజపాను నెర్వలేని
మనసుకు వే తనువుకు ఇది సంకటం
ఏదైతేగాని కంటక సంగరం
పలికెడిది భాగవతమట
నువ్వు - నేను
సమత్వం , అధిగమనం సామాజిక అభివృద్ధి లోనే కాని
శారీరికంగా ఆడా మగా ఎన్నటికీ ఒకటి కాలేరు , కాబోరు .
ఎందుకా ?
విజాతిధ్రువాలు ఎప్పుడూ ఆకర్షకాలే కాని సమాంతరాలు కావు .
- సాహితీకిరణం, నవంబర్ , 2011
ఓ ------ నాకు తెలీకేం ?
ఓ ! ---- నాకు తెలీకేం !
ఆగష్ట్ పదిహేనంటే ------
పబ్లిక్ హాలిడేనేగా !
ఓసారైతే రెండ్రోజులు వేరే హాలిడేస్ తో కలిసొచ్చింది .
హాయిగా ఎంజాయ్ చేశా !
ఓ !---- నాకు తెలీకేం !
జాతీయపతాకమంటే ----
మా ఆఫీస్ వాచ్ మన్ ఎగరేస్తుంటాడు .
అన్నట్లు అప్పుడప్పుడూ అతడు అడిగితే
మా వేస్ట్ మెటీరియల్ రూం నుంచి దాన్ని నేనే తీసిస్తాగా !
ఓ !----నాకు తెలీకేం !
గాంధీతాతంటే --------
బోసినవ్వుతో కర్రపట్టుకొని నడుస్తూ --------
అన్ని రూపాయి నోట్ల మీదా ఉంటాడు ఆయనేగా !
ఓ ! ------ నాకు తెలీకేం !
సత్యాగ్రహమంటే ---------
జీతం పెంచలేదని ఈ మధ్య ఓ పదిరోజలు
మేం పెన్ డౌన్ చేసి పనిచేయ్యకుండానే జీతం తీసుకున్నాం . అదేగా !
ఓ ! ----- నాకు తెలీకేం!
రాముడంటే ----------
బాబ్రీ మసీదుని కూలగొట్టి
ఆయన జన్మస్థలం అని కబ్జా చేశారే !----- ఆయనేగా !
ఓ !------- నాకు తెలీకేం !
తెలుగు జాతి రత్నాలు
నన్నయ ,తిక్కన , కృష్ణదేవరాయలు ,అల్లూరిసీతారామరాజు అంటే --------
మొన్న టాంక్ బండ్ మీద విగ్రహాలు పగలగొట్టామే వాళ్ళేగా !
ఓ ! ------ నాకు తెలీకేం !
తెలుగు భాషంటే ----
వాట్ యార్ ! తుమ్ సమజ్ రహేహో కీ
I DONT KNOW టెల్గూ ! I AM ALSO టెల్గూవాలా BRO.!
నా నైటీ
నిట్టురుస్తూ చూస్తోంది .
ఓ రోజు నా అందాన్ని అద్దినట్లు చూపిన నా నైటీ !
చూచినవారంతా 'చాలాబావుంది ' అన్న నా నైటీ !
నా అలసటను అర్థం చేసుకొని నన్ను అక్కున చేర్చుకున్న నా నైటీ !
నా ఒంటిని అంటినపుడల్లా మా వారు నన్నంటుకుపోయేలా చేసిన నా నైటీ !
మాతృత్వపు అవధిగా తల్లిపాలతో తడిసిన నా నైటీ !
నా కన్నవారి, కట్టుకున్నవారి, కడుపున పుట్టినవారి కన్నీళ్ళు తుడిచిన నా నైటీ !
ఇంటియజమానురాలిగా నా ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించిన నా నైటీ !
కొత్తరకాలెన్ని వచ్చినా తన ప్రత్యేకతను చాటుకున్న నా నైటీ !
పాతదైనా నేను ప్రాణప్రదంగా దాచుకున్న నా నైటీ !
ముసలివగ్గై మూలగది చేర్చబడ్డ నన్ను చిరుగుల అలుకు గుడ్డై వచ్చి చూచి నిట్టూరుస్తోంది
నేటి నిజం వారపత్రిక
ఆ ( ! ఆ భార్యాభర్తల మధ్య కీచులాటలే లేవా ?
ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేని అధము లేమో !
ఆ ( ! ఆ అన్నదమ్ముల మధ్య గొడవల్లేవా ?
ఆస్తిపాస్తుల్లేని దరిద్రులేమో !
ఆ ( ! ఆ తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకున్నాడా ?
ఆ ( ! ఆ తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకున్నాడా ?
ఎవ్వరూ ప్రేమించనంత ఛండాలపుముఖమేమో !
ఆ ( ! హైస్కుల్లోనే కాదు , కాలేజీలో కూడా అఫైర్ లేదా ?
ఐతే ఖచ్చితంగా తేడాగాడే !
ఆ ( ! తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడ్డం లేదా ?
స్నేహితులతో తెలుగు సినిమాలు చూడ్డం లేదేమో !
ఆ ( ! మనసులో ఒకటి బయటి కొకటి లేదా?
బతకడం రాని బడుద్ధాయేమో !
ఆ ( ! వాళ్ళింట్లో T.V సీరియల్స్ చూడరా ?
లోకజ్ఞానం బొత్తిగా అక్కర్లేదేమో !
ఆ ( ! కాలేజ్ కు బంక్ కొట్టి బజార్లో తిరగడం లేదా ?
సక్రమమైన స్నేహితులు లేరేమో !
- ముంబై వన్ [పక్షపత్రిక] 01 - 01 - 2012 - 15- 01-2012
- ముంబై వన్ [పక్షపత్రిక] 01 - 01 - 2012 - 15- 01-2012
అమ్మాయికి అబ్బాయికి ఏం తేడా లేదని
పెద్దచదువులు చదివించారు సరే !
కానీ ఆమాట నా ఫ్రెండ్ ద్రుహిణ్ తో
బైక్ లో తిరిగేటప్పుడు వర్తించదని
నాకెందుకు చెప్పలేదు నాన్నా !
నాన్నైతే సరే మగాడు . మగాడితో స్నేహం
మాటల వరకైతే పర్లేదు కాని
అర్థరాత్రి వరకూ షికార్లకు పనికి రాదని
నువ్వైనా చెప్పలేదేం అమ్మా !
పని చేసేచోట నా తెలివితేటలు ,
పనిసామర్థ్యాలు కూడా నా ఆడతనానికి
పనిసామర్థ్యాలు కూడా నా ఆడతనానికి
అదనపు ఆకర్షణ కూరుస్తాయని
ముందుగానే నాకెందుకు చెప్పలేదు
ఓ నవసమాజమా !
సౌకర్యం కోసం వేసుకున్న జీన్స్ , టీషర్టు
సౌందర్యాన్ని ఆరబోస్తాయని
తెలియజెప్పలేకపోయావా
సాంస్కృతిక పరిణామమా !
ఇన్నాళ్ళు మిత్రుడ్ని అంటూ తిరిగినవాడు
నేడు ప్రియురాలిని కాలేనన్నానని
కాలకూటద్రావకాన్ని క్రూరంగా నా మొహాన పోస్తే
అది నా తప్పా ! మీ తప్పా !
సౌందర్య సాగరం
సాగరతీరాన సైకతవేదికపై శతకోటి కాంతు లు .
పున్నమి చంద్రుడు దిగివచ్చి విశ్రాంతి గొంటున్నాడా !
కానేకాదు. జాబిలి నిమ్నోన్నతాలకు ఇంత సొబగు ఎక్కడిది ?
అచ్చరభామినియా !- కానే కానేరదు .
వారికి చిత్తచాంచల్యాన్ని కలిగించగల ఈ నిమిషత్వ మెక్కడిది ?
సాగరాన జలకమాడి బడలి విశ్రాంతిగొంటున్న ఈ అతిలోకసౌందర్యం .
ఖచ్చితంగా సాగరుణ్ణి రససాగరుణ్ణి చేసిందని .
రసాస్వాదకుడిని చేసిందనేందుకు గుర్తుగా వడలిన వనిత -------
మతిపోయిన సంద్రుడు ఆమెతో సరాగమాడినట్లు
అంగజుని తాతే వివశుడై ఆమె అణువణువునూ చూరగొన్నట్లుగా
ఆమె సీమంతంలో సిందూరంలా మురుస్తూ నిండిన సైకతరేణువులు
ఆమె అంగాంగానా మిలమిలా మెరుస్తూ స్వేదకణములు .
నాకో......!
నాకు పోయిన సంవత్సరం కొన్న పట్టుచీరే
మరి పక్కింటి పార్వతి పాతికవేలు పోసి పట్టుచీర కొనింది
ఎంత బాగుందో ! మరి నాకో.....!
మా ఇంట్లో రెండేళ్లనాటి ఓల్డ్ వాషింగ్ మషీనే
మా పక్కవీధి ప్రవీణ లేటెస్ట్ వాషింగ్ మెషీన్ కొనిందట పాతది పారేసి.
ఎంత బాగుందో ! మరి నాకో.....!
నాలుగేళ్లనాడు కొన్న నాలుగుపేటల
.చంద్రహారమే నా మొహానికి
వరలక్ష్మీ వ్రతమని వడ్డాణం కొనింది వనజ ఐదులక్షలు అమాంతం ఇచ్చేసి .
ఎంత బాగుందో ! మరి నాకో.....!
అన్ని సెలవులకు మేం తిరుపతి , కాళహస్తే
మొన్న హాలిడేస్ కు హంగరీకి వెళ్లారట పైఇంటివాళ్ళు హ్యాపీగా ఆరులక్షలు అవగొట్టేసి
ఎంత బాగుందోనట ! మరి నాకో.....!
మా ఆఫీసులో అయితే ఆడవాళ్ళు అంతా రోజూ షాపింగ్ చేసి
కాస్ట్లీ కాస్ట్లీ చీరలు కొంటారు .
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
ఎప్పుడో కొనుక్కున్న డొక్కు శాంత్రో కారే మాకు
ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడల్లా
కొత్త కొత్త కార్లల్లో వస్తుంది కల్పన
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
పగలు మాత్రం పని చేసి
రాత్రి గుర్రు పెట్టి నిద్రపోతాడు నా మొగుడు పాతిక వేలు తెచ్చినందుకే
రాత్రింబవళ్ళు పనిచేసి లక్షల్లక్షల జీతం తెచ్చి కుమ్మరిస్తాడట మంజులమొగుడు
ఎంత బాగుంటుందో ! మరి నాకో.....!
నాకో...!! = అనంతం = అసూయ + ఆశ = ఆధునిక యుగపు నైజం
పట్టుచీర
(08-09-2012,విజేత చిత్రీకరణ సమయంలో )
పదివేలు విరజిమ్మి నిన్ను కొన్నాను
కన్నీళ్ళు తుడవనూ పనికిరావే !
పెళ్ళికని ప్రేమగా కొన్నాను నిన్ను
పాప పొత్తిళ్ళకూ పనికిరావే !
పదిమందిలో గొప్పకని నేను కొన్నాను
పట్టెడన్నము ఆర్చ పనికిరావే !
పేద్ద గొప్పలు పోయికొంటినే కాని
పేద మానము దాచ నీవు ఎగతాళివే !
పరువూప్రతిష్టలు పెంచగలవే గాని
ప్రాణప్రతిష్ట పురుగుకూ చేయలేవే !
కువకువలు
అది ఒక ఇది
ప్రపంచంతో సంబంధం వద్దనే పరిస్థితి
చుట్టూ వున్నది ఎవ్వరో తోచని వింతగతి
ఇద్దరే ప్రపంచమై,ప్రపంచమా ఇద్దరే అయ్యి,
హద్దులు కరువై, సుద్దులే ఎదలై
తనుస్పందనలే జీవితమై
ఆనందమే సర్వమై
హక్కుల ప్రకటనై, అధికారప్రదర్శనై
అనుబంధాలే అంతా అయ్యి
ఒకరికొకరై, ఇద్దరూ ఒకరై ముగ్గురుకావడమే మనికయ్యే ఓ గమ్మత్తిది .
నీకు....
ఆ నీలిమేఘాన్ని పత్రముగ చేసి,
హరిధనుస్సును లేఖినిగా మార్చి,
తారకల తళుకులను వర్ణాలుగా పేర్చి
రాశాను ఓ లేఖ
మెరుపులే నగిషీగా
చేర్చేది నీకెలా చిరునామ మనసేగా
మట్టి - 'మని'షి
అమ్మయ్యా1 ఇన్ని రోజులుగా వాళ్ళు పడ్డ
కష్టాలన్నిటికీ చరమగీతం .
వాళ్ళ పిల్లలంతా ఎక్కొచ్చారు .
పల్లెలో పుట్టిన వాళ్ళు పరదేశాల కెళ్ళారు .
కూలిపని, సొంతపాడి, సేద్యం -----
జీవాలు , కోళ్ళు ----ఇక ఈ
పనులు వాళ్లకు అవసరం లేదు .
డాలర్లు స్వదేశానికి దిగుమతి ,
తల్లిదండ్రులప్పుడప్పుడూ విదేశాలకు ఎగుమతి .
కానీ ఎందుకా నిర్వేదం ఆ పండిన ముసలిముఖాల్లో.... ??
అకౌంట్లు, ఫ్రిజ్లు, ప్లాస్మా టీవిలు ------- ఏవి లేవు ?
నగలు, డబ్బు,హా దా--------లేనివి ఇంకేమీ లేవు
కాని ఆ ముఖాల్లో సంతోషలేమి ఎందుకు ?
డబ్బులొచ్చాయి . దాంతోపాటే పొలం పనులొద్దనే
హుకుం లొచ్చాయి
.
ఆస్తులొచ్చాయి. వాటితోపాటే పాడి , జీవాలు
వద్దన్న వారింపులొచ్చాయి.
లేదా మీ ఇష్టం. మేమైతే తిరిగిరాం .
మీకూ, మీ పల్లెకూ రాంరాం అనే
వాగ్బాణాలు గుచ్చాయి .
మట్టే మనికిగా , పల్లే ప్రాణంగా
బతికిన ఆ మట్టిమనుషుల ముందో పెద్ద ప్రశ్నార్థకం .
సమానమైన ప్రేమ పంచి పెంఛినా
వాడుకొని వదిలి వెళ్లి పోయిన పిల్లల ప్రేమ సుఖమా ?
ఆదుకొని వదలని పొలం, పశువులు, మొక్కల సాంగత్యం సుఖమా ?
ఇప్పుడు వాళ్ళ ముఖాల్లోని ప్రశ్న " మాకు వారసు లున్నారా ? "
మరీ చికల వెంట మారథాన్
ఉన్నదేదో వద్దని లేనిదేదో కావాలని
లేనిదేదో కలిమని ఉన్నదేదో లేమని
ఆత్రంగా పరుగులు
అలసట పుట్టేలా పరుగులు .
అంతులేని పరుగులు
అనంతంలోకి పరుగులు .
ఆసతో పరుగులు
అవకాసం దొరికితే పరుగులు .
పరిగెత్తి పరిగెత్తి (నొప్పులు ) తిప్పలు
దెబ్బ తిన్న దురాశకు (నొప్పులు )
కనిపించే బంధాలకు నొప్పులు
కనిపించని మానవతకు నొప్పులు
పారిపోవ భాధ్యతలకు నొప్పులు
వీడని అభద్రభావనకు నొప్పులు
ఎందుకంటే పిచ్చి మనిషి చేస్తోంది మరీచికల వెంట మారథాన్
ఇది జారిపోవ కొనితెచ్చుకున్న కష్టం మది నింపలేని ప్రాప్తం
ఏం చెయ్యాలి
గుండె చిక్క పట్టుకొని
మనసు నొడిసి పట్టుకొని
ప్రాణాలు అరచేత పట్టుకొని
పెంచుకోవలసి వస్తోంది భావిమాతృ మూర్తులని
ఎలా చేయాలి ధైర్యం ఆడపిల్లను కనను,
ఆకాశంలో సగమంటూ గర్వంగా పెంచను .
చదవకుంటే మొద్దు అని సమాజంలో చిన్నచూపు .
.చదువుకని పంపిస్తే అడుగగుడున విషపుచూపు .
ఇండివిజ్యు వాలిటి అని ఆడ అయితే ఏమిటని
ఎక్కించాం వెన్నలాంటి ఆడపిల్ల మనసులోకి
వదిలి పోనీ తుమ్మబంక.
నా ఇష్టం నా బతుకు అనే పడికట్టు పదాలు
పాలవంటి మనసులో పడ్డ ఉప్పుకల్లులు
భవిష్యమును కననివ్వని కనికట్టు పరదాలు .
మానైన మానిని కొమ్మకాదు కాండమే.
వ్యక్తిత్వం వివేకం కంటితడుపు కోసమే .
ఎందుకమ్మా
స్త్రీత్వానికి సరితూనికగా సేబాసులు అందుకున్నావ్
శృంగారంలో రససికరాలు ఎక్కించి మరి మురిసి పోయావు
మాతృత్వానికి పరాకాష్టగా మమతలను పంచావు
ఎదుగుతున్న కొద్ది దాగి దాగి దోబూచులాడిన
నీకు ఎప్పుడు ఎక్కడ తగిలిందమ్మ ఈ దిష్టి
సమూలంగా తుడిచి వేయబడ్డావ్ .
బీళ్ళు - బళ్ళు
మొన్నటి పచ్చని పొలాలు నేడు మొలకెత్తని బీళ్ళు
మట్టిని నమ్ముకున్నవారు మట్టి కొట్టుకు పోయేలా మంత్రాంగం
అన్నంపెట్టేందుకు అలసే అలవాటున్న చేతులకు నిర్భంధ విద్యా హక్కు
అన్నమో రామచంద్రా అని అలమటించేలా చేయడం
స్వచందంగా చేస్తూన్న పనిని నిర్బంధంగా మాన్పించి
అనుభవాన్ని అసహ్యంగా మలచి భోజనం పండవలసిన చోట
భవంతులను లేపి మన తిండికి మనమే కట్టుకుంటున్నాం చలువరాతి సమాధి
అదే మనకి తినిపిస్తుంది రేపు బూది
నేనొక విషాదగీతికను .
నా నిండా వేదనాస్వరాలే !
నా ఆలాపనలో , తానం పల్లవులలో
వొలికేది కేవలం వ్యధే !
నెర్రెలు చీలిన నెరవల్
రసహీనమైన స్వరకల్పన నా సొత్తు .
వినేవాళ్ళ ఆహా ఓహొలు
నా గుండెను కలిచివేయగల జీవస్వరాలు
శ్రోతలను మూర్చిల్ల చేసే నా మూర్చన
నా దుఃఖానికి నే పరిపూర్ణంగా చేసే అర్చన .
నాలోని ఉదాత్త అనుదాత్తాలు
కావు సామవేద సారాలు
నే సాధించలేని ఎన్నో అంశాలకు ఆకారాలు .
నేను కోరుకున్న నోట పలకలేని పాటను .
ఓ దైవోపహత నడిచే గజిబిజి బాటను
నిజంగా
ఆకాసంలో ఎప్పుడు ఓభీతావహ అరుణవర్ణం
అదేదో క్రాంతి కారక అభివృద్దికి అభివ్యక్తి అనుకునేదాన్ని
చెప్పొద్దూ -------
పరికించి చూస్తే తరతరాల రక్తార్పణ మరకలు దృశ్యమానమై
మనసును మతథిస్తాయని భయం "నిర్భయం"గా ఈ రోజు పరిశీలిస్తే
ఆకాసంలో నా సగం రుదిరధారలతో రోదిస్తోంది
నైర్మల్యత లేని ఆ సగపు వాటా నాకెందుకు ?
దురాక్రమనలకు గురౌతుందని కూడా నినదించే అధికారం లేని
ఆ నామమాత్రపు హక్కు నాకెందుకు ?
నవ్వులుపాలు కానా ? నాలోమిథ్యాగౌరవాన్ని పెంచనా?
నా అసంతృప్త చిచ్చుకు చిచి కొట్టనా ?
వంట చెయ్యడానికా
పెళ్ళిళ్ళు చేసేది .
వంటింట్లో మగ్గదానికా
పెళ్ళాలు అయ్యేది
ఆడది ఆడది ఆడది
ముద్దుమురిపాలు , మమతానురాగాలు ఎంతపంచినా
పుట్టిలు అంటుంది - ఆడది అని
శరీరాన్ని పంచి , వంశాన్ని పెంచి ఎంత శ్రమించినా
అత్తిల్లూ అంటుంది - ఆడది అని
రక్తాన్ని ఇచ్చి , శరీరాన్ని పెంచి , కృశించి నశించినా
కన్నబిడ్డలూ అంటారు - ఆడది అని
ఇంతకూ ఈ ఆడది ఏడది ??
చింతపండుకు కొలమానం - కిలోలు
ఆడతనానికి కొలమానం -పనితనం
మగవాడికి కొలమానం - పుట్టుక
కన్నవాడి నుండి కనబడ్డ వాడివరకు
కనిపెంచినవాడి నుండి కనిపించినవాడి వరకు
మొత్తం కుట్రదారులే !
మొత్తంగా కుట్రదారులే !
కూతురివైనా కొడుకువే ననీ తండ్రి
బాధ్యతలు బదలాయించిన కుట్రదారు
అక్కవైనా అన్నవే అంటూ
హక్కులు భుక్తంచేసిన సోదరులు కుట్రదారులు
పెళ్ళామంటే ప్రాణార్థమంటూ
పనులు జరుపుకున్న మొగుడు కుట్రదారు
అమ్మేలోకమంటూ అమమ కన్నీళ్ళను
పంనేరులా చల్లుకుని మురిసే కొడుకులు కుట్రదార్లు
మహిళామణి వంటూ వహవాలతో
వలలేసి వేళకొరకు పొంచుండే మగడేగలు కుత్రదార్లు
ఇన్నీ కుట్రలు కుతంత్రాలు ఆదర్శ స్త్రీ సుమ్మాన్ని
పహరా కాసే కుహనా రక్షక కంటకాలు
పత్నీపరాయణత
పతిదేవ్యువాచ :-
నేనెంతో ప్రేమిస్తున్నాగా నిన్ను - నాకు కలిగినంత
నేనెంతో సుఖపెడుతున్నాగా నిన్ను - నాకు తోచినంత
నేనెంతో అందిస్తున్నాగా - నాకు నచ్చినంత
ఇంకా ఎందుకా వాపిరిగొట్టు మొహం ఏదీ లేనిదాన్లా అస్టదరిద్రురాలిలా.
ఆడపిల్ల
అబ్బా ఈ కాలంలో ఆడపిల్లలే నయం
మనకు కన్ను నొచ్చినా కాళ్ళు నొచ్చినా ఆడపిల్లైతేనే చేస్తుంది
ఇద్దరూ మగపిల్లలేనా!!
కోడళ్లెక్కడ చేస్తారూ!!
అమ్మా !!అయ్యా!! ఆపుతారా మీ సుభాషితాలు!!
ఆడపిల్ల అంటే మన కడుపున పుడితేనేనా!!
మనింటి కొచ్చేదీ ఆడపిల్లే!!
ఆ ఆడపిల్ల , ఆ ఇంటికి ఆడపిల్లే!!
ఆ తల్లిదండ్రులకు ఆసరా ఇచ్చే కూతురే !!
మామంచి మన కూతురూఓ ఇంటిని ఆశాంతిపాలు చేసే కోడలే
ఆడపిల్ల అనబడే వ్యక్తి
కూతురిగా ఒకరకం
కోడలిగా సంకరమా !
ఇదెక్కడి కుతర్కం!!
మార్పు రావలసింది మన మాటల్లో, బుర్రల్లో
అప్పుడే అవుతుంది మన ఆడపిల్ల అత్తింటికీ ఆడపిల్లగా .
ఎంత ఇరుకు మనసు మొత్తం
ఎంత బరువు తనువు చిత్రం
అయిదు అడుగుల ఉంచించుకు బతకడం
ఐదుఅడుగుల పైని కాయం
అంగులంలా అనిపించేయడం
ఇవ్వడం తప్ప యాచించుట
తెలియని సాయము చేయడమే
కాని చేయిజపాను నెర్వలేని
మనసుకు వే తనువుకు ఇది సంకటం
ఏదైతేగాని కంటక సంగరం
పలికెడిది భాగవతమట
నువ్వు - నేను
1) నీవు లేని నేను నిలువెల్ల గరళమును .
నీదు రాక కురియు అమృతమ్మును .
త్రావి తావిని కల్గు పూ రాణినయ్యేను .
ఎంత రమ్యమో ఈ బంధ మంత నూతనం .
* * *
2 ) నీవు లేని అనుక్షణం నిట్టూర్పైనా లేని శూన్యం .
నీవు రాని ప్రతిదినము నిశ్శబ్దపు కాసారము .
* * *
౩ ) నీవు చెంత ఉన్ననాడు
బావి లోని కప్పను నేను .
నీవు దూరమైన వేళ
బయట పడిన చేపను నేను .
* * *
4) నీ వలపు కన్నులలో నీలాంబరదర్శనం.
నీ కౌగిలి రక్షణలో ఎనలేని సాంత్వనం .
నీ చిరుఅలకలలోన నులివెచ్చని అనుభవం .
లోకముతో నాకేమని అనిపించును క్షణక్షణం .
* * *
5) ఆనాటి నీ తలపున ఈనాటికీ రోమాంచం .
ఆనాటి నీ చేతకు ఈనాటికీ మృదుహాసం.
ఈనాటి నీ స్పర్శకు ఆనాటి చిరుకంపం .
ఏనాటికీ కాదోయీ మన ప్రేమ దివంగతం .
* * *
6) నీవు దీపము కావు .
నేను శలభము కానే కాను .
భ్రాంతి లోన కొనసాగే
ఆకర్షణ మనది కాదు
* * *
7) ఏమౌతావు నీవు నాకని అడిగే జిజ్ఞాసులకు
అంతేనా అని చప్పరించే నీరసహృదయులకు
ఏమని చెప్పను మనసు విప్పి
నీవే నా మనుగడవని తప్ప
* * *
8) నీ వున్నప్పుడు ఆలస్యంగా పూచే యీ గులాబీకి
నీవు లేనపుడింత తొందరెందుకో !
నిన్ను పొందినందుకు నాపై మత్సరమా !
తనను మించు నా మోము నేడు నీకై వాడేనని మదమా !
* * *
9) పిచ్చిదని పదిమంది పరిహసించిన
బీదనని బంధువులు అపహసించిన
నవ్వుకుంటాను నేను వారికేం తెలుసునని
నీ కళ్ళు నాపై కురియు ఆ ప్రేమే నా నిధియని.
* * *
10) తనువులోని ఆణువణువూ వేచి ఉండడం .
నిలువెల్లా కన్నులు చేసుకొని చూడడం
కన్నులు కాయడం కేవలం కవిభావనే కాదని
నాకు తెలిసిన్దసలు నీ నిరీక్షణలోనే .
* * *
11) ప్రేమికుల అనుభూతికి
అతీతమైన దేదీ
లేదనే అమరసత్యాన్ని
తెల్పింది నీపైని నా ప్రేమే !
* * *
12) వాళ్ళోచ్చారు వీళ్ళోచ్చారని
ఉత్సాహంతో ఉరుకుతుంటారు .
వచ్చినది నీవు కానపుడు
వారెవరైతే నాకెందుకు ?
* * *
13) ఏ పనికై నే మళ్ళినా
మనసును మరలించే ధ్యాసే .
ఎక్కడెక్కడికి నే వెళ్ళినా
నీ వొచ్చుంటావని ఆశే !
* * *
14) నీ పలుకే నాకు ప్రాణం .
నీ ఊపిరే నాకు నాదం .
ఆ రెండూ లేక నేనున్నా లేనట్లే !
మరి నేనున్నానో లేదో తేల్చాలిక నీవే !
* * *
15) ఎవరన్నారో విరహం మధురంగా ఉంటుందని
బహుశా అది కేవలం ఊహతో అన్నారేమో !
గుండెను పిండేస్తుంది . మనసుకు చిల్లేస్తుంది .
అనుభవంతో ఎవరైనా ఇది మధురం అనగలరా ?
* * *
16) నిను తలచువేళ నా మన:స్థితి వర్ణనాతీతము .
నువు చేరువేళ నా తనుస్థితి వ్యక్తాతీతము .
నను వదలువేళ నా గ్రహస్థితి ఊహాతీతము
అయినా నీ పైనే నా ప్రాణమెందుకో భావాతీతము .
* * *
17) పులకరింతలు ,పలవరింతలు
పలకరింతలు , వలపువింతలు
అన్ని నాలో నీకే నీకే
మన సంగమంలో నిను అలరించడానికే .
* * *
18) నిన్నేదో ఊరించి ఉడికించానని అనుకున్నా
నిన్ను కవ్వించానని నే నవ్వుకున్నా
కానీ ఇప్పుడేగా తెలుస్తోంది .
నేనే ఉడుకుతున్నానని స్వయంగా నవ్వులపాలయ్యానని .
* * *
19) అడుగుల సడి అనిపిస్తే అలవోకగా వినిపిస్తే
పులకరించి పూరెమ్మె కదిలే ఈ మనసు
నీవు కాదని కంటికి తెలిసిన క్షణకణములోనె
నీరసించి నిట్టూర్చి నీరుకారిపోవునేల ?
* * *
20) గేటు చప్పుడైన క్షణము జల్లుమనే గుండెసడి
అడుగు అడుగు నెంచుకుంటు ఆత్రంగా మ్రోగుతుంది .
ప్రతి అడుగుకు యోజనాల దూరం పరుగెడుతుంది .
నీవేమోనన్న ఊహే ఇంతపని చేస్తుంది .
* * *
21) ఆగిపోవు కాలగమన మాగిపోవు బతుకుపయన
మాగిపోవు హృదయవేగ మాగిపోవు నయనచలన
మాగిపోవు శ్వాసకార్య మారిపోవు ప్రాణదీపం .
నీవు దూరమైననాడు శూన్యమౌను సృష్టి మొత్తం .
* * *
22) ఎందుకింత వేదన నీవు లేని క్షణమున
గుండెలోన శోధన మనసు పడే యాతన .
నిన్నటి దాకా మనము నీవెవరో నేనెవరో
నేడు 'నేను ' లేనేలేను అంతా ' నీవే ' గా .
* * *
23) అదుపులోన పెట్టలేను మనసు పడే యాతన .
అనుభూతికి ఆవల నిలిచియున్న భావన .
ఎందుకిలా ఒడుపుగా నా మదిలో చేరావు ?
వాటమెరిగి నన్నిలా నలిబిలి చేస్తున్నావు .
* * *
24) కనులు వెదకె నీ కొరకు
మనసు కలచె నీ కొరకు
నీవు రాని క్షణమిలా
నిలిచిపోదుగా కడవరకూ !
* * *
25) నీ కోసం నేను ఎదురు చూస్తున్నానని
నవ్విపోయిన పోదురు నలుగురితో నాకేమి ?
ప్రాణం కోసం దేహం ఎదురు చూస్తుంటే
వెక్కిరించు వారి చూచి జాలి కాక ఏమి ?
* * *
26) ఏమిటి ఈవింత ?ఎందుకింత కవ్వింత ?
ఎగసిపడే గుండె అలల కొచ్చెనులే పులకింత .
కనులు కనులు కలసిపాడు పల్లవి ఒక తుళ్ళింత .
మధురమైన ఊహ సేయు సవ్వడి ఇది రవ్వంత
* * *
27) ఉన్నట్లో లేనట్లో తెలియనిదీ కొత్తస్థితి
ఔనో కాదో తెలియని వలపులతో నిండె మది .
కావాలో వద్దో మరి సుఖమో అది దు:ఖమో !
కావాలో వద్దో మరి సుఖమో అది దు:ఖమో !
కలివిడిగా నన్నిట్లా కలవరమున ముంచినవి .
* * *
28) మధురంగా మనసిజుడే పదిలంగా నిలిచి
మధించగా హృదయంలో పుట్టినట్టి వస్తువిది .
అమృతమై నరనరముల ఉత్తేజము నింపును .
హాలాహలమో అనునటు గుండెల కాల్చేయును .
* * *
29) నీ వొస్తావని కలలతో రేయంతా తెల్లవారె .
వస్తుంటావని ఆశతో పగలంతా పొద్దుపోయె
భ్రమలతోనే బ్రతుకంతా ఇలా గడిచిపోయె .
కల్లలైన కలలతో కాలము చెల్లిపోయె .
* * *
30) నీ తలపుల తలుపు మూసి మదిని జోకొడితే
నిదురించి అంతలోనె ఉలికిపడి లేచి
మారాము చేసేటి గారాల బిడ్డవలె
నీవే కావాలంటూ ఆగమే చేసె .
* * *
31) అక్కడున్నా నీవు ఒక్కసారైనా
నను తలచి ఉంటావు అను ఊహ చాలు .
ఎక్కడో ఉండి నను తలచేందుకన్నా
రోజుకో కడగంటి నీ వీక్షణము మేలు .
* * *
32) ఎదురుగా నీవు ఉన్న రోజు కన్న నాకు
లేని రోజు మరెంతో ప్రీతిగాను తోచు
కనిపించే నీ కన్నా లేనప్పటి నీ ధ్యాసే
నీ పైన నాకున్న ప్రేమనెంతో పెంచు .
* * *
33) నీ తలపున నా పెదవిపై కదిలిన చిరునవ్వు
అలవోకగా మది తోటలో విరిసిన తొలిపువ్వు.
నీ పలుకుకు నా మదిలో కలిగిన పులకింత
పూవింటితో మదనుడు ఎద కలిగించిన వంత .
* * *
34) నీ చూపుజల్లు తడిపినంత వానజల్లు తడుపలేదు .
నీ చేతివేళ్ళు తాకినంత చీర నన్ను తాకలేదు .
నీ వయసు నన్ను ఆపినంత నా మనసు నన్ను ఆపలేదు .
నీకు నేను తెలిసినంత నాకు నేను తెలియదు .
* * *
35) కావొచ్చునేమో లక్ష్మి విష్ణుని పాదరేణువు .
అయివుండవచ్చు సీత రాముని చేతిధనువు
కాబోలు ఆ రాధ కృష్ణుడు మ్రోయించు వేణువు
నేను మాత్రం ఎప్పుడూ నీ పెదవిపై మెరియు నవ్వు .
* * *
36) రెండు రోజాల మేల్ కలయికా !
రెండు చంద్రవంకల నిండు సంగమమా !
రెండు అమృతకలశాల సమ్మేళనమా !
తెలియకున్నదోయీ మన పెదవుల మధురిమ !
* * *
37) రాతిరిలో నిద్దురవు .
నిద్దురలో చిరుకలవు .
కలలోని మెలుకువవు.
నీవే నీవే నీవే !
* * *
38) భవబంధం తుచ్చమట
అనుబంధం బూటకమట.
మరి నను అమరను చేసే
నీ ప్రేమది ఏంటట?
* * *
39) కనులలో కలవరం
మనసులో పరవశం .
వేశావు సుమశరం
అయ్యాను నీ వశం [పరం ]
* * *
40) నడకలలో రాయంచ గొప్పదైన నాకేమి ?
పలుకులలో రాచిల్క మిన్నయైన నాకేమి ?
అందములో చందమామ అగ్రమైన నాకేమి ?
నిన్ను గెలుచుకున్న నాకు వాటితో పోటీ ఏమి ?
* * *
41) కమలమెలా సూర్యోదయంతో విచ్చుకుంటుందో
కలువ ఎలా చంద్రోదయంతో విరిసిపోతుందో
నాకు తెలిసిందెపుడో తెలుసా ?
నీ రాకతో నా ముఖం వికసించినపుడే !
* * *
42) యీ చేతులేగా నన్ను లాలించేది
యీ పెదవులేగా నన్ను శోధించేది
యీ నవ్వులేగా నన్ను అలరించేది
యీ అన్ని కలసిన నీవెగా నన్ను
సౌఖ్యాల తీరాన్ని చేర్చి మురిపించేది .
* * *
43) దేవుడు ఎదురై ఏం కావాలని అడిగితే
మరుజన్మలో కూడా నీ తోడే కావాలని కోరను .
నీవు తోడున్న ఈ జన్మే అయిపోకుండా
ఇలాగే నిలిచిపోవాలని కోరుకుంటాను .
* * *
44) ముంతాజ్ లా పాలరాతి సమాధి నా కొద్దు
నా కోసం నీ గుండెను గుడిగా మలచే ప్రయాస నీ కొద్దు .
అది గుడిశైనా నా ఊసులు పదిలంగా
ఎప్పటికీ మురిపంగా నిలిచుంటే చాలోయీ !
* * *
45) నీ వెవ్వరివి ?
గుర్తొస్తే చాలు నా ఒళ్ళంతా కలిగే పులకింతవా ?
గుర్తొస్తే చాలు నా ఒళ్ళంతా కలిగే పులకింతవా ?
తలచినంతనే నా పెదవుల మొలిచే చిరునవ్వువా ?
ఎదురుగా ఉన్నా కలలా అనిపించే అరుదైన అనుభూతివా ?
నిలువెల్లా కనులు చేసి నే చూసే ఎదురుచూపువా ?
* * *
46) ఈ ప్రేమ ఆవేగాన్ని భరించలేకున్నాను
అది కలిగించే ఆనందాన్ని వదలలేకున్నాను
ప్రేమ గనుక పిచ్చైతే ఆ పిచ్చి నాకానందం .
ఈ ప్రేమ గుడ్డిదైతే గాంధారే నాకాదర్శం
* * *
47) అడవి గాచు వెన్నెలైన కలువకు మోదము గూర్చు .
కడలి కురియు వానయైన ముత్యపు చిప్పలో మెరియు .
నే చేసుకొన్న అలంకరణ నీవు రాని నాడు
బూడిదలో కలిపినట్టి పన్నీరై పోవు చూడు .
* * *
48) అనుక్షణం నా చూపుతో నిన్ను నిలుపుకోవడం నచ్చక
ఆపలేని మత్తుతో నిద్ర నన్ను ఆవరింప చూస్తోంది
కళ్ళు మూసినా నా కలలో నీవే కనిపిస్తావని తెలుసుకోక
పాపం ! వృధాప్రయాసపడే నిద్రను చూస్తే నాకు జాలేస్తోంది .
* * *
49) స్వాతంత్ర్యమె మిన్నంటారు అంతా పారతంత్ర్యము కన్న .
నీవు లేక ఏ బంధన లేనట్టే స్వేచ్చ కన్న
నీ కౌగిలి సంకెలలో కదలక బంధింపబడిన
ఖైదు లోనే నేనెంతో హాయి ఉందంటున్నా !!
* * *
50) ఆనాడు విషాగ్నితో కంటమును కాల్చుకొని
లోకముల గాచెనని శివుని సేవింతురు .
ఈనాడు విరహాగ్నిని దాచి మదిని కాల్చుకొని
ప్రేమకు నెలవైన నన్ను మన్నింపరెందుకో !
* * *
51) చివురు మావి మేత లేక
కోయిల పాడలేదు .
నీ చివురు ప్రేమ ఊతలేక
నా మనసు పలుకలేదు .
* * *
52) నాకు పొద్దు పొడిచేది
నువు నవ్వినపుడే
నాకు చీకటయ్యేది
నువు వెళ్ళినపుడే.
* * *
53) జన్మ నిచ్చింది అమ్మ
ప్రాణమిచ్చాడు నాన్న .
కానీ నాకు నవ్వు నేర్పిన నీవు
వారి కన్నా ఎంతో మిన్న .
* * *
54) నీ నవ్వు నా కివ్వు నీ మనసు నా కివ్వు
బదులుగా నేనిచ్చేది అది నీకెంతో నచ్చేది .
ఊహలకు అందనిది ఊపిరిగా నిలిచేది .
తనువుల ఊసే లేనిది . తపనను సృష్టించేది .
* * *
55) చెలియలి కట్టను ఒరుసుకు సంద్రం చేసే సందడి .
పిడికెడు గుండియ చేస్తే భరిస్తుందా పూబోడి .
అందుకే
కళ్ళలో ఆ కిలకిల వన్నెలలో ఈ మిలమిల
మదిలో ఏదో గుసగుస పైకే ఈ రుసరుస
* * *
56) ఏదో చెప్పాలని తపన
ఏదేదో చెయ్యాలని కామన .
కానీ ఏం చెప్పాలో తెలియడం లేదు .
ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు .
ఇదేనా ప్రేమభావన ?
* * *
57) చెట్టు మీది పిట్ట పైన
వేటగాని గురి .
నా మదిలోని మాట పైన
చెలికానికి గురి .
* * *
58) శృతి చేసిపోయావు మదివీణను .
మ్రోయింప రావేమి నువు ఇంకను .
ఏమి పలకాలో తెలీక తన్యత నోపలేక
వేచి వేసారి దుర్బలనై కంపించుతున్నాను .
పలికింపరావోయి వేడుకలు చాలును.
* * *
59) అందుతుందట అమృతం తపస్సు చేస్తే
ఏముందందులో ఒక్కసారిగా తాగేసేస్తే .
అనుక్షణం నను అమరను చేసే నీ మాటకన్న గొప్పయా ?
అణువణువును మధురోహల ఊపే నీ ఊసుకన్న మిన్నయా ?
* * *
60) కొమ్మను విడిచిన ఆకు
పువ్వును విడిచిన రేకు
నిప్పును తాకిన పటాకు
వీటికున్న ఆస్థిత్వమే నీవులేని నాకు .
* * *
61) చూశావు నీవు కదిలాను నేను .
నవ్వావు నీవు నడిచాను నేను .
పిలిచావు నీవు పలికాను నేను .
నీ క్రియలన్నిటికీ ప్రతిక్రియలే తప్ప
వేరు జీవనక్రియలు నాకు లేవోయీ !
* * *
62) నను తలచావని నీవు తెలుపకనే తెలిసే
అందమైన అనుభూతేనా అనురాగం అంటే ?
నను వలచావని నీవు చెప్పకనే చెప్పే
కనుబాసల భాషేనా కాదల్ అని అంటే ?
* * *
63) నీ వన్నమాట నన్ను ముగ్ధను చేసేసింది .
నీ చేత ఆ పైన మంత్రం వేసేసింది .
ఇలా నీ వలన మంత్రముగ్ధనైన నేను
మరణవు తంత్రాన్నైనా సులువుగ ఛేదించగలను .
* * *
64) చంద్రుని చూసిన కమలపు ఛవి తగ్గిపోవునట.
సూర్యుని చూసిన కుముదపు కళ సన్నగిల్లునట.
అవి పరస్పరశత్రువులనుట లోక ఆచారము . కాని ,
మన ప్రేమ లోకమునకు శత్రువు కావడము
ఏ సిద్ధాంతం మేరకు సబబగు ఆచారము .
* * *
65) మనసుకో తలుపుంటుందని
అది ఓ మధురమంత్రం వింటే తెరుచుకుంటుందని
ఆలస్యంగానైనా అనుభూతి చెందాను .
తలుపు తెరిపించిన నిన్నే మదిలో బంధించివేశాను .
* * *
66) నీవు లేని వేళ నా మనసు పూజ్యము
నీవు రాని వేళ నా మనికి పూజ్యము
నీవు చెంత లేక నా ఉనికి పూజ్యము
నీవుంటే చాలు ఈ పూజ్యములే పూజ్యము .
* * *
67) ఏమని ఊహించను ? ఏమి ఆశించను ?
ఊహలకు నీవే ఊపిరైనప్పుడు .
ఆశలకు నీవే ఆలంబనవైనప్పుడు
నీవు కానిదేదైనా నిన్ను కానిదేదైనా
ఏమని ఊహించను ? ఏమి ఆశించను ?
* * *
68) నీ కనుసైగల తూపుల పాలబడి
మదనుని శరాఘాతపు కైవడి
నీ పెదవుల తమకంపు సవ్వడి (ఒత్తిడి )
నిలువనీక చేర్చే నన్ను నీ ఒడి .
* * *
69) నా మనసే స్వాధీనమైన నీకు
మరి మంత్రము లేల ?
నా ఒడలు మరువజేయు నీకు
మనసిజు సాయము లేల ?
* * *
70) నీ తలపు మది తొలుపు
నీ ఊర్పు మరుతీర్పు .
నీ వలపు సురకైపు
కనుమలపు పెనుగెలుపు .
* * *
71) చూచుకమే సుఖస్థానమా ? చుంబనమే సౌఖ్యదమా ?
చూషణమే గమ్యమా ? జవ్వనమే సర్వమా ?
నా వయసు కన్నా మనసును ఓమారు చూడు
మరీ మరీ సుఖమిచ్చును మనసుంటే నీకు .
* * *
72) నేను నీకు ప్రేరకాన్ని
నీవు నాకు ఉత్ప్రేరకమవు .
మన సంయోగమే ఓ
స 'రసాయనిక చర్య' .
* * *
73) ప్రేమపిపాసినైన నన్ను
ప్రేమసుధాపానమత్తగా మలచిన నీవు
కామకాదంబరిని నేను కోరుదునేమోనని
కలనైన తలపోయుట న్యాయమా ప్రియా !
* * *
74) అణువణువూ రసస్థానం అని తెలిసేలా చేస్తూ
ఒడలంతా అలదిన నీ `అధరామృతమును
స్నానం చేయాలంటూ రంగూరుచీతావీ లేని శుష్కనీరంతో
కడిగివేయు నంతటి అవివేకినా చెప్పు ?
* * *
75) స్వప్నమున ప్రేమతపము కన్నులెదుట మారాకారసాక్షాత్కారం
తప:తీవ్రతానిదర్శనము తనివార సంద ర్శనము .
దృజ్మైధునము సద్వోఊహాగర్భము
(ఆత్మ) తుష్టి (దేహ) పుష్టి బాలక జననము .
* * *
76) నీ వీక్షణామృతము నీ గానామృతము
నీ అధరామృతము నీ ప్రేమామృతము
నీ రేతామృతము
ఈ పంచామృత సుస్నాతను నేను .
ఆ వలపు సామ్రాజ్య మూ షిక్తను నేను .
* * *
77) ఏమిటి నీ స్థితి అంటే ఏమని చెప్పను ?
మధురమగు అధరము, స్పందించు హృదయము .
సరిగమల స్వానము గలగలా పాతము
ఒక్కచో నెలకొంటే అదేగా నాకము
* * *
* * *
78) .బింబోష్టిని పక్వము గావించిన దెవరే చెలీ ?
శుకుడా ? పికుడా ? నఖుడా ?
అయ్యో ! ఎంతటి అమాయికవే చెలీ !
శుకపికనఖ సన్నిభుడగు సఖుడే !
* * *
79) నీవెందుకు నాకు దగ్గరయ్యావు ?
నేనెలా నీకు చేరువ కాగలిగాను ?
నీ లోని సంగీతవధూటిని నేనే గనుక .
నీలోని శృంగారవీటిని నేనే కనుక .
నీలోని నిజహృదయవీక్షిని నేనే గనుక
నీలోని రసకోశగవాక్షిని నేనే గనుక
* * *
* * *
80) కొండల ఔన్నత్యమును లోయల గహనత్వమును (గుహ్యత్వమును )
పీటపు మృదులత్వమును మరీమరీ స్మరియించి .
తనివార దర్శించి మురిసిపోయావు .
ఆదమరచి హాయిగా ఆ ప్రకృతి ఒడిలో
వలపుపూడోలలో మైమరచి ఊగుమా!
* * *
81) ఇంత ప్రేమ ఎద దాచుకొని
ఇంత కాలమెలా ఊర్కున్నావు ?
కాకితో కబురంపి ఉండినా నే కాదని ఉండేదానినా ?
కంటితో సూచించి ఉండినా కైవశం కాకపోయేదానినా ?
* * *
82) పూర్ణకుంభాలను ఎదురుగా ఉంచుకొని
గొంతు తడారిపోతోందని తపిస్తావు .
ఇదేమి అమాయకత్వమోయీ ప్రియా !
లేక అడగకనే అందుకోవాలన్న జాణతనమా !
* * *
83) నీవు రావడం ఓ రోజేగా ఆలస్యమౌతుందని నీ వున్నావు .
కానీ నీ నిరీక్షణలో క్షణ మొక యుగంగా గడిపే నాకు
ఆ ఆలస్యం ఎన్ని లక్షల యుగాలౌతుందో చూడు
ఇప్పుడు చెప్పు నేనా నిరీక్షణ భరించగలనా ?
* * *
84) నా గుండెసడి నీకు వినబడుతోందా ?అన్నావు .
వినడానికి ఆ సడి తెలిసిన నా గుండె సలు పనిచేస్తూంటే కదా !
నీ గొంతు నా చెవిలో వినబడగానే
మిగిలిన అవయవాలన్నీ మాయమై
ఒడలంతా చెవి అయిపొయింది .
* * *
85) దారీతెన్నూ లేని కష్టాల కడలిలో దీపస్తంభం నీవు .
గాఢనిబిడాంధకార దుర్గమ కాననాన వెల్గు చుక్కవు నీవు .
రాల్ పగులు రోహిణీ కార్తెలో నీవు ఘననీల అంబుదమువు.
రాజీ పది బ్రతికే యాంత్రిక జీవనాన నీవు రసరమ్య అనుభూతివి .
* * *
86) నీ తోటి నెయ్యం కాదనిపిస్తోంది నూతనం .
నీతో మాటాడినా నీతో అడుగేసినా
ఇంతకు ముందెపుడో అది జరిగినట్టి జ్ఞాపకం .
అందుకే ఈ బంధం కాదోయీ నూతనం అనునిత్యనూతనం .
* * *
87) నేనెలా వ్రాయను నీ ఈ పాటలను
అడుగడుగున నీ తలపే అడ్డు వస్తుంటే
* * *
పల్లవి
శ్రీకరుడౌ శ్రీనివాసుని కథ శ్రావ్యముగా
చెప్పెద వినుడీ !
విన్నంత మాత్రమునే కన్నంత ఫలితము .
జన్మసాఫల్యము .ముక్తిసోపానము .
చరణం
కలిలోన జనులను కనికరించగా
ఇల చేరదలచిన విష్ణుమూర్తిని
ఆమె కొరకు అడలుచూ హరి శేషగిరి చేరెను .
చరణం
ఆట ఆదివరాహుడు అనుమతింపగా
వకుళాంబ పుత్రుడై వెలుగొందుచూ
పద్మావతీదేవిని తన సతిగా పొందెను .
సవతుల పోరుకు వెరచి తను శిలయై పోయెను .
చరణం
కలికాలపు కల్మషమున క్రుంగిపోవుచూ
అలమటించు జనులీ కథ విన్న చాలును .
సాక్షాత్తూ విష్ణుడైన ఆ వేంకటేశుడు
సకలసంపదల నిచ్చి చల్లగా బ్రోచును .
11
బాల్యము అంటే చక్కనైన చిరునవ్వుల పూదోట
బాల్యము అంటే భవితకు వేసే బంగారుబాట .
నేడు ప్రమతో విరిసిన మొగ్గాలే
రేపు ఇచ్చును తీపిఫలాలు .
బలవంతంగా విచ్చదీస్తే
వెదజల్లలేవు పరిమళాలు .
చరణం
పిట్ట కొంచము మోత ఘనము ఒక వైపు
తెలుగు కోయిలల పరభాషే పలకమని
దారుణపీడనము మరోవైపు .
చదువుల పరువా ? గాడిద బరువా ?
పుట్టుక కన్నా మొండె పేరు పెట్టుట కన్నా ముందే
బిడ్డకు నిర్ణయమయ్యే పట్టా !
విజ్ఞానపు గోమ్దేలపై సంపాదనా కాంక్ష
మోదుతూ ఉన్న సమ్మెట.
చరణం
ఎంత చెట్టుకు అంత గాలి అని మరచి .
కడుపారా తినడం లేదని ఏడ్వాల్సిన తల్లులే
తనివారే ర్యాంక్ లేదని వగచితే -----
ఆటలు కరువై , మనసులు బరువై
తల్లిదండ్రుల ప్రేమ , తాతాఅవ్వల లాలన
బాల్యాన్ని అలరించిన నాటి కథ
ఒంటరిగా కుమిలె నేటి పిల్లలకు
కన్నుల కార్పించే కన్నీటివ్యథ.
చరణం
కన్నపిల్లలను యాత్రాలుగా చేయకండి .
చదువంటే చాకిరీ అనే ఊహా రానీకండి .
ఆటక్లు పాటలు కలిసినదే చదువు .
మార్కుల ఛత్రం ప్రతిభకు( ప్రగతికి ) అడ్డం .
బహుముఖ ప్రజ్ఞాపాటవం , వినయం కలిగిన సంస్కారం
కలగలిసిన పౌరులను ఇచ్చే బాధ్యత .
దేశప్రజలుగా దేశానికి తల్లిదండ్రులు చూపే కృతజ్ఞత .
12
సేవాభావం , సహనం ఆమె ప్రేమస్వాశ .
అమ్మలగన్నయమ్మ మదర్ థెరిస్సా అమ్మా !
ప్రాణమె పాలుగా జన్మమె అన్నముగా
దీనుల పోషించిన భారతరత్నమమా !
చరణం
భారతమాతే రూపము దాల్చి తన పిల్లల దరిచేరినది .
అక్కున చేర్చి వారందరి కష్టాలు తనవని అన్నది .
కోరిక లెరుగని కన్యకగా వారికి అంకితమైనది .
భారతరత్నమైన భారతి మదర్ థెరిస్సా ధన్యగాథ ఇది.
చరణం
అడగందే అమ్మైనా పెట్టని ఆకలిలోకంలో !
అడుగడుగునా ఆపన్నుల కందగాకనే అన్న విరచ్చి వేదన తీర్చి
కన్నెమాత అయిన మదర్ థెరిస్సా !
ఎల్లలేని ప్రేమకు ఈమే ఓ మణిపూస .
(కు ఈమే ఆగనిస్వాశ )
13
పల్లవి
బొజ్జలోనే నీవు భద్రముగా బజ్జోని ఆటలాడించేవులే !
బుజ్జినాన్నా ! నీవు బయటి కొచ్చావంటె పట్ట శక్యము కావులే !
చరణం
అల్లరీ నా తండ్రీ ! నిన్ను చూడగ నాకు అమిత కోరిక కలుగురా !
నాదు నోములపంట ! మీ నాన్న నీ కొరకు బొమ్మలను కొని తెచ్చెరా !
చరణం
నన్ను తల్లిని చేసి ధన్యనే చేసేటి నా చిట్టిబాబువేరా !
మీ నాన్న పోలికతో నన్ను అలరింపగా అవతరించేవు లేరా !
చరణం
అమ్మమ్మ నీ కొరకు ఆశతో చూచెను , చల్లని జాబిల్లి రా !
మామలను ఆడించు మగతమితో అలరారు అగ్రగణ్యుడ వేనురా !
14
పల్లవి
మూగవోయిన నా హృదిలో ఏల ఈవేళ కలకాలము
మనసు పొరలలో మోడుపారిస ఊహల కొచ్చే పరిమళము .
చరణం
అంతులేని అవని వలెను , అదుపులేని సంద్రము వలెను
అంతరాళ మంతయు నిండి , అణువణువున చేతన నింపి
చరణం
ఆకాశమును అంటుతున్నా ఆనందము ఇది అందునా !
ఆవధెరుంగని ఏ సంతోషపు సూచనో అని తలవనా !
చరణం
ఇంతవరకు అలసినటుల విశ్రమించిన ఈ మనసుకు
ఒక్క లిస్తలో ఎందుకో మరి ఇంత అలజడి ఎవరికీ తెలుసు ?
15
పల్లవి
సన్నజాజి పువ్వులా , తెలివేన్నెల రేయిరా
వికసించి , విరబూసి హాయిగా నవ్వవే !
చరణం
ఎదనాపి , మధురోహల డోలల నూపి ,
ఆనందపు టంచుల నను చేర్చేనులే!
చరణం
సింగారే ! నీ ముద్దు చెక్కిలి చిదిమి
స్రవించే సుధాలనే సేవిన్చనా !
వయ్యారే ! నును వెచ్చని కౌగిట జేర్చి ,
వలపుల విరితితల నిను విహరింపజేయనా !
16
పల్లవి
అతివ , మగువ, లలన ముదిత , నెలత , సుదతి , పడతి , నవల .
పిలుపు వేరువేరైనా పలు రకాల పలుకైనా
మమత పంచి మురిసేది , మనసు తెలిసి మసలేది .
చరణం
తల్లియైన చేల్లియైన చెలిమి చిల్కు చెలియైన
కూతురైన , కోడలైన గృహము నిల్పు ప్రేముడి
సర్దుబాటు గునములో చక్కదిద్దుతనములో
ప్రథమస్థాన మొందేదీ , అగ్రపూజ నందేదీ
చరణం
సృష్టియన్న తానుగా , స్వాభిమాన సహితగా
సర్వతంత్ర సమర్థగా సాటిలేని చతురత
సంఘకార్య నిర్వహణలో , సమరసత్వ సాధనలో
చారుశీల , శుభదహేల సహజభావ భరిత (వనిత )
17
పల్లవి
కదు నిరుపేదను నేను - నవనిధివై వచ్చితీవు .
నా జీవన పథములోన నిలిచినా పెన్నిధి నీవు .
చరణం
క్షుధా త్రుషార్తనైన నాకు - మృష్టభోజ్య మయ్యావు
చావులేరుగని నా బ్రతుకున షడ్రసముల కురిశావు .
చరణం
సిరులేవీ లేని నాకు - శాంతియైన లేని నాకు
నిలింపశాభివై వచ్చి - సౌభాగ్యము కూర్చావు
చరణం
తరణియు ఛాయల వోలె -పున్నమి చంద్రుడు వోలె
మన ఇరువురి సంగమం - లలిత ఖావ భరితం
"శ్రీవారికి అంకితం "
18
పల్లవి
కాశ్మీరు చీరకట్టి , కారంచేడు మాలు పెట్టి
కన్యా కుమారిలా నీవు కన్తబడుతుంటే ,
కావాలని అంటుంది కాని మనసు - మా కాని వయసు .
చరణం
కళ్ళు కదిపితే చాలు కలకలమని పొంగు కళలు
కాలు మెదిపితే చాలు జలజలమని జారు సొగసు
ఆ కళ్ళు , ఈ కాళ్ళూ కలిపి కదిపినామంటే ,
ఆగలేనంటుంది కాని మనసు - మా కాని వయసు
చరణం
కావి చీర రంగంలో - కసిగా రేగు పొంగులో
కోనసీమ కొబ్బరుంది - రాయలసీమ రాగముంది .
రావే నా చిన్నదానా ! రాయంచల నడకదానా !
రారమ్మని పిలుస్తుంది కాని మనసు మాకాని వయసు
19
పల్లవి
ఇంత మాత్రానికా ఈ మిడిసిపాటు
ఎందుకోయీ నీకు ఈ అడరుపాటు
చరణం
సర్వము నీవే యని , అంతయూ నీదే యని
అంతరంగంబున అతిశయించేవు .
కోర్కెల కోతలు కూలిపోయెడి వేళ
కాసింత నిలకడగ కాలూని చూడు .
చరణం
ఆశయాలని అంటూ , ఆదర్శ మనుకొంటూ
వెర్రికోరికలతో విర్ర వీగేవు .
తెలుసుకోన లేరులే నీ మనసు ఎవ్వరూ
ఎంత కాలము ఈ ఎదురీత చాలు .
20
పల్లవి
ఆడు కొనే సమయం
ఇది ఆటలు ఆడుకొనే సమయం
మది పాటలు పాడుకొనే సమయం .
చరణం
చల్లనైన పిల్లగాలులు - చక్కని పువ్వుల పరిమళాలు
సాయంత్రపు ఈ సోయగమ్మలో స్నేహితులంతా సంతోషముగా .
చరణం
శారీరకపు పరిశ్రమలతో - మానసికపు ఉల్లాసం కలిపి
మానవునే ఆరోగ్యవంతునిగా మలచే చక్కని సాధనం .
చరణం
అలసిన వేళల అమ్మ ఒడి ఇది
విసిగిన వేళల విశ్రాంతి గది
ధనవంతినికి , పేదవానికి అందరికీ ఇది తరగని పెన్నిధి .
21
పల్లవి
మరువలేనోయీ ప్రియా ! - మరువలేనోయీ
మదిలోన నీ రూపు మాసిపోదోయీ !
చరణం
మైమరపిలే మిగిలె , మనససలె పలుకదాయే
ఆవేదనే నాకు ఆలాపనాయె
అనుభూతి కాలయమై ! అనురాగ నిలయమై
ఆకాశ సుమములకై ఆశగా చూచే నే
చరణం
అంతరంగుడవంచు , ఆత్మీయుడవతంచు
అర్పణము చేసితిని నా హృదయసుమము
నీ తీవ్ర తిరస్క్రుతిని కటిన నిర్ధయాసి
విడనాడి చల్లగా నన్నేలు కోరా
22
పల్లవి
చరణం
నే చూడలేదని చూచే నీ చూపులు
విశితూపులు అవీ మరుని ములుకులు
చూచియూ చూడనట్లు నటియిచే చూపులు
ఎదలోతులలో తగిలే మెత్తని సుమశరములు
చరణం
కవ్వించి అమాయకతను చిందించే చూపులు
కడదాకా నా మదిలో మెదిలేటీ తలపులు
రారమ్మని పిలిచే నీ మత్తైన చూపులు
ఏనాటికి నాకు సాదర ఆహ్వానాలు
చరణం
రాజీవలోచానములు వెదజల్లే చూపులు
రాకాశశాంకుని కౌముదీ జల్లులు
23
పల్లవి
నీవు లేని జీవనము నే కోరను ఏ క్షణము
నీ తలపున బ్రతుకుటయే నా మది కానందము .
చరణం
నీ వలపూ , నీ తలపూ నా మనసుకు మోదమొసగు .
ఎదురెదురుగా క్షణమైనా ఆ రసానుభూతి చాలు
చరణం
లేవోయీ దురాశలూ , కోరను ఏ వరములూ
నువ్వు మ్రోయించిన మురలిపై అపశ్రుతి పలికింపకుమా!
బెలిడైన ఈ గుండియ ఒర్వదోయీ ప్రియతమా !
24
పల్లవి
దీపావళి పండుగ వచ్చింది -
చల్లని దీవెనలెన్నో లేచ్చింది .
చరణం
బాపూ బొమ్మలాంటి అక్కకు
చక్కని బావను తెచ్చింది.
మిలమిలలాడే అక్క కనులలో
ముసిముసి నవ్వులు నవ్వింది
చరణం
ఎన్నో చాడువులుచాదివిన అన్నకు
మంచి ఉద్యోగ మిచ్చింది .
ఆనందంతో మురుసిన ఇంట్లో
కలకలకలమని నవ్వింది
చరణం
పట్టు పావడా లడ్డూ మిట్టాయి
ఎన్నో ఎన్నో తెచ్చింది .
అన్నీ చూచి హాయిగా నవ్వే
చెల్లి గుండెలో విరిసింది
25
పల్లవి
అందాల నా రాజా ! చందురుని సరిజోడా !
రావోయి ఈ వేళ నన్ను కూడగా !
చరణం
చల్లనైన పిల్లగాలి సాపత్వుమల నెరుపగా
నిరాదరుడు రాతీవిభుడు నీ సరిజోడాయెరా!
చరణం
రమ్యహర్మ్య వాటికలో ధార్యాణిగ నిలిచినా
నీ గాటపు కౌగిటిలో తమితీరగ శయనించెద!
చరణం
వేచివేచి వేసారిన నీ చెలి నుదికిం పకురా
సమైక్యం
పల్లవి
తెలుగు తల్లి పిలుపు వినలేరా
జాతిమేలుకోలుపు ఇది లేయరా
తెలుగు గౌరవాన్ని నిలుపుమురా
తెలుగు వాడి వాడి చూపుమురా
చరణం
తెలుగు లంటే ప్రపంచాన ఖ్యాతికన్న జాతిరా
రంగము ఏదైనా విద్యలు ఏవైనా ముందుండును తెలుగు వారి అడుగేర
సాటిగా వేరు ఎవరు లేరనే రీతిగా జగతిని చాటర
మేటిగా అగ్రరాజ్యమందు పట్టు సాధించి
సూటిగా విజయ శంఖమూదెను మన జాతిరా .
చరణం
తెలుగు బాషే ఇన్నినాలుగా మానని కలిపి ఒకటిగా ఉంచేనురా
ఒకే తల్లి బిడ్డలందరూ కలిసి ఉంటే అందమురా
నాలుగు వెళ్ళళో ఏవేలు బలమెంతో పిడికిలిగా ఉంటే తెలియదురా
వీరుగా విడిపోయినంతనే దుర్బలమైపోవు తెలుగు జాతిరా
నదీ తీరాలు - ప్రేమ సారాలు
పల్లవి
HE:నదీ తీరాలూ - ప్రేమ సారాలు
ప్రణయ కావ్యాల నవ్యనగరాలు
SHE:నీటి కెరటాలు - రాగ భారితాలు
అంభరాన్నంటు వలపు శిఖరాలు .
HE:క్షీరమథనాలు - కామ కదనాలు .
SHE:సౌఖ్యసదనాలు -లౌఖ్యజతనాలు .
చరణం -1
HE:రాధ విరహాలు - వంశి గమకాలూ
మాధవుని సరసకేళి మురిపాలు
SHE:గోపి సమయాలు -తీపి తమకాలు
విరహలోకముకు తాపహరణాలు
HE:భావభవనాలు - రాసరతనాలు
SHE:ప్రేమ చరిత కివి చలువ సాక్షాలు
చరణం-2
HE:చలనచోద్యాలు -అమృతచోష్యాలు
చెలిమి సంధించు చిలిపి దౌత్యాలు .
SHE:కలల సారాలు కథల హారాలు
కామినీ కదన మదన భాష్యాలు
HE:అతను మంత్రాలు -సుఖద తంత్రాలు
SHE:సరససామ్రాజ్య సుజయ ధ్వానాలు
HE:అలలు అలలు అలలు
నీ ఒళ్ళంత అందము అలలు
నను ఉక్కిరి బిక్కిరి చేసే వలలు
ఎటూ తప్పుకు పోలేవు నా కనులు .
SHE:కథలు కథలు కథలు
నువు చెప్పకు తుంటరి కథలు
నను నిద్దురపోనీవు కమ్మని కలలు
హద్దుకు ఆగవు తీపి వలపులు .
చరణం -1
HE:చేపలా మారి సొగసులో నన్ను లోతుగా ఈదనీ !
ఓడలు తేలి వయసునే నన్ను హాయిగా దాటనీ !
SHE:పాపలా నీలి కనులలో దాగి కాపురం చేయనీ !
నీడలా మారి నిలకడే ఉన్న తోడుగా ఉండనీ !
HE:పరాగాల పూదోటల్లో మరే నీవు మా రాణే!
SHE:సరాగాల సయ్యాటల్లో సరే నీవు దొరవలె !
చెట్టు మీద
పల్లవి
చెట్టు మీద పిట్టాకటుంది .
కట్టు దాటి రానంటుంది .
కన్ను పడ్డ వాళ్ళంతా కాదూ పోపొమ్మంటుంది .
పట్టే దమ్మే ఉంటే పిట్టే నీదాతుంది .
నీదే ! నీదే ! నీదే ! నీదే !
చరణం - 1
చురచుర చూపుల్ది - నెరనెర వన్నెల్ది .
పకపక నవ్విందా కసాబిసా ఔతోంది .
చూశావా రేతిరంత కలలతో తెల్లార్తుంది .
మా టక్కులమారిది - హైతెక్కుల (చిన్నది)(పోకుది).
హయ్యా !హయ్యా ! హయ్యా !హయ్యా !
చరణం-2
కోడేజట్టు విరుగన్ది . కావాలన్నా దొరకన్ది .
కాకలు తీరినవాళ్ళనే కంగారు పెడుతుంది .
కోరావా కవ్విస్తూ కళ్ళల్లో ఉంటుంది .
చిత్రాంగి చెల్లి ఇది . చిత్రంగా చిక్కింది .
భలే !భలే !భలే !భలే !
చరణం-3
భలేభలేగూటిది. బడాయి చాలంటిది .
బడాచాబులకైనా బెబ్బెబ్బే అంటుంది .
ఏ మ్మాయలు చేశావో నీదే మనసన్నది .
చెట్టెక్కి చేరుకో ! స్వర్గాన్నే అందుకే !
ఛలో !ఛలో !ఛలో !ఛలో !
వెన్నెలమ్మా! వెన్నెలమ్మా !
పల్లవి
HE:వెన్నెలమ్మా ! వెన్నెలమ్మా !
మల్లెనవ్వే నవ్వవమ్మా !
అల్లరమ్మా ! అల్లరమ్మా !
అంతదూరం ఎందుకమ్మా!
SHE:కోయిలమ్మా ! కోయిలమ్మా !
కొత్తరాగం ఏమిటమ్మా!
ఆగవమ్మా !ఆగవమ్మా !
హద్దు ఎంతో ముద్దులేమ్మా !
HE:మనసుకు ఏవేవో కొత్త చివురులు
SHE:వయసును వేధించే తీపి బరువులు
HE:అటు చూడు - మన కోసం
ఆసలు వేసిన మోసాలు -ఊహలు వూచిన ఊసులు
చరణం-1
HE:మనసను తోటలో విరిసిన పాటలే
పెదవుల నుండి తేనెజల్లు లాగ జారేనమ్మా !
SHE:పెదవుల మధువుతో తడిసిన మాటలే !
మనసునులకున్న తీపి ఊపులేమొ చెప్పేనమ్మా !
HE:మురిపెము తెలిపిలే - మది కథ తెలిసెలే !
SHE:అలజడి ముగిసెలే -విరజడి కురిసెలే 1
HE:నీవే నేనై పోయే భావావేశంలో
నేనే నీలో నిండే ప్రేమావేశంలో !
చరణం-2
SHE:సగమగు వేడుక సరసము మీరగా
సుఖపడమంటు నిన్ను నన్ను చేరపిలిచేనమ్మా !
HE:గడసరికోరొక సోగాసరిబాలికా !
తెలిపిన జానథానము జంట ఎదను తదిమేనమ్మా !
SHE:హృదయము పలికిలే! అధరము వణికిలే!
HE:మధుపము పిలిచిలే -మధువని విరిసెలే!
SHE:పొంగే అలలే నింగే తాకే వేళల్లో
సాగే నదులే సంద్రం చేరే ప్రేమల్లో .
మనసులో పువ్వులా
పల్లవి
మనసులో పువ్వులా విరిసిన తొలి కోరిక
పెదవిపై మెదిలెగ చందమామే సాక్షిగా !
చురుకు చూపులు సిగ్గుతో సోలేనెందుకో !
పడునుమాటే తడుములాటై ఆగెనెందుకో !
చలో మన్మధా !కథే కొత్తదా !
హలో పయ్యెద ! మరీ ఇంతిదా ?
చరణం-1
చిలిపి చందురుడే మండే సూరీడై తాకే .
పరుపు నలిగే కునుకు మాత్రం కంటికి రాదే
తలగాడైనా తాపమసలు తీర్చనే లేదె !
నిదురొద్దని మనసు మారాం చేసె ఈ రోజే !
చలో మన్మధా !కథే కొత్తదా !
హలో పయ్యెద ! మరీ ఇంతిదా !
చరణం-2
చలిని చెమటలే పోసే వింతెదురాయె !
ఎండా వెన్నెల చలువలిచ్చే ముచ్చటలాయె !
ఎందరున్నా ఎవరెదురుగ లేరనే తోచె !
మునుపెరుగని ఎరుపు బుగ్గను గారమే చేసె.
చలో మన్మధా !కథే కొత్తదా !
హలో పయ్యెద ! మరీ ఇంతిదా ?
మనవే వినవా ?
పల్లవి
HE:మనవే వినవా ? దయనే కనవా?
ఇది ఏకాంత సేవా ! ఎదలో కాంతవేగా !
చెలి వన్నె చిన్నెల్తో సరి కొత్తగా వెళ్ళు ఓ వెన్నెలా !
తన కోపమే నీవు చల్లార్చితే చాలులే చల్లగా!
చిరు అలకలు నా కొదిలెయ్యి .
అను తాపాలు నా పాలు చెయ్యి .
చరణం -1
HE:చేత ఉండి ఈ విరహ మోపలేనే !
ఈ చింత ఏల ఆ కాంతు తంతిదేనే !
SHE:వింతగుంది ఈ సరస మాగలేనే!
నా పంథా మీక ఆవంత ఆపలేనే !
HE: పగతీర్చి తెగటార్చు వయసు ఓపికను నలిపిన చిరుచలిని .
SHE:చెమటోడ్చి పరిమార్చు చెలియచేతలను చెణికిన మరుగులిని .
HE:పరువాలవాడలో
SHE:పరదాలమేడలో
SHE:మురియాద చేయమని
మరుడు మారుడు వేడుకొను వేళలలో- - - - -
చరణం-2
SHE:తనువు లేని ఆ మదను డెంత పదునో !
ఓ కునుకు కూడా కరువైన వైనము విను
HE:మనసు లేని జాబిల్లి చెలివో ఏమో !
నీ సొగసు వెన్నెలలు నన్ను కాల్చు నిజము .
SHE:ఒడి చేర్చి ,మరి పేర్చి పడక నోదార్చి వెడలెను మలయజము .
HE: నిట్టూర్చి ,నీర్కార్చి పడక ఊరార్చి మారలేను అంబుదము .
SHE:సరసాల బాటలో
HE:సురసాల తోటలో
SHE:తనివార గ్రోలమని తపనలో
తడుము తీరులలో .
ఔనా!నిజమేనా?
పల్లవి
HE&SHE:ఔనా!నిజమేనా?నేను - - నేనేనా ?
ఆ కన్నులు కథలను తెలిపేనా
నా మనసుకు ఆ కథ తెలిసేనా
HE:ఆ అమ్మడి అందం చలువేనా ?
SHE:ఇది జన్మలు దాటిన చెలిమేనా?
చరణం-1
SHE:ఆకాశం పందిరిగా హారాలే తళుకులుగా
నన్ను మెచ్చేవాడు ఏనాడు వస్తాడో !
HE:నా మదే వేదికగా ప్రేమనే వేడుకగా
అందజెయ్యాలంటే ఎంత వేచుండాలో !
SHE:మరి ఎగిరే పైటకు నిలుపెపుడో !
చలి ముసిరే రేయికి దడుపెపుడో !
HE: ఎద అడిగే ముచ్చట ముడి ఎపుడో !
జత పలికే వయసుల నది ఎపుడో !
SHE:ఆగలేక వేగలేక ఓపలేక చూపలేఖ
HE:రాయగోరు ఈడుపోరు తోడుకోరు కుర్రజోరు
SHE:వింత వింత తెలిసేనా ?
వయసింత వంపులు తిరిగేనా ?
చరణం-2
HE:వయసిదిగో నచ్చింది . నీ కొరకు వేచింది .
నిన్ను చేరేదాక నిదుర రాదే అంది.
SHE:ఊహ తెలిసిననాడే నిన్ను తనవాడంది .
ఊసు కలిగిననాడే నీకు అది తెలిపింది .
HE:ఈ దొరకని పరుగుకు సరి ఎపుడో !
నే దొరతనముగా ముడి పాడుటెపుడో!
SHE:నీ చిరు చిరు అలాకకు బదులెపుడో !
ఈ చిరు పరిచయముకు మలుపెపుడో !
HE: ఎప్పుడమ్మా అంపకాలు - అత్త ఇంట జాగరాలు
SHE:ఇంక కాస్త ఆగుచాలు - చిన్నదొచ్చి ఒళ్ళోవాలు .
HE:సందె వాలితే శెలవేనా ?
ఇక రాతిరంతా కలలేనా ?
ఆ !ఆకాసంలో
పల్లవి
HE:ఆ !ఆకాసంలో నీలిమేఘంలో దోబూచులాడకే సింగారీ !
SHE:ఏకాంతంలో కన్నె హృదయంతో సయ్యాటలాడకో బ్రహ్మచారీ !
HE:శ్రావణమాసం వచ్చింది . మంచి ముహూర్తం తెచ్చింది
సందడి ఏదో చేద్దాం రమ్మంది .
SHE:మంగళమంత్రం పలికింది . మల్లెలమాసం విరిసింది .
మంజులనాదం ముందుగ మ్రోగింది .
చరణం-1
HE:పచ్చని ఆకులు వెచ్చగ పిలిచాయి .
SHE:ఎందుకని ? ఏ విందుకని
HE:విచ్చిన పువ్వులు మత్తుగా పలికాయి .
SHE:ఏమిటని? ఏం చెయ్యమని
HE:తోరణమే కట్టేసే తరుణం వచ్చిందని .
మాలగ మన మెళ్ళో మురిసే మోజే పుట్టిందని . `
SHE:మాధవికే మావిడికే తరగని బంధమని .
ఆ జతలా విడకుండా మనలను బతకమని .
SHE:ఈ పసుపుకుంకుమతో
HE:పదికాలాలూ చల్లగ ఉండమని .
ఇదుగో
ఇదుగిదుగో ఓ మాట .
ఇన్నినాళ్ళు తెలియలేని
ఎపుడూ నా కెదురుకాని
ఓ తియ్యని చెలగాట .
నీకే చెప్పాలా మాట .
చరణం-1
నిద్దురపోయే కలువల కన్నుల
మెత్తగ తాకి మేల్కొలిపి .
కలలిట్లా ఉంటాయని అంటూ
పులకలు రేపిన ఆ మాట .
హద్దులు చాలు - పొద్దులు లేవు .
వయసుకు వయసొచ్చిందంటూ
పరుగును నడకగా నవ్వును సిగ్గుగ
మలచిన ఆ అల్లరిమాట .
నా చెలియ
పల్లవి
నా చెలియా చిరునవ్వు
ఎలమావి తొలిపువ్వు .
ఆ కలికి కొనసిగ్గు
సుమబాణముకు నిగ్గు .
అనుపల్లవి
బాంధవ్యమే నేరుప
మదనుడే తలచెనో !
తన విల్లు జడలాగ
కాన్కగా పంపెనో !
చరణం
తన సాటి చెలియగా తలపోసి భయమొంది ,
మాత్సర్యమున రగిలి రతి ఎంతో దిగులోందె .
తన పతిని శంకరుడు ఆశరీరునిగ చేయ
బెంగ తీరెను సఖియ సొగసు వర్ణనలేల ?
అదిరందయ్యా అదిరింది
పల్లవి
HE:అదిరందయ్యో అదిరింది అదిరింది .
SHE:అదిరింది అదిరిందయ్యో అదిరింది .
HE:ఈ అమ్మడి అందంలోని హిటెక్కంతా అదిరింది .
SHE:ఈ పిల్లడి కళ్ళల్లోని వెల్ కమ్ ఇంకా అదిరింది .
HE: చూపులతో చూపులు కలిపే ఎంజాయ్ మెంటే అదిరింది .
SHE:మాటలకు మాటలు విసిరే మాజిక్ లవ్వే అదిరింది .
HE: సయ్యంటే సయ్యంటున్న సుందరి స్టైలే అదిరింది .
చరణం-1
HE:కంగారుకు జోరుగ జారే జార్జెట్ పైటే అదిరింది .
SHE:సింగారికి సైటే కొట్టే రేబాన్ గ్లాసు అదిరింది .
HE: కప్పేసి కొత్తగ చూపే మోడ్రన్ డ్రస్సే అదిరింది .
SHE:టక్కెసి లైనుకు లాగే కౌబాయ్ సూటే అదిరింది .
HE: చలిగాలికి గజగజలాడే లేడీ వేడి అదిరింది .
SHE:చెలిగాలికి తహతహలాడే ఐరన్ బాడీ అదిరింది .
HE: నిద్దురకు గూడ్బై పలికిన ఈ గుడ్ నైటు అదిరింది .
SHE:తద్ధినక తాళం వేసే లేటెస్ట్ ట్రెండు అదిరింది .
HE: ఇమ్మంటే ఈనంటూ మన ఇద్దరి ఈ లవ్ గేము అదిరింది .
చరణం -2
HE:ఉన్నానా లేనా అంటూ ఊగే నడుమే అదిరింది .
SHE:తాకాలా వద్దా అన్న తడబాతబ్బా ! అదిరింది .
HE:బ్రేకులతో షేకులతో డాన్సింగ్ ఆహా!అదిరింది .
SHE:జోకులతో కేకలతో ఔటింగ్ ఓహో!అదిరింది .
HE: సరదాగా సరసకు వస్తే బ్యూటీ బాబో ! అదిరింది .
SHE:దొరలాగా దోచుకుపోను నాటీ ప్లానింగ్ అదిరింది .
HE:మజునూలా మార్చేస్తున్న లైలా లాఫింగ్ అదిరింది .
SHE:గజినీలా అలుపే లేని నీ ట్రైయ్యింగు అదిరింది .
HE:రమ్మంటే రానన్తో నులివెచ్చని రొమాన్సు మస్తు అదిరింది .
హలో!హలో!
పల్లవి
హలో!హలో!ఓ హబీబీ !
కొత్త ఆవకాయలాంటి పిల్ల నీ డబ్బీ !
కాస్త ఆగు షరాబీ ! పక్క నుండి జిలేబీ !
చెయ్యబోతివా లూటీ ! దొరకబోదు బ్యూటీ !
చరణం-1
థెల్లగుర్రమ్ ఎక్కిస్తాను చీకట్లో
స్వర్గమంటె నీకు నేను చూపిస్తాను కౌగిట్లో
ఇక నో ఫియర్స్ మైడియర్ !
ట్వంటీ ఫొరవర్స్ బీ నియర్ !
దే అండ్ నైటు జల్సా చేస్కో ఓ మాన్లీ లవెండర్
సూపర్ మాన్లా చెలరేగావో నేనే నీకు సరెండర్ .
చరణం-2
బెస్ట్ క్లాసు బొంబాయ్ బాబీ నా ఫిగరు .
టెస్ట్ డోసు ఇస్తే చాలు కిక్కిస్తుంది నా పవరు .
ఇక బే ఫికర్ బెంజిమన్ !
ఒళ్ళో భలే అంజుమన్ !
లవ్ పాటాలు నేర్పిస్తాను ఇచ్చుకో నీ బయానా !
ఫ్రీడంలోన ఈడంలోన నేనే లేరా డయానా!
నిన్న నేడు
పల్లవి
బజ్జోమ్మా బుద్ధిగ ఉండమ్మా !
సన్నాయ్ మ్రోగానీ ! సందడి రేగనీ !
చరణం -1
HE:కలలు కనీకనీకనీ కైపెక్కిపోతోంది .
వినను అనీ అనీ అనీ నా ఈడు అంటోంది .
SHE:పిలవకనీ అనీ అనీ విసుగెత్తిపోతోంది .
సమయమనీ అనీ అనీ నీ ముందు ఒకటుంది .
HE:వైటింగుకు అంతున్నదీ
డేటింగులు ఎపుడన్నది .
SHE:ఆ మాటే వద్దన్నదీ !
అది సరదా కాదన్నది .
HE:చక్కనిచుక్కను పక్కన పెట్టి
కళ్ళకు గంతలు కట్టకు పట్టీ!
SHE:ఎక్కకు కోర్కెలు గుర్రము జెట్టీ
ఇమ్మని వద్దని మనలో పోటీ !
చరణం-2
SHE:చిలిపితనం మరీ మరీ కనుసైగ చేస్తోంది .
కలికిగుణం అరె అరె కంగారు పడ్తోంది .
HE:సొగసు సరీసరీసరీ కనికట్టు చేస్తోంది .
వయసు అదీ ఇదీ అనీ నసపెట్టి చస్తోంది .
SHE:గుప్పిట్లో గుట్టున్నది .
గుండెల్లో గుబులున్నది .
HE:మాటలతో తీరందది
చేతలకు చెయ్యాలి శృతి .
SHE:చాటుకు రమ్మని పిలువకు మళ్ళీ
వేటకు వేళిది కాదురా అబ్బీ !
HE:మాటకు తీయని తేనెలు అద్ది
ఆటకు తీరిక లేదనకమ్మీ !
హరేరామ హరేరామ
పల్లవి
HE: హరేరామ హరేరామ రామ రామ హరే హరే !
హలోభామ హలోభామ భామ సోకు భలే భలే !
(అలా) అలకతో చూసినా , అల్లరే చేసినా!
SHE:హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే !
చలో కన్న చలో కన్నా చిక్కనయ్య మరే మరే !
(ఇలా)స్త్రోత్రమే చేసినా , సాగిలే ,మొక్కినా !
చరణం -1
HE:ముందు నుండి మగాళ్ళంతా దేవీ (భామ)దాసులే !
కాదంటే అయ్యారు దేవదాసులే !
SHE:తెలుసునండి ముందరంతా పాదదాసులే !
పడ్డామా ఔతారు మాకు బాసులే !
HE:ఆ రాముణ్ణి చూడు -మా కృష్ణున్ని చూడు .
రఘు రాముణ్ణి చూడు -శ్రీ కృష్ణున్ని చూడు .
SHE:ఆ(! వనవాసం పంపాడు - వీధిముద్దు మరిగాడు .
ఆ కథలన్నీ చెప్పి ,మస్కా లిక కొట్టలేరు .
చరణం-2
SHE:సగభాగం మాకిచ్చి మీలో ఒకరు
మా నెత్తిన పెట్టారు ఇంకో ఫిగరు .
HE:కథలను వదిలెయ్ డం ఎంతో బెటరు .
ఈ రోజులు చెరిసగమని తెచ్చాయ్ కబురు .
SHE:ఇది నమ్మేందుకు వీల్లేదు -చరిత్ర సాక్ష్యము లేదు .
నమ్మేందుకు వీల్లేదు - ఏ చరిత్ర సాక్ష్యము లేదు .
HE:అ చరిత్రలో చిక్కనిది - నా ప్రేమే చిక్కనిది .
నే లవ్ బర్డ్ లా నీ కోసం ప్రాణాలిస్తా చూడు .
ఏదో ఏదో
పల్లవి
ఏదో ఏదో జరిగింది
నాలో ఏదో ఔతోంది .
ఆ నవ్వు మహిమేమిటో ?
ఆ చూపు చొరవేమిటో ?
వేరే ధ్యాసే రానంది .
చరణం
గాలిలో తన గుసగుసలే !
పూలలో తన ఘుమఘుమలే !
ఏమ్మాయ చేసిందో -------
ఏమ్మత్తు చల్లిందో -------
తన మాట కూడ ఆ తేనె కన్నా మధురం .
తన కంటపడని క్షణమైనా నాకు విరహం .
దాగుడుమూతల ఈ అనుబంధం.
సగమై నిలిచే సంబంధం .
చరణం
పాటలా తన రుసరుసలే !
ఆటలా తన విసవిసలే !
వెంటాడుతున్నాయే ----
నను లాగుతున్నాయే----
తన చూపు నన్ను రారమ్మనంటూ పిలిచిందే !
తన కొంగు నన్ను కవ్విస్తూ ఎగురుతూందే !
మాటలు చాలని ఈ మధుబంధం .
జన్మలు దాటినా ఈ అనుబంధం .
సగమై నిలిచే సంబంధం .
నారాయణా !నారాయణా!
పల్లవి
HE:నారాయణా ! నారాయణా ![అందాలమ్మా!(2)]
చూసెయ్యనా ! చూసెయ్యనా ! [రావాలమ్మా!(2)
SHE:అయ్యో రామా ! అయ్యో రామా!
ఆగాలమ్మా ! ఆగాలమ్మా !
HE:ఇట్టా ఆరుబైట అందాలన్నీ ఆరబోసి ఆగాలంటే
కోడె వయసు ఒప్పుకొదమ్మా !
SHE:అట్టా ఓపలేని పరువం తోటి ఆడసోకు అంటాలంటే
అమ్మదొంగా !వీలెకాదమ్మా !
HE:అ కాదనక లేదనక నా మైకం నువ్వే దించాలమ్మా !
చరణం-1
HE: ఆ ఈదురుగాలే వీచి , నా వయసును ఆవిరి చేసి
అరువైనా అడగాలందమ్మా !
SHE:అరువంటూ లేదోరయ్యా !అణువణువూ నీదేనయ్యా!
ఆ ముచ్చట ముందే వద్దయ్యా!
HE:ముందైనా వెనకైనా ఆ మురిపెం
ముద్దులమూటేనమ్మా !
చరణం-2
SHE:ఆ చుక్కను చంద్రుడు కూడా
చిరుచీకటి ముసిరినాకే
సరసానికి రమ్మంటాడయ్యో !
HE:సరసంలో వేళాపాళా లేదమ్మో చక్కెరబొమ్మా!
నీ సిగ్గును చెట్టిక్కించమ్మో !
SHE:అ నా సిగ్గును , నీ ఉడుకు
తగ్గేలా లగ్గం పెట్టించయ్యో !
HELLO ఓ కన్నెమనసా !
పల్లవి
SHE:HELLO ఓ కన్నెమనసా !నీకా అబ్బాయి తెలుసా !
ఇన్నాళ్ళుగ లేని కులుకు నీ కొచ్చెను ఔనా!
కదిలి కదిలి నా ప్రాణాలన్నీ తోడేస్తున్నావు .
బాగుందమ్మా నీ వరస!
HE:HAY ! ఓ కొంటె వయసా!నీకీ అమ్మాయి తెలుసా !
బజ్జోని ఇప్పటిదాకా చెలరేగేవు చాలా!
ఎగిరి ,ఎగిరి ఆ అమ్మడి సోకు అంటాలంటావు .
హద్దే లేదా ఏంటి నస?
చరణం-1
SHE:ఇంతకాలం ఎవర్నీ చూసినప్పుడూ కలగదే !
HE:ఎంతమందిని చూసినా ఇంత అలజడి జరగదే !
SHE:ఇది ఏదో కొత్తగా రాపిడి
జతేదని హడావుడి .
HE:ఇన్నినాళ్ళకు మేల్కొంటున్నది .
గుండెలో ఉండే సడి .
SHE:ప్రతి మనసును ఇది మీటేనా !
ఎదురవ్వక మరి తప్పేనా!
HE:ఇది వయసున తొలి జడివాన!
చలి చూపుల కరిగే వెన్న .
SHE:ఐనా ఆపాలన్న ధ్యాసే లేక
అల్లరి చేస్తావ్ ఏంటి కథా !
కాముని కొలిచిన
పల్లవి
HE:కాముని కొలిచిన ఫలమో ----
దేవుడు ఇచ్చిన వరమో----
కోరిన చెలియ కలగా ----
కరుణించెనే తనుగా----
SHE:అంత ప్రేమ ఏమిటమ్మా !
ఇంత పరుగు ఎందుకమ్మా!
HE:అ మనసు పడిన చెలియా నాదెగా !
నిజాము తెలిసి మనసు మురిసెగా!
చరణం-1
HE:అందరాని చందమామ అనిపించిన భామ .
అరచేతి అద్దమై అగుపించినదమ్మా!
SHE:చందమామ కాదోయీ ఈ ముద్దులగుమ్మా !
నీ కోసమే ఉదయించిన నెల వెన్నెలమ్మా!
HE:కలయా! నిజమా! అసలిది కాంతాలలామా!
SHE:కలిశా!పిలిచా!మరువక నను చేరుకొనుమా!
చరణం-2
SHE:చేరలేని తీరంలో నిలిచిన ఈ చిలక
రంగుల రెక్కలు విప్పి నిను చేరినదమ్మా!
HE:రామచిలుక కాదోయీ ఈ రంగులబొమ్మా!
నా కోసమె మొలకెత్తిన గాటపువలపమ్మా !
SHE:మెరుపా! మైమరపా!ఈ మన్మథసీమా!
HE:బిగువా?తగువా?వేగమె నను చేరుకొనుమా!
అలా నువ్వు కవ్విస్తే
పల్లవి
అలా నువ్వు కవ్విస్తే ఆగలేదు నా మనసు .
అలా నువ్వు చూస్తుంటే ఊరుకోదు నా వయసు
నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చెయ్యలేరుగా !
దేవుడైన (మబ్బులైన)దారికి అడ్డు నేడు కారుగా!
ఏదేమైనా మన ప్రేమదిలే విజయం .
ఎదురేదైనా ఇక ఆగదు మన ప్రణయం .
చరణం-1
సుడురాల తీరంలో అలా నీవు నిలుచున్నా
సుతారంగ నీ నవ్వే సితారల్లె వింటున్నా!
గులాబిలా గుండెల్లో నిన్నే నింపుకుంటున్నా !
సిందూరంలా చెంప కందే కథే నీకు చెబుతున్నా!
తపస్సునే చేయక దొరికిన వరం నీవు సుమనయనా !
మరో లోకమంటే ఏంటో చెలీ నీలో చూస్తున్నా!
మనసే ఇచ్చాను . నే వచ్చాను.
నీవే కదా నా ప్రాణం !
చరణం-2
మరీ మరీ చూస్తుంటే మతే నాకు పోతుంది .
తుదే లేని మోహంతో ఏదో జరుగుతూ ఉంది .
కదులుతున్న కోరిక లాగా నన్నే కాల్చుతున్నవే !
రగులుతున్న నాగిని లాగా నన్నే రేపుతున్నావే !
ఇంకా ఏల నువ్వు దూరున్గా
దారే చేరు వేగంగా !
తీస్తున్నావె నా ప్రాణాన్ని
అందాలున్న రాక్షసిగా !
నను దోచెయ్యవా దాచెయ్యవా నే వేరని లేకుండా !
ఒళ్లంతా వయ్యాగ్రా హీటు
పల్లవి
HE:ఒళ్లంతా వయ్యాగ్రా హీటు - పల్సంతా ఓ కొత్త బీటు
సూపర్బు ఈ వింతషాటు వార్రేవా!
SHE:సిక్సర్ లా తాకింది సైటు - ఫిక్సైంది గుండెల్లో సీటు
టోటల్ గా అమ్మాయి ఫ్లాటు వార్రేవా!
HE:ఏ బెంగ చేరిందో లోకి - అరె జోడైంది తబలాకి
SHE:మొత్తంగ మూకి -
అయ్యొ నా నిద్ర అయ్యింది హుష్ కాకి .
HE:ABC రాకున్నాముందె BBC చేరేసి ఉందె
LOVE ఎంత పవరైంది !
చరణం-1
SHE:కళ్ళల్లో చూయింగుగమ్ము -చేతల్లో స్నాచింగుదమ్ము
మాటల్లో మ్యాజిక్కు హమ్ము వార్రేవా!
అబ్బాయి సానెట్టిన జేమ్ము డూస్కెళ్ళె లేజరిలేనమ్ము
చూపాడు వండర్ లోకమ్ము వార్రేవా!
HE:బాడీలో బాదమ్ముషైను--సాడీలో షేకింగుసైను
లేడీయె లేటెస్టు క్వీను వార్రేవా!
అమ్మాయి అందాలమూను --శాండిల్లా గంధాలమేను
జోడీగా తానుంటే ఫైను -వార్రేవా!
SHE:ఫ్రీక్వెన్సీ గమ్మతుగా ఉంది -
అరె!సీక్వెన్సు స్టన్నింగుగా ఉంది.
HE:ఈ థ్రిల్లు కావాలని ఉంది -
అబ్బ! డ్రిల్లు మామత్థుగా ఉంది .
SHE:అ డీడిక్కు ఆడాలనుంది వేడెక్కి ఊగాలనుంది .
చాటింపు వేయాలని నాకుంది . ఆహా! ఓహో!
చరణం-2
HE:బ్యాటింగు ఆ కళ్ళ కిచ్చి ---దెతింగు చెక్కిళ్ళ నిచ్చి
రాగింగు రాపిల్ల గుచ్చి ----వార్రేవా!
కౌబాయ్ ని కట్టేసుకుంది ----హీమాన్ ని చుట్టేసుకుంది
లవ్ మార్చేసుకుంది --- వార్రేవా !
SHE:డే అంతా హాంటింగు చేసి---నైటంతా ఛేజింగు చేసి .
డ్రీమ్సన్నీ డ్రాగింగు చేసి ----- వార్రేవా!
స్వీటికి వేశాడు బీటు ------భేటీకి చెప్పాడు డేటు
బ్యూటీకి ఇచ్చాడు జోల్లు ------వార్రేవా!
HE:ఈ ఛార్మి హంటింగు చేస్తోంది .
అబ్బో! నా ఓర్మి టెస్టింగ్ కు పెడ్తోంది .
SHE:ఈ గేము లవ్లీగా ఉంది .
అమ్మొ ఇంకేమొ జల్దీగా ఉంది .
HE:టెమ్టయ్యి ఊగాలనుంది .
జంటయ్యి తీరాలనుంది .
కమిటయ్యిపోవాలని నాకుంది . ఆహా!----ఓహో!
పాలరంగులో ఉంది కోయిలా !
పల్లవి
HE:పాలరంగులో ఉంది కోయిలా !
గుటక లేయమంటే నాకెలా ?
కళ్ళు అప్పగించి చూస్తె నేనిలా
వన్నెపోని కన్నె చందమామలా !
నవ్వుతోంది నంగనాచి కిలకిలా!
SHE:ఆకుచాటు పండు షోకిలా!
కొరికి చూడాలంటె మాటలా!
మత్తు చల్లుతున్న పిల్లగాలిలా!
హద్దు మీరుతున్న కొంటెవాగులా !
నన్ను చుట్టబోకు నీవు గలగలా!
చరణం-1
SHE:అమ్మయ్యో!ఇంత ఆకలా?
HE:అమ్మడూ!సమయమే కదా!
SHE:ఇంత ఇంత కళ్ళతోచి ఎంత ఎంత జుర్రుకున్నా తనివి నీకు తీరదా?
HE:అంత అంత అందముంటే చిన్నచిన్న కళ్ళు ఎట్ల తినడమబ్బా మాటలా?
SHE:ఓహో! నను వదలవా?
HE:రాణీ! కరుణించవా!
SHE:కరుణించడమంటె ఏమిటో చెప్పాలంటా !
HE:కరుణించడమంటె కౌగిట్లో కరగాలన్తా!
చరణం-2
SHE:అమ్మబాబోయ్ ! ఏమి తొందర ?
HE:కవ్వించి ఎంత బిత్తర !(తత్తర)
SHE:ఎంత ఎంత దూరముంటే అంత అంత చేరువయ్యే రోజు ముందు ఉందిగా ?
HE:అంత అంత దూరమంటే ఇంత కొంటె వయసు నన్ను ఆగనదు చేరవా?
SHE:బాబూ!ఇంత అల్లారా?
HE:భామా!ఇది ముచ్చటా!
ఆదిశక్తి ప్రతిరూపమా!
పల్లవి
ఆదిశక్తి ప్రతిరూపమా!
ఇదే నీ కిచ్చే గౌరవమా!
స్త్రీని దేవతగ కొలిచే నేలలో
అడుగడుగున వ్యథలే(అపశృతి)నీకమ్మా!
చరణం-1
మాతృదేవతవు అంటారు .
నిను ప్రకృతి రూపమని అంటారు .
కూడుగూడైన ఈయక , నీ యోగక్షేమాలు చూడక .
నీ కండ కరిగించి , గుండె మరిగించి
నీ చను బాలు త్రాగిన వారే నిను వీధిపాలు చేస్తుంటారు .
చరణం-2
అర్థదేహమని అంటారు
ఆకాశంలో సగమంటారు .
ఆకలి చూపుల వెంటాడి , నిను ఆలి చేసుకొన వెనుకాడి ,
నీ నమ్మకం తుంచి , అమ్మకం ఉంచి .
నీ మురిపాలు పొందినవారే నిను అల్లరిపాలు చేస్తుంటారు .
చరణం-3
అపరకాళివని తెలుసుకో!
నువ్వు ఆత్మస్థైరాన్ని పెంచుకో !
నీవు ఇచ్చిన జన్మేగా ఈ మగజాతి మొత్తంగా
నీ శక్తి చాటించి,భక్తి కలిగించి
ఈ దానవజాతిని ఇకనైనా అభిమానవజాతిగ నడిపించు .
రావా! వినలేవా!
పల్లవి
రావా! వినలేవా!
ఈ గుండెల్లో ఆవేదనెట్ల తెలుపనురా!
నీ ప్రేమను నేనెలా పొందనురా!
చేయని పాపం ఈ రూపం
చేయకనే పొందిన శాపం [చేజేతులా పొందినా శాపం ]
ఈ శిక్ష మారేదేలా?
నా బాధ తీరేదెలా!
రావా ------- వినలేవా!
చరణం-1
శిథిలమైన నా మనసు ఆకాశమే
చివురు తొడుగు వలపుంటె ఆ పుడమే !
ఆ రెంటికి కలయిక లేదులే!
నా కోరిక తీరేది కాదులే!
చుక్కను చంద్రుడు చేరెనురా!నీ కౌగిలి నే చేరేదెలా!
ఆ దైవమె నా వ్యథ తీర్చాలిరా!
రావా!--------వినలేవా?-------
రారా! ఇటు రారా!
పల్లవి
రారా!ఇటు రారా !
నీ గుండెల్లో నే నిదురపోతారా!
నీ కళ్ళల్లో కలవరం నేనేరా!
పోలేవు నీవు ఎంతో దూరం
రాలేరు ఎవ్వరూ సాయం
ఈ లోకమే నావశం
నా మాటలే శాసనం .
రారా! ఇటు రారా!
చరణం-1
తీరిపోదురా నా రక్తదాహము
ఎవ్వరొచ్చినా ఆపాను నా పయనం
నా పగ చల్లారిపోయేదాక [నే కోరినదంతా సాధించగా]
ఈ మారణహోమం సాగించుతా!
ఏ ప్రేమలు దారిలో బలి అయినా
నా ద్వేషం తీరుటే మిన్న
ఆ దేవుడొచ్చినా వదలనురా !
రారా ! ఇటు రారా!
నీ పిలుపు కోసం
పల్లవి
వలపే నీ కోసం లేరా!
సొగసే నీ సొంతం రారా!
కదిలే ఈ కోరిక నీదేరా!
ఇది ఎడబాటు కాదోయి
మనసులకు లేదోయి
తనువులదె ఈ దూరము .
విడవక నీ నీడల్లే నేనుంటా!
నీ పిలుపు కోసం -----నీ పిలుపు కోసం .
చరణం-1
ఆరిపోదు గుండెలోన నీ రూపము
మాయలేదు అంతులేని ప్రేమపాశము.
విధి దేహాన్ని విడదీసి పొమ్మన్నా!
నిను వదిలేసి పోలేక నేనున్నా!
ఏ జన్మకూ నీ జంతగా
వస్తాను నేను ఎవరు నన్ను ఏమన్నా!
నీ పిలుపు కోసం -----నీ పిలుపు కోసం .
చరణం-2
ఓర్వలేని వారు మనసు వేరు చేసినా -----
చేరువైన తీరు మనది ప్రేమ దీవెనా !
పదికాలాలు ఉంటాము ఇకనైనా -----
మనిషే కాదు మనసైన ఒకటే సుమా!
మన ఆత్మల ఈ సంగమం
నిలవాలి వేయిజన్మ లెదురు చూస్తుంటా !
నీ పిలుపు కోసం -----నీ పిలుపు కోసం .
ఏయ్ రాజా !
పల్లవి
SHE:ఏయ్ రాజా! ఏయ్ రాజా!
అందముంది ఆజా ఆజా!
HE:ఏయ్ రోజా!ఏయ్ రోజా!
మీద పడకు జా జా!
SHE:చేరువే ఉంది లేజా!
చేసుకో కామపూజా!
HE:ఊదకే నీవు బాజా!
ఊపుతా కాస్త సోజా!
SHE:లంచమే ఇచ్చినా మంచమే ఎక్క ఫోజా!
చరణం-1
SHE:ఏప్రిల్ ఎండలో ఉన్నట్టుగా నన్ను దులపరించుకుంటావు ఎందుకంటా?
HE:సూపర్ ఫిగర్ పై పై పడినా నేను
పిచ్చి పట్టిపోను పొపొమ్మంటూ !
SHE:నవంబర్ చలిలో చిక్కినట్టుగా
నన్ను అంటుకొని వెచ్చగా ఉండమంట .
HE:డిసంబర్ నెల నన్ను నలిపేస్తున్నా
నేను సికిందర్ ధైర్యంతో అడుగేస్తుంటా!
SHE:ప్రవరాఖ్యుడివా? పండుముసలివా?
HE:మేనక చెలివా? ఆగని చలివా ?
SHE:సిగ్గేల స్వెట్టర్లా చుట్టేయి వణుకొచ్చె
గజగజగజ---గజగజగజ .
చరణం-2
HE:హస్తిణీ చిత్తిణీ అక్క కాకు
నన్ను లక్కలా గంమ్ములా అంటుకోకు .
SHE:సందులో సుందరి నేను కను .
నిను కోరి అప్పగించుకునే కన్యను నేను .
HE:హద్దులో ఉంటేనే అందమంటాను .
నిన్ను బుద్ధిగా కాస్త వేచి చూడమంటాను .
SHE:తోడు కోరు పాల వంటి ఈడు దివాను .
మీనమేషాలు లెక్కిస్తే విరిగిపోవును .
HE:లాలీ పప్పే కోరే మనసే!
SHE:జాలీ లాలీ ఊగే వయసే!
HE:కత్రీనా సైక్లోన్లా కమ్మెయ్యకు నేనౌతా!
గిజగిజగిజ ---గిజగిజగిజ .
తిరిగిరాని తీరమే
సాకీ
ఊహల కందని ఓ త్యాగమూర్తీ !
అమ్మ పదానికి అర్థమై పొందావు శాశ్వత కీర్తీ.
పల్లవి
తిరిగిరాని తీరమే చేరావా దీపమా!
కనుమరుగైపోయావా కన్నపేగుబంధమా!
చీకటి కోదిలేశావా నీ ఆశాజ్యోతిని .
ఈ మాయాలోకంలో ఎలా బ్రతకగలడని .
చరణం-1
ఎంత రక్తాన్ని చిలికి ఇచ్చావో చనుబాలు .
ఎన్ని కష్టాలు కోర్చి చెప్పించావో ఓనమాలు .
కాయ కెపుడు తెలియదమ్మా
కొమ్మ పడే కష్టం .
తల్లి మనసు తెలయనీదు
బిడ్డకు తన దు:ఖం
ఆమె దూరమైన వేళ జగమంతా శూన్యం
తడబడే అడుగులతో మొదలౌను జీవితం (జీవనం)
చరణం-2
నెమలికంటి నీరు వేటగానికి ముద్దౌనా ?
మాతృత్వపు మధురిమ ధనపిచ్చికి బలియేనా?
ఎంతిచ్చినా తీరదు తల్లి ప్రేమ ఋణం .
ఏ జన్మలో పొందారో అరుదైన ఈ వరం.{ఆ అమ్మకు మరురూపం అన్నమెట్టుపొలం (అన్నమిచ్చు)}
ఏ లోకంలో ఉన్నా ఆ దీవెన అమరం .{జనని జన్మభూములను మించదు ఏ స్వర్గం .}
మరుజన్మకు కావాలి తల్లిగా ఈ దైవం .{ఈ అభిమన్యుడు వాటి కొరకుచేయాలిక సమరం .}
పట్టేసిండు వాడు
పల్లవి
పట్టేసిండు వాడు నా పైటపట్టేసిండు .
చుట్టేసిండు అబ్బా నా నడుం చుట్టేసిండు .
పైట పట్టేసి , నడుం చుట్టేసి ,
తీయని తిప్పలు నాకు తెచ్చి పెట్టిండు .
తీరక లేదని నన్ను తిప్పి కొట్టిండు .
ఏం చెయ్యనురా రామా నా కొచ్చిన ఈ ఖర్మ .
ఏమైందే నీ కంటూ అడుగుతోంది మా అమ్మ .
చరణం-1
ఆ రాత్రి ఏమైందో ఏమోనమ్మా!
మామూలుగానే పడుకున్నానమ్మా!
దిండేమో చిరిగింది .
పడకేమో నలిగింది .
చపావె రాత్రంతా అని అమ్మే కసిరింది .
పొడిచింది అమ్మనైతే నా కొళ్ళంతా నొప్పులు .
నలిగింది పడకైనా నా నడుమంతా సలుపులు .
ఇదేం మాయమౌ ఇదేం చిత్రమౌ ?
పట్టు కింత పట్టుందా ?వాడి కింత శక్తుందా ?
అబ్బో!అబ్బో!అబ్బో!అబ్బో!
చరణం-2
పైటేసి పదినాళ్ళు కాలేదమ్మా-
సిగ్గింకా మొగ్గినా ఎయ్ లేదమ్మా!
ఒళ్ళంతా బరువైంది - రైకంతా బిగువైంది .
నా చూపు రేబవాలు వాడి దారి కాసింది .
గుండెలో ఓ దిగులు -
ఆవిరి అయ్యే గుబులు .
ఆ డొంకదారంట చెప్పలేను నా తిప్పలు .
పట్టుకింత - వాడి కింత శక్తుందా!
ఆగు ఆండాలమ్మో!
పల్లవి
HE:ఆగు ఆండాలమ్మో !సోకు చాకేనమ్మో!
ఎంత అందగాత్తెమ్మో!నిన్ను కనమ్మో!
SHE:నాటు నాచారయ్యో!నన్ను గిల్లొద్దయ్యో!
ముంత కింత పప్పు తినిపిస్తానయ్యో!
HE:అత్తమ్మే మీ అమ్మ నా కౌతుందమ్మా!
నీ అందం గుత్తం గియ్యమ్మా!
SHE:ఆ అత్తే వచ్చినా నేను ఒప్పుకోనయ్యో!
నీ సొత్తు కాబోనయ్యా!
చరణం-1
HE:చీరలో చందమామ చంపేస్తోందమ్మా!
కోకలో కన్నెలేమ కాటేస్తోందమ్మా!
SHE:నాటులో నీటు కొంచెం తోడైందిరయ్యో!
ఆటలో అరటిపండు నే కాలేనయ్యో!
HE:అల్లాగా!మరి ఎల్లాగా!
SHE:ఇల్లాగా!తిరిగెళ్ళాల్గా!
HE:వద్దంటె నామర్దా కాదా!
SHE:ముద్దంటె కొంప కొల్లేరవదా!
HE:దొంగను చేస్తున్నావు అడిగింది ఇవ్వకుండా
ఆనాక ఏమైనా ఆనేరం నీదేనమ్మో!
SHE:ఆ ఛాన్సు నీకు దొరికే వీల్లేకుండా
దాస్తాను సరుకు భయమే నీకొద్దయ్యో!
(దొరలా నువ్వుండయ్యా)
చరణం-2
SHE:దారిలో మాటు వేసి ఆపొద్దురయ్యో!
పాకలో పాప నన్నుచేయొద్దయా!
HE:జోరులో జరుగుతున్న పనికాదోలమ్మో!
తోడుగా బతుకంత నే నుంటనమ్మో!
SHE:అల్లాగా!నే నమ్మాల్గా!
HE:ఇల్లాగా!రా ఇల్లాల్గా?
SHE:కాకాలు చాలించరాదా!
HE:నీ కాలు పట్టేస్తా రాధా!
SHE:ఆశను చూపిస్తావు . నే నీరు కారేలాగ
ఆ పైన ఆగదయ్యొ . అది నీకు నాకు బాగా!
HE:అసరదా కాదులె నా మాటను నమ్ము
పరదా లొద్దులె నేనే నీ సొమ్ము .
మొదలేది ఈ వింతమోహానికి
పల్లవి
HE:కదిలేను మరికాస్త చొరబాటుకి .
చరణం-1
SHE:తీరిపోని తపన ఏదో ఓడిపోనన్నది .
HE:లేనిపోని గొడవ నాలో రేపిపోతున్నది .
SHE:చాటుమాటు తెరచాటు లేలా?
HE:ఆటుపోటు అలవాటు మేలా?
SHE:తేటిలా చేరరా! చెలియ నీదేనురా!
చరణం-2
HE:విదుర రాని రాతిరేదో ఎదురు లేదన్నది .
SHE:అదును చూసి పదును గాలి తనకు తోడైనది .
HE:ఈడు జోడు కలిశాయి రాధా!
SHE:వాడివేడి చలివేళ కాదా!
HE:ఇంక జాగేలరా!వంకలే లేవుగా !
కందిచేను
పల్లవి
కందిచేను ఏపుగున్నాది .
ఆ చేనిలోన మంచె ఉన్నాది .
ఆ మంచె మీద ముద్దబంతి పువ్వు
దాని చూపు లాగుతోంది జివ్వుజివ్వు .
కోసుకోరా!కోసుకోరా!కంచె దాటి కోసుకోరా!
చేసుకోరా!చేసుకోరా!చేతనైంది చేసుకోరా!
చరణం-1
రేతిర్లు నిదర రానీదురా !
పగలంతా అరక దున్ననీదురా !
అబ్బా!బువ్వే తిన్నీదురా!పొద్దే పోనీదురా!
రమ్మంటూ పిలుస్తుంది .వస్తే కవ్విస్తుంది.
దాని తిక్క వదిలేట్టుగా పడునుచూపు చూడరా!
రేకురేకు విరిసేలా చురుకునంత చూపరా!
చరణం-2
చూసిందా చూపు తిప్పలేవురా !
నవ్విందా నీళ్ళు నములుతావురా!
సంకురాత్రి రోజురా!చందమామ చాటురా!
వచ్చావో దొరుకుతుంది
దరువే వేయిస్తుంది .
దాని దుడుకు తగ్గేటుగా నీ ఒడుపే చూపరా!
సోకు సొమ్మసిల్లేలా నీ చేవనంత చూపరా!
చీరలే ఒలవని
పల్లవి
HE:చీరలే ఒలవని మొక్క జొన్నపొత్తు.
ముళ్ళే ఎరగని ఓ మొగలి గుత్తు.
అమ్మాయి చూపులో క్లోరోఫాం మత్తు .
పడిపోయి లేచాక పీక్కోవాలి జుత్తు .
SHE:ప్యాంటునే వేసుకున్న మెరుపే వీడచ్చు .
తాకితే షాక్కొట్టే చూపే ఓ చిచ్చు
అబ్బాయి వాయిస్ లో ఉరుమే వినవచ్చు .
నో డౌటు వీడికి లైనే వెయ్యొచ్చు .
చరణం-1
HE:మాట చల్లిపోయింది తేనెల గమ్మత్తు
ఈటె గుచ్చిపోయింది ఊపులలో సొత్తు .
ఈ పిల్లే లేకుంటే జీవితమే పస్తు .
బిస్తర్ పై తోడుంటే నైటు అబ్బో మస్తు .
SHE:చుట్టుకొలత చూసింది వాడి చేతి పట్టు .
రెచ్చ గొట్టిపోయింది చెప్పలేను ఒట్టు .
అమ్మచేతి ఉగ్గు కూడ అమ్మో హాంఫట్టు
ఒళ్ళంతా నిండిందీ పాడి చూపు హీటు . చరణం-2
SHE:చాలు చాలు అంటుంది చుప్పనాతిమనసు
మోరుమోరు అంటుంది మాయదారి వయసు
ఆగలేదు వేగలేదు ఆకతాయి సొగసు
వాడి జోడు తీర్చుతుంది (దించుతుంది)ఈడుకున్న పులుసు
HE:ప్యారుప్యారు మంటాయి రేతిరంత కలలు
బ్యారుబ్యారు మంటాయి పగటి పూట పొదలు
ఆర్చలేను తీర్చలేను వేడివేడి సొదలు
అమ్మాయే తీర్చాలి తియ్యని ఆపదలు .
చలి కాచు చూపు
పల్లవి
చలి కాచు చూపు, గిలిగింత పెట్టి
నన్నే మాయ చేసింది
చినుకంటి నవ్వు వరదల్లె మారి
అలలా ముంచిపోయింది .
ఏమిటో ఈ వింత ? సంగతేమిటి అంట ?
అందరికీ అంటుకునే (ఈ)వ్యాధి ప్రేమేనంట .
చరణం-1
తాళం ఉందని తెలియని నా మది తలుపే తెరిచి
కనివిని ఎరుగని చిలిపి సరదా తెలిపి
నిలిచిపోయిన తానే నా కాదల్ రాణే
మిగిలిపోయిన నేనే ప్యార్ కీ దీవానే !
చరణం-2
ప్రేమే తెలియక పెరిగిన వయసును నిద్దుర లేపి
రంగులలోకం నీకుందంటూ సందడి చేసి
కలలు నేర్పిన తానే సదియోం సే జానె
మనసు తాకిన తానే రూప కీ రాణే !
చేసుకో నన్ను
పల్లవి
నీ తెగనీల్గెడి వయసు నాకు బాల్ నిషా!
కాదంటే ఆపుతావ కాలేషా!
నీవు కామ్ చోరు కాకుండా చూపుపస
HE:బాగుందె ఈ తమాషా !
SHE:భాగోతమాపు పేరాశా!
కొట్లాడాలని ఉంది తుంటరి కాముని తోటే !
SHE:అట్లానే ఉంటుంది ఆ అక్కర తీరేదాక
ఇంకెట్లాగొ ఉంటుంది ఓ చక్కెరకేళి రాజా!
HE:ఇంకైతే మొదలెడదాం సరసాల సరిగమ .
SHE:తంతైతే వద్దంటానా ఆ కమ్మని మధురిమ .
SHE:అమ్మమ్మా! ఆగాలా అందాకా!
HE:ఆడేద్దాం! అష్టాచెమ్మా!
చరణం-2
HE:తాకే చలిగాల్లో నీ చూపే రగ్గు రగ్గు .
ఊపే కోరికలో అరే నీవె దిక్కు దిక్కు .
SHE:అంతే లేని ఆశ నీ కొద్దు తగ్గు తగ్గు .
వలలో పడను నేను చేసేస్తా చిక్కు చిక్కు
HE:వయసుల్ని మరిగిస్తే నీ సొమ్మేం పోతుంది .
SHE:మనసుల్ని కదిలిస్తే ఆ తొందర పోతుంది .
HE:అయ్యయ్యో!దయచూడు దీనుణ్ణి .
దాటేస్తే ఎట్టాగమ్మా !
ఘాటు ఘాటు ప్రేమకిది ఒకటే మాదా!
HE:చెబితే వినవా?లేటు నీకు బాగుందా!
SHE:అయితే గురువా!తిరిగి వెళ్ళి పోయేదా?
HE:కాళివి అయితే కాశికి పోతా!
మేనక లాగా మేనందీవా?
SHE:మేనక వస్తే నాకే నీవిక టాటా చెబుతావా?
HE:మేనక భూమిక యామిక గోపిక అన్నీ నీవేగా!
ముందర ఉందోయ్ !అందుకు తోవ!
HE:తోవను చూపి అడుగులు నాతో నువ్వేవేస్తావా!
SHE:తోడువు జోడువు నీడవు అన్నీ నీవే ఔతావా!
HE:అందుకె నే వచ్చాగా -----
జన్మంతా నీకే అంకితమిస్తాగా -----------
ఉప్పాడ చీరలో
పల్లవి
HE:ఉప్పాడ చీరలో , ఉయ్యూరు రైకతో
ఊపుతున్నావే ఉయ్యాలా!
ఊహ రేపుతున్నావే ఇయ్యాలా!
SHE:సరిగంచు పంచెలో , చక్కని క్రాఫింగుతో
చంపుతున్నావే సామిలాలా!
చెంప నొక్కుతున్నావే యాలోయాలా!
చరణం-1
HE:ఇగురుకూర,సిలుకు చీర , కన్నెపిల్ల సోకుసారె.
SHE:పాలచుక్క,పూలపక్క,పడకటింటి పోకుచెక్క .
HE:ఇచ్చుకోను రావే ఇంటి ఎనక బుల్లీ !
SHE:పుచ్చుకోని పోరా మాటమత్తు చల్లీ!
HE:ఇచ్చుకో !
SHE:పుచ్చుకో!
HE:సరదాలే చేసుకో!
చరణం-2
HE:తడికెచాటు,పెదిమకాటు,గడ్డివామి ఆటుపోటు
SHE:సిగ్గుచేటు,ఎంత నాటు,లగ్గమవ్వకుండ పాటు .
HE:రెచ్చగొట్టిపోకే రవ్వముక్కు పుడకా!
SHE:పిచ్చిపట్టిపోకో లచ్చుమత్త కొడకా!
HE:ఒప్పవా?
SHE:వదలవా?
HE:ఒళ్ళోకి వచ్చెయ్యవా!
చరణం-3
HE:దొండపండు,పక్కదిండు,సన్నజాజి పూలచెండు .
SHE:చీకటిల్లు,వానజల్లు,మచ్చు కింద మాట చెల్లు .
HE:ఎప్పుడిస్తావమ్మో వద్దుగిద్దు అనక
SHE:అప్పగిస్తనయ్యో ఆగు అంతదనక .
HE:పట్టుకో!
SHE:తట్టుకో!
HE:పగ్గంలా వాటేసుకో!
చిన్నచిన్నమాట
పల్లవి
SHE:చిన్న చిన్న మాట నీకు చెప్పనందుకు
నాకు నిన్న మొన్న రాత్రి నిద్ర పట్టదెందుకు
HE:అమ్మ కొంగు చాటు నీకు ఇంక ఎందుకు
అబ్బ చల్ల కొచ్చి నీకు ముంత దాచుడెందుకు?
SHE:ఇంతదాక సిగ్గు నన్ను తడమనందుకు
ఈ కొత్తబెంగ జాడ నాకు తెలియదెందుకు?
HE:చంటి పాప లాగ లాలిపప్పు లెందుకు?
నీ చిన్న గౌను కింక ఇన్ని తిప్పలెందుకు?
చరణం-1
SHE:సందె అయినా కాకముందె సద్దు ఎందుకు ?
నీకు కోడి కూసే దాక ఉంది హద్దు(పొద్దు)ముద్దుకు .
HE:చెల్లి పెళ్ళి కూడా లేదు ఆగమందుకు .
అబ్బ!అన్న కూడా లేడు నాకు అడ్డముందుకు
SHE:అమ్మనాన్నలాట ఆడ రామ్మనేందుకు
అయ్యో!అందమింక అంగలేసి రాదు ముందుకు .
HE:అంగలేయ ఇంత చెడ్డ లేటు చేయకు .
అయ్యో చొంగకారు ఈడు పెద్దకేటు ఆపకు .
ఆ నవ్వు చూస్తె
పల్లవి
ఆ నవ్వు చూస్తె తెలిసింది .
నీ చూపు చూస్తె తెలిసింది .
నీ సిగ్గు నాకు చెప్పకనే చెబుతోంది .
ఆ నిగ్గు ఊసు తెల్పకనే తెలిపింది .
అన్నిటినీ మించిపోయి నీలో నిగనిగ చెబుతోంది .
నువు ప్రేమలో పడ్డావని .
తలమునకలుగా ఉన్నావని .
చరణం-1
నిన్నే తెలిసిన నా మది నుంచి దాచాలేవు .
నీకే తెలిసిన నా చెలిమి ముందు ఆగలేవు .
నిన్నే వెదికే నా కళ్ళను దాటలేవు
దాగలేని నీ వలపు దా!దా!అంటోంది
ఆగలేని నా వయసు పదపద మంటోంది .
చరణం-2
పరదా చాటు ఇంక నిన్ను ఆపలేదు .
సరదా మాటు నీ నవ్వును మాపలేదు .
వరదై పొంగే ఈ అలజడి నిలువనీదు .
మాట లేని నీ చూపు మాయే చేస్తోంది .
దాత లేని నాకైపు మారాం చేస్తోంది .
సరసకు రావేమే
పల్లవి
HE:సరసకు రావేమే (నా కామాక్షీ)(నా ముత్యాలు)నా ఇల్లాలు !
[సలుపులు పుట్టించే(సోకే సాక్షి)నీ పరువాలు ]
సలుపులు పెడుతున్నాయ్ నీ పరువాలు .
SHE:[చలాకి మాటలు చాలించయ్యా ఓ చలమయ్యో]
పంచెగ్గట్టుకు రాకయ్యో మొగుడయ్యో!(ఓ చలమయ్యో!)
గురుతొచ్చిందా ఇప్పుడు నీకు ఇల్లాలు [(ఈ కామాక్షీ!),(ఈ ముత్యాలు!)]
HE:అరె కోర మీనా (కన్నె కూవా)0 కోర కోర లొద్దు .
కోరిక తీర్చి కొసరవె ముద్దు .
చరణం-1
HE:బంజారా హొటల్లో మొఘలాయి బిర్యానీ నీతోనే తినిపిస్తా
[ఒబెరాయి హొటల్లో చికెను కబంబ్ తెచ్చి నీచేత్తో కొరికిస్తా.]
ఆపైన ఏదైనా నువ్విస్తే కుక్కల్లే నీ కాడే పడి ఉంటా.
SHE:నా కొద్దు నీ తిళ్ళు -ఆపై నీ ఆకళ్ళు
[పెళ్ళామే ఉండంగా - నేనెందుకు అడ్డంగా]
ఈ సోకుల సిత్రాంగి చింతామణి చెల్లెలు .
HE:అరె!అప్సరసల్లే నీ వుండంగా
[పెళ్ళా మెందుకు గుండెకు దడగా!]
వేరే ఫిగరు నాకు దండగా!
చరణం-2
HE:చన్నీళ్ళు పడినట్లు నీ చూపు పడగానే జిల్లైపోతానమ్మీ!
ఎన్నాళ్ళు నన్నిట్లా నీ చుట్టూ చక్రంలా తిప్పిస్తావే అమ్మీ!
SHE:చాలించు ఈ కథలు చెల్లదులే నీ చతురు
నా ముందు ఉడకదులే నీ పప్పు ఓ డూపు .
HE:అరె వయ్యారంపై వొట్టేస్తానే!
వాకిట్లోనే కాపూటానే!
చరణం-3
HE:సాకిరేవు కాడ నిన్ను కూచోబెట్టి గాడిద చాకిరి చేస్తా!
వగలంతా ఒలికించి వొళ్ళోకి నీవొస్తే ఒళ్ళంతా నగలేస్తా!
[ఆపైన ఏదైనా నువ్విస్తే కుక్కల్లే నీ కాడే పడి ఉంటా!(కాళ్ళ)]
SHE:వగలొద్దు . నగలొద్దు . నీతో నా కసలొద్దు .
ఆమాసకు వున్నంకు నువ్ మెలికలు తిరగొద్దు .
HE:అరె!నువ్వూ ( అంటే నే వస్తానే!
రేయింబగలు పడిచస్తానే!
చరణం-4
HE:నడుమొంపుకు నజరానా - వడ్డాణంలా మేన నేనుండిపోయేనా
మలుపున్న ఆపైన మెరిసే నీ మెడలోన నగలానే నిలిచేనా?
SHE:నడుమైనా మెడపైనా ఆపై ఇంకేమైనా
తాకాలి అనుకుంటే అవ్వాలి తలకిందే!
HE:అరె!నగలా నువ్వు వద్దని అంటే
చీరలా ఐనా చుట్టుంటానే!
తొలిచూపు
పల్లవి
SHE:తొలిచూపు అమాయకం
మరు చూపు అయోమయం .
ఆ పైన చూసిన ప్రతి చూపూ ఓ మన్మధబాణం .
HE:తొలిమాట ప్రతికూలం
మరుమాట అనుకూలం .
ఆ పైన ఆడిన ప్రతిమాటా ఓ రతిసంకేతం .
చరణం-1
HE:చూపు ములుకు తగిలి
అయినది చిరుగాయము .
కలికి పలుకు పూసింది వలపుమలాము .
SHE:తొలి కలయిక చేసెను ఈ చిలిపియాగము .
BOTH :మన జతకిక లేదుగ ఏ జంటా సమము .
చరణం-2
SHE:మాట మత్తు బిగిసి
కలిగె పారవశ్యము
చెలుని చెలిమి చేసింది వలపు(చలువ)వైద్యము .
HE:మన వలపులు చేరెను మనసైన తీరము .
BOTH :రసజగములు చూచిన ప్రేమికులు మనము .
కసి కసి
పల్లవి
HE:కసికసిపరువంతో వెయ్యకు పందెం
మిసమిస వయసున్న అల్లరి అందం .
SHE:కసికసిగుంటేనే పందెం అందం.
నా మిసమిస తలుకేగా నీకు బంధం .
HE:అరె సొగసే మంచం కులుకే లంచం .
దగ్గరి కొస్తే తగ్గును దాహం .
చరణం-1
HE:'F'ఛానల్ మోడల్లా కవ్విస్తూ ఉన్నావే!
పాపిన్సు బిళ్ళల్లే నోరూరిస్తున్నావే!
SHE:శక్తిమాను డూపల్లే ఛేజింగు చెయ్యకులే!
షకలక బేబీలా నేను చిక్కేదాన్ని కానులే!
HE:డిస్కో థెక్కుకు వస్తావా?
ఫోమ్ డాన్సింగ్ నాతో చేస్తావా?
ఓ నవ్వైనా వద్దనక ఇస్తావా?
SHE:ఓ!ఒకటేంటి?వెయ్యైనా ఇచ్చేస్తా!
HE:నీ నవ్వుకు బానిస నేనౌతా!
జన్మంతా నీ బరువే మోస్తా!
చరణం-2
SHE:కౌబాయ్ కి బాబాయ్ లా కన్నే గీటుతున్నావే!
అమితాబ్ కు అబ్బాయ్ లా నన్నాడిస్తున్నావే!
HE:ప్లేబాయ్ కి లవ్ క్లాసే చెప్పేస్తా నువ్ తోడుంటే
సల్మానుకు రొమాన్సే నేర్పేస్తా నువ్ ఔనంటే!
SHE:ఆ దూకుడే ముద్దంట .
లవ్ వీరుడు నీవంట .
నా బుజ్జీ!ఇంకాస్త ఆగమంట .
HE:ఓ!నీ కోసం జన్మంతా వేచుంటా!
SHE:నేనుంటాగా నీ జంట
వలపంటే మనదేనంట .
కలయా?నిజమా!
పల్లవి
కలయా? నిజామా! ఈ వింతధీమా!
మనసై తనువై పెనవేసెనమ్మా!
ఇక నా ఉనికే థానైనదమ్మా!
చరణం-1
మెల్లగ తాకెను నన్నే
వెల్లువ అయినది నా జన్మే!
తొలిగా కలగా కదిలించి నన్నే
మలిగా ఇలగా కరుణించె నన్నే
సందేహం లేదు ప్రేమే!
చరణం-2
మంత్రమో తంత్రమో మహిమో!
చిత్రము గున్నది ఇది ఏమో!
పలుకే మధువై తొణికింది నేడే!
సుమమే శరమై తగిలింది నేడే!
సందేహం లేదు ప్రేమే!
జిలిబిలి
పల్లవి
జిలిబిలి జాబిలి పైన
చలిచలి ఊహలు లోన
క్షణమే యుగమిక మైనా!
చెలి కౌగిలి దొరికేనా!
దయ చూపవే నీవైనా!
చరణం-1
ఆ నునువెచ్చని జాణ
పొంగే యవ్వన వీణ
నను చేరిన చాలు
మరువను నీ మేలు .
ఈ ఒంటి తనమంతా నే నోర్వలేనింక
నా జంట తానుంటే
మా సాటి లేరింక.
చరణం-2
ఆ కొనచూపుల బాణం
నాలో చేసెను గాయం .
తన తియ్యని రూపం
కలిగించెను తాపం
ఆ కాలిగోరైనా తగలాలి ఓ మైనా!
ఆ నింగి తానైనా
దాలాలి నాపైన .
నా లక్కీలాటరివి
పల్లవి
నా లక్కీలాటరివి .
నా బంపరు ప్రైజువి .
నిను పొందకుంటె నా తెలివి ఎందుకంట?
కోటలో నే పాగా వేసేస్తా!
మీ నాన్నను తాతయ్యను
చరణం-1
కాళ్ళొచ్చి నడిచేటి రిజర్వ్ బ్యాంక్ ఖజానా!
Y2Kలో దొరికిన NRI నజరానా!
నిన్నొదిలి పెడతానా నా మోడ్రన్ సిరివానా!
కోటలో నే పాగా వేసేస్తా!
మీ నాన్నను తాతయ్యను చేసేస్తా!
చరణం-2
చెమటోడ్చి పనిచైడం కాదమ్మో గొప్పదనం .
ప్లానేసి ప్లేనెక్కే ఘనతే లేటెస్టు ఇజం .
సోమ్మేమో మామయ్యది సోకేమో అల్లుడిది .
కోటలో నే పాగా వేసేస్తా!
మీ నాన్నను తాతయ్యను చేసేస్తా!
నిన్ను చేరకోరితి.
పల్లవి
నిన్ను చేరకోరితి.
మనసు కరుగవేడితి .
మరులు విరియు వేళలో
మరువబోకుమా ప్రియా!
చరణం-1
నీవు లేక నిముషమైన నేను నిలువలేనులే!
నీదు చెలిమి నా బ్రతుకున పండు వెన్నెలేనులే!
మనసులోని మమత నిలా వాడనీకుమా!
పలుకలేని భావమువై మిగిలిపొకుమా!
చరణం-2
సున్నజాజి,చందమామ సందెవేళ నవ్విరే!
నీవు లేని నన్ను ఎంతో జాలిగొనుచు చూచిరే!
ఓపరాని విరహము నను నలుపుచున్నదే!
కినుక వీడి జాగు లేక నన్ను చేరవే!
(అలుక చాలు)
కలిసిన తన తొలిచూపే
పల్లవి
కలిసిన తన తొలిచూపే
మంత్రం వేసేసిందే!
కలలో కదిలిన రూపే
ఎదురుగ కవ్విస్తోందే!
మనసే ఇక నా మాటే
విననని వేదిస్తోందే!
ఏం చెయ్యాలో తోచక
తడబడి నట్లౌతోందే!
ఎలా కలవడం?ఆమెకు ఏమని చెప్పడం .
చరణం-1
అన్నం కూడా తానై ఆహ్వానించేస్తోంటే-----
నిద్దురలోనా చేరువై మొద్దును చేసేస్తొంటే----
హద్దులు లేవని ఊహలో ముద్దులు కురిపిస్తోంటే----
జన్మల నా చెలి తానే అనిపిస్తూ ఊరిస్తే-----
ఎలా కలవడం! ఆమెకు ఏమని చెప్పడం?
చరణం-2
చంద్రుని కూడా తానే అందంగా నింపేస్తే----
అద్దంలో నా రూపే ముద్దొస్తూ మురిపిస్తే
అందని ఆ ఆకాశమే చేతిలో అడ్డం అయితే ----
జన్మల నా హ్చెలి తానే అనిపిస్తూ ఊరిస్తే------
ఎలా కలవడం! ఆమెకు ఏమని చెప్పడం?
ఏయ్!ఏంటలా
పల్లవి
SHE:ఏయ్!ఏంటలా చూస్తున్నావు?
ఏదోగా ఉంది .
తాకకే ఒళ్ళంతా తడిమినట్టుంది .
HE:ఏయ్!ఏంటలా సిగ్గుపడతావు?
గమ్మత్తుగ ఉంది .
కొత్తగా ఇంకోలా చూడాలని ఉంది .
చరణం-1
SHE:నిన్నదాక నీ చూపుతూపులో ఈ వాడి లేదు .
HE:నిన్నదాక నీ ఒంపుసొంపులో ఈ వేడి లేదు .
SHE:ఎందుకో నాకు ఈ రోజే పుట్టినట్లుగా ఉంది .
HE:నిన్న చూసిన ఈ క్షణమే బతికి ఉన్నట్లు ఉంది .
చరణం-2
SHE:రేపు దాక నిను చూడకుండా నేనుండలేను .
HE:నీవు ఉన్న ఈ రోజే ఇట్లా నిలవాలంటాను .
SHE:ఎందుకో ఇంత తొందర తెలివి లేని సూర్యునికి .
HE:త్వరగా తెల్లవార్చాలని చెప్పాలి చంద్రునికి .
సిగ్గుతో మనసు
పల్లవి
సిగ్గుతో మనసు విప్పి చెప్పలేక
మనసును మాటలోన చూపలేక (తెల్పలేక)
కనులతో సైగ చేయ చేతకాక
పాడుతున్నాను నా మది గుసగుసను .
జాబిల్లిని చూసి తారపొందు మిసమిసను.
చరణం-1
మావిడి గుబురులు చూస్తే తోరణములు గురుతొచ్చి .
పచ్చని ఆకులు చూస్తే పందిరి తలపొచ్చి
కోయిల పాడితే మంగళవాద్యాలు వినిపించి .
ఇక ఆగలేక నీ లది ముందు దాచలేక .
పాడుతున్నాను నా మది గుసగుసను .
జాబిల్లిని చూసి తార పొందు మిసమిసను .
చరణం-2
పూతీవలె పూలదండలై తాకగా
చిరుజల్లులె తలను అక్షింతలు కాగా
ఆ నింగి విల్లే పసుపు సూత్రమై మెరయ .
జాగు చేయలేక,ఈ దూరమోర్వలేక .
పాడుతున్నాను నా మది గుసగుసను .
జాబిల్లిని చూసి తార పొందు మిసమిసను .
నువ్వే నా ప్రాణం
పల్లవి
HE:నువ్వే నా ప్రాణం అని తెలిపే నా హృదయం .
ఆ నింగీ ఈ నేల పలికాయి శుభాగీతం.
ఈ వేళ మధుమాసం అరుదెంచె మనకోసం .
SHE:నువ్వే నా ప్రాణం అని పలికే నా పరువం .
నా తనువు , నా హృదయం ఇక సర్వం నీ సొంతం .
ఈ తరులు , ఆ గిరులు మన జతకు తొలిసాక్ష్యం .
చరణం-1
SHE:నిద్దుర పోతుంటే నువ్వే కలగా వస్తావు .
HE:ఆ కలలో కూడా నువ్వే కవ్విస్థున్తావు .
SHE:సందెవేళలో ఎదలో సందడి చేస్తావు .
HE:మాపటివేళ రేపటి ఊసులు వెచ్చగ చెబుతావు .
SHE:నీ తలపే లేకుంటే నా ఉనికే ఓ నరకం .
HE:నీ ఉనికే తోడుంటే ఆ నరకమె ఓ నాకం (స్వర్గం)
SHE:అందుకే -------}అందుకే -------!Both
HE:అందుకే ---------}
చరణం-2
HE:చీకటి వెలుగులలో నువ్వే తోడువు కావాలి
SHE:ఆకలిదప్పులు లేనిది మనదో లోకం కావాలి .
HE:ప్రేమ ఊసుంటే పడదేమిటి .
SHE:ప్రేమే ఊపిరి చేసేద్దాం పద మొత్తం .
HE:బతికున్నా నీ కోసం కాదంటే అది మరణం .
SHE:అనే తనువు నువు ప్రాణం విడిగా లేనేలేం .
HE:అందుకే --------}అందుకే -------!Both
SHE:అందుకే -------}
తెల్లకల్వపువ్వు
పల్లవి
తెల్లకల్వపువ్వు లాగా కొలనులో నువు కంటబడితే -----
సుర్రున మండే సరారీడైనా సల్లబడతడు సందమామై ------
ఈ ఒంటరిగ జలకాలు ఎన్నాళ్ళే?
సరిగంగ తానాలు ఆడాలే!
చరణం-1
రంబలాగ రంజుగాను సెరుకుతోటలో నీవు ఉంటే -----
సెరుకువిల్లు సేతబట్టి ఎంటబడతడు కాముడైనా ------
ఒక్కతివి ఇక నీవు పోమాకే!-----
మనం జోడు కట్టి ఇద్దరం పోదామే!
చరణం-2
లచ్చిమి లాగ ఎదర నీవు ఎలిగిపోతా మొక్కుతుంటే -----
పద్మావతినే వదిలివస్తడు గుడిలో ఉండే ఎంకన్నా!
కన్నెతనము నీకు ఇంక సాల్సాలే !
ఇంట దివ్వెలా నువ్వు నిలవాలే!
ఓ చెలీ!
పల్లవి
ఓ చెలీ!ఓ ------- సఖీ!
నా కలలకు రూపం నీవే!
నా వెన్నెల వేకువ నీవే!
నా చీకటి దీపం నీవే!ఓ చెలీ!
చరణం-1
చందనగంధం చంద్రుని అందం చెలి నీ ఆకారం!
చెయ్యనితపముకు అయినది నాకు నీ సాక్షాత్కారం
నా కరదీపికగా మారి
నా కనుపాపలలో చేరి
నీలో నన్నే దాచుకొని ,
కొత్తగ లోకం చూడమని
వరమును ఇచ్చిన దేవివి నిన్నే సేవిస్తా మరి .
చరణం-2
తియ్యని కోర్కెలు రూపం దాల్చితే నీవే ఆ నారి
మన్మథబాణం మనసున తాకెను ఇదిగో తొలిసారి
మగసిరి నాలో మేల్కొల్పి
సొగసరి కానుక లాదించి,
సిరిసిరి ఊహలు రగిలించి
మరిమరి మధువులు చిందించి,
సుఖముల సరిగమ నేర్పించావే పలికిస్తా మరి .
కొత్త జీవితం
పల్లవి
కొత్త జీవితం - ఇది ఓ కొత్తజీవితం
రెండు తనువులను పెనవేసి,
రెండు మనసులను ముడివేసే
ఇది సరికొత్త జీవితం .
చరణం-1
నాతిచరామి మంత్రముతో
బాధ్యత తెలిపే జీవనం
మాగల్యధారణ తంతుతో
నైతిక విలువకు ప్రతిరూపం .
స్వర్గములోనే నిర్ణయమైన
పావనదైవ స్వరూపముగా ------
చరణం-2
ఏ ఒడిదుడుకులు వేధించినా
విదిపోనిదే ఈ సంబంధము
అనుకోని అలజడి ఎదురైనా
సహవాసమే ఈ అనుబంధం .
ఒకే మాటగా ఒకే బాటగా
ఏడేడు జన్మల పూదోటగా ------
SORRY BOYS
పల్లవి
SORRY BOYS - SO SORRY BOYS.
చకచక అందం కవ్విస్తే
లలలల కలలను రప్పిస్తే
పదపదపదమని నడిపిస్తే
కనులకు నిదురను తప్పిస్తే
SORRY SORRY SORRY HEY!BOYS!
SO SORRY EXTREMELY SORRY BOYS !
చరణం-1
జేబ్సు జేబ్సు ఖాళీ చేసే SORRY BOYS .
గిఫ్ట్ సెల్లు స్విచ్చాఫ్ చేసే SORRY BOYS .
రాక లో ఫ్రెండ్ తో షాక్ SORRY BOYS .
మాల్ లో బిల్ చేతి కిస్తే SORRY BOYS .
చరణం-2
చెల్లి ఫ్రెండుకు మెల్లకన్ను SORRY BOYS .
పక్క ఇంట్లో పాపల్లేరు SORRY BOYS .
సర్వెంట్ ముసలవ్వైతే SORRY BOYS .
కో ఎడ్ లో సీటు లేదు SORRY BOYS .
తెల్లచీర కట్టుకొని
పల్లవి
HE:తెల్లచీర కట్టుకొని , మల్లెపూలు పెట్టుకొని
కాళ్ళగజ్జ లెట్టుకొని,జడగప్పె లెట్టుకొని
బిందెత్తు కెళ్ళే పిల్లా నీ పేరు చెప్పవా?6
SHE:అబ్బో!ఎంత ఆశమ్మా!అట్టా పైకి రాకమ్మా!
HE:ఝనక్ !ఝనక్ జజ్జనక!ఝనక్ ఝనక్ జజ్జనక.
చరణం-1
HE:ముద్దూ ముచ్చట లేదు!నిదుర ఊసే లేనే లేదు.
అసలే ఆకలి కాదూ!అమ్మాయి నీ తోడు .
SHE:వస్తూ తొందర చేస్తావూ!వెళుతూ ఏడిపిస్తావూ!
అయినా కోపము రాదూ!అబ్బా!ఏంటి పోరు!
HE:తప్పు నాది కాదే చిలకా!నీ ఒంపూ సొంపులది .
SHE:ఓపలేను బాబూ!ఆ పెయ్ నీ చిలిపీసందడిని .
HE:అట్టాగంటే ఎట్టా!ఈ రాత్రి కల్లో కొస్తా!
SHE:అదేమైనా వింత!ఇది రోజు మాములెగా!
చరణం-2
HE:బిత్తర చూపులు చూస్తూ తత్తరపడతావే!
నాయుడు బావను నేనే!నా ఎంకి నువ్వేనే!
SHE:గారడినవ్వుల తోటి గాలా వేస్తావే!
ఏమ్మాయ నువు చేసినా నే లొంగుపోబోనులే!
HE:పత్తి చేను వెనకే నాకు అత్తకూతురౌతావా?
SHE:కత్తి లాంటి సొగసే చూసి పిచ్చి పట్టిపోతావా?
HE:ఆరాటమే మాటది . పోరాటమే ఈదుడి .
SHE:అమోమాటమే నాకది . చెలగాటమే నీకిది.
ఎట్టేగను ఈ మావతో
పల్లవి
HERO:ఎట్టేగను ఈ మావతో నాటుమోటు ఎవారమే
క్షణమొక గండంగా బయటపడ్డ పిండంలా
ఎట్టా నే బతకను?ఏ సావని సావను?
చరణం-1
HERO:సౌండింజనీరు మావ సావబాదుతున్నాడు .
ముదురుసుందరి మా అత్త ముచ్చెమటలు పోయిస్తోంది .
క్రాకేషు కూపీలతో కాల్చుకు తింటున్నాడు .
అపరిచితుడు టైపులో ఆరాతీస్తున్నాడు.
FRIEND:రోట్లో తలపెట్టి పో -----పోటుకు భయఎందుకురో!
అబ్బో!లబ్బో!వామ్మో!వాయ్యో!
చరణం-2
HERO:దీపావళి అంటేనే దడదడే పుడుతోందే!
గన్ను చూస్తే ఎడం కన్ను అదురుతూ ఉందే!
రాత్రైతే బతుకే తెల్లారేట్టనిపిస్తోందే !
నా నూకలు భూమి మీద చెల్లేరోజొచ్చిందే!
FRIEND:భయమెందుకురా మావా!నేనేగా నీ బీమా!
పద!పద!పద!
HERO:ఉండహే!
మరుమల్లై పుట్టింది
పల్లవి
మరుమల్లై పుట్టింది ఓ చంద్రిక
హరివిల్లై విరిసింది ఈ బాలిక (జ్యోతిక)
గుండెల్లో గుచ్చింది పూచాకుగా
ఊహల్లో కదిలింది పూరేకుగా
అరె జింగిచక్క జింగిచక్క జింగిచక్క .
చరణం-1
కదిలావా నీవు కాశ్మీరు అందాలు
మెదిలావా చాలు మనాలి మురిపాలు
నవ్వుల్లో నయగారా!వన్నెలలో ఎల్లోరా!
నీవే ఆ తారా!నీ జడ జలతారా!
వర్ణించాలంటే బ్రహ్మకె కంగారా!
చరణం-2
చెక్కిట చేరింది చేమంతి సింగారం
కనులుగ మారింది కలువల్లో సింగారం .
ముక్కున సంపెంగ !నుదుటన నెలవంక .
లేదే ఏ వంక !నీ సరి ఎవరింక !
మన్మథుడైనా పడతాడే నీ వెనక .
జో జో లాలి జో!
పల్లవి
జో జో లాలి జో!జో లాలీ జో జో జో!
తియ్యగా నా పాత వింటూ
చల్లగాలి వీచెనమ్మా!నిదురించవె కొమ్మా!హాయిగ నిదురించవె బొమ్మా!
కలతలు రాకూడదు లేమ్మా!
చరణం-1
మూసుకుపోయే కలువల కన్నుల
మెత్తగ తాకి జో కొట్టి
కమ్మని కలలే రావాలంటూ మనసారా దీవించమ్మా!
నిద్దుర పోనని మారాలు చేసే మనసొక అల్లరిపిల్లమ్మా!
ఆడీ పాడీ అలసిందేమో
సేద తీర్చవే నిదురమ్మా!
చరణం-2
వెన్నలలోని చలువను అంతా
మెల్లగ నీవు మోసుకొని
నిదురించే తను మేల్కొనకుండా
అల్లన రావే రాత్రమ్మా!
కలలో కూడా కన్నెనవ్వులు వన్నెవాసి పోనకుండా పువ్వులగంధం పెదవులపై
పూసి వెళ్ళవే నవ్వమ్మా!
తొంగితొంగి చూసింది
పల్లవి
తొంగితొంగి చూసింది నింగిలోన జాబిల్లి
పొంగిపొంగి పూచింది కుందనాల సిరిమల్లి .
ప్రతి ఏటా జరగాలి నీకీ పండగ .
మనసంతా చేరాలి ఆడీపాడగా!
HAPPY BIRTHDAY TO YOU
HAPPY HAPPY BIRTHDAY TO YOU
చరణం-1
అందమైన ఆడపిల్ల మది ఊసుల
అందగాడి కోసమని విరితూపులు .
దాచుకున్న ధనములు
దోచుకొమ్మని పిలుపులు .
చెంత చేర రమ్మని కన్నుల సన్నలు
అందజేయమన్నవి కానుకలు .
వింత చూడనున్నవి మిన్నుల మెరుపులు
కంటిలోన చెరెను తారకలు . //HAPPY BIRTHDAY//
చరణం-2
తీగలాగ కన్నెపిల్ల జతకోరులే!
రాగమల్లే జీవితాన్నే శృతి చేయులే!
అందమైన సంసారం - జంట జన్మల సంగమం .
రావాలి ఈ ఇంట ఆ పెళ్ళి సందడి
త్వరలోనె బాజా భజంత్రీలతో
సాగాలి ఆ రోజు సరదాల లాహిరి
మనసైన ఓ జంట మురిపాలతో .
HAPPY BIRTHDAY TO YOU
HAPPY HAPPY BIRTHDAY TO YOU
ALL THE BEST FOR FUTURE
WE WISH YOU ALL SUCCESS .
ఓ రంభా!మనదేగా
పల్లవి
HE:ఓ రంభా! మనదేగా ఆ మన్మథసామ్రాజ్యం ఏలేద్దాం .
SHE:రాంబాబూ!ముందుంది ఆ ముద్దులమధుమాసం వేచుందాం!
HE:క్షణమైనా ఇక యుగామేగా ఆలూమగలం అయ్యాక!
SHE:యుగమైనా ఒక క్షణమవదా ఒకరికి ఒకరం ఉన్నాక!
HE:ఎందుకింకా ఇంతదూరం చిలకా!
అందుకింకా ఆగలేను మొలకా!
SHE:చాలు మారాము ఇంతగా
పెద్దలున్నారు చాటుగా!
చరణం-1
HE:చేరువగా నే చేరాక రేపూమాపని అనక
కోరినదేదో అందిస్తే ఉంటాగా నే కిమ్మనక .
SHE:సుముహూర్తం పందిరి మంచం సిద్ధం లేవు గనక
సుఖమంత్రం చదివేటందుకు వేళిది కాదుర పిలగా
HE:రాతిరేళ రామచిలక కాలేవా!
SHE:వేళవస్తె రంభ నేనె ఔతాగా!
HE:పెళ్ళి ఐన బ్రహ్మచారి నేనేగా!
SHE:కళ్ళు మూసి బజ్జుకోర తూనీగా!
చరణం-2
HE:ఇనాళ్ళూ నన్నూరించి , వేధించావా లేదా!
ఇపుడేమో నన్నుడికించి ఏడ్పిస్తావే మరియాదా!
SHE:ఏనాడైనా నీ కిచ్చేదే ఇంపూసొంపూ సంపద .
ఆత్రంతో చేరనివ్వక కంచికి నీవు మన కథ
HE:దాటి రావె హద్డుగీత కొంటె తీగా!
SHE:ఆగి చూడు అంతదాక కందిరీగా!
HE:సద్దు లేని ముద్దులాట కింతసేపా!
SHE:సుద్దు చాలు
ఇంతలోనె అంతకైపా!
నా వయసే పదహారు
పల్లవి
నా వయసే పదహారు - కోరింది నీ తోడు
కావాలా ఇచ్చేస్తా - ఉడుకు ఉడుకు ఈడు
నా సామిరంగ తీసుకోర - నాటు నాటు కోడి కూర
ఆగకుండ తాగిపోర వేడి వేడి సీమ సారా!
చరణం-1
కళ్ళల్లో ఉందయ్యో కైపుకైపు కలేజా !
కళలను చూపి దోచుకోర నన్ను నీవు రాజా!
మగసిరి ఎంతో ఉన్నా సొగసుకు కిందే కన్నా!
ముఖముల్ సొకవ్వనా!సుఖములు దోచివ్వనా!
వయసునే మరిగించి,చిటికెలోన చల్లార్చనా!
చరణం-2
తకధిమి ఆడిస్తా!తలపడి ఓడిస్తా!
తపనలు రేపి తహతహలాడేట్టు చేస్తా!
మత్తును పెంచెయ్యనా!పద్దులు రాసెయ్యనా!
అదునే చూసెయ్యనా!పదునే చేసెయ్యనా!
నాదనే లేదని అంత నీకు దోచెయ్యనా!
నిజం నిజం
పల్లవి
నిజం నిజం ఒకటే నిజం
ఇజం ఇజం ఇది ఒక ఇజం .
ఎప్పటికైనా నిప్పులా కాల్చి బయటపడేదే ఈ నిజం .
ఎవ్వరైనా ఎప్పుడో అపుడు ఒప్పుకోవాలి ఈ నిజం .
చరణం-1
నివురు కప్పినంత మాత్రాన నిప్పు కాల్చకుంటుందా!
ఒకరు చెప్పనంత మాత్రాన నిజం దాగిపోతుందా!
చక్రవర్తినే కాటికాపరిని చేసిందే ఈ నిజం .
ఇంటిపేరుగా నిలిచి ఆయనకు మింట నిలిపింది ఈ నిజం .
చరణం-2
అగ్నిచే కాల్చబడనిది-నీటిచే తడపబడినది.
ఆత్మ ఒక్కటే కాదులే - నిజం అంతకన్న మిన్నలే!
నాశము చేయాలన్నవారిని నలిపివేస్తుంది ఈ నిజం .
శోధన చేసినవారికి తప్పక దొరుకుతుందిలే ఈ నిజం .
సారిగామా నీదే
పల్లవి
సారిగమా నీదే ఈ భామా!
చూస్తున్నావే లేదా హంగామా!
లేటేలమ్మా!లేచిటురారా గామా!
లేజా అంది లేతగులాబీరెమ్మ .
చరణం-1
సందిట్లో సంతూరు రాగాన్ని విందామా!
కౌగిట్లో కన్నేవాలని కసరత్ చేద్దామా!
అందిందె అందం - చిందించు గంధం .
సందేహంలో ఉంటూ దేహంతో వెయ్యకు పందెం .
చరణం-2
రాతిర్లో వలపుల చలిమంటే వేద్దామా!
జాతర్లో జోడీ లాగ జల్సా చేద్దామా!
చిక్కిందె చిత్రం-దక్కించు స్వర్గం
పట్టావెందుకు పగ్గం చేపట్టగ లేదా పగ్గం .
MADAM MADAM
పల్లవి
MADAM MADAM YES MADAM
I AM ALWAYS HERE FOR YOU MADAM
మీ కంటి చూపు కొసలే చాలు నా జన్మే ధన్యం .
చరణం-1
ఎవరో ఏదో చేశారని రాయై పోతే మీరెలా!
ఉల్లిని మల్లిని ఒకటే లెమ్మని అనుకోకండి మీరిలా!
మగాళ్ళందరూ ఒకటే అంటూ మండిపడుతుంటె నాకెలా?
మండిపడుతుంటె నాకెలా?
చరణం-2
తావేలేని పువ్వులు ఎంతో అందంగున్నా ఎం లాభం?
ప్రేమేలేని జీవితము ఎ రంగులు లేని ఓ లోకం .
మీరే లేక బతకడమూ ఏం చేసిన తప్పని ఓ నరకం .
ఎందుకు నాకీ నరకం?
చరణం-3
భార్యాభర్తకు స్మైలు కాపురం - లవర్స్ స్మైలు ప్రేమపావురం
రాజకీయపు రామాయణంలో స్మైలే లీడరుకున్న ధనం .
ఆఫీసర్ ను ఐస్ చేస్తుంది NGO స్మైలు నిజం .
స్మైలును చెప్పే గొప్పలు ఎందుకు
స్టైలుకు స్మైలే ఆభరణం .
ఏడేడూ జన్మల
పల్లవి
HE:ఏడేడూ జన్మల బంధం నీదీ నాదీ !
SHE:ఏనాడూ వీడని బంధం నాదీ నీదీ!
HE:నువులేక ఏ నిముషం నే బతుకలేను .
SHE:ఆ యముడే వచ్చిననూ నిన్ను విడువబోను .
చరణం-1
HE:ఎల్లలు ఎరగని స్నేహం కోరిన వరమూ
కల్లలు తెలియని ప్రేమ జన్మల ఫలము .
SHE:ఇచ్చావు నీవే ఈ ఋణము తీరనిదే!
ప్రతిజన్మలోను నాకు నీవె ఇవ్వవా!
చరణం-2
SHE:చూచే దేవతలంతా వరమివ్వాలి .
మళ్ళీ జన్మలో నువ్వే జోడవ్వాలి .
HE:అదేవతవు నీవే!సేవలు నీకే!
ఒక జన్మ ఏంటి?జన్మలన్నీ నీవెలే!
బావా బావా
పల్లవి
SHE:బావా బావా బావా!
బావా బావా కొంటె బావా!
మంత్యమంటి పిల్లదాన్ని!స్వచ్ఛమైన మనసుదాన్ని
అచ్చమైన సొగసుదాన్ని నేను కాదా!
అట్ల మీద పడితె ఇద్దరికీ ముప్పు రాదా!
HE:కోవా!కోవా!కోవా!
కోవా!కోవా!పాలకోవా!
గుడికి వస్తనంటావు.మడిలో కంటపడతావు .
ఒడిలోకి మాత్రము రావు కాదా!
నన్ను ఆశ పెట్టి చంపుతావు పాపం కాదా!
చరణం-1
SHE:పిచ్చిపట్టునట్లు చుట్టు తిరుగుతావు .
అమ్మో!రెచ్చగొట్టి ముగ్గులోకి దించుతావు.
అమ్మ చాటు ----అమ్మచాటు చిన్నదాన్ని
రెమ్మమాటు పువ్వు రాణ్ణి
సైగ చేసి నన్ను నీవు పిలవొద్దురా!
నీకు దండమెడత దారిలో కలవొద్దురా!
చరణం-2
పల్లవి
ఎందుకు ఈ శాపం - ఏమిటి నా పాపం!
జరిగిందీ ఇంత ఘోరం - ఓ అమ్మా!ఆకాశవాణీ!
కరుణించు ఈ దీమని .
చరణం-1
నన్ను మెచ్చి ఇచ్చావమ్మా ఆ మణిమయహారం .
చేతులారా నే జార్చుకొంటి - నా భార్యప్రేమ చేసె బ్రతుకుభారం .
ఎంత వారలైనా కాంతదాసులే!
తెలిసివచ్చెనమ్మ నా తప్పులే!
నీ శాపము తగలక ముందే నారూపము మారకముందే
దొరికించవె దండ - దయచూడవె నీవే అండ .
చరణం-2
వెదికి వెదికి విసిగినాను . నే తిరిగి తిరిగి అలసిపోయినాను .
మరలా హారం దొరుకుతుందా!అది మళ్ళీ నన్ను స్వర్గం చేర్చుతుందా!
చుట్టూ ఎటు చూసినా విషవలయం .
దాటి చేరలేను నేను తీరం .
ఇక మనిషిగా నే మిగాలాలా!- నా రూపము కోల్పోవాలా!
దాటాలి ఈ శోకాల - మరి ఎక్కడ నా మణిమాల !
మన్మథగోల
పల్లవి
మన్మథగోల - రంభారాంబాబుల లీల .
వెదుకో వెదుకు మన్మథుడు - ధింతక ధింతక ధింతక ధీం
పరుగో పరుగు రాంబాబు - ధింతక ధింతక ధింతక ధీం
పిల్లికేమో చెలగాటం - ధింతక ధింతక ధింతక ధీం
ఎలుకకు ప్రాణసంకటం - ధింతక ధింతక ధింతక ధీం
చరణం-1
అమాయకుడండి రాంబాబు - అల్లరి పిల్ల మన రంభ .
ఇద్దరిమధ్యన చిక్కాడు - మనసులమారి మన్మథుడు
ఇంతకాలం ప్రేమికుల ఏడ్పించే ఇతగాడు
అయ్యోపాపం మింటికి మంటికి ధారలా తిరిగి ఏడ్చాడు .
చరణం-2
వయసులో ఉన్న రాంబాబు - సొగసులో మిన్న మన రంభ
కలిశారంటే అయిపోతాడు కష్టాలు కాముడు .
పుష్పబాణం పక్కన పెట్టి వృతి మార్చి ఇతగాడు .
అయ్యోరామా!బెత్తం పట్టుక కాపలాలు కాస్తున్నాడు .
HAPPYHOME
పల్లవి
HE:HAPPY HOME! HAPPY HOME!మనదే HAPPY HOME
SHE:HAPPY HOME! HAPPY HOME!మనదే HAPPY HOME
SHE:చేరువగా వచ్చావు , చెలిమివై నిలిచావు .
ఎడారంటి నా మదికి స్వాతి చినుకయ్యావు .
HE:అనుకోక వచ్చాను . అనుభూతే చెందాను
నీతోనడిచే వేళ నీడనై పోయాను .
SHE:నిజమా!ఓ నా వరమా!
HE:ప్రియమా ఇది నీ మహిమా!
SHE:అందుకే నీతో అడవిలో ఉన్నా అదియే హ్యాపీ హం .
చరణం-2
HE:నీ మెరుపే మెరిసింది . నా బ్రతుకే వెలిగింది .
నీ రూపే దేవతలా నా ఎదలో నెలకొంది .
SHE:ఇన్నాళ్ళూ వేచింది నీవే జోడీ వండి .
నా ప్రేమ పన్నీరై నిన్నే అర్చిస్తోంది .
HE:క్షణమా! జన్మవు కామ్మా!
SHE:జన్మా!(నువు)అయిపోకమ్మా!
HE:చేసిపో నువ్వు వెచ్చని మారగుంటినే ఓ హ్యాపీ హొమ్
HAPPY LIFE
పల్లవి
HE:HAPPY LIFE!HAPPY LIFE! మనదే HAPPY LIFE
SHE:HAPPY LIFE! HAPPY LIFE! మనదే HAPPY LIFE
పిల్లలు:అమ్మంటే నాన్నకు ఇష్టం నాన్నంటే అమ్మకు ఇష్టం
అమ్మా నాన్నా అంటే ఇద్దరు ముద్దుల పిల్లల కిష్టం .
HE&SHE:అమ్మా నాన్నా ఇదారికీ ముద్దుల పిల్లలు ఎంతో ఇష్టం .
చరణం-1
SHE:ఆ దేవుడు తలచాడు నీకై సృష్టించాడు
ఈ సుందరలోకంలో ఒకరికి ఒకరన్నాడు .
HE:అజ్ఞానంలో నుంచి నన్నే మెల్కొల్పావు .
హద్దంటూ లేని సుఖము నాకే అందించావు.
SHE:తప్పే జరిగినదమ్మా!
HE:సుఖమే దక్కెను లేమ్మా!
SHE:క్షమియించవా యెహోవా!
దయచేయవా నీ బిడ్డలకు లైఫ్!
చరణం-2
HE:తినకూడని ఆ ఫలము తిన్నందుకు .
అనుకోని ఆ సుఖము పిల్లలతో జీవనము.
SHE:తిగ్గలేని పండమ్మా! పిల్లలతో మురిపెం.
కొదవింకేముంటుంది?నాదేలే ఆ స్వర్గం .
HE:దేవా!స్తోత్రము నీకు.
SHE:ప్రభువా!నిత్యము నీవు.
HE:చక్కని పిల్లలు , అందమైన తోటలో ఇది హ్యాపీ లైఫ్ .
ఈవూ!నవ్వూ!
పల్లవి
ఈవూ!నవ్వూ చిరునవ్వూ!
ఈ ఆడమ్ ఊపిరి నువ్వూ!
పువ్వే ముడిచింది మూతి నీలా!
ఆ గువ్వకు నీలా మౌనమేలా!
నా బాధే కార్చే ఆకులు కన్నీరుగా!
ఈ పొదలే వేచే మనకి బేలగా!
చూడు ఈడేనంతా ఏడుస్తోంది అలిగావంటూ నీవిలా!
చరణం-1
ఆటే తప్ప మరి ఏనాడూ అలకే తెలియని నేస్తమా!
బాసె తప్ప వేరే ఊసే ఎపుడూ నేర్వని నేత్రమా!
తుమ్మెదలా నే వాలగా వికసించాలే పువ్వుగా
దేహం వేరే ఉంటున్నా మన ప్రాణం మాత్రం ఒకటేగా!
చరణం-2
ఏమిటీ ఎపుడు
పల్లవి
HE:ఏమిటీ ఎపుడు లేని మోహం!
అబ్బ!ఎక్కడో నలుపుతోంది తాపం .
SHE:ఆ చూపెలా అయినదిట్లు బాణం
అమ్మో!కొత్త రుచులు కోరుతోంది ప్రాణం .
HE:హద్దులు తెలిశాయి . సరిహద్దులు పిలిచాయి .
SHE:కన్నులు కలిశాయి - మరి వెన్నులు వణికాయి .
చరణం-1
HE:కన్నులతో మొదలయ్యింది - ఒళ్ళంతా గొడవయ్యింది .
నిన్నీదాక రాణి ఊహతో తుళ్ళితుళ్ళి పడుతూ ఉంది .
SHE:నీవునేను వేరే అంది దాపరికం ఉండాలంది .
దాచుకుంటె తీరదు నీకే దోచి ఇవ్వమంటోంది .
HE:గెలుపే తప్ప ఓడని ఈ ఆటే బాగుంది .
చరణం-2
HE:నా ఎముకల్లో ఎముకా! నా మాంసంలో మాంసమా!
నన్ను ఇంత కవ్వించే శక్తి నీకు ఎక్కడిదే?
SHE:నా దేహంలో దేహమా!నా ప్రాణంలో ప్రాణమా!
తొలి అమ్మానాన్నలయ్యే ఆ అదృష్టానిదే!
HE:అందుకె ఈ గిలిగింత!తుదిలేని కవ్వింత!
చరణం-3
నిశ్చలమై నిర్జనమై
పల్లవి
నిశ్చలమై నిర్జనమై మరి అంధకారమై ఉండిన భూమిని
సృష్ట్యాదిని యేహోవా దేవుడు సుందరమ్ముగా చేసెను .
చరణం-1
మొదటిరోజున వెలుగునేర్పరచి,రాత్రింబళ్ళ విభజించి ,
రెండవరోజున తెరనేర్పరిచి,ఆకాశమనుచు పేరిడెను .
జలమంతా ఏకము చేసి,భూమి సంద్రముల నేర్పరిచి ,
భూమిపై వృక్షజాతిని ఏర్పడ మూడవరోజున చేసెను .
చరణం-2
నాల్గవరోజున సూర్యచంద్ర తారల నేర్పరిచి (వెలిగించి)
అయిదవరోజున చేపలను,పక్షులను సృష్టించె .
తనపోలికగా ఆడమ్ ను చేసి,వాని ఎముకను ఈవుగా మార్చి ,
భూమి పైన అధికార మిచ్చి,సమస్త జీవుల స్వాధీన వరచె .
వానిని వారికి ఆహారముగా ఆరవరోజున ఆదేశించెను .
ఆరురోజులలో పని పూర్తి చేసి,అలసిన దేవుడు ఏడోరోజు
విశ్రాంతి పొంది ఆ పవిత్రమ్ముగా ఆశీర్వదించెను .
ఆడుగడుగో ఆడుగడుగో
పల్లవి
అడుగడుగో ఆడుగడుగో అతడే సాతాను
నిండి బుసకొట్టే కాలనాగు తాను
తోయబడి,దేవునిచే తరమబడి,
ప్రతీకారవాంఛతో,దురధికారదుగ్దతో
దేవుని దించెయ్యాలని పథకం వేశాడు
తనరాజ్యాన్ని స్థాపించగ వచ్చాడు
. అతడే ----- సాతాను . అతడే సాతాను .
చరణం-1
ప్రభువు నుండి బిడ్డలను దూరం చేస్తాడు .
కోల్పోయిన పదవికై కుట్ర పన్నుతాడు .
పవిత్రతకు పాపపు పూతలు పూస్తాడు
మంచితనము మసి చేయగ మనిషిని కలిశాడు .
పాపకర్మ పుట్టించి,పోషిస్తాడు .
స్వార్థబీజమును నాటేస్తాడు .
దేవునిపై పగతో సృష్టిని చెండాడుతాడు .
చరణం-2
నీతీ అవినీతి హద్దు చెరిపేస్తాడు
వావీవరసలను మరచి పొమ్మంటాడు .
జాలీ కరుణలకు తావు లేదంటాడు .
మత్తులో మునిగే లోకం ముద్దంటాడు .
దేవుడెవడు ? నేనే కొత్తదేవుడంటాడు .
పాపఫలము ఎంతో తియ్యనంటాడు .
పరలోకము లేదు నేటి సుఖమే నిజమంటాడు .
సిసింద్రీలు,సిసింద్రీలు
పల్లవి
సిసింద్రీలు,సిసింద్రీలు సీమటపాకాయలు
చిన్నారులు కారు వీరు శివకాశీ బాంబులు
. చలచల్లని పిడుగులు వీళ్ళు
భల్ ముద్దొచ్చే భడవలు వీళ్ళు .
చరణం-1
తలిదండ్రుల తగవులను తీర్చేవేళల్లో పంచాయితి పెద్దలు వీళ్ళు .
అల్లరితో ఇల్లు పీకి పందిరి వేసేటప్పుడు బాబోయ్!
నో డౌటు వానరాగ్రగణ్యులు.
తగవులాడి మరుక్షణమే కలిసిపోయే వేళ
కనిపించని దేవుని ప్రతిరూపాలు
ముద్దుముద్దుమాటలతో మురిపాల మొలకలు .
హద్దు మీరి విసిగిస్తే పెనురక్కసి మూకలు .
చరణం-2
చెడును చూసి తప్పంటూ ఎదురొడ్డే సమయంలో
అరివీర భయం కారులు వీళ్ళు .
ప్రాణాలను పణపెట్టి,పరులను కాచేటప్పుడు
ఇలలో పరమాత్ముని అనుచరులు .
లక్ష్యాలను సాధించే కక్ష్యలో సాగేటప్పుడు
చెదరని దీక్షాకంకణదారులు.
చూడచూడముచ్చటేసె చిరునవ్వుల పువ్వులు .
మంకుపట్టు పట్టారా!ఉడుము కన్నఘనులు .
సూపర్ మేన్
పల్లవి
సూపర్ మేన్ , సూపర్ మేన్ ,సూపర్ డూపర్ మేన్
కలలో నువ్వే! ఇలలో నువ్వే!
ఎక్కడ చూచినా నువ్వే!
మదిలో నువ్వే - గదిలో నువ్వే!
మాటల్లోనూ నువ్వే!
నువ్వే మాన్ - మేరా డాన్
నీకే ఫాన్ - ఈ సిమ్రాన్ .
చరణం-1
ఆకాశం నేలకు దించే ఆ దమ్మే నీదే!
ఆపదలను గట్టెక్కించే గట్సన్నీ నీవే!
నా కోసం తెచ్చిస్తావా ఆ మబ్బుల్లో మెరుపులని
నీ కోసం నేనిస్తాలే - నా ఊహల్లో తళుకులని .
నైటంతా వింటానులే - నీ స్టోరీలో మలుపులని
ఆ పైన కునుకే -రాదు వస్తే కంతా నీ కలని .
చరణం-2
జై హనుమాన్నేమరిపించే ధైర్యమిచ్చావు అందరికీ
లోలోపల పీటం వేసిన సీక్రెట్ ఫ్రెండువి ఎందరికి?
నా కోసం దాటొస్తావా ఏడేడూ సంద్రాల్ని
నీ కోసం నే నొస్తాలే - చెరిపేసి హద్దుల్ని
ఇంకేం చెప్పను ఆ పైన నే మొగ్గనని
చెప్పకనే తెలుసుకునే నీ తలపే నాకు మొగ్గని .
HAPPY HAPPY BIRTHDAY
పల్లవి
HAPPY HAPPY BIRTHDAY-HAPPY BIRTHDAY .
దేవతలంతా దీవించరారే !
మా కంటి ఈ వెలుగుని - నూరేళ్ళు వర్ధిలమని .
చరణం-1
ఏటేటా నీకీ సరదా - తనిమేరా!
చంద్రునిలా కళలే నిండగా!
నీ వంశం ఎత్తేలా - నీ గర్వించేలా!
ఎదగాలి నువు కొండలా!ఆదర్శమై నిలవగా
(దేశమాత మెడలో దండలా!)
చరణం-2
మనిషంటే అర్థం తెలిసి - మంచికి నువు నిలిచి
మన్ననలే పొందాలిలే !
అవతారపురుషుల కథలే - నీ నడతలో ఒరవడి దిద్ది
ధన్యమవ్వాలిలే - పొందాలిలే!
HEY GUYS!
పల్లవి
HEY GUYS!YOU ARE RIGHT!
HEY BOYS!JUST DO IT !
పబ్బుకు వెళ్ళే వయసే నీదిరా !
పగ్గం వెయ్యక సరదా చెయ్యరా!
LIFE IS BEAUTIFUL!
YOU MAKE IT COLOURFUL!
చరణం-1
BE CARE OF ENJOYMENT - YEAH HOO!YEAH HOO!
BEWARE OF ATTACHMENT - BE CAUTIOUS.
ఆంటీ అయినా నో సెంటిమెంట్ - HURRAY
చేసేయ్యరా సెటిల్ మెంట్ - YOU CAN!
LIFE IS BEAUTIFUL !
YOU MAKE IT COLOURFUL
చరణం-2
MY SECRET OF ENERG- SHOOT IT
HAPPYNESSE BENERGY - WOW!
ఏడుపు అంటేనే అలర్జీ !- ఎగ్జాక్ట్లీ !
పాపల నవ్వే సిరంజీ - వార్రేవా !
LIFE IS BEAUTIFUL !
YOU MAKE IT COLOURFUL !
ఈ పడుచుపాపకై
పల్లవి
SHE(సాకీ):ఈ పడుచుపాపకై ఏడ్చే పసిబావల్లారా!
నా షరతులకు మీరు లొంగిపడుంటారా!OK!
HE:OK!OK!డబుల్ OK!
SHE:ఫాపకు OK అయితే HE:బావలకు డబుల్ ఓకే .
SHE:పాపే సయ్యంటే HE:బావలు సైసయ్యే .
SHE: సై HE: సైసై
SHE:మల్లెలగంపే తేకుంటే - మీరు తేకుంటే ----
HE:ముక్కు మీ దొట్టు - కాలితో కొట్టు .
SHE:మంచం మూలుగు వినకుంటే , వినబడకుంటే ----
HE:టాటా చెప్పేసెయ్ , టాటా చెప్పేసెయ్ ,
SHE:ఏ రోజైనా లేకుంటే , ఆ రోజ్ నుండి భారత్ బందే!
HE:గుడుగుడుగుడుగుంచం - నిన్ను దిగనియ్యము మంచం .
చరణం-2
SHE:రాత్రీ పగలని నసలొద్దు - అలసట లొద్దు .
HE:పొద్దులే వద్దు - హద్దులే రద్దు .
SHE:ఇల్లూవాకిలి తలవొద్దు - నను మరవొద్దు .
HE:నీ కళ్ళు మా ఇళ్ళు - నీ ఒళ్ళు వాకిళ్ళు .
SHE:మాటలు చెప్పి మోసం చేస్తే - గోతులు తేసి పాతరవేస్తా!
HE:గుడుగుడుగుడుగుంచం - నిన్ను దిగనియ్యము మంచం .
పదరా పదరా పదరా!
పల్లవి
పదరా పదరా పదరా-పదరా ముందుకు పదరా!
కాలంతో పోటీపడుతూ చేసెయ్యర సమరం .
సంకల్పం సాధించేందుకు పయనం .
అవమానాలు , అవహేళనలు కలిగిచాలి చలనం .
అలుపూసొలుపూ ఎరగక నీవు సాధించు విజయం .
చరణం-1
సాధించాలని తపనుంటే దిగివస్తుంది సురగంగే!
కలిసొస్తుందని కలగంటే జీవితమంతా వ్యథపొంగే!
అలలా చెలిరేగరా - ఆ తీరం కోసం .
అవరోథం ఏదైనా - గమ్యం నీ లక్ష్యం .
పదరా ఎదురేదిరా శ్రమయే నీ తోడురా!
కష్టేఫలంటు ముందుకు పదరా - మాట్టే మణి కాదా!
చరణం-2
అందాలాబొమ్మా!
పల్లవి
HE:అందాలబొమ్మా! అనుకున్నది జరిగింది.
ఇన్నాళ్ళ కలలే నిజమయ్యే వేళైంది .
SHE:ఓ అబ్బాయిగారూ! కోరిందే జరిగింది .
ఎంతెంతో దూరం అనుకున్నది ఎదురైంది .
HE:ఇక ముందుండే ముచ్చటకే అడ్డే తొలిగింది .
SHE:ఆ తొందరలే చూస్తుంటే సిగ్గే వేస్తోంది .
చరణం-1
HE:ఈ ప్రేమను చూస్తుంటే కన్నే కుడుతోంది .
ఏ జంటను విడివిడిగా ఉంచాను అంటోంది .
SHE:ఆ ప్రేమే నిన్నూ నన్నూ ఒకటిగా చేసింది .
ఈ ప్రేమకు ప్రతిరోజూ మొక్కాలని ఉంది .
HE:ఈ మొక్కులు నీ ముడుపులు కావాలి నా సొంతం .
SHE:ఇక ఎందుకు నువు అడగటం . నే నిస్తాగా సాంతం .
HE:దోచేస్తా అందంచందం . కన్యాదానం దాకా ఆగం .
SHE:అమ్మో!అట్లైతే నే వెళ్ళి మల్లి వస్తా!
HE:అయ్యో!నీ వట్లా తిరగేస్తే ప్లేటు ఎట్లా?
చరణం-2
SHE:గుండెల్లో నువు తాపం పెంచుతూ ఉన్నా
కన్నుల్లో నీ రూపం దాస్తూనే ఉన్నా!
HE:రేయంతా నువ్ కలలో కవ్విస్తూ ఉన్నా!
పగలైతే నీ చుట్టూ పరిగెడుతూ ఉన్నా!
SHE:ఈ ప్రేమకే నే బానిస . ప్రతి నీవే జంట .
HE:ఈ నాటికీ ఏనాటికీ నా ప్రేమే నీ తోడంట .
SHE:గుండెల్లో గుసగుసలన్నీ పిలిచేనంట .
HE:ఐతే ఈ క్షణమే హనిమూనుకు పదమంట .
SHE:అదిగో ఆ వరసే అబ్బాయీ వద్దంట .
పెద్ద మనిషి నైనానని
పల్లవి
పెద్ద మనిషి నైనానని చెప్పేటి ఈ పైట
నిలవనంటదేమే రామణమ్మక్కా !
ఎలా ఆపనీ రాజమ్మక్కా!
చరణం-1
నిన్నదాక సరిపోయిన నల్లసుక్కలరైక
ఇయ్యాల పట్టదేంటి సూరమ్మక్కా!
ఇరుకై పోయిందేంటే సిన్నక్కా!
పెట్టిగాని అంగడి సందులో కెళుతుంటే
పోకిరోళ్ళు ఎగాదిగా సూస్తరేందే అక్కా!
నేనేమీ సేతునే రంగమ్మక్కా!-(2)
చరణం-2
సంకురేతిరి సంబరాల్లో సెక్కబజన సేత్తనంటె
వద్దంటాందే ఎల్లమ్మక్కా!
ఈ సిత్రమేందో సెప్పు సోమక్కా!
నిన్నదాక నా తోటి నేస్తం కట్టిన రంగడు
ఎట్టాగో సూస్తాడు ఏందక్కా !
నా కెట్టాగో ఉంటాదే లచ్చుమ్మక్కా!
చరణం-3
బైకెనే రాకెట్
పల్లవి
HE:బైకెనే రాకెట్ చేస్తా!
జెట్టులా దూసుకు పోతా!
మబ్బులో మేరుపూను ఔతా!
రోడ్డులో రేసింగ్ చేస్తా
SHE:పడ్డాక , రిస్కులే లేవంట
దేవుడే ఎదురైనా డోంట్ కేర్ మేమంట .
చరణం-1
HE:అమ్మాయి అందంగా పక్కనే కూర్చుంటే
చంద్రుణ్ణి ఎంచక్కా చిటికెలో చేరేయ్ నా!
SHE:అబ్బాయి తోడుంటే ఆ నింగి దాకైనా
అలుపంటు లేకుండా సరదాగ నే పోనా!
HE:ప్రేమలోకము తాకి ప్రామిసే చేద్దామా!
SHE:పేరెంట్స్ ఏమన్నా కన్విన్స్ చేద్దామా!
చరణం-2
SHE:ఎవరెస్ట్ శిఖరాన్ని చిటికెలో ఎక్కెయ్ నా!
లవ్ కెంత పవరుందో లోకాన చాటెయ్ నా!
HE:పసిఫిక్కు ఓషన్ని ఎక్ పల్ మె ఈదెయ్ నా!
ప్రేమికుల
SHE:ప్రేమ వర్శిటి పెట్టి పాటాలు చెబుదామా!
HE:ప్రేమలో పడ్డంపై కాంపైను చేద్దామా!
సంతోషిమాతా!
పల్లవి
సంతోషిమాతా!మా ఇంటి దేవతా!
సౌభాగ్యమిమ్మా!నిన్నే వేడే ద!
చరణం-1
పసుపుకుంకుమలు తాళి పూలు
నల్లపూసలు , కాటుక , కాలిమెట్టెలు
ముత్తైదువు బ్రతుకున తరగని సిరులు
భోగాభాగ్యాలెందుకు నీ దయ చాలు
చరణం-2
. చిన్ననాటి నుండి నే చేసిన తపము
సఫలము చేసితివమ్మా!చల్లని తల్లీ!
నే వలచి వలపించిన ప్రేమమూర్తిని
నా వాడిగ చేసితివి నీ దయ చూపి .
చరణం-3
SHE:అ
HE:అ
SHE:అ
HE:అ
SHE:అ
HE:అ
SHE:అ
HE:అ
A
పల్లవి
చరణం-1
చరణం-2
పాటలు రాసిన చిత్రాలు
1)రాజువయ్యా మారాజువయ్యా, 2)పోసాని జెంటిల్ మెన్ , 3)సోల్జర్,
4)శీనుగాడు , 5)పరంపర, 6) సిసింద్రీ బాబాయ్ ,
7)లవ్ జంక్షన్ , 8)ఆ అంతస్తులో, 9)ప్రేమించే రోజుల్లో ,
10)ప్రేమతో నువ్వు వస్తావని, 11)ప్రియమైన శ్రీమతి, 12)మాంగో ,
13)సర్కార్, 14)పోలీస్ అధికారి , 15) 4 కపుల్స్ ,
16)నా మొగుడు చిరంజీవి, 17)గజ దొంగలు , 18) 100% లవ్,
19)జననీ జన్మ భూమిశ్చా , 20)భార్య , 21)జీవనపోరాటం ,
22)నీ పిలుపు కోసం, 23)కొత్త జీవితం, 24)పక్కింటి అమ్మాయి ,
25)దొరగారింట్లో దొంగలు , 26)వంశీ కృష్ణ , 27)వీడా,
28)నవ్వుల సందడి , 29)ఘరానామొగుడు , 30)నియంత,
31)రౌడీ గారి పెళ్ళాం , 32)దోషి, 33)గాలి శీను ,
34)రంభ -రాంబాబు , 35)లక్ష్మీ రాజా , 36)మేడమ్ మేడమ్ YES మేడమ్ ,
37)నిజం నిజం ఒకటే నిజం , 38)హైటెక్ లవ్, 39) జాదూగాళ్ళు ,
40)రాంగ్ నంబర్ , 41)SORRY BOYS, 42)ఉద్రేకం ,
43)చిన్నా, 44)యమకేటుగాడు 45)మాలిష్ మంగ ,
46)ఆ ఇంట్లో ఒక రోజు , 47)పోలీస్ ఎంక్వైరీ, 48)టార్గెట్,
49)బుల్లెబ్బాయ్ , 50)కిరాయి గూండా
పొందిన పురస్కారాలు
విశిష్ట మహిళ -- జూనియర్ చాంబర్స్ తిరుపతి
విశిష్ట మహిళ -- యునెస్కో క్లబ్ బెస్ట్ లేడీ 2010 (సినీ గీత రచన)-- అభినందన సంస్థ ,హైదరాబాద్
ఉత్తమ గేయరచయిత్రి -- భరతముని అకాడమి
గ్రేట్ డాటర్ ఆఫ్ ద సాయిల్ -- కడపోత్సవ కమిటీ
బెస్ట్ గోల్డెన్ కపుల్ -- యునెస్కో క్లబ్
బెస్ట్ ఆల్ రౌండర్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ -- జమ్మలమడుగు డిగ్రీ కాలేజి కమిటీ
రచన :- రాణీ పులోమజా దేవి
ఎలా పూర్తి చేయను నీ విచ్చిన పనిని .
నీ వెచ్చని కౌగిలే మదిని మథిస్తుంటే.
* * *
88) నీ కీరవాణి రాగం కా కరముల బంధనం .
నీ ఆగని తమకం నా తపనకు ఇంధనం
నీ చిలిపి సన్నలే నా , నీ చెలిమికి ఓదనం
నీ భావుకహృదయమే నాకు దొరికిన పెనుధనం.
* * *
89) నీ వెచ్చని కౌగిలి కోరేనోయి ఈ చలి .
ఈ కలిలో ఆపలేను నేను 'ఆ ' ఆకలి
మదాళివై నన్ను పెట్టకుమా గిలిగిలి .
విరాళితో నేను వేగుచుంటి సొక్కిలి.
* * *
90) ఇదేనా మదనావస్థ ?
అందుకేనేనా దీనిని వద్దంటుందీ వ్యవస్థ
ఏమీ చెయ్యనివ్వదూ ఎటకూ పోనివ్వదు.
స్పృహలోన ఉండేటి కోమాయే ఈ స్థితి .
* * *
91) ఎట దాచను ఈ మేనివంపులు
నీ ఒడి నాకు దూరమున్నపుడు .
ఎచట పొదగను ఉబుకుసొంపులు
నీ వేడి పరువం చెంతలేనపుడు .
* * *
92) ఎందుకీ ఆనందం ?ఉవ్వెత్తున ఎగిసే మోదతరంగం ?
గాలికన్న చులకనై వీచినట్టి భావన
ధూళికన్న చిన్ననై ఎగిసిన ఆలాపన
నీ మాటే చేసింది ఇంతటి జాలం .
నీ పలుకే వేసింది నా మనసుకు గాలం .
* * *
93) కలిసి చేసే పనులు కామునికే నెలవులు
కలిసి పాడే పాటలు పంచబాణు ములుకులు
కలిసి ఆడే ఆటలు అలరువిల్తు కోటలు .
కలిసి పొందు కలుములు కందర్పుపూజా ఫలములు .
* * *
94) ఈ ముద్దు . ఇది తొలిముద్దు
ఇరుగుండెల చప్పుళ్ళతో కలబోసినది .
ఈ ముద్దు ఇది మలిముద్దు
మధురోహలు మది మెదిలి ఇస్తున్నది .
మధురోహలు మది మెదిలి ఇస్తున్నది .
ఆ పైన కొసరేటి ప్రతి ముద్దూ
అనురాగార్ణవముకు వంతెన వేస్తున్నది .
* * *
96) ఎందుకింతగా ఆకర్షించావు నన్ను
నీవు లేని ప్రతిక్షణం భరించడం అసాధ్యం
శివుని వదలి ప్రాణత్యాగం చేసుకునేతప్పటి
సతికి కలిగినలాంటి నాలో మెదిలే భావం .
* * *
97) నీవు గంభీరంగా పనిచేసుకుంటున్నావని
అలిగానని నను కించగా ఎంచకు
నిజానికి నా మనసులో నేనే నీ పనినై పోయి
నీవు తేలికగా చెయ్యగలిగేలా చెయ్యాలని ఉంది.
* * *
98) కామెర్లరోగి కంటికి లోకమంతా పచ్చనేనట .
ప్రేమరోగముతోన సొక్కి సొమ్మసిల్లే నాకు మాత్రం .
లోకమందున మనది మాత్రమే ప్రేమ అని అనిపించడం
ఎంత చిత్రం ! అందుకే ప్రేమ భాష్యాలకు అతీతం .
* * *
99) సూర్యుడొచ్చిన తర్వాత వికసించి అలంకరించుకుంటుంది కమలం .
చంద్రుడు చేతితో తట్టి లేపిన తర్వాతే బద్ధకంగా తయారౌతుంది కుముదం .
నీవు వస్తావన్న ఊహ కలిగితే చాలు నాకు ఏ క్షణం
నిలువెల్లా అలంకరించుకొని నిలిచి ఉంటున్నా రాదే నీకు కనికరం
* * *
100) నేను ఊహనైతే నీవు అందున్న భావానివి .
నే కవితనైతే నీ వందులోని అర్థానివి .
పువ్వు - పరిమళంలా , అందం - అలరింతలా
మొగుడూ పెళ్ళాలైన చక్కనిబంధం మనది .
* * *
101) ఎప్పుడైనా విన్నావా ?ఎక్కడైనా కన్నావా ?
ఓ పువ్వు మరో పువ్వు నుండి మధువు గ్రోలడం .
నా పెదవిని తరచే నీ పెదవేనోయీ
ఆ వివశత్వపు విడ్డూరానికి ఉదాహరణం .
* * *
102) ఇంతటి నీ ఆరాధనకు నే నర్హురాలిని కావాలనుకున్నా
అందుకే నీలో ఐక్యమైపోయి ఆస్థిత్వాన్ని వదలి
అర్హతానర్హతల చర్చకు పాడాను చరమగీతిక
దిగంతాలు కలిసే చోట నేలనింగిల సమానత్వాల బేరీజుకు తావేదీ ఇక !
* * *
103) ఈ గోడలు ఎందుకింత స్తబ్దంగా నిశ్సబ్దంగా ఉన్నాయి ?
నీవున్నప్పటిలా ఉత్సాహంగా ఊగిపోకుండా !
నీవు లేక ఒంటరితనంతో వేగే నన్ను చూస్తే
బహుశా వాటికీ జాలేసిన్దేమో అంతగా !
* * *
104) నీవు లేని ప్రతిసెకనూ
సుడులు లేని కొలను
* * *
105) తాకితేనే చాలు
తలమించు మోహాలు
చూపు మీటిన చాలు
శృతి మించు దాహాలు
* * *
106) నా ఆశాభంగపు కన్నీళ్ళు
నిన్ను మరుని తూపులై వేచుగాక !
నా విరహిత ద్రుక్కులు
నిన్ను ప్రేమదవానలంలో మాడ్చుగాక !
నా గుండెలో సుడులు తిరిగే భాధ
నిను వలపు సుడిగుండంలోకి ఈడ్చుగాక !
* * *
107) వెన్నెల కురిసి మురిపించి విరబూయించిన చంద్రుడు
దిగిరమ్మన్నా రాకుండా ఉండిపోతే -----
ఏడ్చి ఊర్కునే బేలకలువను కాను .
తూడునే తూణీరం చేసి
మొగ్గనే శీలీముఖం చేసి
చంద్రుడినే గురిచూసి వలపుగాయం చేసే
వలరాజు వలపుసాయకమైన నీలోత్పలాన్ని నేను .
* * *
108) ఏవీ చందన చర్చలు ? ఏవీ శీతల సేవలు ?
ఏవీ పువ్వులసెజ్జలు ? ఏవీ ఊరతపల్కులు ?
ఓహో ! అవన్నీ రాకుమారికలకే చెల్లునంటారా ?
కానీ ఆ తారతమ్యం ఆ మనసులేని మనసిజుడికి లేదే !
ఏం చెయ్యను ? అయినా కానీ నాకేం పరవాలేదు .
నా ప్రియుని వస్త్రమే నాకు పూల శయ్య
నా తలపే నాకు శీతలసేవ
నీ వలపే నాకు చందన చర్చ .
నా మరుని ఊర్పే నాకు ఊరటమాట .
* * *
109) నవ్వుకో !నవ్వుకో! నన్ను చూచి నవ్వుకో
ప్రేమబాణంతో కొట్టి గిలగిలలాడే పిట్టను
వోదార్చ మనసు లేని కరకు వేటగానివా ?
వలపు పంజరాన పెట్టి గిజగిజలాడే చిలుకను
విలాసంగ నవ్వుకుంటు చూచే యజమానివా ?
నీలిమేఘమును చూచి నాట్యమాడు మయూరిని
క్రుంగజేయు క్రూరమైన సుడిగాలివే నీవా ?
* * *
వోదార్చ మనసు లేని కరకు వేటగానివా ?
వలపు పంజరాన పెట్టి గిజగిజలాడే చిలుకను
విలాసంగ నవ్వుకుంటు చూచే యజమానివా ?
నీలిమేఘమును చూచి నాట్యమాడు మయూరిని
క్రుంగజేయు క్రూరమైన సుడిగాలివే నీవా ?
* * *
110) సమున్నత శిఖరాగ్రం నుండి దూకే
జలపాతపు హోరును తలపించే ఆ తొలినాళ్ళ ప్రేమావేగం
చల్లారిపోయిందనుకున్నాను .
కానీ , అది గాఢమైన లోతు కలిగిన
ప్రశాంత మందాకినీనదంగా
మారి నిలకడై సాగుతోందని నేడే తెలుసుకున్నాను .
* * *
సరిసరి నను మరి ఉదికించకు మిక
నీ సరి లేరని తలచితి నేడే !
యవ్వనమంతయు నీకై దాగిన
వైనము వాడిగ వెడలెనులే !
ఆకుకు చాటుగ దాగిన పువ్వుకు
నీ దయతో తెర తొలిగెనులే !
* * *
* * *
నీకు అన్నీతక్కువై బాధ .
(ధైర్యము ,తెగువ ,సాహసము ,చొరువ )
* * *
ఓ అందగాడా ! నీదే ఈ శిల్పం .
నీ చూపుల ఉలితో చెక్కిన ఒంపులు
నీకేగా సొంతం
కడునిరుపేదను నేను .
నవనిధివై వచ్చి తీవు .
నా జీవన గమనములో
నిలిచిన పెన్నిధి నీవు .
2
ప్రియా ! నీవు చెంతలేని దివారాత్రములు అతి నిరాసక్తములు ,కడు సుదీర్ఘములై అనేక ఊహలకు తావిచ్చుచు ఒక పరి చల్లని గాలిని చేసి , నిను సుతిమెత్తగా స్పృశింపజేయుచు మరియొక పరి మందగమనయైన అంబుదముగా రూపింపజేసి ,నిను ప్రేమామృత ధారల అభిషేకింప జేయుచు , వేరొక పరి చకోర చెలిని జేసి , నీ వాదనరాకాచంద్ర నిరమ చంద్రికల తనివార గ్రోల జేయుచు , స్వైరవిహారియైన సుమశరుని బారిసేసి , అంతలోనే అంతయూ మటుమాయ మొనరించి , అలోకాంధకారమందు నను ఏ కాకిని సేయంచు, నిన్ను చేరు దారిలేక , నిన్ను మరువ వీలు కాక , నిట్టార్పుల నిర్లక్ష్యముగా నలుపుతున్నవోయీ !
౩
ఆహా ! ఏమీ నా ఈ మనసు ? నీ వెడుత లేని క్షణమున కూడా నిను మరువనేరక ,నీ ఊహామూర్తిని ఔదల దాల్చి ,గగనాంతరగుహ్య సీమలకు చేర్చి , నాక నారీమణులు నిను గాంచి ,కంతజయంతభ్రాంతిలో డాయుదురీమౌనని భయమెంది,తారావల్లభు చాటుగా ,పర్జన్యుల మాటుగా నిను తరలించి ,సురఝరినిఅనురాగరసఝరిగా మలచి , నిన్నందు ఓలలాడించి , సురపారిజాత సుమసౌరభామును మించు ,తన మనోమోహ సుగంధమున తనియించి ,నిను చేరవచ్చిన శ్రీగంధసంభరితమలయా నిలమును కేలనే పరిహరించి , అంతర్విహూద్భూత ఉష్ణ మిళితములైన
తన శ్వాసలచే నీ ఒడలి తడియార్చి , అనిక్షణం తవ చింతనా ఫలములుగా తనలో విరియబూచిన వలపుపూవుల గుది గ్రుచ్చి , హేలగా నీ కంట్ట సీమను అలంకరించుచున్నదోయీ సఖా !
4
చెలికాడా !ఏమి ఈ బంధము ?శ్రీగంధసంవహగంధ వృక్షములను అలవోకగా పెకలించు ఝంఝామారుతమై నన్నూ పిరి త్రిప్పుకోనీక చుట్టివేసి , నాలోని వివేచనను సమూలమంగా పెకలించి ,నన్ను మత్తను చేయుచూ చిత్తమును వేరొకచో నిలువనీక నీ యందే లగ్నమనస్కను చేయుచూ నీ అనురాగ పూరంబులైన దృక్కుల నను జలకమాడించుచూ ఒక పరి , నీ కాక్షాపూరిత వీక్షణముల పాల్జేసి , ఒడలెల్ల పులకలు రేగజేయుచూ ఒకపరి ,నీ బద్ధ కార్యాదీక్షాపరిపూరిత శూన్యచూడ్కుల విముఖను చేసి వేరొక పరి , నీ ప్రియక్రియాతను స్పర్శల సుముఖను జేయుచూ మరొకపరి ,అలరించి , అపారమైన , అపూర్వమైన , అనంతమైన , అమేయమైన నీ ప్రేమాపయోధారాల నను అభిషిక్తను చేసి ,దివ్యమహారాజ్ఞీత్వ మాపాదించి ,అత్యున్నత ప్రేమికాపీట్టమున నీ సరసన కూర్చుండబెట్టుచున్నది .
5
ఎంత సుందరమైనది ఆ మానసరోవరం ! సుజలసుహృద్యమమై , నిర్మలనేత్రోత్సవమై , ఒకచో అగాధమై , దాపుననే ఉన్నతమై , ఒక్కచో విశాలమై , సమీపముననే సంకుచితమై , తాకినంత అలలై ఉవ్వెత్తున పడుచూ ,ఎగయుచూ , స్పృశించినంత ఎడదరీతి స్పందించుచూ ,పరివేష్టిత కృష్ణ తృణ సంపదార్ణవమై , (దినకర) కరతాడనమున మనోజ్ఞముగా కాన్పడుచూ , చూపరుల కదలనీక కట్టేదుటనే నిలవేయుచూ , గుహ్యమై , గహనమై , అలభ్యమై కవ్వించుచూ నిరంతరస్రవిత సుగంధరసముచే ఊరించుచు , మౌనులనైనా తలపెట్టుగోర జేయుచూ తన విలాసమ్ముతో మరులుగొల్పుచున్నది.
1
హక్కుభుక్తమైన దానిని అడుక్కోవడం .
అర్హతలేని దానిని ఆశించడం
అవకాసం లేకపోయినా అర్రులు చాచడం .
ఆకాశకుసుమాన్ని అందుకోవాలనుకోవడం అవివేకం .
SONGS
1
బహువీర సంతాన వినుత జనయిత్రీ !
చరణం
ఆజాద్ -హింద్ కై ఫౌజునే నడిపిన
ఆ చంద్రబోసు నీ ప్రియపుత్రుడేగా !
సత్యాగ్రహమ్మొక శక్తి ఆయుధమని
జగతికే చాటిన గాంధీ నీ సుతుడెగా !
చరణం
రాణీరుద్రమ నుండి ఝాన్సీరా ణి వరకు
కేప్టన్ లక్ష్మి నుండి కిరణ్ బేడీ వరకు
నీ ఒడిని ఆడిన ఆడవారందరూ
అబలలము కాదని అవని చాటారుగా !
చరణం
శత్రువులు ఎవరొచ్చి నిన్ను చెరబట్టినా
ఎల్లలలో ఎటు నుండి నిను ఆక్రమించినా
పరిమార్చి , హతమార్చి నిను నిలుపుకొందుము .
నిర్వీర్యులము కాము నీ వీరపుత్రులము .
2
పల్లవి
భారతదేశము నాదంటూ గర్విస్తే చాలదు .
స్వర్ణభూమంటు ఊరకే కీర్తిస్తే మారదు .
బంగరుముద్దను మలచే స్వర్ణకారుడి వోలె
మన దేశప్రగతి మనమే రచియించవలె .
చరణం
ఉపఖండమని భారతభూమికున్న బిరుదును
అభివృద్ధిని సాధించి నిలపాలి మనము .
గుర్తింపుకో , ధనపెంపుకో దేశాన్ని వదిలే
మన మేధావుల వలసలను ఆపాలి మనము .
చరణం
అన్నదాతలు తృప్తిగా అన్నము తినగలిగేలా
చేయగల్గిననాడే దేశము అన్నపూర్ణ .
ధనికులంతా కుబేరులు కానక్కరలేదు .
పేదలు కడునిరుపేదలుగా కాకుండా ఆపు .
చరణం
పల్లెల నుండి పొరుగుదేశ పొత్తుల వరకు
పంచశీలసూత్రాలను పాటింఛి చూడు
నాడే విశ్వపతాకమున తెలిపావురమై
భారతదేశము శాంతిగీతమ్మునే పాడు .
3
పల్లవి
నమస్కారము విశ్వదేవతా !
నీ కిదె మా నమస్కారము .
"సర్వేజనా సుఖినో భవంతు "
అనుటే భారత సంస్కారము .
చరణం
విశ్వశాంతికై పాటుపడుటలో
మొదటివారము మేమో తల్లి !
విశ్వమానవత అను భావమునకు
పాదు చేసెదము ప్రణమిల్లి .
చరణం
ప్రాంతము వేరని ,భాష వేరని
వర్ణము వేరని , మతము వేరని
బేధా లెరుగని భారతీయులం .
భాయీ భాయీ మా నినాదం .
చరణం
5 . స్వాతంత్ర్య దినోత్సవం
పల్లవి
అర్దరాత్రివేళలో స్వేచ్చా సూర్యోదయం .
ఆగస్ట్ పదహైదున అరుణారుణశుభోదయం .
చరణం
పరతంత్రపు పాయసంతో చేదెక్కిన నాల్కలకు
స్వాతంత్ర్యపు గంజి చవుల రేకెత్తించిన సమయం .
విదేశీ బిరుదాళితొ బిరుసెక్కిన భుజాలను
స్వదేశీ సైనుగుడ్డ చల్లగ తాకిన తరుణం .
చరణం
కులమంటూ మతమంటూ కుమ్ములాడుకున్న జనం
కలిసి వందేమాతర గీతిక పాడినదీ ఉదయం .
బానిస అనిపించుకుంటు బాసట లేనట్టి మనం .
సగర్వంగ నింగి తాక తలలెత్తిన మహోదయం .
చరణం
సత్యమైన ఆగ్రహం సింహస్వప్నమైపోయి
శత్రువులను పొలిమేరకు తరిమినట్టి దీ దినం .
సంస్కృతి తొలి నెలవైన భారతజాతి ఎప్పుడూ
చేవను కోల్పోదని చాటించిన ఘనవిజయం .
6.జాతిపతాక
పల్లవి
జాతిపతాకం మన జాతిపతాకం .
జనజాగృతి సంకేతం ఈ జాతిపతాకం .
చరణం
బాపూజీ బోసినోట వెల్లివిరిసినట్టి
చిరునవ్వుల వెల్లదనము ఆవరించినట్లు
పరిపూర్ణత తెలిసేలా చల్లదనం కలిగేలా
మన జెండా తెల్లదనం అదిగో కనవోయీ !
చరణం
బానిసత్వ మోర్వలేక భారతమాత సుతులు
దాస్యముక్తి కోరి రక్తతర్పణము లిడినా
వేదభూమి వారసుల అభిమతమది కాబోదని
కాషాయపు కాంతులవిగో చాటుచున్నవోయీ !
చరణం
అమ్మఒడిలా వెచ్చగ ఆవరించి పెంచి
కమ్మనైన నైసర్గికస్థితులను అమరించి
పచ్చదనం ప్రకృతంత నిండాలని అంటూ
చెప్పకనే చెప్పను ఆకుపచ్చరంగోయీ !
7 .బాలలభారతం
పల్లవి
బాలల్లారా ! బాలల్లారా ! భారతసౌభాగ్యశిల్పుల్లారా !
సౌమరస్యంతో తీర్చిదిద్దాలి విశాలభారతిని .
సువర్ణభారతిగా , విశ్వహారాన పతకముగా !
చరణం
మనదేశం మన జాతి అని కలివిడిగానే పలకాలి .
నా ప్రాంతం నా భాష అనే విడివిడివాదం మానాలి .
ఏ దేశ మేగినా - ఎందెందు కాలిడినా
భారతీయులని అంటారు కానీ
ప్రాంత bhedaa ల నెన్నరుగా !
చరణం
ప్రాంతము నెంచక వివేకానందు
భారతఖ్యాతిని పెంచగలేదా?
ఒక రాష్ట్రానికి చెందినా గాంధీ
దేశ మంతటికై పోరాడలేదా ?
వారికి లేని ప్రాంత భేదాలు
మనకీ నాడు ఎందులకు ?
మానవతే మనుగడ నీతిగ
వేసేసెయ్యి ముందడుగు .
పల్లవి
ఏమనుకున్నారు భారతదేశమంటే
నీరయిపోతారు మేం విజ్రుంభణ చేస్తే .
చరణం
దొమ్మీ చేసే దాయాది దేశ
దురాగతాలను దహించలేదా!
అణ్వస్త్రమైన అవసరమైతే
ఆటబొమ్మని తెల్పగలేదా!
చరణం
కంపూటర్ల కొత్తయుగంలో
ఘనకీర్తిని మేం పొందగలేదా ?
రోదసి చేరే రాకెట్ కూడా
మా చేతి తయారీయే కాదా !
చరణం
గృహస్థాశ్రమపు గొప్పదనమంత
గుత్తంగా మా సొమ్మే కాదా !
ప్రపంచంలోన సౌందర్యమంటే
మాదని మీరే ఎన్నగలేదా !
9 . భారతిప్రగతి
పల్లవి
ప్రగతిపథంలో భారతదేశం పయనిస్తోంది .
విశ్వమనే రాచబాటలో వడిగా వెళుతోంది .
వడివడిగా వెళుతోంది .
చరణం
సంవత్సర మొక అడుగు చేసుకొని
అభివృద్ధిని చేయూతగా కొని
వేయడుగులు ముందంజగా అదే
దూసుకుపోతోంది.అలా దూసుకుపోతోంది
చరణం
బానిసబుద్దుల త్రోసిరాజని
స్వయంసమృద్ధి ఆశయమ్మని
జనవాహినిలో జవము నింపుతూ
దూసుకుపోతోంది.అలా దూసుకుపోతోంది
చరణం
తనలో ఉన్న హిమశిఖరాల
ఔన్నత్యము ప్రతిఫలించులాగా
విశ్వమంతటా శాంతి పంచుతూ
దూసుకుపోతోంది.అలా దూసుకుపోతోంది
10
మారి నిలకడై సాగుతోందని నేడే తెలుసుకున్నాను .
* * *
111) ఈ భాధ్యతలూ బంధనాలూ
ఈ సంసారాలూ సంపాదనలూ
ఈ సంకటాలూ ఝంఝాటాలూ
ఏవీ లేని ఆ అద్భుతలోకం ,
ఎక్కడైతే ప్రేమే గాలిగా , ప్రేమే ఆకాశంగా
ప్రేమే పృథ్విగా , ప్రేమే నీరంగా ,ప్రేమే తేజంగా ఉంటుందో
అక్కడికి నన్ను తీసుకోనిపోవూ ప్రియా !
ఆ పంచప్రేమభూతాలసాక్షిగా
నా ప్రేమార్తిని చల్లర్చవూ !
* * *
112)చెలియలికట్ట హద్దుగా
ఉత్సాహపు అలలు ఆపుకునే సంద్రుడవీవు .
పరిమితులే లేక పరుగుపరుగున సాగే స్రవంతిని నేను.
అల్పురాలినైన నేను
నీ అపరిమిత జలవాహినిలో తల్లీనం కావడానికి
ఎంత దూరమని పరుగిడగలను ?
నా కోసం -------నీవే గమ్యంగా కల నా కోసం
కాస్త నీ హద్దులు చెరుపుకొని వచ్చి
నీకూ నా పై ప్రేమ ఉందని
నిరూపించుకోవూ చెలికాడా ?
* * *
113)ఎందుకింత వేదన ? ఎదలో ఏదో యాతన ?
ఎంత తాగినా తీరని దాహం
ఎంత పొందినా ఆరని మోహం
నీ సాన్నిధ్వమే దానికి పరిష్కారం .
* * *
114)నీవో అచంచల దీక్షాబద్దుడివి.
నిన్ను భంగపరచకూడదనుకుంటాను .
కానీ , నీ సాహచర్యం తప్ప
వేరేదీ నన్నుమురిపించనప్పుడు
ఎలా మౌనంగా ఉండగలవు ?
ఏం చెయ్యమంటావు ? నీవే చెప్పు .
* * *
115)నిజంగా నీకు నాపై ప్రేమ ఉందా ?
నా మనస్సనే త్రాసులో
ఒక్కోసారి నీ ఉరకలు వేసే
ఉత్సాహం క్రిందికి తూగుతుంది .
మరోసారి నీ సాదాసీదా వర్తన
క్రిందికి మొగ్గుతుంది .
అలాంటప్పుడు
ఏది నిజమైన బరువున్నదో ఎలా తేల్చను ?
నా ఎదలోని భారాన్ని ఎలా దించను ?
* * *
116)నిను గని మురిసెను నా మది
ఈ ఇది ఏమిటో ఇపుడే తెలిసెనులే !సరిసరి నను మరి ఉదికించకు మిక
నీ సరి లేరని తలచితి నేడే !
యవ్వనమంతయు నీకై దాగిన
వైనము వాడిగ వెడలెనులే !
ఆకుకు చాటుగ దాగిన పువ్వుకు
నీ దయతో తెర తొలిగెనులే !
* * *
117)కన్నుల కికపై కాయలు కాచే
ఆ శ్రమలే మరి ఉండవులే !
బుగ్గన పూచే సిగ్గుల మొగ్గలు
పూలై నీదరి చేరునులే !
కమ్మని ఊహల కిప్పుడు
తియ్యని వలపుల తావులు అబ్బెనులే !
మనలను గాంచిన కంతదంపతుల
ఓర్వమి విరహపు రూపము దాల్చి
లోకము గాల్చి* * *
118)నాకు అన్ని ఎక్కువై బాధ .
(లోయలు , శిఖరాలు , పీట్టభాగాలు , మైదానాలు )
(ధైర్యము ,తెగువ ,సాహసము ,చొరువ )
* * *
119)రాలేను , రాలేను ,అని ఏడిపిస్తావు .
పోతాను ,పోతాను అని ఏడిపిస్తావు .
ఇన్ని రకాలుగా నువ్వు ఏడిపిస్తున్నా------
నేనెందుకు నీ రాకకై ఎదురుచూస్తున్నా !
* * *
120)నువ్వు లేని లోకంతో నాకేంటి అవసరము
నువ్వు రాణి ఊరితో నాకేంటి అనుభందం
నువ్వు కాని విషయం నాకేంటి ఆసక్తికరం
నువ్వు వున్నా హృదయమే నాపాలి అంతరాళం (అంతఃపురం)
* * *
122)ఉష్ణం ఉష్ణేన శీతలం
నా ఒంటి సులుపులకు నీ చేతులే ఔషధం
నా ఒంటి సలుపుడుకు నీ చేతుల నలుపుడే
సలిపే నా సొంపులకు నలిపే నీ చేతులే ఔషధం
చేతులు నలుపుడే ఔషధం
* * *
123)మల్లెల మాలలో నా చేత బందీ అవుతూ
మావుసురు నీకు తగిలి
నీవు నీ ప్రియుడు చేతుల్లో బందీగా
చిక్కకపోతావా అని నిట్టూర్పులు
విడుస్తున్నట్లు
మల్లెసౌరాభం అంతటా వ్యాపిస్తోంది గుములు గుములుగా
* * *
124)నిద్రకై బలుపైన వాలోండ్లు మధ్య చిక్కుకొని
బయటకు రావడం ఇష్టం లేక
ఊపిరికి కదులుతున్న మిషతో
సుఖాను భూతి జుర్రుకుంటున్న నీ తలకు
క్షణక్షణానికో ముద్దుతో మదనాభిషేకం .
* * *
125)చందమామ ఎంత దూరాన ఉన్నా
కాదన గలడా చకోరి మానసాకాశాన్ని
అందులోని తన స్థానాన్ని .
* * *
126)నేను కూడా తమాషా అనే అనుకున్నా
కొన్ని కోట్ల క్షణాలు ఎదురు చూసే కోట్లక్షణాలను
తెంచేసేదాకా
భ్రమేనేమో అనుకున్నా
బదులే రాణి సందేశాలు బరువును గుండెల్లో
పెంచేసేదాకా
నేనూ నిజం కాదేమో అనే అనుకున్నా
నిర్దయకు ఉప్పొంగిన నరాలు రక్తాన్ని
కన్నీళ్ళుగా కార్చేదాక
నేనూ సరదాయేమోనని సరి చెప్పుకున్నా
సరిహద్దులేని విచారం సున్నాగా సంతోషాన్ని
మృగతృష్ణలా మార్చేదాకా !
* * *
127)నా గుండె చప్పుడు కాబట్టి
అదెక్కడ ఎక్కిళ్ళు రూపంలో
నిన్ను బాధిస్తుందోనని
శ్వాసక్రియలో సంధించి వదిలే
నిర్దయ నటిస్తున్నా .
* * *
128)మంచి వయసులో ఉన్నవారికి
అరిటిపండు వలిచి రుచి నోట్లో కుక్కి
నీళ్ళు పోసి మింగించే ప్రక్రియనే
సాహిత్యంలో పుస్తక,సమీక్ష అంటారు .
* * *
129)ఎంత జ్ఞాపకాల దుప్పటి కప్పుతున్నా
ఆగని చెలిమి చలి
ఊసులు కొలిమిలో కాచుకోక తప్పదని
మారాం చేస్తే అది ఎవరి తప్పు చెప్పు ?
ఎలా దాటాలి ఈ ముప్పు ?
* * *
130)నువ్వు మారపు నన్ను ఆరడి పెట్టడం మానవు .
నేనూ మారాను నీ కోసం ఎదురుచూపులు మానవు .
ఇదో నిరంతర ప్రహసనం .
నిర్విరామ ధారావాహికం విరక్తి కలిగించేలా !
* * *
131)తార లెన్ని ఉన్నా చందమామ కనబడనప్పుడు
ఆకాసవీధి చిన్న బోతుంది .
మాట లెన్నున్నా నీవు వినబదనప్పుడు
మనోవీధి మూగబోతుంది .
* * *
132)ఉలిక్కిపడి లేచి ఆత్రంగా చూసుకున్నాను
ఆనాటిలా ఆలస్యంగా అయినా సందేశానికి
ప్రతిస్పందించావేమోనని
కంగారుగా మేల్కొని పదకనన్థా తదిమేసాను
ఓ నాటిలా నిద్రమత్హులో దూరంవెళ్ళిపోయావేమోనని
తత్తరబాటుతో తిరిగి తిరిగి చూసా
ఆ ఓ నాటిలా నాతో మాట్లాదాననుకుంటే
పట్టించుకోలేదేమో నని కానీ ---------
అవేవి కావు ----- నీవు లేవు
ఎందుకంటే ఈనాడు ఆ ఏనాడూ కాదుకదా !
* * *
133)గుండె నిందా గుసగుసలు
కంట్టం నిండా కబురు
కళ్ళ నిండా కోరికలు
పులిలేమేంటి చందమామా!
ఎదురుచూపులు నిట్టూర్పులు తప్ప .
* * *
134)మల్లెలను జంటగా మంచంపై నలపడం .
మదవతికి ఎంత కష్టం ?
* * *
135)నిర్దయద ఆకాశం నిండా నిండగా
గుండుగా మనసు పరాభవంతో మండెలా ----
పరితాపంతో ఎండేలా
భంగపాటుకు కృంగేలా .
* * *
136)ఊహలమాలికలో మైమరచి
పక్కపై ఉంచుకున్న మల్లెమాలపై బడి నలిపేకాను
నీ ఊహలమాల నన్ను నలిపేసి నిట్టూర్పులు మిగిలిస్తే
నాచే నలుపబడ్డ మల్లెలమాల
నాకు సుగందాలు పులిమి నన్నూరడించింది
నీతి:మంచి వారిని అకారణంగా శిక్షించినా మేలే చేస్తారు
* * *
137)నీ చూపు సోకితే నా మనసంతా తమకం
నీ చేయితాకితే నా తనువంతా గమకం
నీ నామమే నమకం చమకం
నీవు లేవన్న క్షణమైనా నా నరకం .
* * *
138)నా బతుకు నడపడానికి నీ బాసట కావాలి
నా అడుగు పడాలంటే నీ బాసరా కావాలి
నే నవ్వాలంటే నీ నయగారం కావాలి
నే అన్నం తినాలంటే నీ ముద్దుల ముద్దలు కావాలి
నే ఊపిరి పీల్చాలంటే నీ ఊహల గాలి కావాలి .
* * *
139)మనసుకు లేదు ఒంటరితనం
ఎందుకంటే అది నీ తలపుల లావాతో
రగిలే అగ్నిపర్వతం కానీ
ఊపిరి సలపని ఉక్కపోత
క్షణంక్షణం ఎందుకంటే ఆ ఊహలో
వేడికి నేనైపోతున్నా కాలే పెనం.
* * *
2
హద్దు లేని మోమాతాలు
రద్దు కాని బులబాటాలు
సద్దు చేయని ఏకాంతాలు
పద్దు వద్దను పులకాంగాలు.
3
తెలివి గల వనిత పేరిడి
పిలవకనే తన ప్రియుని కుయ్యిడి
అతడు వడి 'వడి' చేరినంతనె .
కడకు పరువిడి పెట్టె నారడి .
4
జాణకు , జవ్వనముఖవీణకు ,
కిణ 'కిణ' నిక్వణ చానకు ,
ఘనతర పుష్పాంగ పంచబాణకు నాకున్
కానని ఆదని మధు సేవన సౌఖ్యములు
మీనకేతన స్వామిచ్చు గాత ఏవేళైనన్
నువ్వు రాణి ఊరితో నాకేంటి అనుభందం
నువ్వు కాని విషయం నాకేంటి ఆసక్తికరం
నువ్వు వున్నా హృదయమే నాపాలి అంతరాళం (అంతఃపురం)
* * *
121)నీవు నా జీవన గమనంలో దొరికిన నిధివా ?
లేక నా తలరాత రాసిన విధివా ?
వెచ్చని ఆలంబనవా ?
నులివెచ్చని ఆనంద భాష్పానివా ?
అతివెచ్చని విషాద నిశ్వాసానివా ?
* * *122)ఉష్ణం ఉష్ణేన శీతలం
నా ఒంటి సులుపులకు నీ చేతులే ఔషధం
నా ఒంటి సలుపుడుకు నీ చేతుల నలుపుడే
సలిపే నా సొంపులకు నలిపే నీ చేతులే ఔషధం
చేతులు నలుపుడే ఔషధం
* * *
123)మల్లెల మాలలో నా చేత బందీ అవుతూ
మావుసురు నీకు తగిలి
నీవు నీ ప్రియుడు చేతుల్లో బందీగా
చిక్కకపోతావా అని నిట్టూర్పులు
విడుస్తున్నట్లు
మల్లెసౌరాభం అంతటా వ్యాపిస్తోంది గుములు గుములుగా
* * *
124)నిద్రకై బలుపైన వాలోండ్లు మధ్య చిక్కుకొని
బయటకు రావడం ఇష్టం లేక
ఊపిరికి కదులుతున్న మిషతో
సుఖాను భూతి జుర్రుకుంటున్న నీ తలకు
క్షణక్షణానికో ముద్దుతో మదనాభిషేకం .
* * *
125)చందమామ ఎంత దూరాన ఉన్నా
కాదన గలడా చకోరి మానసాకాశాన్ని
అందులోని తన స్థానాన్ని .
* * *
126)నేను కూడా తమాషా అనే అనుకున్నా
కొన్ని కోట్ల క్షణాలు ఎదురు చూసే కోట్లక్షణాలను
తెంచేసేదాకా
భ్రమేనేమో అనుకున్నా
బదులే రాణి సందేశాలు బరువును గుండెల్లో
పెంచేసేదాకా
నేనూ నిజం కాదేమో అనే అనుకున్నా
నిర్దయకు ఉప్పొంగిన నరాలు రక్తాన్ని
కన్నీళ్ళుగా కార్చేదాక
నేనూ సరదాయేమోనని సరి చెప్పుకున్నా
సరిహద్దులేని విచారం సున్నాగా సంతోషాన్ని
మృగతృష్ణలా మార్చేదాకా !
* * *
127)నా గుండె చప్పుడు కాబట్టి
అదెక్కడ ఎక్కిళ్ళు రూపంలో
నిన్ను బాధిస్తుందోనని
శ్వాసక్రియలో సంధించి వదిలే
నిర్దయ నటిస్తున్నా .
* * *
128)మంచి వయసులో ఉన్నవారికి
అరిటిపండు వలిచి రుచి నోట్లో కుక్కి
నీళ్ళు పోసి మింగించే ప్రక్రియనే
సాహిత్యంలో పుస్తక,సమీక్ష అంటారు .
* * *
129)ఎంత జ్ఞాపకాల దుప్పటి కప్పుతున్నా
ఆగని చెలిమి చలి
ఊసులు కొలిమిలో కాచుకోక తప్పదని
మారాం చేస్తే అది ఎవరి తప్పు చెప్పు ?
ఎలా దాటాలి ఈ ముప్పు ?
* * *
130)నువ్వు మారపు నన్ను ఆరడి పెట్టడం మానవు .
నేనూ మారాను నీ కోసం ఎదురుచూపులు మానవు .
ఇదో నిరంతర ప్రహసనం .
నిర్విరామ ధారావాహికం విరక్తి కలిగించేలా !
* * *
131)తార లెన్ని ఉన్నా చందమామ కనబడనప్పుడు
ఆకాసవీధి చిన్న బోతుంది .
మాట లెన్నున్నా నీవు వినబదనప్పుడు
మనోవీధి మూగబోతుంది .
* * *
132)ఉలిక్కిపడి లేచి ఆత్రంగా చూసుకున్నాను
ఆనాటిలా ఆలస్యంగా అయినా సందేశానికి
ప్రతిస్పందించావేమోనని
కంగారుగా మేల్కొని పదకనన్థా తదిమేసాను
ఓ నాటిలా నిద్రమత్హులో దూరంవెళ్ళిపోయావేమోనని
తత్తరబాటుతో తిరిగి తిరిగి చూసా
ఆ ఓ నాటిలా నాతో మాట్లాదాననుకుంటే
పట్టించుకోలేదేమో నని కానీ ---------
అవేవి కావు ----- నీవు లేవు
ఎందుకంటే ఈనాడు ఆ ఏనాడూ కాదుకదా !
* * *
133)గుండె నిందా గుసగుసలు
కంట్టం నిండా కబురు
కళ్ళ నిండా కోరికలు
పులిలేమేంటి చందమామా!
ఎదురుచూపులు నిట్టూర్పులు తప్ప .
* * *
134)మల్లెలను జంటగా మంచంపై నలపడం .
మదవతికి ఎంత కష్టం ?
* * *
135)నిర్దయద ఆకాశం నిండా నిండగా
గుండుగా మనసు పరాభవంతో మండెలా ----
పరితాపంతో ఎండేలా
భంగపాటుకు కృంగేలా .
* * *
136)ఊహలమాలికలో మైమరచి
పక్కపై ఉంచుకున్న మల్లెమాలపై బడి నలిపేకాను
నీ ఊహలమాల నన్ను నలిపేసి నిట్టూర్పులు మిగిలిస్తే
నాచే నలుపబడ్డ మల్లెలమాల
నాకు సుగందాలు పులిమి నన్నూరడించింది
నీతి:మంచి వారిని అకారణంగా శిక్షించినా మేలే చేస్తారు
* * *
137)నీ చూపు సోకితే నా మనసంతా తమకం
నీ చేయితాకితే నా తనువంతా గమకం
నీ నామమే నమకం చమకం
నీవు లేవన్న క్షణమైనా నా నరకం .
* * *
138)నా బతుకు నడపడానికి నీ బాసట కావాలి
నా అడుగు పడాలంటే నీ బాసరా కావాలి
నే నవ్వాలంటే నీ నయగారం కావాలి
నే అన్నం తినాలంటే నీ ముద్దుల ముద్దలు కావాలి
నే ఊపిరి పీల్చాలంటే నీ ఊహల గాలి కావాలి .
* * *
139)మనసుకు లేదు ఒంటరితనం
ఎందుకంటే అది నీ తలపుల లావాతో
రగిలే అగ్నిపర్వతం కానీ
ఊపిరి సలపని ఉక్కపోత
క్షణంక్షణం ఎందుకంటే ఆ ఊహలో
వేడికి నేనైపోతున్నా కాలే పెనం.
* * *
2
హద్దు లేని మోమాతాలు
రద్దు కాని బులబాటాలు
సద్దు చేయని ఏకాంతాలు
పద్దు వద్దను పులకాంగాలు.
3
తెలివి గల వనిత పేరిడి
పిలవకనే తన ప్రియుని కుయ్యిడి
అతడు వడి 'వడి' చేరినంతనె .
కడకు పరువిడి పెట్టె నారడి .
4
జాణకు , జవ్వనముఖవీణకు ,
కిణ 'కిణ' నిక్వణ చానకు ,
ఘనతర పుష్పాంగ పంచబాణకు నాకున్
కానని ఆదని మధు సేవన సౌఖ్యములు
మీనకేతన స్వామిచ్చు గాత ఏవేళైనన్
నీ చూపుల ఉలితో చెక్కిన ఒంపులు
నీకేగా సొంతం
కడునిరుపేదను నేను .
నవనిధివై వచ్చి తీవు .
నా జీవన గమనములో
నిలిచిన పెన్నిధి నీవు .
క్షుధాతృఫార్తనైన నాకు
మృష్టభోజ్యమయ్యావు
చవులెరుగని నా బ్రతుకున
షడ్రసములు కురిశావు .
సిరులేవీ లేని నాకు
శాంతియైన లేని నాకు
నిలింప శాఖవై వచ్చి
సౌభాగ్యము లిచ్చావు .
మన ఇరువురి సంగము
ప్రణయ భావ భరితం .
I WANT YOUR TOUCH ON BACK
I WANT YOUR TOUCH IN FRONT
I WANT YOUR TOUCH ON A WHOLE
I WANT YOUR TOUCH EVEN ON SOLE .
1
ప్రియా ! అని సంబోధించనా ! నీనా ప్రియత్వము ఆ పిలుపుకు అందనంత అనంత సుదూర మధురమనోహరవీధుల
విహంగమై స్వేచ్చాసామ్రాజ్యపు టెల్లల జూచుచు అగోచర మనోదృక్కుల ఊయల లూగుచు , అద్వితీయమై ,అమేయమై ,అర్పిత హృదయ హృద్యమరీతుల మధురోహల సేయంచు .కకోకిల కూజితములు ,మంద్రమారుతములు , మల్లెల సారభములు,మనసిజు ఆగడములు విరహిత ఎడదలకు చందన చర్చ కాగా , సమీరునితో సయ్యాటలాడుచు , మేరువుకు మారుబల్కుచు ,సురగంగన తానమాడుచు ,రసలోకపు వీణియ మీటుచు , అచ్చరయై ఆడుచు , కిన్నెరయై షాడుచు , అలోకపు లోకమై , నీరవమధురవమై , చుంబిత శశితరణీ పథమై కాదు వయారములు పోవుచున్నది .2
ప్రియా ! నీవు చెంతలేని దివారాత్రములు అతి నిరాసక్తములు ,కడు సుదీర్ఘములై అనేక ఊహలకు తావిచ్చుచు ఒక పరి చల్లని గాలిని చేసి , నిను సుతిమెత్తగా స్పృశింపజేయుచు మరియొక పరి మందగమనయైన అంబుదముగా రూపింపజేసి ,నిను ప్రేమామృత ధారల అభిషేకింప జేయుచు , వేరొక పరి చకోర చెలిని జేసి , నీ వాదనరాకాచంద్ర నిరమ చంద్రికల తనివార గ్రోల జేయుచు , స్వైరవిహారియైన సుమశరుని బారిసేసి , అంతలోనే అంతయూ మటుమాయ మొనరించి , అలోకాంధకారమందు నను ఏ కాకిని సేయంచు, నిన్ను చేరు దారిలేక , నిన్ను మరువ వీలు కాక , నిట్టార్పుల నిర్లక్ష్యముగా నలుపుతున్నవోయీ !
౩
ఆహా ! ఏమీ నా ఈ మనసు ? నీ వెడుత లేని క్షణమున కూడా నిను మరువనేరక ,నీ ఊహామూర్తిని ఔదల దాల్చి ,గగనాంతరగుహ్య సీమలకు చేర్చి , నాక నారీమణులు నిను గాంచి ,కంతజయంతభ్రాంతిలో డాయుదురీమౌనని భయమెంది,తారావల్లభు చాటుగా ,పర్జన్యుల మాటుగా నిను తరలించి ,సురఝరినిఅనురాగరసఝరిగా మలచి , నిన్నందు ఓలలాడించి , సురపారిజాత సుమసౌరభామును మించు ,తన మనోమోహ సుగంధమున తనియించి ,నిను చేరవచ్చిన శ్రీగంధసంభరితమలయా నిలమును కేలనే పరిహరించి , అంతర్విహూద్భూత ఉష్ణ మిళితములైన
తన శ్వాసలచే నీ ఒడలి తడియార్చి , అనిక్షణం తవ చింతనా ఫలములుగా తనలో విరియబూచిన వలపుపూవుల గుది గ్రుచ్చి , హేలగా నీ కంట్ట సీమను అలంకరించుచున్నదోయీ సఖా !
4
చెలికాడా !ఏమి ఈ బంధము ?శ్రీగంధసంవహగంధ వృక్షములను అలవోకగా పెకలించు ఝంఝామారుతమై నన్నూ పిరి త్రిప్పుకోనీక చుట్టివేసి , నాలోని వివేచనను సమూలమంగా పెకలించి ,నన్ను మత్తను చేయుచూ చిత్తమును వేరొకచో నిలువనీక నీ యందే లగ్నమనస్కను చేయుచూ నీ అనురాగ పూరంబులైన దృక్కుల నను జలకమాడించుచూ ఒక పరి , నీ కాక్షాపూరిత వీక్షణముల పాల్జేసి , ఒడలెల్ల పులకలు రేగజేయుచూ ఒకపరి ,నీ బద్ధ కార్యాదీక్షాపరిపూరిత శూన్యచూడ్కుల విముఖను చేసి వేరొక పరి , నీ ప్రియక్రియాతను స్పర్శల సుముఖను జేయుచూ మరొకపరి ,అలరించి , అపారమైన , అపూర్వమైన , అనంతమైన , అమేయమైన నీ ప్రేమాపయోధారాల నను అభిషిక్తను చేసి ,దివ్యమహారాజ్ఞీత్వ మాపాదించి ,అత్యున్నత ప్రేమికాపీట్టమున నీ సరసన కూర్చుండబెట్టుచున్నది .
5
ఎంత సుందరమైనది ఆ మానసరోవరం ! సుజలసుహృద్యమమై , నిర్మలనేత్రోత్సవమై , ఒకచో అగాధమై , దాపుననే ఉన్నతమై , ఒక్కచో విశాలమై , సమీపముననే సంకుచితమై , తాకినంత అలలై ఉవ్వెత్తున పడుచూ ,ఎగయుచూ , స్పృశించినంత ఎడదరీతి స్పందించుచూ ,పరివేష్టిత కృష్ణ తృణ సంపదార్ణవమై , (దినకర) కరతాడనమున మనోజ్ఞముగా కాన్పడుచూ , చూపరుల కదలనీక కట్టేదుటనే నిలవేయుచూ , గుహ్యమై , గహనమై , అలభ్యమై కవ్వించుచూ నిరంతరస్రవిత సుగంధరసముచే ఊరించుచు , మౌనులనైనా తలపెట్టుగోర జేయుచూ తన విలాసమ్ముతో మరులుగొల్పుచున్నది.
1
హక్కుభుక్తమైన దానిని అడుక్కోవడం .
అర్హతలేని దానిని ఆశించడం
అవకాసం లేకపోయినా అర్రులు చాచడం .
ఆకాశకుసుమాన్ని అందుకోవాలనుకోవడం అవివేకం .
SONGS
1
పల్లవి
భారతీ !భారతీ ! భవ్యచారిత్రీ !బహువీర సంతాన వినుత జనయిత్రీ !
చరణం
ఆజాద్ -హింద్ కై ఫౌజునే నడిపిన
ఆ చంద్రబోసు నీ ప్రియపుత్రుడేగా !
సత్యాగ్రహమ్మొక శక్తి ఆయుధమని
జగతికే చాటిన గాంధీ నీ సుతుడెగా !
చరణం
రాణీరుద్రమ నుండి ఝాన్సీరా ణి వరకు
కేప్టన్ లక్ష్మి నుండి కిరణ్ బేడీ వరకు
నీ ఒడిని ఆడిన ఆడవారందరూ
అబలలము కాదని అవని చాటారుగా !
చరణం
శత్రువులు ఎవరొచ్చి నిన్ను చెరబట్టినా
ఎల్లలలో ఎటు నుండి నిను ఆక్రమించినా
పరిమార్చి , హతమార్చి నిను నిలుపుకొందుము .
నిర్వీర్యులము కాము నీ వీరపుత్రులము .
2
పల్లవి
భారతదేశము నాదంటూ గర్విస్తే చాలదు .
స్వర్ణభూమంటు ఊరకే కీర్తిస్తే మారదు .
బంగరుముద్దను మలచే స్వర్ణకారుడి వోలె
మన దేశప్రగతి మనమే రచియించవలె .
చరణం
ఉపఖండమని భారతభూమికున్న బిరుదును
అభివృద్ధిని సాధించి నిలపాలి మనము .
గుర్తింపుకో , ధనపెంపుకో దేశాన్ని వదిలే
మన మేధావుల వలసలను ఆపాలి మనము .
చరణం
అన్నదాతలు తృప్తిగా అన్నము తినగలిగేలా
చేయగల్గిననాడే దేశము అన్నపూర్ణ .
ధనికులంతా కుబేరులు కానక్కరలేదు .
పేదలు కడునిరుపేదలుగా కాకుండా ఆపు .
చరణం
పల్లెల నుండి పొరుగుదేశ పొత్తుల వరకు
పంచశీలసూత్రాలను పాటింఛి చూడు
నాడే విశ్వపతాకమున తెలిపావురమై
భారతదేశము శాంతిగీతమ్మునే పాడు .
3
పల్లవి
నమస్కారము విశ్వదేవతా !
నీ కిదె మా నమస్కారము .
"సర్వేజనా సుఖినో భవంతు "
అనుటే భారత సంస్కారము .
చరణం
విశ్వశాంతికై పాటుపడుటలో
మొదటివారము మేమో తల్లి !
విశ్వమానవత అను భావమునకు
పాదు చేసెదము ప్రణమిల్లి .
చరణం
ప్రాంతము వేరని ,భాష వేరని
వర్ణము వేరని , మతము వేరని
బేధా లెరుగని భారతీయులం .
భాయీ భాయీ మా నినాదం .
చరణం
అణ్వస్త్రములను పరిత్యజించి
స్నేహసుగుణమును మది పెంచి
అంతరాళమున అంతర మెరుగని
ఒకే కుటుంబము నెలకొల్పెదము.
పల్లవి
అర్దరాత్రివేళలో స్వేచ్చా సూర్యోదయం .
ఆగస్ట్ పదహైదున అరుణారుణశుభోదయం .
చరణం
పరతంత్రపు పాయసంతో చేదెక్కిన నాల్కలకు
స్వాతంత్ర్యపు గంజి చవుల రేకెత్తించిన సమయం .
విదేశీ బిరుదాళితొ బిరుసెక్కిన భుజాలను
స్వదేశీ సైనుగుడ్డ చల్లగ తాకిన తరుణం .
చరణం
కులమంటూ మతమంటూ కుమ్ములాడుకున్న జనం
కలిసి వందేమాతర గీతిక పాడినదీ ఉదయం .
బానిస అనిపించుకుంటు బాసట లేనట్టి మనం .
సగర్వంగ నింగి తాక తలలెత్తిన మహోదయం .
చరణం
సత్యమైన ఆగ్రహం సింహస్వప్నమైపోయి
శత్రువులను పొలిమేరకు తరిమినట్టి దీ దినం .
సంస్కృతి తొలి నెలవైన భారతజాతి ఎప్పుడూ
చేవను కోల్పోదని చాటించిన ఘనవిజయం .
6.జాతిపతాక
పల్లవి
జాతిపతాకం మన జాతిపతాకం .
జనజాగృతి సంకేతం ఈ జాతిపతాకం .
చరణం
బాపూజీ బోసినోట వెల్లివిరిసినట్టి
చిరునవ్వుల వెల్లదనము ఆవరించినట్లు
పరిపూర్ణత తెలిసేలా చల్లదనం కలిగేలా
మన జెండా తెల్లదనం అదిగో కనవోయీ !
చరణం
బానిసత్వ మోర్వలేక భారతమాత సుతులు
దాస్యముక్తి కోరి రక్తతర్పణము లిడినా
వేదభూమి వారసుల అభిమతమది కాబోదని
కాషాయపు కాంతులవిగో చాటుచున్నవోయీ !
చరణం
అమ్మఒడిలా వెచ్చగ ఆవరించి పెంచి
కమ్మనైన నైసర్గికస్థితులను అమరించి
పచ్చదనం ప్రకృతంత నిండాలని అంటూ
చెప్పకనే చెప్పను ఆకుపచ్చరంగోయీ !
7 .బాలలభారతం
పల్లవి
బాలల్లారా ! బాలల్లారా ! భారతసౌభాగ్యశిల్పుల్లారా !
సౌమరస్యంతో తీర్చిదిద్దాలి విశాలభారతిని .
సువర్ణభారతిగా , విశ్వహారాన పతకముగా !
చరణం
మనదేశం మన జాతి అని కలివిడిగానే పలకాలి .
నా ప్రాంతం నా భాష అనే విడివిడివాదం మానాలి .
ఏ దేశ మేగినా - ఎందెందు కాలిడినా
భారతీయులని అంటారు కానీ
ప్రాంత bhedaa ల నెన్నరుగా !
చరణం
ప్రాంతము నెంచక వివేకానందు
భారతఖ్యాతిని పెంచగలేదా?
ఒక రాష్ట్రానికి చెందినా గాంధీ
దేశ మంతటికై పోరాడలేదా ?
వారికి లేని ప్రాంత భేదాలు
మనకీ నాడు ఎందులకు ?
మానవతే మనుగడ నీతిగ
వేసేసెయ్యి ముందడుగు .
8 .నేటి విజ్రుంభణ
పల్లవి
ఏమనుకున్నారు భారతదేశమంటే
నీరయిపోతారు మేం విజ్రుంభణ చేస్తే .
చరణం
దొమ్మీ చేసే దాయాది దేశ
దురాగతాలను దహించలేదా!
అణ్వస్త్రమైన అవసరమైతే
ఆటబొమ్మని తెల్పగలేదా!
చరణం
కంపూటర్ల కొత్తయుగంలో
ఘనకీర్తిని మేం పొందగలేదా ?
రోదసి చేరే రాకెట్ కూడా
మా చేతి తయారీయే కాదా !
చరణం
గృహస్థాశ్రమపు గొప్పదనమంత
గుత్తంగా మా సొమ్మే కాదా !
ప్రపంచంలోన సౌందర్యమంటే
మాదని మీరే ఎన్నగలేదా !
9 . భారతిప్రగతి
పల్లవి
ప్రగతిపథంలో భారతదేశం పయనిస్తోంది .
విశ్వమనే రాచబాటలో వడిగా వెళుతోంది .
వడివడిగా వెళుతోంది .
చరణం
సంవత్సర మొక అడుగు చేసుకొని
అభివృద్ధిని చేయూతగా కొని
వేయడుగులు ముందంజగా అదే
దూసుకుపోతోంది.అలా దూసుకుపోతోంది
చరణం
బానిసబుద్దుల త్రోసిరాజని
స్వయంసమృద్ధి ఆశయమ్మని
జనవాహినిలో జవము నింపుతూ
దూసుకుపోతోంది.అలా దూసుకుపోతోంది
చరణం
తనలో ఉన్న హిమశిఖరాల
ఔన్నత్యము ప్రతిఫలించులాగా
విశ్వమంతటా శాంతి పంచుతూ
దూసుకుపోతోంది.అలా దూసుకుపోతోంది
10
పల్లవి
శ్రీకరుడౌ శ్రీనివాసుని కథ శ్రావ్యముగా
చెప్పెద వినుడీ !
విన్నంత మాత్రమునే కన్నంత ఫలితము .
జన్మసాఫల్యము .ముక్తిసోపానము .
చరణం
కలిలోన జనులను కనికరించగా
ఇల చేరదలచిన విష్ణుమూర్తిని
భ్రుగు అవమానపు నెపమున
లక్ష్మి వీడి వెడలెను .ఆమె కొరకు అడలుచూ హరి శేషగిరి చేరెను .
చరణం
ఆట ఆదివరాహుడు అనుమతింపగా
వకుళాంబ పుత్రుడై వెలుగొందుచూ
పద్మావతీదేవిని తన సతిగా పొందెను .
సవతుల పోరుకు వెరచి తను శిలయై పోయెను .
చరణం
కలికాలపు కల్మషమున క్రుంగిపోవుచూ
అలమటించు జనులీ కథ విన్న చాలును .
సాక్షాత్తూ విష్ణుడైన ఆ వేంకటేశుడు
సకలసంపదల నిచ్చి చల్లగా బ్రోచును .
11
పల్లవి
బాల్యము అంటే భవితకు వేసే బంగారుబాట .
నేడు ప్రమతో విరిసిన మొగ్గాలే
రేపు ఇచ్చును తీపిఫలాలు .
బలవంతంగా విచ్చదీస్తే
వెదజల్లలేవు పరిమళాలు .
చరణం
పిట్ట కొంచము మోత ఘనము ఒక వైపు
తెలుగు కోయిలల పరభాషే పలకమని
దారుణపీడనము మరోవైపు .
చదువుల పరువా ? గాడిద బరువా ?
పుట్టుక కన్నా మొండె పేరు పెట్టుట కన్నా ముందే
బిడ్డకు నిర్ణయమయ్యే పట్టా !
విజ్ఞానపు గోమ్దేలపై సంపాదనా కాంక్ష
మోదుతూ ఉన్న సమ్మెట.
చరణం
ఎంత చెట్టుకు అంత గాలి అని మరచి .
కడుపారా తినడం లేదని ఏడ్వాల్సిన తల్లులే
తనివారే ర్యాంక్ లేదని వగచితే -----
ఆటలు కరువై , మనసులు బరువై
తల్లిదండ్రుల ప్రేమ , తాతాఅవ్వల లాలన
బాల్యాన్ని అలరించిన నాటి కథ
ఒంటరిగా కుమిలె నేటి పిల్లలకు
కన్నుల కార్పించే కన్నీటివ్యథ.
చరణం
కన్నపిల్లలను యాత్రాలుగా చేయకండి .
చదువంటే చాకిరీ అనే ఊహా రానీకండి .
ఆటక్లు పాటలు కలిసినదే చదువు .
మార్కుల ఛత్రం ప్రతిభకు( ప్రగతికి ) అడ్డం .
బహుముఖ ప్రజ్ఞాపాటవం , వినయం కలిగిన సంస్కారం
కలగలిసిన పౌరులను ఇచ్చే బాధ్యత .
దేశప్రజలుగా దేశానికి తల్లిదండ్రులు చూపే కృతజ్ఞత .
12
పల్లవి
మాతృత్వపు మణిదీపం మదర్ థెరిస్సా !సేవాభావం , సహనం ఆమె ప్రేమస్వాశ .
ప్రేమకు పరిధులు లేవని చాటెను ఆమె గాధ
అందుకే ఆ పరదేశపు వనిత అయినది భారతమాత .
మదర్ థెరిస్సా ! భారతమాత !
చరణం
కన్నతల్లినే మించిన దీ కనని తల్లీ !అమ్మలగన్నయమ్మ మదర్ థెరిస్సా అమ్మా !
ప్రాణమె పాలుగా జన్మమె అన్నముగా
దీనుల పోషించిన భారతరత్నమమా !
చరణం
భారతమాతే రూపము దాల్చి తన పిల్లల దరిచేరినది .
అక్కున చేర్చి వారందరి కష్టాలు తనవని అన్నది .
కోరిక లెరుగని కన్యకగా వారికి అంకితమైనది .
భారతరత్నమైన భారతి మదర్ థెరిస్సా ధన్యగాథ ఇది.
చరణం
అడగందే అమ్మైనా పెట్టని ఆకలిలోకంలో !
అడుగడుగునా ఆపన్నుల కందగాకనే అన్న విరచ్చి వేదన తీర్చి
కన్నెమాత అయిన మదర్ థెరిస్సా !
ఎల్లలేని ప్రేమకు ఈమే ఓ మణిపూస .
(కు ఈమే ఆగనిస్వాశ )
13
పల్లవి
బొజ్జలోనే నీవు భద్రముగా బజ్జోని ఆటలాడించేవులే !
బుజ్జినాన్నా ! నీవు బయటి కొచ్చావంటె పట్ట శక్యము కావులే !
చరణం
అల్లరీ నా తండ్రీ ! నిన్ను చూడగ నాకు అమిత కోరిక కలుగురా !
నాదు నోములపంట ! మీ నాన్న నీ కొరకు బొమ్మలను కొని తెచ్చెరా !
చరణం
నన్ను తల్లిని చేసి ధన్యనే చేసేటి నా చిట్టిబాబువేరా !
మీ నాన్న పోలికతో నన్ను అలరింపగా అవతరించేవు లేరా !
చరణం
అమ్మమ్మ నీ కొరకు ఆశతో చూచెను , చల్లని జాబిల్లి రా !
పిన్నమ్మ ప్రేమతో నిన్ను పాలించెను పాలబుగ్గల తోడరా !
చరణం
నాన్నమ్మ , తాతయ్య మంకులను విడిపించు సమర్థుడ వాడు వౌరా !మామలను ఆడించు మగతమితో అలరారు అగ్రగణ్యుడ వేనురా !
14
పల్లవి
మూగవోయిన నా హృదిలో ఏల ఈవేళ కలకాలము
మనసు పొరలలో మోడుపారిస ఊహల కొచ్చే పరిమళము .
చరణం
అంతులేని అవని వలెను , అదుపులేని సంద్రము వలెను
అంతరాళ మంతయు నిండి , అణువణువున చేతన నింపి
చరణం
ఆకాశమును అంటుతున్నా ఆనందము ఇది అందునా !
ఆవధెరుంగని ఏ సంతోషపు సూచనో అని తలవనా !
చరణం
ఇంతవరకు అలసినటుల విశ్రమించిన ఈ మనసుకు
ఒక్క లిస్తలో ఎందుకో మరి ఇంత అలజడి ఎవరికీ తెలుసు ?
15
పల్లవి
సన్నజాజి పువ్వులా , తెలివేన్నెల రేయిరా
వికసించి , విరబూసి హాయిగా నవ్వవే !
చరణం
నీ నవ్వు వెదజల్లిన సుమపరిమళము
నీ చూపు కలిగించిన చల్లందనముఎదనాపి , మధురోహల డోలల నూపి ,
ఆనందపు టంచుల నను చేర్చేనులే!
చరణం
సింగారే ! నీ ముద్దు చెక్కిలి చిదిమి
స్రవించే సుధాలనే సేవిన్చనా !
వయ్యారే ! నును వెచ్చని కౌగిట జేర్చి ,
వలపుల విరితితల నిను విహరింపజేయనా !
16
పల్లవి
అతివ , మగువ, లలన ముదిత , నెలత , సుదతి , పడతి , నవల .
పిలుపు వేరువేరైనా పలు రకాల పలుకైనా
మమత పంచి మురిసేది , మనసు తెలిసి మసలేది .
చరణం
తల్లియైన చేల్లియైన చెలిమి చిల్కు చెలియైన
కూతురైన , కోడలైన గృహము నిల్పు ప్రేముడి
సర్దుబాటు గునములో చక్కదిద్దుతనములో
ప్రథమస్థాన మొందేదీ , అగ్రపూజ నందేదీ
చరణం
సృష్టియన్న తానుగా , స్వాభిమాన సహితగా
సర్వతంత్ర సమర్థగా సాటిలేని చతురత
సంఘకార్య నిర్వహణలో , సమరసత్వ సాధనలో
చారుశీల , శుభదహేల సహజభావ భరిత (వనిత )
17
పల్లవి
కదు నిరుపేదను నేను - నవనిధివై వచ్చితీవు .
నా జీవన పథములోన నిలిచినా పెన్నిధి నీవు .
చరణం
క్షుధా త్రుషార్తనైన నాకు - మృష్టభోజ్య మయ్యావు
చావులేరుగని నా బ్రతుకున షడ్రసముల కురిశావు .
చరణం
సిరులేవీ లేని నాకు - శాంతియైన లేని నాకు
నిలింపశాభివై వచ్చి - సౌభాగ్యము కూర్చావు
చరణం
తరణియు ఛాయల వోలె -పున్నమి చంద్రుడు వోలె
మన ఇరువురి సంగమం - లలిత ఖావ భరితం
"శ్రీవారికి అంకితం "
18
పల్లవి
కాశ్మీరు చీరకట్టి , కారంచేడు మాలు పెట్టి
కన్యా కుమారిలా నీవు కన్తబడుతుంటే ,
కావాలని అంటుంది కాని మనసు - మా కాని వయసు .
చరణం
కళ్ళు కదిపితే చాలు కలకలమని పొంగు కళలు
కాలు మెదిపితే చాలు జలజలమని జారు సొగసు
ఆ కళ్ళు , ఈ కాళ్ళూ కలిపి కదిపినామంటే ,
ఆగలేనంటుంది కాని మనసు - మా కాని వయసు
చరణం
కావి చీర రంగంలో - కసిగా రేగు పొంగులో
కోనసీమ కొబ్బరుంది - రాయలసీమ రాగముంది .
రావే నా చిన్నదానా ! రాయంచల నడకదానా !
రారమ్మని పిలుస్తుంది కాని మనసు మాకాని వయసు
19
పల్లవి
ఇంత మాత్రానికా ఈ మిడిసిపాటు
ఎందుకోయీ నీకు ఈ అడరుపాటు
చరణం
సర్వము నీవే యని , అంతయూ నీదే యని
అంతరంగంబున అతిశయించేవు .
కోర్కెల కోతలు కూలిపోయెడి వేళ
కాసింత నిలకడగ కాలూని చూడు .
చరణం
ఆశయాలని అంటూ , ఆదర్శ మనుకొంటూ
వెర్రికోరికలతో విర్ర వీగేవు .
తెలుసుకోన లేరులే నీ మనసు ఎవ్వరూ
ఎంత కాలము ఈ ఎదురీత చాలు .
20
పల్లవి
ఆడు కొనే సమయం
ఇది ఆటలు ఆడుకొనే సమయం
మది పాటలు పాడుకొనే సమయం .
చరణం
చల్లనైన పిల్లగాలులు - చక్కని పువ్వుల పరిమళాలు
సాయంత్రపు ఈ సోయగమ్మలో స్నేహితులంతా సంతోషముగా .
చరణం
శారీరకపు పరిశ్రమలతో - మానసికపు ఉల్లాసం కలిపి
మానవునే ఆరోగ్యవంతునిగా మలచే చక్కని సాధనం .
చరణం
అలసిన వేళల అమ్మ ఒడి ఇది
విసిగిన వేళల విశ్రాంతి గది
ధనవంతినికి , పేదవానికి అందరికీ ఇది తరగని పెన్నిధి .
21
పల్లవి
మరువలేనోయీ ప్రియా ! - మరువలేనోయీ
మదిలోన నీ రూపు మాసిపోదోయీ !
చరణం
మైమరపిలే మిగిలె , మనససలె పలుకదాయే
ఆవేదనే నాకు ఆలాపనాయె
అనుభూతి కాలయమై ! అనురాగ నిలయమై
ఆకాశ సుమములకై ఆశగా చూచే నే
చరణం
అంతరంగుడవంచు , ఆత్మీయుడవతంచు
అర్పణము చేసితిని నా హృదయసుమము
నీ తీవ్ర తిరస్క్రుతిని కటిన నిర్ధయాసి
విడనాడి చల్లగా నన్నేలు కోరా
22
పల్లవి
ఎంత బేలచూపులు - ఏమి దొంగ చూపులు
చూపులతోనే నీవు గారడి చేసేవు చరణం
నే చూడలేదని చూచే నీ చూపులు
విశితూపులు అవీ మరుని ములుకులు
చూచియూ చూడనట్లు నటియిచే చూపులు
ఎదలోతులలో తగిలే మెత్తని సుమశరములు
చరణం
కవ్వించి అమాయకతను చిందించే చూపులు
కడదాకా నా మదిలో మెదిలేటీ తలపులు
రారమ్మని పిలిచే నీ మత్తైన చూపులు
ఏనాటికి నాకు సాదర ఆహ్వానాలు
చరణం
రాజీవలోచానములు వెదజల్లే చూపులు
రాకాశశాంకుని కౌముదీ జల్లులు
23
పల్లవి
నీవు లేని జీవనము నే కోరను ఏ క్షణము
నీ తలపున బ్రతుకుటయే నా మది కానందము .
చరణం
నీ వలపూ , నీ తలపూ నా మనసుకు మోదమొసగు .
ఎదురెదురుగా క్షణమైనా ఆ రసానుభూతి చాలు
చరణం
లేవోయీ దురాశలూ , కోరను ఏ వరములూ
నువ్వు మ్రోయించిన మురలిపై అపశ్రుతి పలికింపకుమా!
బెలిడైన ఈ గుండియ ఒర్వదోయీ ప్రియతమా !
24
పల్లవి
దీపావళి పండుగ వచ్చింది -
చల్లని దీవెనలెన్నో లేచ్చింది .
చరణం
బాపూ బొమ్మలాంటి అక్కకు
చక్కని బావను తెచ్చింది.
మిలమిలలాడే అక్క కనులలో
ముసిముసి నవ్వులు నవ్వింది
చరణం
ఎన్నో చాడువులుచాదివిన అన్నకు
మంచి ఉద్యోగ మిచ్చింది .
ఆనందంతో మురుసిన ఇంట్లో
కలకలకలమని నవ్వింది
చరణం
పట్టు పావడా లడ్డూ మిట్టాయి
ఎన్నో ఎన్నో తెచ్చింది .
అన్నీ చూచి హాయిగా నవ్వే
చెల్లి గుండెలో విరిసింది
25
పల్లవి
అందాల నా రాజా ! చందురుని సరిజోడా !
రావోయి ఈ వేళ నన్ను కూడగా !
చరణం
చల్లనైన పిల్లగాలి సాపత్వుమల నెరుపగా
నిరాదరుడు రాతీవిభుడు నీ సరిజోడాయెరా!
చరణం
రమ్యహర్మ్య వాటికలో ధార్యాణిగ నిలిచినా
నీ గాటపు కౌగిటిలో తమితీరగ శయనించెద!
చరణం
వేచివేచి వేసారిన నీ చెలి నుదికిం పకురా
సమైక్యం
పల్లవి
తెలుగు తల్లి పిలుపు వినలేరా
జాతిమేలుకోలుపు ఇది లేయరా
తెలుగు గౌరవాన్ని నిలుపుమురా
తెలుగు వాడి వాడి చూపుమురా
చరణం
తెలుగు లంటే ప్రపంచాన ఖ్యాతికన్న జాతిరా
రంగము ఏదైనా విద్యలు ఏవైనా ముందుండును తెలుగు వారి అడుగేర
సాటిగా వేరు ఎవరు లేరనే రీతిగా జగతిని చాటర
మేటిగా అగ్రరాజ్యమందు పట్టు సాధించి
సూటిగా విజయ శంఖమూదెను మన జాతిరా .
చరణం
తెలుగు బాషే ఇన్నినాలుగా మానని కలిపి ఒకటిగా ఉంచేనురా
ఒకే తల్లి బిడ్డలందరూ కలిసి ఉంటే అందమురా
నాలుగు వెళ్ళళో ఏవేలు బలమెంతో పిడికిలిగా ఉంటే తెలియదురా
వీరుగా విడిపోయినంతనే దుర్బలమైపోవు తెలుగు జాతిరా
నదీ తీరాలు - ప్రేమ సారాలు
పల్లవి
HE:నదీ తీరాలూ - ప్రేమ సారాలు
ప్రణయ కావ్యాల నవ్యనగరాలు
SHE:నీటి కెరటాలు - రాగ భారితాలు
అంభరాన్నంటు వలపు శిఖరాలు .
HE:క్షీరమథనాలు - కామ కదనాలు .
SHE:సౌఖ్యసదనాలు -లౌఖ్యజతనాలు .
చరణం -1
HE:రాధ విరహాలు - వంశి గమకాలూ
మాధవుని సరసకేళి మురిపాలు
SHE:గోపి సమయాలు -తీపి తమకాలు
విరహలోకముకు తాపహరణాలు
HE:భావభవనాలు - రాసరతనాలు
SHE:ప్రేమ చరిత కివి చలువ సాక్షాలు
చరణం-2
HE:చలనచోద్యాలు -అమృతచోష్యాలు
చెలిమి సంధించు చిలిపి దౌత్యాలు .
SHE:కలల సారాలు కథల హారాలు
కామినీ కదన మదన భాష్యాలు
HE:అతను మంత్రాలు -సుఖద తంత్రాలు
SHE:సరససామ్రాజ్య సుజయ ధ్వానాలు
బుల్లెబ్బాయ్ (అలలు అలలు)
పల్లవి HE:అలలు అలలు అలలు
నీ ఒళ్ళంత అందము అలలు
నను ఉక్కిరి బిక్కిరి చేసే వలలు
ఎటూ తప్పుకు పోలేవు నా కనులు .
SHE:కథలు కథలు కథలు
నువు చెప్పకు తుంటరి కథలు
నను నిద్దురపోనీవు కమ్మని కలలు
హద్దుకు ఆగవు తీపి వలపులు .
చరణం -1
HE:చేపలా మారి సొగసులో నన్ను లోతుగా ఈదనీ !
ఓడలు తేలి వయసునే నన్ను హాయిగా దాటనీ !
SHE:పాపలా నీలి కనులలో దాగి కాపురం చేయనీ !
నీడలా మారి నిలకడే ఉన్న తోడుగా ఉండనీ !
HE:పరాగాల పూదోటల్లో మరే నీవు మా రాణే!
SHE:సరాగాల సయ్యాటల్లో సరే నీవు దొరవలె !
HE:దరి చేరబోవు ఈ వేళ
మరి మీనాలు మేషాలు ?
చరణం - 2
HE:విందుకి వచ్చి వాకితే నీవు ఆగటం ఏమిటో ?
(అల్లుడా అంటూ పండగే చేసి పిలవటం ఎన్నడో)
అల్లుడా అంటూ పిల్లనిచ్చాక అలక పాన్పెందుకో
SHE:రమ్మనే చెప్పి దొంగలా నీవు చూడటం ఎందుకో ?
(అందమే ఇచ్చి కాళ్ళనే నాకు కడగటం ఎప్పుడో?)
అందమే చుట్టి ఆకులో పెట్టి ఇవ్వడం ఎప్పుడో ?
HE:మరీ అంత తొందర చేస్తే మతే నాకు పోతుంది .
SHE:చెలీ !ఇంత దూరం ఉంటే జతే చిన్నబోతుంది .
HE:పువ్వే చేసి నిను ప్రేమ దేవతకు
పూజ చేసుకుంటా !
మరి మీనాలు మేషాలు ?
చరణం - 2
HE:విందుకి వచ్చి వాకితే నీవు ఆగటం ఏమిటో ?
(అల్లుడా అంటూ పండగే చేసి పిలవటం ఎన్నడో)
అల్లుడా అంటూ పిల్లనిచ్చాక అలక పాన్పెందుకో
SHE:రమ్మనే చెప్పి దొంగలా నీవు చూడటం ఎందుకో ?
(అందమే ఇచ్చి కాళ్ళనే నాకు కడగటం ఎప్పుడో?)
అందమే చుట్టి ఆకులో పెట్టి ఇవ్వడం ఎప్పుడో ?
HE:మరీ అంత తొందర చేస్తే మతే నాకు పోతుంది .
SHE:చెలీ !ఇంత దూరం ఉంటే జతే చిన్నబోతుంది .
SHE:మొగమాతమెల ఈ వేళ
నిను అందాలు బతిమాలి పిలవాలా ?
బుల్లెబ్బాయ్(రీజనబుల్గా)
పల్లవి
HE:రీజనబుల్గా ఆలోచిస్తే
నీకు నన్ను ప్రేమించాలనిపిస్తుంది
SHE:లాజికల్గా పరిశీలిస్తే
నీకు అంత శీను లేదనిపిస్తోంది.(ఎందుకో ఇది వర్కౌట్ కాదనిపిస్తోంది)
HE:అమ్మ మీదొట్టు ఁఆణ్ణా మీదొట్టు .
దయచేసి నాకు ప్రేమభిక్షే పెట్టు .
SHE:ఒట్టు మీదొట్టు . గట్టు మీదెట్టు .
ప్రేమదోమ అన్నావంటే చేసేస్తాను వాకట్టు .
చరణం-1
నిను అందాలు బతిమాలి పిలవాలా ?
బుల్లెబ్బాయ్(రీజనబుల్గా)
పల్లవి
HE:రీజనబుల్గా ఆలోచిస్తే
నీకు నన్ను ప్రేమించాలనిపిస్తుంది
SHE:లాజికల్గా పరిశీలిస్తే
నీకు అంత శీను లేదనిపిస్తోంది.(ఎందుకో ఇది వర్కౌట్ కాదనిపిస్తోంది)
HE:అమ్మ మీదొట్టు ఁఆణ్ణా మీదొట్టు .
దయచేసి నాకు ప్రేమభిక్షే పెట్టు .
SHE:ఒట్టు మీదొట్టు . గట్టు మీదెట్టు .
ప్రేమదోమ అన్నావంటే చేసేస్తాను వాకట్టు .
చరణం-1
HE:లకుముకి చెకుముకి మెరుపులా చిన్నది
అదరక బెదరక ఇటు నిలుచున్నది
SHE:పలుకుల ములుకుల ఉలుకుల పిల్లడు
వదలక పదమని నస పెడుతున్నడు
HE:వయ్యారంపై పోనీ చూపు
సింగారంలో రాణీ కైపు .
SHE:సందేహంలో ఉందే లవ్వు
టెమ్టేమవకు ముందే నువ్వు .
HE:దౌటేమి లేదులే ప్రేమపడవలో పడక తప్పదింకా !
SHE:ప్రేమంటె తెలుసులే నేను నమ్మనిది కోడె వయసునంట .
HE:సుడి లోన మునుగినా ప్రేమ పవరుతో నిన్ను కాంచుకుంటే !
SHE:నడినీటిఏటిలో నిన్ను నమ్ముకొని దోగాను నేను వెంట .
చరణం-2
అదరక బెదరక ఇటు నిలుచున్నది
SHE:పలుకుల ములుకుల ఉలుకుల పిల్లడు
వదలక పదమని నస పెడుతున్నడు
HE:వయ్యారంపై పోనీ చూపు
సింగారంలో రాణీ కైపు .
SHE:సందేహంలో ఉందే లవ్వు
టెమ్టేమవకు ముందే నువ్వు .
HE:దౌటేమి లేదులే ప్రేమపడవలో పడక తప్పదింకా !
SHE:ప్రేమంటె తెలుసులే నేను నమ్మనిది కోడె వయసునంట .
HE:సుడి లోన మునుగినా ప్రేమ పవరుతో నిన్ను కాంచుకుంటే !
SHE:నడినీటిఏటిలో నిన్ను నమ్ముకొని దోగాను నేను వెంట .
చరణం-2
SHE:తడబడు అడుగుల నడిచేది మనసిది .
పరుగుల వలపులు సరిపడవన్నది
HE:మనసుకు రెక్కలు తొడిగెడి వయసిది
SHE:పరిగెత్తిట్లా పాలేందుకు ?
పాయసముంది కాస్తాగుదూ !
HE:నా ఆత్రాన్ని జో కొట్టేందుకు
దయతో నీవు రాముందుకు.
SHE:దయ నేను చూపితే
దుడుకు ఈడుతో కొంప మునుగునంట
HE:పరవాలేదులే ప్రేమనగరులో
నిన్ను దాచుకుంటా !
SHE:సరదాకాదులే ప్రేమ దైవము
ఆటలాడకిట్లా !పరుగుల వలపులు సరిపడవన్నది
HE:మనసుకు రెక్కలు తొడిగెడి వయసిది
SHE:పరిగెత్తిట్లా పాలేందుకు ?
పాయసముంది కాస్తాగుదూ !
HE:నా ఆత్రాన్ని జో కొట్టేందుకు
దయతో నీవు రాముందుకు.
SHE:దయ నేను చూపితే
దుడుకు ఈడుతో కొంప మునుగునంట
HE:పరవాలేదులే ప్రేమనగరులో
నిన్ను దాచుకుంటా !
SHE:సరదాకాదులే ప్రేమ దైవము
HE:పువ్వే చేసి నిను ప్రేమ దేవతకు
పూజ చేసుకుంటా !
చెట్టు మీద
పల్లవి
చెట్టు మీద పిట్టాకటుంది .
కట్టు దాటి రానంటుంది .
కన్ను పడ్డ వాళ్ళంతా కాదూ పోపొమ్మంటుంది .
పట్టే దమ్మే ఉంటే పిట్టే నీదాతుంది .
నీదే ! నీదే ! నీదే ! నీదే !
చరణం - 1
చురచుర చూపుల్ది - నెరనెర వన్నెల్ది .
పకపక నవ్విందా కసాబిసా ఔతోంది .
చూశావా రేతిరంత కలలతో తెల్లార్తుంది .
మా టక్కులమారిది - హైతెక్కుల (చిన్నది)(పోకుది).
హయ్యా !హయ్యా ! హయ్యా !హయ్యా !
చరణం-2
కోడేజట్టు విరుగన్ది . కావాలన్నా దొరకన్ది .
కాకలు తీరినవాళ్ళనే కంగారు పెడుతుంది .
కోరావా కవ్విస్తూ కళ్ళల్లో ఉంటుంది .
చిత్రాంగి చెల్లి ఇది . చిత్రంగా చిక్కింది .
భలే !భలే !భలే !భలే !
చరణం-3
భలేభలేగూటిది. బడాయి చాలంటిది .
బడాచాబులకైనా బెబ్బెబ్బే అంటుంది .
ఏ మ్మాయలు చేశావో నీదే మనసన్నది .
చెట్టెక్కి చేరుకో ! స్వర్గాన్నే అందుకే !
ఛలో !ఛలో !ఛలో !ఛలో !
వెన్నెలమ్మా! వెన్నెలమ్మా !
పల్లవి
HE:వెన్నెలమ్మా ! వెన్నెలమ్మా !
మల్లెనవ్వే నవ్వవమ్మా !
అల్లరమ్మా ! అల్లరమ్మా !
అంతదూరం ఎందుకమ్మా!
SHE:కోయిలమ్మా ! కోయిలమ్మా !
కొత్తరాగం ఏమిటమ్మా!
ఆగవమ్మా !ఆగవమ్మా !
హద్దు ఎంతో ముద్దులేమ్మా !
HE:మనసుకు ఏవేవో కొత్త చివురులు
SHE:వయసును వేధించే తీపి బరువులు
HE:అటు చూడు - మన కోసం
ఆసలు వేసిన మోసాలు -ఊహలు వూచిన ఊసులు
చరణం-1
HE:మనసను తోటలో విరిసిన పాటలే
పెదవుల నుండి తేనెజల్లు లాగ జారేనమ్మా !
SHE:పెదవుల మధువుతో తడిసిన మాటలే !
మనసునులకున్న తీపి ఊపులేమొ చెప్పేనమ్మా !
HE:మురిపెము తెలిపిలే - మది కథ తెలిసెలే !
SHE:అలజడి ముగిసెలే -విరజడి కురిసెలే 1
HE:నీవే నేనై పోయే భావావేశంలో
నేనే నీలో నిండే ప్రేమావేశంలో !
చరణం-2
SHE:సగమగు వేడుక సరసము మీరగా
సుఖపడమంటు నిన్ను నన్ను చేరపిలిచేనమ్మా !
HE:గడసరికోరొక సోగాసరిబాలికా !
తెలిపిన జానథానము జంట ఎదను తదిమేనమ్మా !
SHE:హృదయము పలికిలే! అధరము వణికిలే!
HE:మధుపము పిలిచిలే -మధువని విరిసెలే!
SHE:పొంగే అలలే నింగే తాకే వేళల్లో
సాగే నదులే సంద్రం చేరే ప్రేమల్లో .
మనసులో పువ్వులా
పల్లవి
మనసులో పువ్వులా విరిసిన తొలి కోరిక
పెదవిపై మెదిలెగ చందమామే సాక్షిగా !
చురుకు చూపులు సిగ్గుతో సోలేనెందుకో !
పడునుమాటే తడుములాటై ఆగెనెందుకో !
చలో మన్మధా !కథే కొత్తదా !
హలో పయ్యెద ! మరీ ఇంతిదా ?
చరణం-1
చిలిపి చందురుడే మండే సూరీడై తాకే .
పరుపు నలిగే కునుకు మాత్రం కంటికి రాదే
తలగాడైనా తాపమసలు తీర్చనే లేదె !
నిదురొద్దని మనసు మారాం చేసె ఈ రోజే !
చలో మన్మధా !కథే కొత్తదా !
హలో పయ్యెద ! మరీ ఇంతిదా !
చరణం-2
చలిని చెమటలే పోసే వింతెదురాయె !
ఎండా వెన్నెల చలువలిచ్చే ముచ్చటలాయె !
ఎందరున్నా ఎవరెదురుగ లేరనే తోచె !
మునుపెరుగని ఎరుపు బుగ్గను గారమే చేసె.
చలో మన్మధా !కథే కొత్తదా !
హలో పయ్యెద ! మరీ ఇంతిదా ?
మనవే వినవా ?
పల్లవి
HE:మనవే వినవా ? దయనే కనవా?
ఇది ఏకాంత సేవా ! ఎదలో కాంతవేగా !
చెలి వన్నె చిన్నెల్తో సరి కొత్తగా వెళ్ళు ఓ వెన్నెలా !
తన కోపమే నీవు చల్లార్చితే చాలులే చల్లగా!
చిరు అలకలు నా కొదిలెయ్యి .
అను తాపాలు నా పాలు చెయ్యి .
చరణం -1
HE:చేత ఉండి ఈ విరహ మోపలేనే !
ఈ చింత ఏల ఆ కాంతు తంతిదేనే !
SHE:వింతగుంది ఈ సరస మాగలేనే!
నా పంథా మీక ఆవంత ఆపలేనే !
HE: పగతీర్చి తెగటార్చు వయసు ఓపికను నలిపిన చిరుచలిని .
SHE:చెమటోడ్చి పరిమార్చు చెలియచేతలను చెణికిన మరుగులిని .
HE:పరువాలవాడలో
SHE:పరదాలమేడలో
SHE:మురియాద చేయమని
మరుడు మారుడు వేడుకొను వేళలలో- - - - -
చరణం-2
SHE:తనువు లేని ఆ మదను డెంత పదునో !
ఓ కునుకు కూడా కరువైన వైనము విను
HE:మనసు లేని జాబిల్లి చెలివో ఏమో !
నీ సొగసు వెన్నెలలు నన్ను కాల్చు నిజము .
SHE:ఒడి చేర్చి ,మరి పేర్చి పడక నోదార్చి వెడలెను మలయజము .
HE: నిట్టూర్చి ,నీర్కార్చి పడక ఊరార్చి మారలేను అంబుదము .
SHE:సరసాల బాటలో
HE:సురసాల తోటలో
SHE:తనివార గ్రోలమని తపనలో
తడుము తీరులలో .
ఔనా!నిజమేనా?
పల్లవి
HE&SHE:ఔనా!నిజమేనా?నేను - - నేనేనా ?
ఆ కన్నులు కథలను తెలిపేనా
నా మనసుకు ఆ కథ తెలిసేనా
HE:ఆ అమ్మడి అందం చలువేనా ?
SHE:ఇది జన్మలు దాటిన చెలిమేనా?
చరణం-1
SHE:ఆకాశం పందిరిగా హారాలే తళుకులుగా
నన్ను మెచ్చేవాడు ఏనాడు వస్తాడో !
HE:నా మదే వేదికగా ప్రేమనే వేడుకగా
అందజెయ్యాలంటే ఎంత వేచుండాలో !
SHE:మరి ఎగిరే పైటకు నిలుపెపుడో !
చలి ముసిరే రేయికి దడుపెపుడో !
HE: ఎద అడిగే ముచ్చట ముడి ఎపుడో !
జత పలికే వయసుల నది ఎపుడో !
SHE:ఆగలేక వేగలేక ఓపలేక చూపలేఖ
HE:రాయగోరు ఈడుపోరు తోడుకోరు కుర్రజోరు
SHE:వింత వింత తెలిసేనా ?
వయసింత వంపులు తిరిగేనా ?
చరణం-2
HE:వయసిదిగో నచ్చింది . నీ కొరకు వేచింది .
నిన్ను చేరేదాక నిదుర రాదే అంది.
SHE:ఊహ తెలిసిననాడే నిన్ను తనవాడంది .
ఊసు కలిగిననాడే నీకు అది తెలిపింది .
HE:ఈ దొరకని పరుగుకు సరి ఎపుడో !
నే దొరతనముగా ముడి పాడుటెపుడో!
SHE:నీ చిరు చిరు అలాకకు బదులెపుడో !
ఈ చిరు పరిచయముకు మలుపెపుడో !
HE: ఎప్పుడమ్మా అంపకాలు - అత్త ఇంట జాగరాలు
SHE:ఇంక కాస్త ఆగుచాలు - చిన్నదొచ్చి ఒళ్ళోవాలు .
HE:సందె వాలితే శెలవేనా ?
ఇక రాతిరంతా కలలేనా ?
ఆ !ఆకాసంలో
పల్లవి
HE:ఆ !ఆకాసంలో నీలిమేఘంలో దోబూచులాడకే సింగారీ !
SHE:ఏకాంతంలో కన్నె హృదయంతో సయ్యాటలాడకో బ్రహ్మచారీ !
HE:శ్రావణమాసం వచ్చింది . మంచి ముహూర్తం తెచ్చింది
సందడి ఏదో చేద్దాం రమ్మంది .
SHE:మంగళమంత్రం పలికింది . మల్లెలమాసం విరిసింది .
మంజులనాదం ముందుగ మ్రోగింది .
చరణం-1
HE:పచ్చని ఆకులు వెచ్చగ పిలిచాయి .
SHE:ఎందుకని ? ఏ విందుకని
HE:విచ్చిన పువ్వులు మత్తుగా పలికాయి .
SHE:ఏమిటని? ఏం చెయ్యమని
HE:తోరణమే కట్టేసే తరుణం వచ్చిందని .
మాలగ మన మెళ్ళో మురిసే మోజే పుట్టిందని . `
SHE:మాధవికే మావిడికే తరగని బంధమని .
ఆ జతలా విడకుండా మనలను బతకమని .
SHE:ఈ పసుపుకుంకుమతో
HE:పదికాలాలూ చల్లగ ఉండమని .
ఇదుగో
పల్లవి
ఇదుగో ఓ మాటఇదుగిదుగో ఓ మాట .
ఇన్నినాళ్ళు తెలియలేని
ఎపుడూ నా కెదురుకాని
ఓ తియ్యని చెలగాట .
నీకే చెప్పాలా మాట .
చరణం-1
నిద్దురపోయే కలువల కన్నుల
మెత్తగ తాకి మేల్కొలిపి .
కలలిట్లా ఉంటాయని అంటూ
పులకలు రేపిన ఆ మాట .
హద్దులు చాలు - పొద్దులు లేవు .
వయసుకు వయసొచ్చిందంటూ
పరుగును నడకగా నవ్వును సిగ్గుగ
మలచిన ఆ అల్లరిమాట .
నా చెలియ
పల్లవి
నా చెలియా చిరునవ్వు
ఎలమావి తొలిపువ్వు .
ఆ కలికి కొనసిగ్గు
సుమబాణముకు నిగ్గు .
అనుపల్లవి
బాంధవ్యమే నేరుప
మదనుడే తలచెనో !
తన విల్లు జడలాగ
కాన్కగా పంపెనో !
చరణం
తన సాటి చెలియగా తలపోసి భయమొంది ,
మాత్సర్యమున రగిలి రతి ఎంతో దిగులోందె .
తన పతిని శంకరుడు ఆశరీరునిగ చేయ
బెంగ తీరెను సఖియ సొగసు వర్ణనలేల ?
అదిరందయ్యా అదిరింది
పల్లవి
HE:అదిరందయ్యో అదిరింది అదిరింది .
SHE:అదిరింది అదిరిందయ్యో అదిరింది .
HE:ఈ అమ్మడి అందంలోని హిటెక్కంతా అదిరింది .
SHE:ఈ పిల్లడి కళ్ళల్లోని వెల్ కమ్ ఇంకా అదిరింది .
HE: చూపులతో చూపులు కలిపే ఎంజాయ్ మెంటే అదిరింది .
SHE:మాటలకు మాటలు విసిరే మాజిక్ లవ్వే అదిరింది .
HE: సయ్యంటే సయ్యంటున్న సుందరి స్టైలే అదిరింది .
చరణం-1
HE:కంగారుకు జోరుగ జారే జార్జెట్ పైటే అదిరింది .
SHE:సింగారికి సైటే కొట్టే రేబాన్ గ్లాసు అదిరింది .
HE: కప్పేసి కొత్తగ చూపే మోడ్రన్ డ్రస్సే అదిరింది .
SHE:టక్కెసి లైనుకు లాగే కౌబాయ్ సూటే అదిరింది .
HE: చలిగాలికి గజగజలాడే లేడీ వేడి అదిరింది .
SHE:చెలిగాలికి తహతహలాడే ఐరన్ బాడీ అదిరింది .
HE: నిద్దురకు గూడ్బై పలికిన ఈ గుడ్ నైటు అదిరింది .
SHE:తద్ధినక తాళం వేసే లేటెస్ట్ ట్రెండు అదిరింది .
HE: ఇమ్మంటే ఈనంటూ మన ఇద్దరి ఈ లవ్ గేము అదిరింది .
చరణం -2
HE:ఉన్నానా లేనా అంటూ ఊగే నడుమే అదిరింది .
SHE:తాకాలా వద్దా అన్న తడబాతబ్బా ! అదిరింది .
HE:బ్రేకులతో షేకులతో డాన్సింగ్ ఆహా!అదిరింది .
SHE:జోకులతో కేకలతో ఔటింగ్ ఓహో!అదిరింది .
HE: సరదాగా సరసకు వస్తే బ్యూటీ బాబో ! అదిరింది .
SHE:దొరలాగా దోచుకుపోను నాటీ ప్లానింగ్ అదిరింది .
HE:మజునూలా మార్చేస్తున్న లైలా లాఫింగ్ అదిరింది .
SHE:గజినీలా అలుపే లేని నీ ట్రైయ్యింగు అదిరింది .
HE:రమ్మంటే రానన్తో నులివెచ్చని రొమాన్సు మస్తు అదిరింది .
హలో!హలో!
పల్లవి
హలో!హలో!ఓ హబీబీ !
కొత్త ఆవకాయలాంటి పిల్ల నీ డబ్బీ !
కాస్త ఆగు షరాబీ ! పక్క నుండి జిలేబీ !
చెయ్యబోతివా లూటీ ! దొరకబోదు బ్యూటీ !
చరణం-1
థెల్లగుర్రమ్ ఎక్కిస్తాను చీకట్లో
స్వర్గమంటె నీకు నేను చూపిస్తాను కౌగిట్లో
ఇక నో ఫియర్స్ మైడియర్ !
ట్వంటీ ఫొరవర్స్ బీ నియర్ !
దే అండ్ నైటు జల్సా చేస్కో ఓ మాన్లీ లవెండర్
సూపర్ మాన్లా చెలరేగావో నేనే నీకు సరెండర్ .
చరణం-2
బెస్ట్ క్లాసు బొంబాయ్ బాబీ నా ఫిగరు .
టెస్ట్ డోసు ఇస్తే చాలు కిక్కిస్తుంది నా పవరు .
ఇక బే ఫికర్ బెంజిమన్ !
ఒళ్ళో భలే అంజుమన్ !
లవ్ పాటాలు నేర్పిస్తాను ఇచ్చుకో నీ బయానా !
ఫ్రీడంలోన ఈడంలోన నేనే లేరా డయానా!
నిన్న నేడు
పల్లవి
HE:నిన్న నేడు రేపు మాపని ఓరించద్దు .
పార్కు బీచ్ పబ్బు క్లబ్బని తిప్పించద్దు .
చాల్లే కవ్వింతలూ ,ఉత్తి ఊరింతలు
స్పాట్ చెప్పెయ్ , బ్యూటీ భరిణెమ్మా!
డిస్కో థెక్కులా ? బాల్ రూమ్ డాన్సులా ?
{కిస్ కొట్టెయ్ బ్యూటీ భరిణెమ్మా! ఒడిలో చేరవా వేడిని దించవా }
SHE:ఇవ్వు ఇవ్వని నన్నీ వేళ వేధించద్దు .
నీకై నేను దాచినవన్నీ దోచేయ్యద్దు .
అప్పుడే ఏం తొందర ? టైము ఉందిగా !
బజ్జోమ్మా బుద్ధిగ ఉండమ్మా !సన్నాయ్ మ్రోగానీ ! సందడి రేగనీ !
చరణం -1
HE:కలలు కనీకనీకనీ కైపెక్కిపోతోంది .
వినను అనీ అనీ అనీ నా ఈడు అంటోంది .
SHE:పిలవకనీ అనీ అనీ విసుగెత్తిపోతోంది .
సమయమనీ అనీ అనీ నీ ముందు ఒకటుంది .
HE:వైటింగుకు అంతున్నదీ
డేటింగులు ఎపుడన్నది .
SHE:ఆ మాటే వద్దన్నదీ !
అది సరదా కాదన్నది .
HE:చక్కనిచుక్కను పక్కన పెట్టి
కళ్ళకు గంతలు కట్టకు పట్టీ!
SHE:ఎక్కకు కోర్కెలు గుర్రము జెట్టీ
ఇమ్మని వద్దని మనలో పోటీ !
చరణం-2
SHE:చిలిపితనం మరీ మరీ కనుసైగ చేస్తోంది .
కలికిగుణం అరె అరె కంగారు పడ్తోంది .
HE:సొగసు సరీసరీసరీ కనికట్టు చేస్తోంది .
వయసు అదీ ఇదీ అనీ నసపెట్టి చస్తోంది .
SHE:గుప్పిట్లో గుట్టున్నది .
గుండెల్లో గుబులున్నది .
HE:మాటలతో తీరందది
చేతలకు చెయ్యాలి శృతి .
SHE:చాటుకు రమ్మని పిలువకు మళ్ళీ
వేటకు వేళిది కాదురా అబ్బీ !
HE:మాటకు తీయని తేనెలు అద్ది
ఆటకు తీరిక లేదనకమ్మీ !
హరేరామ హరేరామ
పల్లవి
HE: హరేరామ హరేరామ రామ రామ హరే హరే !
హలోభామ హలోభామ భామ సోకు భలే భలే !
(అలా) అలకతో చూసినా , అల్లరే చేసినా!
SHE:హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే !
చలో కన్న చలో కన్నా చిక్కనయ్య మరే మరే !
(ఇలా)స్త్రోత్రమే చేసినా , సాగిలే ,మొక్కినా !
చరణం -1
HE:ముందు నుండి మగాళ్ళంతా దేవీ (భామ)దాసులే !
కాదంటే అయ్యారు దేవదాసులే !
SHE:తెలుసునండి ముందరంతా పాదదాసులే !
పడ్డామా ఔతారు మాకు బాసులే !
HE:ఆ రాముణ్ణి చూడు -మా కృష్ణున్ని చూడు .
రఘు రాముణ్ణి చూడు -శ్రీ కృష్ణున్ని చూడు .
SHE:ఆ(! వనవాసం పంపాడు - వీధిముద్దు మరిగాడు .
ఆ కథలన్నీ చెప్పి ,మస్కా లిక కొట్టలేరు .
చరణం-2
SHE:సగభాగం మాకిచ్చి మీలో ఒకరు
మా నెత్తిన పెట్టారు ఇంకో ఫిగరు .
HE:కథలను వదిలెయ్ డం ఎంతో బెటరు .
ఈ రోజులు చెరిసగమని తెచ్చాయ్ కబురు .
SHE:ఇది నమ్మేందుకు వీల్లేదు -చరిత్ర సాక్ష్యము లేదు .
నమ్మేందుకు వీల్లేదు - ఏ చరిత్ర సాక్ష్యము లేదు .
HE:అ చరిత్రలో చిక్కనిది - నా ప్రేమే చిక్కనిది .
నే లవ్ బర్డ్ లా నీ కోసం ప్రాణాలిస్తా చూడు .
ఏదో ఏదో
పల్లవి
ఏదో ఏదో జరిగింది
నాలో ఏదో ఔతోంది .
ఆ నవ్వు మహిమేమిటో ?
ఆ చూపు చొరవేమిటో ?
వేరే ధ్యాసే రానంది .
చరణం
గాలిలో తన గుసగుసలే !
పూలలో తన ఘుమఘుమలే !
ఏమ్మాయ చేసిందో -------
ఏమ్మత్తు చల్లిందో -------
తన మాట కూడ ఆ తేనె కన్నా మధురం .
తన కంటపడని క్షణమైనా నాకు విరహం .
దాగుడుమూతల ఈ అనుబంధం.
సగమై నిలిచే సంబంధం .
చరణం
పాటలా తన రుసరుసలే !
ఆటలా తన విసవిసలే !
వెంటాడుతున్నాయే ----
నను లాగుతున్నాయే----
తన చూపు నన్ను రారమ్మనంటూ పిలిచిందే !
తన కొంగు నన్ను కవ్విస్తూ ఎగురుతూందే !
మాటలు చాలని ఈ మధుబంధం .
జన్మలు దాటినా ఈ అనుబంధం .
సగమై నిలిచే సంబంధం .
నారాయణా !నారాయణా!
పల్లవి
HE:నారాయణా ! నారాయణా ![అందాలమ్మా!(2)]
చూసెయ్యనా ! చూసెయ్యనా ! [రావాలమ్మా!(2)
SHE:అయ్యో రామా ! అయ్యో రామా!
ఆగాలమ్మా ! ఆగాలమ్మా !
HE:ఇట్టా ఆరుబైట అందాలన్నీ ఆరబోసి ఆగాలంటే
కోడె వయసు ఒప్పుకొదమ్మా !
SHE:అట్టా ఓపలేని పరువం తోటి ఆడసోకు అంటాలంటే
అమ్మదొంగా !వీలెకాదమ్మా !
HE:అ కాదనక లేదనక నా మైకం నువ్వే దించాలమ్మా !
చరణం-1
HE: ఆ ఈదురుగాలే వీచి , నా వయసును ఆవిరి చేసి
అరువైనా అడగాలందమ్మా !
SHE:అరువంటూ లేదోరయ్యా !అణువణువూ నీదేనయ్యా!
ఆ ముచ్చట ముందే వద్దయ్యా!
HE:ముందైనా వెనకైనా ఆ మురిపెం
ముద్దులమూటేనమ్మా !
చరణం-2
SHE:ఆ చుక్కను చంద్రుడు కూడా
చిరుచీకటి ముసిరినాకే
సరసానికి రమ్మంటాడయ్యో !
HE:సరసంలో వేళాపాళా లేదమ్మో చక్కెరబొమ్మా!
నీ సిగ్గును చెట్టిక్కించమ్మో !
SHE:అ నా సిగ్గును , నీ ఉడుకు
తగ్గేలా లగ్గం పెట్టించయ్యో !
HELLO ఓ కన్నెమనసా !
పల్లవి
SHE:HELLO ఓ కన్నెమనసా !నీకా అబ్బాయి తెలుసా !
ఇన్నాళ్ళుగ లేని కులుకు నీ కొచ్చెను ఔనా!
కదిలి కదిలి నా ప్రాణాలన్నీ తోడేస్తున్నావు .
బాగుందమ్మా నీ వరస!
HE:HAY ! ఓ కొంటె వయసా!నీకీ అమ్మాయి తెలుసా !
బజ్జోని ఇప్పటిదాకా చెలరేగేవు చాలా!
ఎగిరి ,ఎగిరి ఆ అమ్మడి సోకు అంటాలంటావు .
హద్దే లేదా ఏంటి నస?
చరణం-1
SHE:ఇంతకాలం ఎవర్నీ చూసినప్పుడూ కలగదే !
HE:ఎంతమందిని చూసినా ఇంత అలజడి జరగదే !
SHE:ఇది ఏదో కొత్తగా రాపిడి
జతేదని హడావుడి .
HE:ఇన్నినాళ్ళకు మేల్కొంటున్నది .
గుండెలో ఉండే సడి .
SHE:ప్రతి మనసును ఇది మీటేనా !
ఎదురవ్వక మరి తప్పేనా!
HE:ఇది వయసున తొలి జడివాన!
చలి చూపుల కరిగే వెన్న .
SHE:ఐనా ఆపాలన్న ధ్యాసే లేక
అల్లరి చేస్తావ్ ఏంటి కథా !
కాముని కొలిచిన
పల్లవి
HE:కాముని కొలిచిన ఫలమో ----
దేవుడు ఇచ్చిన వరమో----
కోరిన చెలియ కలగా ----
కరుణించెనే తనుగా----
SHE:అంత ప్రేమ ఏమిటమ్మా !
ఇంత పరుగు ఎందుకమ్మా!
HE:అ మనసు పడిన చెలియా నాదెగా !
నిజాము తెలిసి మనసు మురిసెగా!
చరణం-1
HE:అందరాని చందమామ అనిపించిన భామ .
అరచేతి అద్దమై అగుపించినదమ్మా!
SHE:చందమామ కాదోయీ ఈ ముద్దులగుమ్మా !
నీ కోసమే ఉదయించిన నెల వెన్నెలమ్మా!
HE:కలయా! నిజమా! అసలిది కాంతాలలామా!
SHE:కలిశా!పిలిచా!మరువక నను చేరుకొనుమా!
చరణం-2
SHE:చేరలేని తీరంలో నిలిచిన ఈ చిలక
రంగుల రెక్కలు విప్పి నిను చేరినదమ్మా!
HE:రామచిలుక కాదోయీ ఈ రంగులబొమ్మా!
నా కోసమె మొలకెత్తిన గాటపువలపమ్మా !
SHE:మెరుపా! మైమరపా!ఈ మన్మథసీమా!
HE:బిగువా?తగువా?వేగమె నను చేరుకొనుమా!
అలా నువ్వు కవ్విస్తే
పల్లవి
అలా నువ్వు కవ్విస్తే ఆగలేదు నా మనసు .
అలా నువ్వు చూస్తుంటే ఊరుకోదు నా వయసు
నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చెయ్యలేరుగా !
దేవుడైన (మబ్బులైన)దారికి అడ్డు నేడు కారుగా!
ఏదేమైనా మన ప్రేమదిలే విజయం .
ఎదురేదైనా ఇక ఆగదు మన ప్రణయం .
చరణం-1
సుడురాల తీరంలో అలా నీవు నిలుచున్నా
సుతారంగ నీ నవ్వే సితారల్లె వింటున్నా!
గులాబిలా గుండెల్లో నిన్నే నింపుకుంటున్నా !
సిందూరంలా చెంప కందే కథే నీకు చెబుతున్నా!
తపస్సునే చేయక దొరికిన వరం నీవు సుమనయనా !
మరో లోకమంటే ఏంటో చెలీ నీలో చూస్తున్నా!
మనసే ఇచ్చాను . నే వచ్చాను.
నీవే కదా నా ప్రాణం !
చరణం-2
మరీ మరీ చూస్తుంటే మతే నాకు పోతుంది .
తుదే లేని మోహంతో ఏదో జరుగుతూ ఉంది .
కదులుతున్న కోరిక లాగా నన్నే కాల్చుతున్నవే !
రగులుతున్న నాగిని లాగా నన్నే రేపుతున్నావే !
ఇంకా ఏల నువ్వు దూరున్గా
దారే చేరు వేగంగా !
తీస్తున్నావె నా ప్రాణాన్ని
అందాలున్న రాక్షసిగా !
నను దోచెయ్యవా దాచెయ్యవా నే వేరని లేకుండా !
ఒళ్లంతా వయ్యాగ్రా హీటు
పల్లవి
HE:ఒళ్లంతా వయ్యాగ్రా హీటు - పల్సంతా ఓ కొత్త బీటు
సూపర్బు ఈ వింతషాటు వార్రేవా!
SHE:సిక్సర్ లా తాకింది సైటు - ఫిక్సైంది గుండెల్లో సీటు
టోటల్ గా అమ్మాయి ఫ్లాటు వార్రేవా!
HE:ఏ బెంగ చేరిందో లోకి - అరె జోడైంది తబలాకి
SHE:మొత్తంగ మూకి -
అయ్యొ నా నిద్ర అయ్యింది హుష్ కాకి .
HE:ABC రాకున్నాముందె BBC చేరేసి ఉందె
LOVE ఎంత పవరైంది !
చరణం-1
SHE:కళ్ళల్లో చూయింగుగమ్ము -చేతల్లో స్నాచింగుదమ్ము
మాటల్లో మ్యాజిక్కు హమ్ము వార్రేవా!
అబ్బాయి సానెట్టిన జేమ్ము డూస్కెళ్ళె లేజరిలేనమ్ము
చూపాడు వండర్ లోకమ్ము వార్రేవా!
HE:బాడీలో బాదమ్ముషైను--సాడీలో షేకింగుసైను
లేడీయె లేటెస్టు క్వీను వార్రేవా!
అమ్మాయి అందాలమూను --శాండిల్లా గంధాలమేను
జోడీగా తానుంటే ఫైను -వార్రేవా!
SHE:ఫ్రీక్వెన్సీ గమ్మతుగా ఉంది -
అరె!సీక్వెన్సు స్టన్నింగుగా ఉంది.
HE:ఈ థ్రిల్లు కావాలని ఉంది -
అబ్బ! డ్రిల్లు మామత్థుగా ఉంది .
SHE:అ డీడిక్కు ఆడాలనుంది వేడెక్కి ఊగాలనుంది .
చాటింపు వేయాలని నాకుంది . ఆహా! ఓహో!
చరణం-2
HE:బ్యాటింగు ఆ కళ్ళ కిచ్చి ---దెతింగు చెక్కిళ్ళ నిచ్చి
రాగింగు రాపిల్ల గుచ్చి ----వార్రేవా!
కౌబాయ్ ని కట్టేసుకుంది ----హీమాన్ ని చుట్టేసుకుంది
లవ్ మార్చేసుకుంది --- వార్రేవా !
SHE:డే అంతా హాంటింగు చేసి---నైటంతా ఛేజింగు చేసి .
డ్రీమ్సన్నీ డ్రాగింగు చేసి ----- వార్రేవా!
స్వీటికి వేశాడు బీటు ------భేటీకి చెప్పాడు డేటు
బ్యూటీకి ఇచ్చాడు జోల్లు ------వార్రేవా!
HE:ఈ ఛార్మి హంటింగు చేస్తోంది .
అబ్బో! నా ఓర్మి టెస్టింగ్ కు పెడ్తోంది .
SHE:ఈ గేము లవ్లీగా ఉంది .
అమ్మొ ఇంకేమొ జల్దీగా ఉంది .
HE:టెమ్టయ్యి ఊగాలనుంది .
జంటయ్యి తీరాలనుంది .
కమిటయ్యిపోవాలని నాకుంది . ఆహా!----ఓహో!
పాలరంగులో ఉంది కోయిలా !
పల్లవి
HE:పాలరంగులో ఉంది కోయిలా !
గుటక లేయమంటే నాకెలా ?
కళ్ళు అప్పగించి చూస్తె నేనిలా
వన్నెపోని కన్నె చందమామలా !
నవ్వుతోంది నంగనాచి కిలకిలా!
SHE:ఆకుచాటు పండు షోకిలా!
కొరికి చూడాలంటె మాటలా!
మత్తు చల్లుతున్న పిల్లగాలిలా!
హద్దు మీరుతున్న కొంటెవాగులా !
నన్ను చుట్టబోకు నీవు గలగలా!
చరణం-1
SHE:అమ్మయ్యో!ఇంత ఆకలా?
HE:అమ్మడూ!సమయమే కదా!
SHE:ఇంత ఇంత కళ్ళతోచి ఎంత ఎంత జుర్రుకున్నా తనివి నీకు తీరదా?
HE:అంత అంత అందముంటే చిన్నచిన్న కళ్ళు ఎట్ల తినడమబ్బా మాటలా?
SHE:ఓహో! నను వదలవా?
HE:రాణీ! కరుణించవా!
SHE:కరుణించడమంటె ఏమిటో చెప్పాలంటా !
HE:కరుణించడమంటె కౌగిట్లో కరగాలన్తా!
చరణం-2
SHE:అమ్మబాబోయ్ ! ఏమి తొందర ?
HE:కవ్వించి ఎంత బిత్తర !(తత్తర)
SHE:ఎంత ఎంత దూరముంటే అంత అంత చేరువయ్యే రోజు ముందు ఉందిగా ?
HE:అంత అంత దూరమంటే ఇంత కొంటె వయసు నన్ను ఆగనదు చేరవా?
SHE:బాబూ!ఇంత అల్లారా?
HE:భామా!ఇది ముచ్చటా!
ఆదిశక్తి ప్రతిరూపమా!
పల్లవి
ఆదిశక్తి ప్రతిరూపమా!
ఇదే నీ కిచ్చే గౌరవమా!
స్త్రీని దేవతగ కొలిచే నేలలో
అడుగడుగున వ్యథలే(అపశృతి)నీకమ్మా!
చరణం-1
మాతృదేవతవు అంటారు .
నిను ప్రకృతి రూపమని అంటారు .
కూడుగూడైన ఈయక , నీ యోగక్షేమాలు చూడక .
నీ కండ కరిగించి , గుండె మరిగించి
నీ చను బాలు త్రాగిన వారే నిను వీధిపాలు చేస్తుంటారు .
చరణం-2
అర్థదేహమని అంటారు
ఆకాశంలో సగమంటారు .
ఆకలి చూపుల వెంటాడి , నిను ఆలి చేసుకొన వెనుకాడి ,
నీ నమ్మకం తుంచి , అమ్మకం ఉంచి .
నీ మురిపాలు పొందినవారే నిను అల్లరిపాలు చేస్తుంటారు .
చరణం-3
అపరకాళివని తెలుసుకో!
నువ్వు ఆత్మస్థైరాన్ని పెంచుకో !
నీవు ఇచ్చిన జన్మేగా ఈ మగజాతి మొత్తంగా
నీ శక్తి చాటించి,భక్తి కలిగించి
ఈ దానవజాతిని ఇకనైనా అభిమానవజాతిగ నడిపించు .
రావా! వినలేవా!
పల్లవి
రావా! వినలేవా!
ఈ గుండెల్లో ఆవేదనెట్ల తెలుపనురా!
నీ ప్రేమను నేనెలా పొందనురా!
చేయని పాపం ఈ రూపం
చేయకనే పొందిన శాపం [చేజేతులా పొందినా శాపం ]
ఈ శిక్ష మారేదేలా?
నా బాధ తీరేదెలా!
రావా ------- వినలేవా!
చరణం-1
శిథిలమైన నా మనసు ఆకాశమే
చివురు తొడుగు వలపుంటె ఆ పుడమే !
ఆ రెంటికి కలయిక లేదులే!
నా కోరిక తీరేది కాదులే!
చుక్కను చంద్రుడు చేరెనురా!నీ కౌగిలి నే చేరేదెలా!
ఆ దైవమె నా వ్యథ తీర్చాలిరా!
రావా!--------వినలేవా?-------
రారా! ఇటు రారా!
పల్లవి
రారా!ఇటు రారా !
నీ గుండెల్లో నే నిదురపోతారా!
నీ కళ్ళల్లో కలవరం నేనేరా!
పోలేవు నీవు ఎంతో దూరం
రాలేరు ఎవ్వరూ సాయం
ఈ లోకమే నావశం
నా మాటలే శాసనం .
రారా! ఇటు రారా!
చరణం-1
తీరిపోదురా నా రక్తదాహము
ఎవ్వరొచ్చినా ఆపాను నా పయనం
నా పగ చల్లారిపోయేదాక [నే కోరినదంతా సాధించగా]
ఈ మారణహోమం సాగించుతా!
ఏ ప్రేమలు దారిలో బలి అయినా
నా ద్వేషం తీరుటే మిన్న
ఆ దేవుడొచ్చినా వదలనురా !
రారా ! ఇటు రారా!
నీ పిలుపు కోసం
పల్లవి
వలపే నీ కోసం లేరా!
సొగసే నీ సొంతం రారా!
కదిలే ఈ కోరిక నీదేరా!
ఇది ఎడబాటు కాదోయి
మనసులకు లేదోయి
తనువులదె ఈ దూరము .
విడవక నీ నీడల్లే నేనుంటా!
నీ పిలుపు కోసం -----నీ పిలుపు కోసం .
చరణం-1
ఆరిపోదు గుండెలోన నీ రూపము
మాయలేదు అంతులేని ప్రేమపాశము.
విధి దేహాన్ని విడదీసి పొమ్మన్నా!
నిను వదిలేసి పోలేక నేనున్నా!
ఏ జన్మకూ నీ జంతగా
వస్తాను నేను ఎవరు నన్ను ఏమన్నా!
నీ పిలుపు కోసం -----నీ పిలుపు కోసం .
చరణం-2
ఓర్వలేని వారు మనసు వేరు చేసినా -----
చేరువైన తీరు మనది ప్రేమ దీవెనా !
పదికాలాలు ఉంటాము ఇకనైనా -----
మనిషే కాదు మనసైన ఒకటే సుమా!
మన ఆత్మల ఈ సంగమం
నిలవాలి వేయిజన్మ లెదురు చూస్తుంటా !
నీ పిలుపు కోసం -----నీ పిలుపు కోసం .
ఏయ్ రాజా !
పల్లవి
SHE:ఏయ్ రాజా! ఏయ్ రాజా!
అందముంది ఆజా ఆజా!
HE:ఏయ్ రోజా!ఏయ్ రోజా!
మీద పడకు జా జా!
SHE:చేరువే ఉంది లేజా!
చేసుకో కామపూజా!
HE:ఊదకే నీవు బాజా!
ఊపుతా కాస్త సోజా!
SHE:లంచమే ఇచ్చినా మంచమే ఎక్క ఫోజా!
చరణం-1
SHE:ఏప్రిల్ ఎండలో ఉన్నట్టుగా నన్ను దులపరించుకుంటావు ఎందుకంటా?
HE:సూపర్ ఫిగర్ పై పై పడినా నేను
పిచ్చి పట్టిపోను పొపొమ్మంటూ !
SHE:నవంబర్ చలిలో చిక్కినట్టుగా
నన్ను అంటుకొని వెచ్చగా ఉండమంట .
HE:డిసంబర్ నెల నన్ను నలిపేస్తున్నా
నేను సికిందర్ ధైర్యంతో అడుగేస్తుంటా!
SHE:ప్రవరాఖ్యుడివా? పండుముసలివా?
HE:మేనక చెలివా? ఆగని చలివా ?
SHE:సిగ్గేల స్వెట్టర్లా చుట్టేయి వణుకొచ్చె
గజగజగజ---గజగజగజ .
చరణం-2
HE:హస్తిణీ చిత్తిణీ అక్క కాకు
నన్ను లక్కలా గంమ్ములా అంటుకోకు .
SHE:సందులో సుందరి నేను కను .
నిను కోరి అప్పగించుకునే కన్యను నేను .
HE:హద్దులో ఉంటేనే అందమంటాను .
నిన్ను బుద్ధిగా కాస్త వేచి చూడమంటాను .
SHE:తోడు కోరు పాల వంటి ఈడు దివాను .
మీనమేషాలు లెక్కిస్తే విరిగిపోవును .
HE:లాలీ పప్పే కోరే మనసే!
SHE:జాలీ లాలీ ఊగే వయసే!
HE:కత్రీనా సైక్లోన్లా కమ్మెయ్యకు నేనౌతా!
గిజగిజగిజ ---గిజగిజగిజ .
తిరిగిరాని తీరమే
సాకీ
ఊహల కందని ఓ త్యాగమూర్తీ !
అమ్మ పదానికి అర్థమై పొందావు శాశ్వత కీర్తీ.
పల్లవి
తిరిగిరాని తీరమే చేరావా దీపమా!
కనుమరుగైపోయావా కన్నపేగుబంధమా!
చీకటి కోదిలేశావా నీ ఆశాజ్యోతిని .
ఈ మాయాలోకంలో ఎలా బ్రతకగలడని .
చరణం-1
ఎంత రక్తాన్ని చిలికి ఇచ్చావో చనుబాలు .
ఎన్ని కష్టాలు కోర్చి చెప్పించావో ఓనమాలు .
కాయ కెపుడు తెలియదమ్మా
కొమ్మ పడే కష్టం .
తల్లి మనసు తెలయనీదు
బిడ్డకు తన దు:ఖం
ఆమె దూరమైన వేళ జగమంతా శూన్యం
తడబడే అడుగులతో మొదలౌను జీవితం (జీవనం)
చరణం-2
నెమలికంటి నీరు వేటగానికి ముద్దౌనా ?
మాతృత్వపు మధురిమ ధనపిచ్చికి బలియేనా?
ఎంతిచ్చినా తీరదు తల్లి ప్రేమ ఋణం .
ఏ జన్మలో పొందారో అరుదైన ఈ వరం.{ఆ అమ్మకు మరురూపం అన్నమెట్టుపొలం (అన్నమిచ్చు)}
ఏ లోకంలో ఉన్నా ఆ దీవెన అమరం .{జనని జన్మభూములను మించదు ఏ స్వర్గం .}
మరుజన్మకు కావాలి తల్లిగా ఈ దైవం .{ఈ అభిమన్యుడు వాటి కొరకుచేయాలిక సమరం .}
పట్టేసిండు వాడు
పల్లవి
పట్టేసిండు వాడు నా పైటపట్టేసిండు .
చుట్టేసిండు అబ్బా నా నడుం చుట్టేసిండు .
పైట పట్టేసి , నడుం చుట్టేసి ,
తీయని తిప్పలు నాకు తెచ్చి పెట్టిండు .
తీరక లేదని నన్ను తిప్పి కొట్టిండు .
ఏం చెయ్యనురా రామా నా కొచ్చిన ఈ ఖర్మ .
ఏమైందే నీ కంటూ అడుగుతోంది మా అమ్మ .
చరణం-1
ఆ రాత్రి ఏమైందో ఏమోనమ్మా!
మామూలుగానే పడుకున్నానమ్మా!
దిండేమో చిరిగింది .
పడకేమో నలిగింది .
చపావె రాత్రంతా అని అమ్మే కసిరింది .
పొడిచింది అమ్మనైతే నా కొళ్ళంతా నొప్పులు .
నలిగింది పడకైనా నా నడుమంతా సలుపులు .
ఇదేం మాయమౌ ఇదేం చిత్రమౌ ?
పట్టు కింత పట్టుందా ?వాడి కింత శక్తుందా ?
అబ్బో!అబ్బో!అబ్బో!అబ్బో!
చరణం-2
పైటేసి పదినాళ్ళు కాలేదమ్మా-
సిగ్గింకా మొగ్గినా ఎయ్ లేదమ్మా!
ఒళ్ళంతా బరువైంది - రైకంతా బిగువైంది .
నా చూపు రేబవాలు వాడి దారి కాసింది .
గుండెలో ఓ దిగులు -
ఆవిరి అయ్యే గుబులు .
ఆ డొంకదారంట చెప్పలేను నా తిప్పలు .
పట్టుకింత - వాడి కింత శక్తుందా!
ఆగు ఆండాలమ్మో!
పల్లవి
HE:ఆగు ఆండాలమ్మో !సోకు చాకేనమ్మో!
ఎంత అందగాత్తెమ్మో!నిన్ను కనమ్మో!
SHE:నాటు నాచారయ్యో!నన్ను గిల్లొద్దయ్యో!
ముంత కింత పప్పు తినిపిస్తానయ్యో!
HE:అత్తమ్మే మీ అమ్మ నా కౌతుందమ్మా!
నీ అందం గుత్తం గియ్యమ్మా!
SHE:ఆ అత్తే వచ్చినా నేను ఒప్పుకోనయ్యో!
నీ సొత్తు కాబోనయ్యా!
చరణం-1
HE:చీరలో చందమామ చంపేస్తోందమ్మా!
కోకలో కన్నెలేమ కాటేస్తోందమ్మా!
SHE:నాటులో నీటు కొంచెం తోడైందిరయ్యో!
ఆటలో అరటిపండు నే కాలేనయ్యో!
HE:అల్లాగా!మరి ఎల్లాగా!
SHE:ఇల్లాగా!తిరిగెళ్ళాల్గా!
HE:వద్దంటె నామర్దా కాదా!
SHE:ముద్దంటె కొంప కొల్లేరవదా!
HE:దొంగను చేస్తున్నావు అడిగింది ఇవ్వకుండా
ఆనాక ఏమైనా ఆనేరం నీదేనమ్మో!
SHE:ఆ ఛాన్సు నీకు దొరికే వీల్లేకుండా
దాస్తాను సరుకు భయమే నీకొద్దయ్యో!
(దొరలా నువ్వుండయ్యా)
చరణం-2
SHE:దారిలో మాటు వేసి ఆపొద్దురయ్యో!
పాకలో పాప నన్నుచేయొద్దయా!
HE:జోరులో జరుగుతున్న పనికాదోలమ్మో!
తోడుగా బతుకంత నే నుంటనమ్మో!
SHE:అల్లాగా!నే నమ్మాల్గా!
HE:ఇల్లాగా!రా ఇల్లాల్గా?
SHE:కాకాలు చాలించరాదా!
HE:నీ కాలు పట్టేస్తా రాధా!
SHE:ఆశను చూపిస్తావు . నే నీరు కారేలాగ
ఆ పైన ఆగదయ్యొ . అది నీకు నాకు బాగా!
HE:అసరదా కాదులె నా మాటను నమ్ము
పరదా లొద్దులె నేనే నీ సొమ్ము .
మొదలేది ఈ వింతమోహానికి
పల్లవి
HE&SHE :మొదలేది ఈ వింతమోహానికి
తుదిలేదు ఈ తీపిదాహానికి .
SHE:అదిరేను అధరాలు ఇది ఏటికి? HE:కదిలేను మరికాస్త చొరబాటుకి .
చరణం-1
SHE:తీరిపోని తపన ఏదో ఓడిపోనన్నది .
HE:లేనిపోని గొడవ నాలో రేపిపోతున్నది .
SHE:చాటుమాటు తెరచాటు లేలా?
HE:ఆటుపోటు అలవాటు మేలా?
SHE:తేటిలా చేరరా! చెలియ నీదేనురా!
చరణం-2
HE:విదుర రాని రాతిరేదో ఎదురు లేదన్నది .
SHE:అదును చూసి పదును గాలి తనకు తోడైనది .
HE:ఈడు జోడు కలిశాయి రాధా!
SHE:వాడివేడి చలివేళ కాదా!
HE:ఇంక జాగేలరా!వంకలే లేవుగా !
కందిచేను
పల్లవి
కందిచేను ఏపుగున్నాది .
ఆ చేనిలోన మంచె ఉన్నాది .
ఆ మంచె మీద ముద్దబంతి పువ్వు
దాని చూపు లాగుతోంది జివ్వుజివ్వు .
కోసుకోరా!కోసుకోరా!కంచె దాటి కోసుకోరా!
చేసుకోరా!చేసుకోరా!చేతనైంది చేసుకోరా!
చరణం-1
రేతిర్లు నిదర రానీదురా !
పగలంతా అరక దున్ననీదురా !
అబ్బా!బువ్వే తిన్నీదురా!పొద్దే పోనీదురా!
రమ్మంటూ పిలుస్తుంది .వస్తే కవ్విస్తుంది.
దాని తిక్క వదిలేట్టుగా పడునుచూపు చూడరా!
రేకురేకు విరిసేలా చురుకునంత చూపరా!
చరణం-2
చూసిందా చూపు తిప్పలేవురా !
నవ్విందా నీళ్ళు నములుతావురా!
సంకురాత్రి రోజురా!చందమామ చాటురా!
వచ్చావో దొరుకుతుంది
దరువే వేయిస్తుంది .
దాని దుడుకు తగ్గేటుగా నీ ఒడుపే చూపరా!
సోకు సొమ్మసిల్లేలా నీ చేవనంత చూపరా!
చీరలే ఒలవని
పల్లవి
HE:చీరలే ఒలవని మొక్క జొన్నపొత్తు.
ముళ్ళే ఎరగని ఓ మొగలి గుత్తు.
అమ్మాయి చూపులో క్లోరోఫాం మత్తు .
పడిపోయి లేచాక పీక్కోవాలి జుత్తు .
SHE:ప్యాంటునే వేసుకున్న మెరుపే వీడచ్చు .
తాకితే షాక్కొట్టే చూపే ఓ చిచ్చు
అబ్బాయి వాయిస్ లో ఉరుమే వినవచ్చు .
నో డౌటు వీడికి లైనే వెయ్యొచ్చు .
చరణం-1
HE:మాట చల్లిపోయింది తేనెల గమ్మత్తు
ఈటె గుచ్చిపోయింది ఊపులలో సొత్తు .
ఈ పిల్లే లేకుంటే జీవితమే పస్తు .
బిస్తర్ పై తోడుంటే నైటు అబ్బో మస్తు .
SHE:చుట్టుకొలత చూసింది వాడి చేతి పట్టు .
రెచ్చ గొట్టిపోయింది చెప్పలేను ఒట్టు .
అమ్మచేతి ఉగ్గు కూడ అమ్మో హాంఫట్టు
ఒళ్ళంతా నిండిందీ పాడి చూపు హీటు . చరణం-2
SHE:చాలు చాలు అంటుంది చుప్పనాతిమనసు
మోరుమోరు అంటుంది మాయదారి వయసు
ఆగలేదు వేగలేదు ఆకతాయి సొగసు
వాడి జోడు తీర్చుతుంది (దించుతుంది)ఈడుకున్న పులుసు
HE:ప్యారుప్యారు మంటాయి రేతిరంత కలలు
బ్యారుబ్యారు మంటాయి పగటి పూట పొదలు
ఆర్చలేను తీర్చలేను వేడివేడి సొదలు
అమ్మాయే తీర్చాలి తియ్యని ఆపదలు .
చలి కాచు చూపు
పల్లవి
చలి కాచు చూపు, గిలిగింత పెట్టి
నన్నే మాయ చేసింది
చినుకంటి నవ్వు వరదల్లె మారి
అలలా ముంచిపోయింది .
ఏమిటో ఈ వింత ? సంగతేమిటి అంట ?
అందరికీ అంటుకునే (ఈ)వ్యాధి ప్రేమేనంట .
చరణం-1
తాళం ఉందని తెలియని నా మది తలుపే తెరిచి
కనివిని ఎరుగని చిలిపి సరదా తెలిపి
నిలిచిపోయిన తానే నా కాదల్ రాణే
మిగిలిపోయిన నేనే ప్యార్ కీ దీవానే !
చరణం-2
ప్రేమే తెలియక పెరిగిన వయసును నిద్దుర లేపి
రంగులలోకం నీకుందంటూ సందడి చేసి
కలలు నేర్పిన తానే సదియోం సే జానె
మనసు తాకిన తానే రూప కీ రాణే !
చేసుకో నన్ను
పల్లవి
HE:చేసుకో నన్ను నీ బానిస
నేను చూడకుండలేను సోకు హమేషా
చాలంటూ పెట్టకు నీవు నస
నాకు నీ సోకు తినలేని సమోసా!
SHE:తినకురా నన్ను ఓ తానీషా!నీ తెగనీల్గెడి వయసు నాకు బాల్ నిషా!
కాదంటే ఆపుతావ కాలేషా!
నీవు కామ్ చోరు కాకుండా చూపుపస
HE:బాగుందె ఈ తమాషా !
SHE:భాగోతమాపు పేరాశా!
HE:ముందు పెట్టి కట్టి మూవీ చూపిస్తుంటే
గొంతెండిపోతోంది గణేశా !
(కాస్త) గంగనైన పంపు గౌరీశా!
చరణం-1
HE:ఎట్లెట్లాగొ ఉందే నిన్నిట్లా చూస్తుంటే కొట్లాడాలని ఉంది తుంటరి కాముని తోటే !
SHE:అట్లానే ఉంటుంది ఆ అక్కర తీరేదాక
ఇంకెట్లాగొ ఉంటుంది ఓ చక్కెరకేళి రాజా!
HE:ఇంకైతే మొదలెడదాం సరసాల సరిగమ .
SHE:తంతైతే వద్దంటానా ఆ కమ్మని మధురిమ .
SHE:అమ్మమ్మా! ఆగాలా అందాకా!
HE:ఆడేద్దాం! అష్టాచెమ్మా!
చరణం-2
HE:తాకే చలిగాల్లో నీ చూపే రగ్గు రగ్గు .
ఊపే కోరికలో అరే నీవె దిక్కు దిక్కు .
SHE:అంతే లేని ఆశ నీ కొద్దు తగ్గు తగ్గు .
వలలో పడను నేను చేసేస్తా చిక్కు చిక్కు
HE:వయసుల్ని మరిగిస్తే నీ సొమ్మేం పోతుంది .
SHE:మనసుల్ని కదిలిస్తే ఆ తొందర పోతుంది .
HE:అయ్యయ్యో!దయచూడు దీనుణ్ణి .
దాటేస్తే ఎట్టాగమ్మా !
కలిలో కిష్కింధా! పల్లవి HE:కలిలో కిష్కింధా! చూడాలని ఉందా!
కౌగిట్లో కొచ్చేసెయ్ ఓ మకరందా!
SHE:చాల్లే గురివిందా!దీనికి అంతుందా!ఘాటు ఘాటు ప్రేమకిది ఒకటే మాదా!
HE:చెబితే వినవా?లేటు నీకు బాగుందా!
SHE:అయితే గురువా!తిరిగి వెళ్ళి పోయేదా?
HE:నన్నిట్లా ఏడిపిస్తోంది గురుగోవిందా!
చరణం-1
SHE:ఎంకిని కానోయ్ నాయుడు బావా!
కాళిని నాలో నువు చూస్తావా! SHE:ఎంకిని కానోయ్ నాయుడు బావా!
HE:కాళివి అయితే కాశికి పోతా!
మేనక లాగా మేనందీవా?
SHE:మేనక వస్తే నాకే నీవిక టాటా చెబుతావా?
HE:మేనక భూమిక యామిక గోపిక అన్నీ నీవేగా!
SHE:ఆ మాటే ఇచ్చావా ------------
నిన్నంటుకు జన్మలు జంటగ ఉంటాగా --------
చరణం-2 HE:సుందరవదనా!చెంతకు రావా!
తనివే లేని ఆకలి కావా!
SHE:తొందర చాలోయ్!చిందుల లావా!ముందర ఉందోయ్ !అందుకు తోవ!
HE:తోవను చూపి అడుగులు నాతో నువ్వేవేస్తావా!
SHE:తోడువు జోడువు నీడవు అన్నీ నీవే ఔతావా!
HE:అందుకె నే వచ్చాగా -----
జన్మంతా నీకే అంకితమిస్తాగా -----------
ఉప్పాడ చీరలో
పల్లవి
HE:ఉప్పాడ చీరలో , ఉయ్యూరు రైకతో
ఊపుతున్నావే ఉయ్యాలా!
ఊహ రేపుతున్నావే ఇయ్యాలా!
SHE:సరిగంచు పంచెలో , చక్కని క్రాఫింగుతో
చంపుతున్నావే సామిలాలా!
చెంప నొక్కుతున్నావే యాలోయాలా!
చరణం-1
HE:ఇగురుకూర,సిలుకు చీర , కన్నెపిల్ల సోకుసారె.
SHE:పాలచుక్క,పూలపక్క,పడకటింటి పోకుచెక్క .
HE:ఇచ్చుకోను రావే ఇంటి ఎనక బుల్లీ !
SHE:పుచ్చుకోని పోరా మాటమత్తు చల్లీ!
HE:ఇచ్చుకో !
SHE:పుచ్చుకో!
HE:సరదాలే చేసుకో!
చరణం-2
HE:తడికెచాటు,పెదిమకాటు,గడ్డివామి ఆటుపోటు
SHE:సిగ్గుచేటు,ఎంత నాటు,లగ్గమవ్వకుండ పాటు .
HE:రెచ్చగొట్టిపోకే రవ్వముక్కు పుడకా!
SHE:పిచ్చిపట్టిపోకో లచ్చుమత్త కొడకా!
HE:ఒప్పవా?
SHE:వదలవా?
HE:ఒళ్ళోకి వచ్చెయ్యవా!
HE:దొండపండు,పక్కదిండు,సన్నజాజి పూలచెండు .
SHE:చీకటిల్లు,వానజల్లు,మచ్చు కింద మాట చెల్లు .
HE:ఎప్పుడిస్తావమ్మో వద్దుగిద్దు అనక
SHE:అప్పగిస్తనయ్యో ఆగు అంతదనక .
HE:పట్టుకో!
SHE:తట్టుకో!
HE:పగ్గంలా వాటేసుకో!
చిన్నచిన్నమాట
పల్లవి
SHE:చిన్న చిన్న మాట నీకు చెప్పనందుకు
నాకు నిన్న మొన్న రాత్రి నిద్ర పట్టదెందుకు
HE:అమ్మ కొంగు చాటు నీకు ఇంక ఎందుకు
అబ్బ చల్ల కొచ్చి నీకు ముంత దాచుడెందుకు?
SHE:ఇంతదాక సిగ్గు నన్ను తడమనందుకు
ఈ కొత్తబెంగ జాడ నాకు తెలియదెందుకు?
HE:చంటి పాప లాగ లాలిపప్పు లెందుకు?
నీ చిన్న గౌను కింక ఇన్ని తిప్పలెందుకు?
చరణం-1
SHE:సందె అయినా కాకముందె సద్దు ఎందుకు ?
నీకు కోడి కూసే దాక ఉంది హద్దు(పొద్దు)ముద్దుకు .
HE:చెల్లి పెళ్ళి కూడా లేదు ఆగమందుకు .
అబ్బ!అన్న కూడా లేడు నాకు అడ్డముందుకు
SHE:అమ్మనాన్నలాట ఆడ రామ్మనేందుకు
అయ్యో!అందమింక అంగలేసి రాదు ముందుకు .
HE:అంగలేయ ఇంత చెడ్డ లేటు చేయకు .
అయ్యో చొంగకారు ఈడు పెద్దకేటు ఆపకు .
ఆ నవ్వు చూస్తె
పల్లవి
ఆ నవ్వు చూస్తె తెలిసింది .
నీ చూపు చూస్తె తెలిసింది .
నీ సిగ్గు నాకు చెప్పకనే చెబుతోంది .
ఆ నిగ్గు ఊసు తెల్పకనే తెలిపింది .
అన్నిటినీ మించిపోయి నీలో నిగనిగ చెబుతోంది .
నువు ప్రేమలో పడ్డావని .
తలమునకలుగా ఉన్నావని .
చరణం-1
నిన్నే తెలిసిన నా మది నుంచి దాచాలేవు .
నీకే తెలిసిన నా చెలిమి ముందు ఆగలేవు .
నిన్నే వెదికే నా కళ్ళను దాటలేవు
దాగలేని నీ వలపు దా!దా!అంటోంది
ఆగలేని నా వయసు పదపద మంటోంది .
చరణం-2
పరదా చాటు ఇంక నిన్ను ఆపలేదు .
సరదా మాటు నీ నవ్వును మాపలేదు .
వరదై పొంగే ఈ అలజడి నిలువనీదు .
మాట లేని నీ చూపు మాయే చేస్తోంది .
దాత లేని నాకైపు మారాం చేస్తోంది .
సరసకు రావేమే
పల్లవి
HE:సరసకు రావేమే (నా కామాక్షీ)(నా ముత్యాలు)నా ఇల్లాలు !
[సలుపులు పుట్టించే(సోకే సాక్షి)నీ పరువాలు ]
సలుపులు పెడుతున్నాయ్ నీ పరువాలు .
SHE:[చలాకి మాటలు చాలించయ్యా ఓ చలమయ్యో]
పంచెగ్గట్టుకు రాకయ్యో మొగుడయ్యో!(ఓ చలమయ్యో!)
గురుతొచ్చిందా ఇప్పుడు నీకు ఇల్లాలు [(ఈ కామాక్షీ!),(ఈ ముత్యాలు!)]
HE:అరె కోర మీనా (కన్నె కూవా)0 కోర కోర లొద్దు .
కోరిక తీర్చి కొసరవె ముద్దు .
చరణం-1
HE:బంజారా హొటల్లో మొఘలాయి బిర్యానీ నీతోనే తినిపిస్తా
[ఒబెరాయి హొటల్లో చికెను కబంబ్ తెచ్చి నీచేత్తో కొరికిస్తా.]
ఆపైన ఏదైనా నువ్విస్తే కుక్కల్లే నీ కాడే పడి ఉంటా.
SHE:నా కొద్దు నీ తిళ్ళు -ఆపై నీ ఆకళ్ళు
[పెళ్ళామే ఉండంగా - నేనెందుకు అడ్డంగా]
ఈ సోకుల సిత్రాంగి చింతామణి చెల్లెలు .
HE:అరె!అప్సరసల్లే నీ వుండంగా
[పెళ్ళా మెందుకు గుండెకు దడగా!]
వేరే ఫిగరు నాకు దండగా!
చరణం-2
HE:చన్నీళ్ళు పడినట్లు నీ చూపు పడగానే జిల్లైపోతానమ్మీ!
ఎన్నాళ్ళు నన్నిట్లా నీ చుట్టూ చక్రంలా తిప్పిస్తావే అమ్మీ!
SHE:చాలించు ఈ కథలు చెల్లదులే నీ చతురు
నా ముందు ఉడకదులే నీ పప్పు ఓ డూపు .
HE:అరె వయ్యారంపై వొట్టేస్తానే!
వాకిట్లోనే కాపూటానే!
చరణం-3
HE:సాకిరేవు కాడ నిన్ను కూచోబెట్టి గాడిద చాకిరి చేస్తా!
వగలంతా ఒలికించి వొళ్ళోకి నీవొస్తే ఒళ్ళంతా నగలేస్తా!
[ఆపైన ఏదైనా నువ్విస్తే కుక్కల్లే నీ కాడే పడి ఉంటా!(కాళ్ళ)]
SHE:వగలొద్దు . నగలొద్దు . నీతో నా కసలొద్దు .
ఆమాసకు వున్నంకు నువ్ మెలికలు తిరగొద్దు .
HE:అరె!నువ్వూ ( అంటే నే వస్తానే!
రేయింబగలు పడిచస్తానే!
చరణం-4
HE:నడుమొంపుకు నజరానా - వడ్డాణంలా మేన నేనుండిపోయేనా
మలుపున్న ఆపైన మెరిసే నీ మెడలోన నగలానే నిలిచేనా?
SHE:నడుమైనా మెడపైనా ఆపై ఇంకేమైనా
తాకాలి అనుకుంటే అవ్వాలి తలకిందే!
HE:అరె!నగలా నువ్వు వద్దని అంటే
చీరలా ఐనా చుట్టుంటానే!
తొలిచూపు
పల్లవి
SHE:తొలిచూపు అమాయకం
మరు చూపు అయోమయం .
ఆ పైన చూసిన ప్రతి చూపూ ఓ మన్మధబాణం .
HE:తొలిమాట ప్రతికూలం
మరుమాట అనుకూలం .
ఆ పైన ఆడిన ప్రతిమాటా ఓ రతిసంకేతం .
చరణం-1
HE:చూపు ములుకు తగిలి
అయినది చిరుగాయము .
కలికి పలుకు పూసింది వలపుమలాము .
SHE:తొలి కలయిక చేసెను ఈ చిలిపియాగము .
BOTH :మన జతకిక లేదుగ ఏ జంటా సమము .
చరణం-2
SHE:మాట మత్తు బిగిసి
కలిగె పారవశ్యము
చెలుని చెలిమి చేసింది వలపు(చలువ)వైద్యము .
HE:మన వలపులు చేరెను మనసైన తీరము .
BOTH :రసజగములు చూచిన ప్రేమికులు మనము .
కసి కసి
పల్లవి
HE:కసికసిపరువంతో వెయ్యకు పందెం
మిసమిస వయసున్న అల్లరి అందం .
SHE:కసికసిగుంటేనే పందెం అందం.
నా మిసమిస తలుకేగా నీకు బంధం .
HE:అరె సొగసే మంచం కులుకే లంచం .
దగ్గరి కొస్తే తగ్గును దాహం .
చరణం-1
HE:'F'ఛానల్ మోడల్లా కవ్విస్తూ ఉన్నావే!
పాపిన్సు బిళ్ళల్లే నోరూరిస్తున్నావే!
SHE:శక్తిమాను డూపల్లే ఛేజింగు చెయ్యకులే!
షకలక బేబీలా నేను చిక్కేదాన్ని కానులే!
HE:డిస్కో థెక్కుకు వస్తావా?
ఫోమ్ డాన్సింగ్ నాతో చేస్తావా?
ఓ నవ్వైనా వద్దనక ఇస్తావా?
SHE:ఓ!ఒకటేంటి?వెయ్యైనా ఇచ్చేస్తా!
HE:నీ నవ్వుకు బానిస నేనౌతా!
జన్మంతా నీ బరువే మోస్తా!
చరణం-2
SHE:కౌబాయ్ కి బాబాయ్ లా కన్నే గీటుతున్నావే!
అమితాబ్ కు అబ్బాయ్ లా నన్నాడిస్తున్నావే!
HE:ప్లేబాయ్ కి లవ్ క్లాసే చెప్పేస్తా నువ్ తోడుంటే
సల్మానుకు రొమాన్సే నేర్పేస్తా నువ్ ఔనంటే!
SHE:ఆ దూకుడే ముద్దంట .
లవ్ వీరుడు నీవంట .
నా బుజ్జీ!ఇంకాస్త ఆగమంట .
HE:ఓ!నీ కోసం జన్మంతా వేచుంటా!
SHE:నేనుంటాగా నీ జంట
వలపంటే మనదేనంట .
కలయా?నిజమా!
పల్లవి
కలయా? నిజామా! ఈ వింతధీమా!
మనసై తనువై పెనవేసెనమ్మా!
ఇక నా ఉనికే థానైనదమ్మా!
చరణం-1
మెల్లగ తాకెను నన్నే
వెల్లువ అయినది నా జన్మే!
తొలిగా కలగా కదిలించి నన్నే
మలిగా ఇలగా కరుణించె నన్నే
సందేహం లేదు ప్రేమే!
చరణం-2
మంత్రమో తంత్రమో మహిమో!
చిత్రము గున్నది ఇది ఏమో!
పలుకే మధువై తొణికింది నేడే!
సుమమే శరమై తగిలింది నేడే!
సందేహం లేదు ప్రేమే!
జిలిబిలి
పల్లవి
జిలిబిలి జాబిలి పైన
చలిచలి ఊహలు లోన
క్షణమే యుగమిక మైనా!
చెలి కౌగిలి దొరికేనా!
దయ చూపవే నీవైనా!
చరణం-1
ఆ నునువెచ్చని జాణ
పొంగే యవ్వన వీణ
నను చేరిన చాలు
మరువను నీ మేలు .
ఈ ఒంటి తనమంతా నే నోర్వలేనింక
నా జంట తానుంటే
మా సాటి లేరింక.
చరణం-2
ఆ కొనచూపుల బాణం
నాలో చేసెను గాయం .
తన తియ్యని రూపం
కలిగించెను తాపం
ఆ కాలిగోరైనా తగలాలి ఓ మైనా!
ఆ నింగి తానైనా
దాలాలి నాపైన .
నా లక్కీలాటరివి
పల్లవి
నా లక్కీలాటరివి .
నా బంపరు ప్రైజువి .
నిను పొందకుంటె నా తెలివి ఎందుకంట?
కోటలో నే పాగా వేసేస్తా!
మీ నాన్నను తాతయ్యను
చరణం-1
కాళ్ళొచ్చి నడిచేటి రిజర్వ్ బ్యాంక్ ఖజానా!
Y2Kలో దొరికిన NRI నజరానా!
నిన్నొదిలి పెడతానా నా మోడ్రన్ సిరివానా!
కోటలో నే పాగా వేసేస్తా!
మీ నాన్నను తాతయ్యను చేసేస్తా!
చరణం-2
చెమటోడ్చి పనిచైడం కాదమ్మో గొప్పదనం .
ప్లానేసి ప్లేనెక్కే ఘనతే లేటెస్టు ఇజం .
సోమ్మేమో మామయ్యది సోకేమో అల్లుడిది .
కోటలో నే పాగా వేసేస్తా!
మీ నాన్నను తాతయ్యను చేసేస్తా!
నిన్ను చేరకోరితి.
పల్లవి
నిన్ను చేరకోరితి.
మనసు కరుగవేడితి .
మరులు విరియు వేళలో
మరువబోకుమా ప్రియా!
చరణం-1
నీవు లేక నిముషమైన నేను నిలువలేనులే!
నీదు చెలిమి నా బ్రతుకున పండు వెన్నెలేనులే!
మనసులోని మమత నిలా వాడనీకుమా!
పలుకలేని భావమువై మిగిలిపొకుమా!
చరణం-2
సున్నజాజి,చందమామ సందెవేళ నవ్విరే!
నీవు లేని నన్ను ఎంతో జాలిగొనుచు చూచిరే!
ఓపరాని విరహము నను నలుపుచున్నదే!
కినుక వీడి జాగు లేక నన్ను చేరవే!
(అలుక చాలు)
కలిసిన తన తొలిచూపే
పల్లవి
కలిసిన తన తొలిచూపే
మంత్రం వేసేసిందే!
కలలో కదిలిన రూపే
ఎదురుగ కవ్విస్తోందే!
మనసే ఇక నా మాటే
విననని వేదిస్తోందే!
ఏం చెయ్యాలో తోచక
తడబడి నట్లౌతోందే!
ఎలా కలవడం?ఆమెకు ఏమని చెప్పడం .
చరణం-1
అన్నం కూడా తానై ఆహ్వానించేస్తోంటే-----
నిద్దురలోనా చేరువై మొద్దును చేసేస్తొంటే----
హద్దులు లేవని ఊహలో ముద్దులు కురిపిస్తోంటే----
జన్మల నా చెలి తానే అనిపిస్తూ ఊరిస్తే-----
ఎలా కలవడం! ఆమెకు ఏమని చెప్పడం?
చరణం-2
చంద్రుని కూడా తానే అందంగా నింపేస్తే----
అద్దంలో నా రూపే ముద్దొస్తూ మురిపిస్తే
అందని ఆ ఆకాశమే చేతిలో అడ్డం అయితే ----
జన్మల నా హ్చెలి తానే అనిపిస్తూ ఊరిస్తే------
ఎలా కలవడం! ఆమెకు ఏమని చెప్పడం?
ఏయ్!ఏంటలా
పల్లవి
SHE:ఏయ్!ఏంటలా చూస్తున్నావు?
ఏదోగా ఉంది .
తాకకే ఒళ్ళంతా తడిమినట్టుంది .
HE:ఏయ్!ఏంటలా సిగ్గుపడతావు?
గమ్మత్తుగ ఉంది .
కొత్తగా ఇంకోలా చూడాలని ఉంది .
చరణం-1
SHE:నిన్నదాక నీ చూపుతూపులో ఈ వాడి లేదు .
HE:నిన్నదాక నీ ఒంపుసొంపులో ఈ వేడి లేదు .
SHE:ఎందుకో నాకు ఈ రోజే పుట్టినట్లుగా ఉంది .
HE:నిన్న చూసిన ఈ క్షణమే బతికి ఉన్నట్లు ఉంది .
చరణం-2
SHE:రేపు దాక నిను చూడకుండా నేనుండలేను .
HE:నీవు ఉన్న ఈ రోజే ఇట్లా నిలవాలంటాను .
SHE:ఎందుకో ఇంత తొందర తెలివి లేని సూర్యునికి .
HE:త్వరగా తెల్లవార్చాలని చెప్పాలి చంద్రునికి .
సిగ్గుతో మనసు
పల్లవి
సిగ్గుతో మనసు విప్పి చెప్పలేక
మనసును మాటలోన చూపలేక (తెల్పలేక)
కనులతో సైగ చేయ చేతకాక
పాడుతున్నాను నా మది గుసగుసను .
జాబిల్లిని చూసి తారపొందు మిసమిసను.
చరణం-1
మావిడి గుబురులు చూస్తే తోరణములు గురుతొచ్చి .
పచ్చని ఆకులు చూస్తే పందిరి తలపొచ్చి
కోయిల పాడితే మంగళవాద్యాలు వినిపించి .
ఇక ఆగలేక నీ లది ముందు దాచలేక .
పాడుతున్నాను నా మది గుసగుసను .
జాబిల్లిని చూసి తార పొందు మిసమిసను .
చరణం-2
పూతీవలె పూలదండలై తాకగా
చిరుజల్లులె తలను అక్షింతలు కాగా
ఆ నింగి విల్లే పసుపు సూత్రమై మెరయ .
జాగు చేయలేక,ఈ దూరమోర్వలేక .
పాడుతున్నాను నా మది గుసగుసను .
జాబిల్లిని చూసి తార పొందు మిసమిసను .
నువ్వే నా ప్రాణం
పల్లవి
HE:నువ్వే నా ప్రాణం అని తెలిపే నా హృదయం .
ఆ నింగీ ఈ నేల పలికాయి శుభాగీతం.
ఈ వేళ మధుమాసం అరుదెంచె మనకోసం .
SHE:నువ్వే నా ప్రాణం అని పలికే నా పరువం .
నా తనువు , నా హృదయం ఇక సర్వం నీ సొంతం .
ఈ తరులు , ఆ గిరులు మన జతకు తొలిసాక్ష్యం .
చరణం-1
SHE:నిద్దుర పోతుంటే నువ్వే కలగా వస్తావు .
HE:ఆ కలలో కూడా నువ్వే కవ్విస్థున్తావు .
SHE:సందెవేళలో ఎదలో సందడి చేస్తావు .
HE:మాపటివేళ రేపటి ఊసులు వెచ్చగ చెబుతావు .
SHE:నీ తలపే లేకుంటే నా ఉనికే ఓ నరకం .
HE:నీ ఉనికే తోడుంటే ఆ నరకమె ఓ నాకం (స్వర్గం)
SHE:అందుకే -------}అందుకే -------!Both
HE:అందుకే ---------}
చరణం-2
HE:చీకటి వెలుగులలో నువ్వే తోడువు కావాలి
SHE:ఆకలిదప్పులు లేనిది మనదో లోకం కావాలి .
HE:ప్రేమ ఊసుంటే పడదేమిటి .
SHE:ప్రేమే ఊపిరి చేసేద్దాం పద మొత్తం .
HE:బతికున్నా నీ కోసం కాదంటే అది మరణం .
SHE:అనే తనువు నువు ప్రాణం విడిగా లేనేలేం .
HE:అందుకే --------}అందుకే -------!Both
SHE:అందుకే -------}
తెల్లకల్వపువ్వు
పల్లవి
తెల్లకల్వపువ్వు లాగా కొలనులో నువు కంటబడితే -----
సుర్రున మండే సరారీడైనా సల్లబడతడు సందమామై ------
ఈ ఒంటరిగ జలకాలు ఎన్నాళ్ళే?
సరిగంగ తానాలు ఆడాలే!
చరణం-1
రంబలాగ రంజుగాను సెరుకుతోటలో నీవు ఉంటే -----
సెరుకువిల్లు సేతబట్టి ఎంటబడతడు కాముడైనా ------
ఒక్కతివి ఇక నీవు పోమాకే!-----
మనం జోడు కట్టి ఇద్దరం పోదామే!
చరణం-2
లచ్చిమి లాగ ఎదర నీవు ఎలిగిపోతా మొక్కుతుంటే -----
పద్మావతినే వదిలివస్తడు గుడిలో ఉండే ఎంకన్నా!
కన్నెతనము నీకు ఇంక సాల్సాలే !
ఇంట దివ్వెలా నువ్వు నిలవాలే!
ఓ చెలీ!
పల్లవి
ఓ చెలీ!ఓ ------- సఖీ!
నా కలలకు రూపం నీవే!
నా వెన్నెల వేకువ నీవే!
నా చీకటి దీపం నీవే!ఓ చెలీ!
చరణం-1
చందనగంధం చంద్రుని అందం చెలి నీ ఆకారం!
చెయ్యనితపముకు అయినది నాకు నీ సాక్షాత్కారం
నా కరదీపికగా మారి
నా కనుపాపలలో చేరి
నీలో నన్నే దాచుకొని ,
కొత్తగ లోకం చూడమని
వరమును ఇచ్చిన దేవివి నిన్నే సేవిస్తా మరి .
చరణం-2
తియ్యని కోర్కెలు రూపం దాల్చితే నీవే ఆ నారి
మన్మథబాణం మనసున తాకెను ఇదిగో తొలిసారి
మగసిరి నాలో మేల్కొల్పి
సొగసరి కానుక లాదించి,
సిరిసిరి ఊహలు రగిలించి
మరిమరి మధువులు చిందించి,
సుఖముల సరిగమ నేర్పించావే పలికిస్తా మరి .
కొత్త జీవితం
పల్లవి
కొత్త జీవితం - ఇది ఓ కొత్తజీవితం
రెండు తనువులను పెనవేసి,
రెండు మనసులను ముడివేసే
ఇది సరికొత్త జీవితం .
చరణం-1
నాతిచరామి మంత్రముతో
బాధ్యత తెలిపే జీవనం
మాగల్యధారణ తంతుతో
నైతిక విలువకు ప్రతిరూపం .
స్వర్గములోనే నిర్ణయమైన
పావనదైవ స్వరూపముగా ------
చరణం-2
ఏ ఒడిదుడుకులు వేధించినా
విదిపోనిదే ఈ సంబంధము
అనుకోని అలజడి ఎదురైనా
సహవాసమే ఈ అనుబంధం .
ఒకే మాటగా ఒకే బాటగా
ఏడేడు జన్మల పూదోటగా ------
SORRY BOYS
పల్లవి
SORRY BOYS - SO SORRY BOYS.
చకచక అందం కవ్విస్తే
లలలల కలలను రప్పిస్తే
పదపదపదమని నడిపిస్తే
కనులకు నిదురను తప్పిస్తే
SORRY SORRY SORRY HEY!BOYS!
SO SORRY EXTREMELY SORRY BOYS !
చరణం-1
జేబ్సు జేబ్సు ఖాళీ చేసే SORRY BOYS .
గిఫ్ట్ సెల్లు స్విచ్చాఫ్ చేసే SORRY BOYS .
రాక లో ఫ్రెండ్ తో షాక్ SORRY BOYS .
మాల్ లో బిల్ చేతి కిస్తే SORRY BOYS .
చరణం-2
చెల్లి ఫ్రెండుకు మెల్లకన్ను SORRY BOYS .
పక్క ఇంట్లో పాపల్లేరు SORRY BOYS .
సర్వెంట్ ముసలవ్వైతే SORRY BOYS .
కో ఎడ్ లో సీటు లేదు SORRY BOYS .
తెల్లచీర కట్టుకొని
పల్లవి
HE:తెల్లచీర కట్టుకొని , మల్లెపూలు పెట్టుకొని
కాళ్ళగజ్జ లెట్టుకొని,జడగప్పె లెట్టుకొని
బిందెత్తు కెళ్ళే పిల్లా నీ పేరు చెప్పవా?6
SHE:అబ్బో!ఎంత ఆశమ్మా!అట్టా పైకి రాకమ్మా!
HE:ఝనక్ !ఝనక్ జజ్జనక!ఝనక్ ఝనక్ జజ్జనక.
చరణం-1
HE:ముద్దూ ముచ్చట లేదు!నిదుర ఊసే లేనే లేదు.
అసలే ఆకలి కాదూ!అమ్మాయి నీ తోడు .
SHE:వస్తూ తొందర చేస్తావూ!వెళుతూ ఏడిపిస్తావూ!
అయినా కోపము రాదూ!అబ్బా!ఏంటి పోరు!
HE:తప్పు నాది కాదే చిలకా!నీ ఒంపూ సొంపులది .
SHE:ఓపలేను బాబూ!ఆ పెయ్ నీ చిలిపీసందడిని .
HE:అట్టాగంటే ఎట్టా!ఈ రాత్రి కల్లో కొస్తా!
SHE:అదేమైనా వింత!ఇది రోజు మాములెగా!
చరణం-2
HE:బిత్తర చూపులు చూస్తూ తత్తరపడతావే!
నాయుడు బావను నేనే!నా ఎంకి నువ్వేనే!
SHE:గారడినవ్వుల తోటి గాలా వేస్తావే!
ఏమ్మాయ నువు చేసినా నే లొంగుపోబోనులే!
HE:పత్తి చేను వెనకే నాకు అత్తకూతురౌతావా?
SHE:కత్తి లాంటి సొగసే చూసి పిచ్చి పట్టిపోతావా?
HE:ఆరాటమే మాటది . పోరాటమే ఈదుడి .
SHE:అమోమాటమే నాకది . చెలగాటమే నీకిది.
ఎట్టేగను ఈ మావతో
పల్లవి
HERO:ఎట్టేగను ఈ మావతో నాటుమోటు ఎవారమే
క్షణమొక గండంగా బయటపడ్డ పిండంలా
ఎట్టా నే బతకను?ఏ సావని సావను?
చరణం-1
HERO:సౌండింజనీరు మావ సావబాదుతున్నాడు .
ముదురుసుందరి మా అత్త ముచ్చెమటలు పోయిస్తోంది .
క్రాకేషు కూపీలతో కాల్చుకు తింటున్నాడు .
అపరిచితుడు టైపులో ఆరాతీస్తున్నాడు.
FRIEND:రోట్లో తలపెట్టి పో -----పోటుకు భయఎందుకురో!
అబ్బో!లబ్బో!వామ్మో!వాయ్యో!
చరణం-2
HERO:దీపావళి అంటేనే దడదడే పుడుతోందే!
గన్ను చూస్తే ఎడం కన్ను అదురుతూ ఉందే!
రాత్రైతే బతుకే తెల్లారేట్టనిపిస్తోందే !
నా నూకలు భూమి మీద చెల్లేరోజొచ్చిందే!
FRIEND:భయమెందుకురా మావా!నేనేగా నీ బీమా!
పద!పద!పద!
HERO:ఉండహే!
మరుమల్లై పుట్టింది
పల్లవి
మరుమల్లై పుట్టింది ఓ చంద్రిక
హరివిల్లై విరిసింది ఈ బాలిక (జ్యోతిక)
గుండెల్లో గుచ్చింది పూచాకుగా
ఊహల్లో కదిలింది పూరేకుగా
అరె జింగిచక్క జింగిచక్క జింగిచక్క .
చరణం-1
కదిలావా నీవు కాశ్మీరు అందాలు
మెదిలావా చాలు మనాలి మురిపాలు
నవ్వుల్లో నయగారా!వన్నెలలో ఎల్లోరా!
నీవే ఆ తారా!నీ జడ జలతారా!
వర్ణించాలంటే బ్రహ్మకె కంగారా!
చరణం-2
చెక్కిట చేరింది చేమంతి సింగారం
కనులుగ మారింది కలువల్లో సింగారం .
ముక్కున సంపెంగ !నుదుటన నెలవంక .
లేదే ఏ వంక !నీ సరి ఎవరింక !
మన్మథుడైనా పడతాడే నీ వెనక .
జో జో లాలి జో!
పల్లవి
జో జో లాలి జో!జో లాలీ జో జో జో!
తియ్యగా నా పాత వింటూ
చల్లగాలి వీచెనమ్మా!నిదురించవె కొమ్మా!హాయిగ నిదురించవె బొమ్మా!
కలతలు రాకూడదు లేమ్మా!
చరణం-1
మూసుకుపోయే కలువల కన్నుల
మెత్తగ తాకి జో కొట్టి
కమ్మని కలలే రావాలంటూ మనసారా దీవించమ్మా!
నిద్దుర పోనని మారాలు చేసే మనసొక అల్లరిపిల్లమ్మా!
ఆడీ పాడీ అలసిందేమో
సేద తీర్చవే నిదురమ్మా!
చరణం-2
వెన్నలలోని చలువను అంతా
మెల్లగ నీవు మోసుకొని
నిదురించే తను మేల్కొనకుండా
అల్లన రావే రాత్రమ్మా!
కలలో కూడా కన్నెనవ్వులు వన్నెవాసి పోనకుండా పువ్వులగంధం పెదవులపై
పూసి వెళ్ళవే నవ్వమ్మా!
తొంగితొంగి చూసింది
పల్లవి
తొంగితొంగి చూసింది నింగిలోన జాబిల్లి
పొంగిపొంగి పూచింది కుందనాల సిరిమల్లి .
ప్రతి ఏటా జరగాలి నీకీ పండగ .
మనసంతా చేరాలి ఆడీపాడగా!
HAPPY BIRTHDAY TO YOU
HAPPY HAPPY BIRTHDAY TO YOU
చరణం-1
అందమైన ఆడపిల్ల మది ఊసుల
అందగాడి కోసమని విరితూపులు .
దాచుకున్న ధనములు
దోచుకొమ్మని పిలుపులు .
చెంత చేర రమ్మని కన్నుల సన్నలు
అందజేయమన్నవి కానుకలు .
వింత చూడనున్నవి మిన్నుల మెరుపులు
కంటిలోన చెరెను తారకలు . //HAPPY BIRTHDAY//
చరణం-2
తీగలాగ కన్నెపిల్ల జతకోరులే!
రాగమల్లే జీవితాన్నే శృతి చేయులే!
అందమైన సంసారం - జంట జన్మల సంగమం .
రావాలి ఈ ఇంట ఆ పెళ్ళి సందడి
త్వరలోనె బాజా భజంత్రీలతో
సాగాలి ఆ రోజు సరదాల లాహిరి
మనసైన ఓ జంట మురిపాలతో .
HAPPY BIRTHDAY TO YOU
HAPPY HAPPY BIRTHDAY TO YOU
ALL THE BEST FOR FUTURE
WE WISH YOU ALL SUCCESS .
ఓ రంభా!మనదేగా
పల్లవి
HE:ఓ రంభా! మనదేగా ఆ మన్మథసామ్రాజ్యం ఏలేద్దాం .
SHE:రాంబాబూ!ముందుంది ఆ ముద్దులమధుమాసం వేచుందాం!
HE:క్షణమైనా ఇక యుగామేగా ఆలూమగలం అయ్యాక!
SHE:యుగమైనా ఒక క్షణమవదా ఒకరికి ఒకరం ఉన్నాక!
HE:ఎందుకింకా ఇంతదూరం చిలకా!
అందుకింకా ఆగలేను మొలకా!
SHE:చాలు మారాము ఇంతగా
పెద్దలున్నారు చాటుగా!
చరణం-1
HE:చేరువగా నే చేరాక రేపూమాపని అనక
కోరినదేదో అందిస్తే ఉంటాగా నే కిమ్మనక .
SHE:సుముహూర్తం పందిరి మంచం సిద్ధం లేవు గనక
సుఖమంత్రం చదివేటందుకు వేళిది కాదుర పిలగా
HE:రాతిరేళ రామచిలక కాలేవా!
SHE:వేళవస్తె రంభ నేనె ఔతాగా!
HE:పెళ్ళి ఐన బ్రహ్మచారి నేనేగా!
SHE:కళ్ళు మూసి బజ్జుకోర తూనీగా!
చరణం-2
HE:ఇనాళ్ళూ నన్నూరించి , వేధించావా లేదా!
ఇపుడేమో నన్నుడికించి ఏడ్పిస్తావే మరియాదా!
SHE:ఏనాడైనా నీ కిచ్చేదే ఇంపూసొంపూ సంపద .
ఆత్రంతో చేరనివ్వక కంచికి నీవు మన కథ
HE:దాటి రావె హద్డుగీత కొంటె తీగా!
SHE:ఆగి చూడు అంతదాక కందిరీగా!
HE:సద్దు లేని ముద్దులాట కింతసేపా!
SHE:సుద్దు చాలు
ఇంతలోనె అంతకైపా!
నా వయసే పదహారు
పల్లవి
నా వయసే పదహారు - కోరింది నీ తోడు
కావాలా ఇచ్చేస్తా - ఉడుకు ఉడుకు ఈడు
నా సామిరంగ తీసుకోర - నాటు నాటు కోడి కూర
ఆగకుండ తాగిపోర వేడి వేడి సీమ సారా!
చరణం-1
కళ్ళల్లో ఉందయ్యో కైపుకైపు కలేజా !
కళలను చూపి దోచుకోర నన్ను నీవు రాజా!
మగసిరి ఎంతో ఉన్నా సొగసుకు కిందే కన్నా!
ముఖముల్ సొకవ్వనా!సుఖములు దోచివ్వనా!
వయసునే మరిగించి,చిటికెలోన చల్లార్చనా!
చరణం-2
తకధిమి ఆడిస్తా!తలపడి ఓడిస్తా!
తపనలు రేపి తహతహలాడేట్టు చేస్తా!
మత్తును పెంచెయ్యనా!పద్దులు రాసెయ్యనా!
అదునే చూసెయ్యనా!పదునే చేసెయ్యనా!
నాదనే లేదని అంత నీకు దోచెయ్యనా!
నిజం నిజం
పల్లవి
నిజం నిజం ఒకటే నిజం
ఇజం ఇజం ఇది ఒక ఇజం .
ఎప్పటికైనా నిప్పులా కాల్చి బయటపడేదే ఈ నిజం .
ఎవ్వరైనా ఎప్పుడో అపుడు ఒప్పుకోవాలి ఈ నిజం .
చరణం-1
నివురు కప్పినంత మాత్రాన నిప్పు కాల్చకుంటుందా!
ఒకరు చెప్పనంత మాత్రాన నిజం దాగిపోతుందా!
చక్రవర్తినే కాటికాపరిని చేసిందే ఈ నిజం .
ఇంటిపేరుగా నిలిచి ఆయనకు మింట నిలిపింది ఈ నిజం .
చరణం-2
అగ్నిచే కాల్చబడనిది-నీటిచే తడపబడినది.
ఆత్మ ఒక్కటే కాదులే - నిజం అంతకన్న మిన్నలే!
నాశము చేయాలన్నవారిని నలిపివేస్తుంది ఈ నిజం .
శోధన చేసినవారికి తప్పక దొరుకుతుందిలే ఈ నిజం .
సారిగామా నీదే
పల్లవి
సారిగమా నీదే ఈ భామా!
చూస్తున్నావే లేదా హంగామా!
లేటేలమ్మా!లేచిటురారా గామా!
లేజా అంది లేతగులాబీరెమ్మ .
చరణం-1
సందిట్లో సంతూరు రాగాన్ని విందామా!
కౌగిట్లో కన్నేవాలని కసరత్ చేద్దామా!
అందిందె అందం - చిందించు గంధం .
సందేహంలో ఉంటూ దేహంతో వెయ్యకు పందెం .
చరణం-2
రాతిర్లో వలపుల చలిమంటే వేద్దామా!
జాతర్లో జోడీ లాగ జల్సా చేద్దామా!
చిక్కిందె చిత్రం-దక్కించు స్వర్గం
పట్టావెందుకు పగ్గం చేపట్టగ లేదా పగ్గం .
MADAM MADAM
పల్లవి
MADAM MADAM YES MADAM
I AM ALWAYS HERE FOR YOU MADAM
మీ కంటి చూపు కొసలే చాలు నా జన్మే ధన్యం .
చరణం-1
ఎవరో ఏదో చేశారని రాయై పోతే మీరెలా!
ఉల్లిని మల్లిని ఒకటే లెమ్మని అనుకోకండి మీరిలా!
మగాళ్ళందరూ ఒకటే అంటూ మండిపడుతుంటె నాకెలా?
మండిపడుతుంటె నాకెలా?
చరణం-2
తావేలేని పువ్వులు ఎంతో అందంగున్నా ఎం లాభం?
ప్రేమేలేని జీవితము ఎ రంగులు లేని ఓ లోకం .
మీరే లేక బతకడమూ ఏం చేసిన తప్పని ఓ నరకం .
ఎందుకు నాకీ నరకం?
చరణం-3
మదికే చక్కని ఆకారం తోడైతేనే జీవితం .
సతికే మగని సహకారం దొరికిందా సుఖసంసారం .
దేహం నుండి ప్రాణాన్ని వేరుచెయ్యడం ఘోరం .
ప్రేమ లేకుండా నన్ను ఉంచడము ఓ నేరం .
హృదయం లేని ఓ నేరం .
నవ్వడమంటేనే
పల్లవి
నవ్వడమంటేనే అది బ్రతుకున ఓ భోగం .
నవ్వించడమింకా అతి అరుదగు ఒక యోగం .
నవ్వేలేక బతుకీడ్చడమే మనిషికి పెనురోగం .
నవ్వేకదరా మనిషికి పశువుకు తేడా తెల్పడం .
స్మైలే యవ్వనం తెలుసా స్మైలే ఇందనం .
స్మైలే ఓ వరం బాబూ స్మైలే జీవితం .
చరణం-1
పొత్తిళ్ళలో పాపల స్మైలే కన్నతల్లికి జన్మఫలం
పెద్దయ్యాక ఆ చిరుస్మైలే ఎల్లవేళలా నీ కవచం .
ఏ డ్రస్ అయినా నీ స్మైలే నీ అడ్రస్ చెప్పును ప్రతీక్షణం
పోయేప్రాణం తిరిగొచ్చేలా స్మైలిస్తుంది నీ కభయం .
చరణం-2
పల్లవి
నవ్వడమంటేనే అది బ్రతుకున ఓ భోగం .
నవ్వించడమింకా అతి అరుదగు ఒక యోగం .
నవ్వేలేక బతుకీడ్చడమే మనిషికి పెనురోగం .
నవ్వేకదరా మనిషికి పశువుకు తేడా తెల్పడం .
స్మైలే యవ్వనం తెలుసా స్మైలే ఇందనం .
స్మైలే ఓ వరం బాబూ స్మైలే జీవితం .
చరణం-1
పొత్తిళ్ళలో పాపల స్మైలే కన్నతల్లికి జన్మఫలం
పెద్దయ్యాక ఆ చిరుస్మైలే ఎల్లవేళలా నీ కవచం .
ఏ డ్రస్ అయినా నీ స్మైలే నీ అడ్రస్ చెప్పును ప్రతీక్షణం
పోయేప్రాణం తిరిగొచ్చేలా స్మైలిస్తుంది నీ కభయం .
చరణం-2
రాజకీయపు రామాయణంలో స్మైలే లీడరుకున్న ధనం .
ఆఫీసర్ ను ఐస్ చేస్తుంది NGO స్మైలు నిజం .
స్మైలును చెప్పే గొప్పలు ఎందుకు
స్టైలుకు స్మైలే ఆభరణం .
ఏడేడూ జన్మల
పల్లవి
HE:ఏడేడూ జన్మల బంధం నీదీ నాదీ !
SHE:ఏనాడూ వీడని బంధం నాదీ నీదీ!
HE:నువులేక ఏ నిముషం నే బతుకలేను .
SHE:ఆ యముడే వచ్చిననూ నిన్ను విడువబోను .
చరణం-1
HE:ఎల్లలు ఎరగని స్నేహం కోరిన వరమూ
కల్లలు తెలియని ప్రేమ జన్మల ఫలము .
SHE:ఇచ్చావు నీవే ఈ ఋణము తీరనిదే!
ప్రతిజన్మలోను నాకు నీవె ఇవ్వవా!
చరణం-2
SHE:చూచే దేవతలంతా వరమివ్వాలి .
మళ్ళీ జన్మలో నువ్వే జోడవ్వాలి .
HE:అదేవతవు నీవే!సేవలు నీకే!
ఒక జన్మ ఏంటి?జన్మలన్నీ నీవెలే!
బావా బావా
పల్లవి
SHE:బావా బావా బావా!
బావా బావా కొంటె బావా!
మంత్యమంటి పిల్లదాన్ని!స్వచ్ఛమైన మనసుదాన్ని
అచ్చమైన సొగసుదాన్ని నేను కాదా!
అట్ల మీద పడితె ఇద్దరికీ ముప్పు రాదా!
HE:కోవా!కోవా!కోవా!
కోవా!కోవా!పాలకోవా!
గుడికి వస్తనంటావు.మడిలో కంటపడతావు .
ఒడిలోకి మాత్రము రావు కాదా!
నన్ను ఆశ పెట్టి చంపుతావు పాపం కాదా!
చరణం-1
SHE:పిచ్చిపట్టునట్లు చుట్టు తిరుగుతావు .
అమ్మో!రెచ్చగొట్టి ముగ్గులోకి దించుతావు.
అమ్మ చాటు ----అమ్మచాటు చిన్నదాన్ని
రెమ్మమాటు పువ్వు రాణ్ణి
సైగ చేసి నన్ను నీవు పిలవొద్దురా!
నీకు దండమెడత దారిలో కలవొద్దురా!
చరణం-2
HE:ఓరచూపు చూసి నన్ను లాగుతావు .
అబ్బా!వాళ్ళో పడ్డాక ఎరగనట్టుంటావు .
మెరుపు లాగ ----- మెరుపు లాగ నన్ను తాకి
చినుకు లాగ జారి జారి .
నా గుండెను ఎందుకే కోస్తావు?
నవ్వి దాని మీద గంధమే పూస్తావు!
ఎందుకు ఈ శాపం పల్లవి
ఎందుకు ఈ శాపం - ఏమిటి నా పాపం!
జరిగిందీ ఇంత ఘోరం - ఓ అమ్మా!ఆకాశవాణీ!
కరుణించు ఈ దీమని .
చరణం-1
నన్ను మెచ్చి ఇచ్చావమ్మా ఆ మణిమయహారం .
చేతులారా నే జార్చుకొంటి - నా భార్యప్రేమ చేసె బ్రతుకుభారం .
ఎంత వారలైనా కాంతదాసులే!
తెలిసివచ్చెనమ్మ నా తప్పులే!
నీ శాపము తగలక ముందే నారూపము మారకముందే
దొరికించవె దండ - దయచూడవె నీవే అండ .
చరణం-2
వెదికి వెదికి విసిగినాను . నే తిరిగి తిరిగి అలసిపోయినాను .
మరలా హారం దొరుకుతుందా!అది మళ్ళీ నన్ను స్వర్గం చేర్చుతుందా!
చుట్టూ ఎటు చూసినా విషవలయం .
దాటి చేరలేను నేను తీరం .
ఇక మనిషిగా నే మిగాలాలా!- నా రూపము కోల్పోవాలా!
దాటాలి ఈ శోకాల - మరి ఎక్కడ నా మణిమాల !
మన్మథగోల
పల్లవి
మన్మథగోల - రంభారాంబాబుల లీల .
వెదుకో వెదుకు మన్మథుడు - ధింతక ధింతక ధింతక ధీం
పరుగో పరుగు రాంబాబు - ధింతక ధింతక ధింతక ధీం
పిల్లికేమో చెలగాటం - ధింతక ధింతక ధింతక ధీం
ఎలుకకు ప్రాణసంకటం - ధింతక ధింతక ధింతక ధీం
చరణం-1
అమాయకుడండి రాంబాబు - అల్లరి పిల్ల మన రంభ .
ఇద్దరిమధ్యన చిక్కాడు - మనసులమారి మన్మథుడు
ఇంతకాలం ప్రేమికుల ఏడ్పించే ఇతగాడు
అయ్యోపాపం మింటికి మంటికి ధారలా తిరిగి ఏడ్చాడు .
చరణం-2
వయసులో ఉన్న రాంబాబు - సొగసులో మిన్న మన రంభ
కలిశారంటే అయిపోతాడు కష్టాలు కాముడు .
పుష్పబాణం పక్కన పెట్టి వృతి మార్చి ఇతగాడు .
అయ్యోరామా!బెత్తం పట్టుక కాపలాలు కాస్తున్నాడు .
HAPPYHOME
పల్లవి
HE:HAPPY HOME! HAPPY HOME!మనదే HAPPY HOME
SHE:HAPPY HOME! HAPPY HOME!మనదే HAPPY HOME
HE:చుక్కంటే చంద్రుని కిష్టం
SHE:చుక్కకు చంద్రుడు ఎంతో ఇష్టం .
HE:చుక్క చంద్రుని లాగా మనమొకరికి ఒకరం ఎంతో ఇష్టం .
SHE:నిన్న నేడు లాగా మన మొకరిని ఒకరం వదలనె వదలం .
చరణం-1SHE:చుక్కకు చంద్రుడు ఎంతో ఇష్టం .
HE:చుక్క చంద్రుని లాగా మనమొకరికి ఒకరం ఎంతో ఇష్టం .
SHE:నిన్న నేడు లాగా మన మొకరిని ఒకరం వదలనె వదలం .
SHE:చేరువగా వచ్చావు , చెలిమివై నిలిచావు .
ఎడారంటి నా మదికి స్వాతి చినుకయ్యావు .
HE:అనుకోక వచ్చాను . అనుభూతే చెందాను
నీతోనడిచే వేళ నీడనై పోయాను .
SHE:నిజమా!ఓ నా వరమా!
HE:ప్రియమా ఇది నీ మహిమా!
SHE:అందుకే నీతో అడవిలో ఉన్నా అదియే హ్యాపీ హం .
చరణం-2
HE:నీ మెరుపే మెరిసింది . నా బ్రతుకే వెలిగింది .
నీ రూపే దేవతలా నా ఎదలో నెలకొంది .
SHE:ఇన్నాళ్ళూ వేచింది నీవే జోడీ వండి .
నా ప్రేమ పన్నీరై నిన్నే అర్చిస్తోంది .
HE:క్షణమా! జన్మవు కామ్మా!
SHE:జన్మా!(నువు)అయిపోకమ్మా!
HE:చేసిపో నువ్వు వెచ్చని మారగుంటినే ఓ హ్యాపీ హొమ్
HAPPY LIFE
పల్లవి
HE:HAPPY LIFE!HAPPY LIFE! మనదే HAPPY LIFE
SHE:HAPPY LIFE! HAPPY LIFE! మనదే HAPPY LIFE
పిల్లలు:అమ్మంటే నాన్నకు ఇష్టం నాన్నంటే అమ్మకు ఇష్టం
అమ్మా నాన్నా అంటే ఇద్దరు ముద్దుల పిల్లల కిష్టం .
HE&SHE:అమ్మా నాన్నా ఇదారికీ ముద్దుల పిల్లలు ఎంతో ఇష్టం .
చరణం-1
SHE:ఆ దేవుడు తలచాడు నీకై సృష్టించాడు
ఈ సుందరలోకంలో ఒకరికి ఒకరన్నాడు .
HE:అజ్ఞానంలో నుంచి నన్నే మెల్కొల్పావు .
హద్దంటూ లేని సుఖము నాకే అందించావు.
SHE:తప్పే జరిగినదమ్మా!
HE:సుఖమే దక్కెను లేమ్మా!
SHE:క్షమియించవా యెహోవా!
దయచేయవా నీ బిడ్డలకు లైఫ్!
చరణం-2
HE:తినకూడని ఆ ఫలము తిన్నందుకు .
అనుకోని ఆ సుఖము పిల్లలతో జీవనము.
SHE:తిగ్గలేని పండమ్మా! పిల్లలతో మురిపెం.
కొదవింకేముంటుంది?నాదేలే ఆ స్వర్గం .
HE:దేవా!స్తోత్రము నీకు.
SHE:ప్రభువా!నిత్యము నీవు.
HE:చక్కని పిల్లలు , అందమైన తోటలో ఇది హ్యాపీ లైఫ్ .
ఈవూ!నవ్వూ!
పల్లవి
ఈవూ!నవ్వూ చిరునవ్వూ!
ఈ ఆడమ్ ఊపిరి నువ్వూ!
పువ్వే ముడిచింది మూతి నీలా!
ఆ గువ్వకు నీలా మౌనమేలా!
నా బాధే కార్చే ఆకులు కన్నీరుగా!
ఈ పొదలే వేచే మనకి బేలగా!
చూడు ఈడేనంతా ఏడుస్తోంది అలిగావంటూ నీవిలా!
చరణం-1
ఆటే తప్ప మరి ఏనాడూ అలకే తెలియని నేస్తమా!
బాసె తప్ప వేరే ఊసే ఎపుడూ నేర్వని నేత్రమా!
తుమ్మెదలా నే వాలగా వికసించాలే పువ్వుగా
దేహం వేరే ఉంటున్నా మన ప్రాణం మాత్రం ఒకటేగా!
చరణం-2
రుచి అంటూ తెలిశాక తినడం ఆపగలమా!
వలపే వాడుకయ్యాక వయసును ఆపతరమా!
వొంటరిబతుకుకు తోడుగా దేవుడు ఇచ్చిన ఓ వరమా!
జంటకు తీయని వేదన కలిగించడము న్యాయమా!
ఏమిటీ ఎపుడు
పల్లవి
HE:ఏమిటీ ఎపుడు లేని మోహం!
అబ్బ!ఎక్కడో నలుపుతోంది తాపం .
SHE:ఆ చూపెలా అయినదిట్లు బాణం
అమ్మో!కొత్త రుచులు కోరుతోంది ప్రాణం .
HE:హద్దులు తెలిశాయి . సరిహద్దులు పిలిచాయి .
SHE:కన్నులు కలిశాయి - మరి వెన్నులు వణికాయి .
చరణం-1
HE:కన్నులతో మొదలయ్యింది - ఒళ్ళంతా గొడవయ్యింది .
నిన్నీదాక రాణి ఊహతో తుళ్ళితుళ్ళి పడుతూ ఉంది .
SHE:నీవునేను వేరే అంది దాపరికం ఉండాలంది .
దాచుకుంటె తీరదు నీకే దోచి ఇవ్వమంటోంది .
HE:గెలుపే తప్ప ఓడని ఈ ఆటే బాగుంది .
చరణం-2
HE:నా ఎముకల్లో ఎముకా! నా మాంసంలో మాంసమా!
నన్ను ఇంత కవ్వించే శక్తి నీకు ఎక్కడిదే?
SHE:నా దేహంలో దేహమా!నా ప్రాణంలో ప్రాణమా!
తొలి అమ్మానాన్నలయ్యే ఆ అదృష్టానిదే!
HE:అందుకె ఈ గిలిగింత!తుదిలేని కవ్వింత!
చరణం-3
SHE:చెట్టు ఏమి చెబుతూ ఉంది?
తీగ ఏమి చేస్తూ ఉంది?
పండు ఎందుకో ఇలా పాలుకారుతూ ఉంది .
HE:చెట్టు చేయి చాచింది
తీగ చెంత చేరింది .
ఈడు వచ్చి పండు నీలా నోరూరిస్తూ ఉంది .
SHE:జగమే శృంగారంగా జంటలతో నిండింది .
తీగ ఏమి చేస్తూ ఉంది?
పండు ఎందుకో ఇలా పాలుకారుతూ ఉంది .
HE:చెట్టు చేయి చాచింది
తీగ చెంత చేరింది .
ఈడు వచ్చి పండు నీలా నోరూరిస్తూ ఉంది .
SHE:జగమే శృంగారంగా జంటలతో నిండింది .
నిశ్చలమై నిర్జనమై
పల్లవి
నిశ్చలమై నిర్జనమై మరి అంధకారమై ఉండిన భూమిని
సృష్ట్యాదిని యేహోవా దేవుడు సుందరమ్ముగా చేసెను .
చరణం-1
మొదటిరోజున వెలుగునేర్పరచి,రాత్రింబళ్ళ విభజించి ,
రెండవరోజున తెరనేర్పరిచి,ఆకాశమనుచు పేరిడెను .
జలమంతా ఏకము చేసి,భూమి సంద్రముల నేర్పరిచి ,
భూమిపై వృక్షజాతిని ఏర్పడ మూడవరోజున చేసెను .
చరణం-2
నాల్గవరోజున సూర్యచంద్ర తారల నేర్పరిచి (వెలిగించి)
అయిదవరోజున చేపలను,పక్షులను సృష్టించె .
తనపోలికగా ఆడమ్ ను చేసి,వాని ఎముకను ఈవుగా మార్చి ,
భూమి పైన అధికార మిచ్చి,సమస్త జీవుల స్వాధీన వరచె .
చరణం-3
ఇలపై పెరిగే వృక్షముల వాని ఫలములను వశపరచి,వానిని వారికి ఆహారముగా ఆరవరోజున ఆదేశించెను .
ఆరురోజులలో పని పూర్తి చేసి,అలసిన దేవుడు ఏడోరోజు
విశ్రాంతి పొంది ఆ పవిత్రమ్ముగా ఆశీర్వదించెను .
ఆడుగడుగో ఆడుగడుగో
పల్లవి
అడుగడుగో ఆడుగడుగో అతడే సాతాను
నిండి బుసకొట్టే కాలనాగు తాను
తోయబడి,దేవునిచే తరమబడి,
ప్రతీకారవాంఛతో,దురధికారదుగ్దతో
దేవుని దించెయ్యాలని పథకం వేశాడు
తనరాజ్యాన్ని స్థాపించగ వచ్చాడు
. అతడే ----- సాతాను . అతడే సాతాను .
చరణం-1
ప్రభువు నుండి బిడ్డలను దూరం చేస్తాడు .
కోల్పోయిన పదవికై కుట్ర పన్నుతాడు .
పవిత్రతకు పాపపు పూతలు పూస్తాడు
మంచితనము మసి చేయగ మనిషిని కలిశాడు .
పాపకర్మ పుట్టించి,పోషిస్తాడు .
స్వార్థబీజమును నాటేస్తాడు .
దేవునిపై పగతో సృష్టిని చెండాడుతాడు .
చరణం-2
నీతీ అవినీతి హద్దు చెరిపేస్తాడు
వావీవరసలను మరచి పొమ్మంటాడు .
జాలీ కరుణలకు తావు లేదంటాడు .
మత్తులో మునిగే లోకం ముద్దంటాడు .
దేవుడెవడు ? నేనే కొత్తదేవుడంటాడు .
పాపఫలము ఎంతో తియ్యనంటాడు .
పరలోకము లేదు నేటి సుఖమే నిజమంటాడు .
సిసింద్రీలు,సిసింద్రీలు
పల్లవి
సిసింద్రీలు,సిసింద్రీలు సీమటపాకాయలు
చిన్నారులు కారు వీరు శివకాశీ బాంబులు
. చలచల్లని పిడుగులు వీళ్ళు
భల్ ముద్దొచ్చే భడవలు వీళ్ళు .
చరణం-1
తలిదండ్రుల తగవులను తీర్చేవేళల్లో పంచాయితి పెద్దలు వీళ్ళు .
అల్లరితో ఇల్లు పీకి పందిరి వేసేటప్పుడు బాబోయ్!
నో డౌటు వానరాగ్రగణ్యులు.
తగవులాడి మరుక్షణమే కలిసిపోయే వేళ
కనిపించని దేవుని ప్రతిరూపాలు
ముద్దుముద్దుమాటలతో మురిపాల మొలకలు .
హద్దు మీరి విసిగిస్తే పెనురక్కసి మూకలు .
చరణం-2
చెడును చూసి తప్పంటూ ఎదురొడ్డే సమయంలో
అరివీర భయం కారులు వీళ్ళు .
ప్రాణాలను పణపెట్టి,పరులను కాచేటప్పుడు
ఇలలో పరమాత్ముని అనుచరులు .
లక్ష్యాలను సాధించే కక్ష్యలో సాగేటప్పుడు
చెదరని దీక్షాకంకణదారులు.
చూడచూడముచ్చటేసె చిరునవ్వుల పువ్వులు .
మంకుపట్టు పట్టారా!ఉడుము కన్నఘనులు .
సూపర్ మేన్
పల్లవి
సూపర్ మేన్ , సూపర్ మేన్ ,సూపర్ డూపర్ మేన్
కలలో నువ్వే! ఇలలో నువ్వే!
ఎక్కడ చూచినా నువ్వే!
మదిలో నువ్వే - గదిలో నువ్వే!
మాటల్లోనూ నువ్వే!
నువ్వే మాన్ - మేరా డాన్
నీకే ఫాన్ - ఈ సిమ్రాన్ .
చరణం-1
ఆకాశం నేలకు దించే ఆ దమ్మే నీదే!
ఆపదలను గట్టెక్కించే గట్సన్నీ నీవే!
నా కోసం తెచ్చిస్తావా ఆ మబ్బుల్లో మెరుపులని
నీ కోసం నేనిస్తాలే - నా ఊహల్లో తళుకులని .
నైటంతా వింటానులే - నీ స్టోరీలో మలుపులని
ఆ పైన కునుకే -రాదు వస్తే కంతా నీ కలని .
చరణం-2
జై హనుమాన్నేమరిపించే ధైర్యమిచ్చావు అందరికీ
లోలోపల పీటం వేసిన సీక్రెట్ ఫ్రెండువి ఎందరికి?
నా కోసం దాటొస్తావా ఏడేడూ సంద్రాల్ని
నీ కోసం నే నొస్తాలే - చెరిపేసి హద్దుల్ని
ఇంకేం చెప్పను ఆ పైన నే మొగ్గనని
చెప్పకనే తెలుసుకునే నీ తలపే నాకు మొగ్గని .
HAPPY HAPPY BIRTHDAY
పల్లవి
HAPPY HAPPY BIRTHDAY-HAPPY BIRTHDAY .
దేవతలంతా దీవించరారే !
మా కంటి ఈ వెలుగుని - నూరేళ్ళు వర్ధిలమని .
చరణం-1
ఏటేటా నీకీ సరదా - తనిమేరా!
చంద్రునిలా కళలే నిండగా!
నీ వంశం ఎత్తేలా - నీ గర్వించేలా!
ఎదగాలి నువు కొండలా!ఆదర్శమై నిలవగా
(దేశమాత మెడలో దండలా!)
చరణం-2
మనిషంటే అర్థం తెలిసి - మంచికి నువు నిలిచి
మన్ననలే పొందాలిలే !
అవతారపురుషుల కథలే - నీ నడతలో ఒరవడి దిద్ది
ధన్యమవ్వాలిలే - పొందాలిలే!
HEY GUYS!
పల్లవి
HEY GUYS!YOU ARE RIGHT!
HEY BOYS!JUST DO IT !
పబ్బుకు వెళ్ళే వయసే నీదిరా !
పగ్గం వెయ్యక సరదా చెయ్యరా!
LIFE IS BEAUTIFUL!
YOU MAKE IT COLOURFUL!
చరణం-1
BE CARE OF ENJOYMENT - YEAH HOO!YEAH HOO!
BEWARE OF ATTACHMENT - BE CAUTIOUS.
ఆంటీ అయినా నో సెంటిమెంట్ - HURRAY
చేసేయ్యరా సెటిల్ మెంట్ - YOU CAN!
LIFE IS BEAUTIFUL !
YOU MAKE IT COLOURFUL
చరణం-2
MY SECRET OF ENERG- SHOOT IT
HAPPYNESSE BENERGY - WOW!
ఏడుపు అంటేనే అలర్జీ !- ఎగ్జాక్ట్లీ !
పాపల నవ్వే సిరంజీ - వార్రేవా !
LIFE IS BEAUTIFUL !
YOU MAKE IT COLOURFUL !
ఈ పడుచుపాపకై
పల్లవి
SHE(సాకీ):ఈ పడుచుపాపకై ఏడ్చే పసిబావల్లారా!
నా షరతులకు మీరు లొంగిపడుంటారా!OK!
HE:OK!OK!డబుల్ OK!
SHE:ఫాపకు OK అయితే HE:బావలకు డబుల్ ఓకే .
SHE:పాపే సయ్యంటే HE:బావలు సైసయ్యే .
SHE: సై HE: సైసై
SHE: సై HE: సైసై
SHE:గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
HE:గుడుగుడుగుడుగుంచం - నిన్ను దిగనియ్యము మంచం .
చరణం-1SHE:మల్లెలగంపే తేకుంటే - మీరు తేకుంటే ----
HE:ముక్కు మీ దొట్టు - కాలితో కొట్టు .
SHE:మంచం మూలుగు వినకుంటే , వినబడకుంటే ----
HE:టాటా చెప్పేసెయ్ , టాటా చెప్పేసెయ్ ,
SHE:ఏ రోజైనా లేకుంటే , ఆ రోజ్ నుండి భారత్ బందే!
HE:గుడుగుడుగుడుగుంచం - నిన్ను దిగనియ్యము మంచం .
చరణం-2
SHE:రాత్రీ పగలని నసలొద్దు - అలసట లొద్దు .
HE:పొద్దులే వద్దు - హద్దులే రద్దు .
SHE:ఇల్లూవాకిలి తలవొద్దు - నను మరవొద్దు .
HE:నీ కళ్ళు మా ఇళ్ళు - నీ ఒళ్ళు వాకిళ్ళు .
SHE:మాటలు చెప్పి మోసం చేస్తే - గోతులు తేసి పాతరవేస్తా!
HE:గుడుగుడుగుడుగుంచం - నిన్ను దిగనియ్యము మంచం .
పల్లవి
పదరా పదరా పదరా-పదరా ముందుకు పదరా!
కాలంతో పోటీపడుతూ చేసెయ్యర సమరం .
సంకల్పం సాధించేందుకు పయనం .
అవమానాలు , అవహేళనలు కలిగిచాలి చలనం .
అలుపూసొలుపూ ఎరగక నీవు సాధించు విజయం .
చరణం-1
సాధించాలని తపనుంటే దిగివస్తుంది సురగంగే!
కలిసొస్తుందని కలగంటే జీవితమంతా వ్యథపొంగే!
అలలా చెలిరేగరా - ఆ తీరం కోసం .
అవరోథం ఏదైనా - గమ్యం నీ లక్ష్యం .
పదరా ఎదురేదిరా శ్రమయే నీ తోడురా!
కష్టేఫలంటు ముందుకు పదరా - మాట్టే మణి కాదా!
చరణం-2
మనసులు తెలిసిన తోడుంటే - తెలియదులే కష్టం .
కష్టంలోనూ సుఖముందంటూ తెలిపెనులే ఈ నేస్తం .
కృషితో నాస్తి దుర్భిక్షం - శ్రమయే నూతనవేదం .
కలాన్ని పట్టిన చేతులకు బానిస కాదా హలం .
సత్తా చూపు ఓ యువతా!తిరగావ్రాయి నీ భవిత!
జననీ జన్మ భూములను మించిన ఏదిరా !
అందాలాబొమ్మా!
పల్లవి
HE:అందాలబొమ్మా! అనుకున్నది జరిగింది.
ఇన్నాళ్ళ కలలే నిజమయ్యే వేళైంది .
SHE:ఓ అబ్బాయిగారూ! కోరిందే జరిగింది .
ఎంతెంతో దూరం అనుకున్నది ఎదురైంది .
HE:ఇక ముందుండే ముచ్చటకే అడ్డే తొలిగింది .
SHE:ఆ తొందరలే చూస్తుంటే సిగ్గే వేస్తోంది .
చరణం-1
HE:ఈ ప్రేమను చూస్తుంటే కన్నే కుడుతోంది .
ఏ జంటను విడివిడిగా ఉంచాను అంటోంది .
SHE:ఆ ప్రేమే నిన్నూ నన్నూ ఒకటిగా చేసింది .
ఈ ప్రేమకు ప్రతిరోజూ మొక్కాలని ఉంది .
HE:ఈ మొక్కులు నీ ముడుపులు కావాలి నా సొంతం .
SHE:ఇక ఎందుకు నువు అడగటం . నే నిస్తాగా సాంతం .
HE:దోచేస్తా అందంచందం . కన్యాదానం దాకా ఆగం .
SHE:అమ్మో!అట్లైతే నే వెళ్ళి మల్లి వస్తా!
HE:అయ్యో!నీ వట్లా తిరగేస్తే ప్లేటు ఎట్లా?
చరణం-2
SHE:గుండెల్లో నువు తాపం పెంచుతూ ఉన్నా
కన్నుల్లో నీ రూపం దాస్తూనే ఉన్నా!
HE:రేయంతా నువ్ కలలో కవ్విస్తూ ఉన్నా!
పగలైతే నీ చుట్టూ పరిగెడుతూ ఉన్నా!
SHE:ఈ ప్రేమకే నే బానిస . ప్రతి నీవే జంట .
HE:ఈ నాటికీ ఏనాటికీ నా ప్రేమే నీ తోడంట .
SHE:గుండెల్లో గుసగుసలన్నీ పిలిచేనంట .
HE:ఐతే ఈ క్షణమే హనిమూనుకు పదమంట .
SHE:అదిగో ఆ వరసే అబ్బాయీ వద్దంట .
పెద్ద మనిషి నైనానని
పల్లవి
పెద్ద మనిషి నైనానని చెప్పేటి ఈ పైట
నిలవనంటదేమే రామణమ్మక్కా !
ఎలా ఆపనీ రాజమ్మక్కా!
చరణం-1
నిన్నదాక సరిపోయిన నల్లసుక్కలరైక
ఇయ్యాల పట్టదేంటి సూరమ్మక్కా!
ఇరుకై పోయిందేంటే సిన్నక్కా!
పెట్టిగాని అంగడి సందులో కెళుతుంటే
పోకిరోళ్ళు ఎగాదిగా సూస్తరేందే అక్కా!
నేనేమీ సేతునే రంగమ్మక్కా!-(2)
చరణం-2
సంకురేతిరి సంబరాల్లో సెక్కబజన సేత్తనంటె
వద్దంటాందే ఎల్లమ్మక్కా!
ఈ సిత్రమేందో సెప్పు సోమక్కా!
నిన్నదాక నా తోటి నేస్తం కట్టిన రంగడు
ఎట్టాగో సూస్తాడు ఏందక్కా !
నా కెట్టాగో ఉంటాదే లచ్చుమ్మక్కా!
చరణం-3
పక్కింటి కిట్టమ్మ పొలంపనికి ఎల్లినపుడు
కిట్టయ్య సైగ సేస్తడేందక్కా !
ఇకిలిస్తూ రమ్మంటడే రావమ్మక్కా!
ఎదురింటి ఎల్లమ్మ ముద్దుల మూడో కొడుకు
ఆల్లమ్మ పన్లోకి ఎల్లాకక్కా!
కన్నుగొట్టి పైట లాగె కావమ్మక్కా!-(2)
బైకెనే రాకెట్
పల్లవి
HE:బైకెనే రాకెట్ చేస్తా!
జెట్టులా దూసుకు పోతా!
మబ్బులో మేరుపూను ఔతా!
రోడ్డులో రేసింగ్ చేస్తా
SHE:పడ్డాక , రిస్కులే లేవంట
దేవుడే ఎదురైనా డోంట్ కేర్ మేమంట .
చరణం-1
HE:అమ్మాయి అందంగా పక్కనే కూర్చుంటే
చంద్రుణ్ణి ఎంచక్కా చిటికెలో చేరేయ్ నా!
SHE:అబ్బాయి తోడుంటే ఆ నింగి దాకైనా
అలుపంటు లేకుండా సరదాగ నే పోనా!
HE:ప్రేమలోకము తాకి ప్రామిసే చేద్దామా!
SHE:పేరెంట్స్ ఏమన్నా కన్విన్స్ చేద్దామా!
చరణం-2
SHE:ఎవరెస్ట్ శిఖరాన్ని చిటికెలో ఎక్కెయ్ నా!
లవ్ కెంత పవరుందో లోకాన చాటెయ్ నా!
HE:పసిఫిక్కు ఓషన్ని ఎక్ పల్ మె ఈదెయ్ నా!
ప్రేమికుల
SHE:ప్రేమ వర్శిటి పెట్టి పాటాలు చెబుదామా!
HE:ప్రేమలో పడ్డంపై కాంపైను చేద్దామా!
సంతోషిమాతా!
పల్లవి
సంతోషిమాతా!మా ఇంటి దేవతా!
సౌభాగ్యమిమ్మా!నిన్నే వేడే ద!
చరణం-1
పసుపుకుంకుమలు తాళి పూలు
నల్లపూసలు , కాటుక , కాలిమెట్టెలు
ముత్తైదువు బ్రతుకున తరగని సిరులు
భోగాభాగ్యాలెందుకు నీ దయ చాలు
చరణం-2
. చిన్ననాటి నుండి నే చేసిన తపము
సఫలము చేసితివమ్మా!చల్లని తల్లీ!
నే వలచి వలపించిన ప్రేమమూర్తిని
నా వాడిగ చేసితివి నీ దయ చూపి .
చరణం-3
ప్రేమతో నీ విచ్చిన మాంగల్యమును
నిలుపవే ఓ నిత్య సుమంగళ దేవీ!
అకాలమృత్యువు నాపి నా దేవుడిని
బ్రతికించవె నిను నమ్మితి బంగారుతల్లీ!
అనుమానం అంటే
పల్లవి
అనుమానం అంటే ఓ పెనుభూతం బాబూ!
అనుమానం మొగుడు ఆ భూతానికె బాబూ!
పెళ్ళాం కోతిలా ఉన్నా ఇతడికి డౌటుగ ఉంటుంది .
అందంగా ఉందంటే ఇక చెప్పేదేముంది ?
ఆనుమానం మొగుడు - అందమైన పెళ్ళాలు .
చరణం-1
రామా అన్నా బూతంటూ భూతద్దం తీస్తాడు .
తాళంకప్పా , కావలికుక్కా తన నేస్తాలంటాడు .
లోకంలోని మగాళ్ళనంతా అనుమానిస్తూ ఉంటాడు .
మాడా గాళ్ళే మనసుకు నచ్చిన మగాళ్ళని అంటాడు .
ఆనుమానం మొగుడు - అందమైన పెళ్ళాలు .
చరణం-2
నీడను చూసి ఉలిక్కిపడుతూ పరుగులు తీస్తూ ఉంటాడు .
నిద్దురలోనూ నీతికథలనే భార్యకు చెబుతూ ఉంటాడు .
ఇద్దరుభార్యల నిచ్చాడెందుకో డౌటుకు తోడు పైవాడు .
ప్రతీక్షణం చస్తూ బతుకును ఈడుస్తాడు ఇతగాడు .
ఆనుమానం మొగుడు - అందమైన పెళ్ళాలు .
మోరు మోరు మంగమ్మా!
పల్లవి
HE:మోరు మోరు మంగమ్మా! జోరుజోరుగుందమ్మో!
SHE:క్యారు క్యారు కావయ్యో!చారు చారు కాకయ్యో!
HE:ధనియాల పప్పెపుడు దంచుతావమ్మో!
SHE:మిరియాల పొడిమల్లే మండుతానయ్యో!
HE:చందమామవే!చిందులెయ్యమాకవే!
SHE:కోతిబావయో!కన్ను గీటమాకవే!
HE:జంకలకిడి జమ్మా!జమ్మా!జాంపండువే!
SHE:గుంతలకిడి గుమ్మా!గుమ్మా!గంగవెర్రులే!
చరణం-1
SHE:అత్తగారి అట్లకాడల వాతలప్పుడే మరిచావా?
నిన్న పెట్టిన తిట్లభోజనం పాతఖాతాలో కలిపావా?
HE:పెద్దవాళ్ళ తిట్లన్నీ నా పాలిత దీవెనెలే!
ఆఫీసరయ్యి అల్లుడిగా కాళ్ళు కడిగించుకుంటాలే !
SHE:ఆ రోజెప్పుడు వస్తుందమ్మా!
HE:వేచి చూడవే మంగమ్మా!
చరణం-2
SHE:ఇన్నినాళ్ళ ప్రేమ సంగతి పెళ్ళికి చేరేదేప్పుడు?
కోరికుంటే చాలదయ్యో అమ్మ ఊరికే ఒప్పుడు .
పైటేలపై ట
పల్లవి
SHE:పైటేల పైట లాగమాకురో - సందేళ సైగ చెయ్యమాకురో !
చిన్నదాన్నిరో!సిగ్గులున్నదాన్నిరో!
నాటుమోటు నాపసాని నేను కానురో!
ముందరుంది ముచ్చటంత దూరముందిరో!
HE:ఆ వంక చెప్పి ఆపమాకవే! నా వంక నవ్వవేమిటే!
ఎన్నిరోజులు ఇట్ల ఎదురుచూడనే!
కోపమొద్దు ఒక్కసారి కనికరించవే!
మాట ఇచ్చి వెళ్ళిపోతే చాలుచాలులే!
చరణం-1
SHE:డైమండు నెక్లెస్సు ఆశ చూపినా
ఫైస్టారు హోటళ్ళ ఫుడ్డు పెట్టినా
పువ్వు లిచ్చినా ఎంత రెచ్చగొచ్చినా
నే లొంగిపోనయ్యో టైం వేస్టులే!
నీ ఆశ దోశ అప్పడం వడే!
HE:డైమండు నెక్లెస్సు దిగదుడుపులే!
ఫైస్టారు ఫుడ్డంత నీ ప్రేమకే!
పువ్వు లెందుకే నీ నవ్వు చాలులే!
ఊ అంటె నే మూడుముళ్ళేస్తాలే!
నా బ్రహ్మచర్యాన్ని వదిలేస్తాలే!
చరణం-2
SHE:వద్దొద్దని నేను ఛీ కొట్టినా,
ఐ లవ్ యు అంటు రావొచ్చునా!
ఊరి నిండుగా ఇన్ని ఫిగరులుండగా!
నా వెంట పడతావు ఇది ఏందిరో?
ఆ బ్యూటీ షకిలానే చూడరో!
HE:ఇనాళ్ళు వెదికాను అడుగడుగునా!
నరుదైనా అందాలు కనిపించెనా?
ఇన్ని ఏళ్ళుగా పెళ్ళి ఊసు లేదులే!
ఆ మిస్సు వెల్డైన అప్పలమ్మెలే!
నీ దివ్యరూపం పడగొట్టెలే!
చుమ్మా!చుమ్మా!
పల్లవి
HE:చుమ్మా!చుమ్మా!చంబల్ రాణి!
యమ్మా!యమ్మా!యవ్వన్ టాణీ!
చికెన్ సూపు ఇస్తావా!
మటన్ ఫ్రై పెడతావా!
ఫిష్ ప్రాన్స్ చేసిపెట్టవే!ఓ కొర్రమీనా!
బొమ్మిడాయిల పులుసు చెయ్యవే!
SHE:నైరానైరా నాన్ వెజ్ నానీ!
సర్దాసర్డా చెయ్ రా జానీ!
తిండి గోల మానవా!అందం వంక చూడవా!
బెంగపడ్డ భామన్ చూడరా!ఓ ఫుడ్డు భీమా!
ముద్దుముచ్చటలన్నీ తీర్చరా!
చరణం-1
HE:తిండిని గోల అంటె ఎట్ల?
కండలు పెంచే వీలెట్ల?
పూటకో వెరైటీ ఫుడ్డుంటే కన్నెకొమ్మా!
అంతకన్నా లక్కేముందంట?
SHE:కండలు పెంచి ఏం చేస్తావు?
గుండెలో గుబులు తెలుసుకోవు
ఎట్ల నేను చావనమ్మా చందమామా!
ఇట్ల వీణ్ణి చేశాడె ఆ బ్రహ్మ!
చరణం-2
SHE:అతిగా తింటే వొళ్ళొస్తుంది
ఒంట్లో వేడి చల్లార్తుంది .
ముద్దులు నోటికి కుక్కడమేనా!ఫుడ్డుభీమా!
ముద్దుల మాటే రాదే ఏంటమ్మా!
HE:అంతగ ఫీలై పోకే భామా!
టెస్టే చేశా నీలో ప్రేమ!
పక్కన నువ్వే ఉండగ ముద్దుగుమ్మా
ఆకలి ఊసే నాకు రాదంట .
చక్కని శిల్పం
పల్లవి
HE:చక్కని శిల్పం చెలిరూపం
ఎదనే చేసెను యమునాతీరం .
చెలియ నునుసిగ్గులే వలపు సిరిమొగ్గలే!
SHE:మక్కువ చూపే పతిదైవం .
మమతల కోవెల ఇల్లే స్వర్గం .
మగని చిరు అలకలే మగువ కవి నోములే!
చరణం-1
HE:ముత్యాలే జలజలరాలే మకరందం గలగలపారే
మగువ చిరునవ్వులే!
నా ఇంట నవరత్నాలై నా కంట మాణిదీపాలై
నిలిచి వెలిగాయిలే ------
బ్రతుకు నింపాయిలే !
SHE:సంసారం సరిగమ కాగా , సంతోషం పదనిస కాగా,
మనది అనురాగమే ------
ఇల్లాలే పూజకు పువ్వే,ఇలవేల్పుగ భర్తను కొలిచే
కాపురం కలశమే -------
కలల కాసారమే (కలల సుఖతీరమే!)
చరణం-2
HE:సిరులన్నీ సరసన నడిచే,సరదాలే విరులై కురిసే
సఖియ చిరునడకలే------
నా ముంగిట మువ్వలసడిగా,నా వాకిట గాజులసడిగా
కదులు తున్నాయిలే-----కలలు పండాయితే !
SHE:బ్రతుకంతా ప్రమిదను ,నా ప్రేమను దీపం చేసి,
హారతే ఇవ్వనా-----
జన్మంటూ మళ్ళీ ,నీ జంటగా నేనే ఉండే
వరమునే కోరనా------నీ ఒడిలో కనుమూయనా!
నేనేరా సుందరవదనా!
పల్లవి
SHE:నేనేరా సుందరవదనా!నాతోనా చిందులు మదనా!
HE:(DIALOGUE )ఏయ్!నీటొద్దు,నాటు----నాటు .
SHE:(DIALOGUE )నాతో ఆడే దమ్ముందా!
HE:(DIALOGUE )ఆ(! ఇరగ దీస్తాం
SHE:అ(DIALOGUE )అదీచూద్దాం . ఏస్కోండ్రా నాటు బీటు .
SHE:నేనేరా సుందరవదనా!నాతోనా చిందులు మదనా!
నాటైనా నీటే అయినా నా సాటి నేనే కన్నా!
తందానా ఆడి,తబ్బిబ్బు చేసి,
నీ పస నే చూసెయ్యనా!
HE:కసిగాయవే ఇంకా లలనా!పసివయసుకు ఈ కసి తగునా!
అరవోణీని అరుపే చెయ్ నా!
అనుభవముంటే పదునెట్టనా!
అబ్బబ్బో పోటీ కొమ్ములు తిరిగిన మాతోనా !
SHE:చూపిస్తా నా తడాఖా!
అందంతో కాదు మజాకా !
HE:ఆడిస్తా నే సరదాగా!
ఓడించి వేస్తా పాగా!
SHE:చూస్తాగా!
చరణం-1
SHE:చూశాను చిత్తూరు చిత్తే చేశాను సారూ
పెద్దాపురం మెళ్ళి నేను గద్దే ఎక్కేసినాను .
వెళ్ళాను ఒంగోలు వాళ్ళంతా కంగారు .
జడ్చర్ల జంక్షన్ లో జెండా పాతేసినాను .
చిలకలూరిపేట,నరసరావుపేట
హడలెత్తి పంపాయి చెప్పేసి నాకు టాటా!
HE:అమ్మమ్మమ్మో!అంతోద్డుచాల్లే
ఆ ఊళ్ళో మేముంటే తెలిసేదిలే!
అమ్మో అమ్మో అమ్మో అమ్మో చెవిలోపూలెట్టకే
నీ కన్నా ముదుర్లను చూశాములే!
SHE:హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ -హా --య్ !
HE:కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ -- కొయ్ కొయ్!
చరణం-2
నిషా నిషా నిషా!
పల్లవి
నిషా నిషా నిషా! నిషా నిషా నిషా!
నీ కళ్ళల్లో నిషా!ఒళ్ళంతా నిషా!
ఈ చీకట్లో నిషా!నీ కౌగిట్లో నిషా!
నిషా నిషా నిషా!
చరణం-1
ఈ చీకులు చింతలు జానేదో!
బాధలు బరువులు రహెనేదో!
దోచెయ్ రా దోసిళ్ళతో సుఖం
ఈ కైపె మన స్వర్గం
నీదేరా ఈ రోజు
ఈ రోజుకు నీవే
రేపన్నది ఓ బూజు .
నిషాతో పెంచు మోజు!
చరణం-2
ఈ లోకంలో ఎవరికి వారే!
సుఖపడరా యమునా తీరే!
ఎవరేమన్నా లేదు భయం .
అనుభవమే మనకు ప్రియం .
ఆ నింగి తారే నేను .
ఈ రాత్రికి నేనే క్వీను.
ఆ చుక్కలలో ఉన్న మూను .
రారమ్మంతోంది నన్ను.
చరణం-3
హద్దులు అన్నవి అంతా ట్రాష్
పెద్దల సుద్దులు చేసెయ్ యాష్
ఈ నాటికి ఈ సుఖమే సత్యం .
చేయకు అర్థం లేని పథ్యం .
ఎవరెవరన్నది కా దవసరం .
ఒకరికి ఒకరం ఈ దినం .
చలినే కాల్చేసే యవ్వనం .
ఇక అగదు సాగరమథనం
విషమును మింగితె శివుడికి నిషా !
మయశిల్పి తమితీర
పల్లవి
మయశిల్పి తమితీర మలిచిన శిల్పానివో !
మతిపోవ జతకూర్చు శృంగార మంత్రానివో !
మదనోత్సవాన సురనాట్యబాణివో!
మౌనముగ మది తొలుచు మన్మథుని రాణివో!
చరణం-1
నీలిమేఘాల పొత్తిళ్ళలోన
నవ్వు చిందించు పసివర్శమా!
వేయిదీపాల వాకిళ్ళ వెలుగుల్లో
ఓలలాడేటి వయ్యారమా!
విరబూసిన అరవిందమా!
తుమ్మెద ఆనని మకరందమా!
దరిచేరవే మధుమాసమా!
చరణం-2
రాధ లేకున్నమాధవుని(కృష్ణుణ్ణి)లోగొన్న
తీయనైన ఓ విరహమా!
హరుని విలు వొంచు రాముణ్ణి కాంచు
(రాఘవుని తిలకించు)
సీతలో మెరయు సింగారమా!
ఆ కణ్వుని వనదీపమా!
అభిమన్యుని చెలిరూపమా!
అలరింపవే అనురాగమా!
సరిగమలే పలికే
పల్లవి
HE:సరిగమలే పలికే ఈ సంతోషం మనదే!
SHE:మధురిమలే ఒలికే ఈ సంగీతం మనదే!
HE:ఆనందం మన సొంతం . ఆత్మీయత మన బంధం .
SHE:అనుబంధం అంటేనే మనమేలే నిర్వచనం .
HE&SHE:ఈ స్నేహం అతిసుందరం .
శతమానం ఆగనిపయనం .
చరణం-1
HE:సాగర మాగినా ఆరని ఈ అనురాగం.
నూతనం,విన్నూతనం,అనునిత్యం నూతనం .
SHE:జన్మలే చాలని ఈ తీయని సంగమం.
అంకితం,అంకితం,స్నేహానికి పునరంకితం .
HE:ఆ చంద్రుని చల్లదనం మాటలలో మంత్రం.
SHE:భూదేవి ఈసుపడే సహనం మా సొంతం .
HE&SHE:ఈ స్నేహం అతిసుందరం .
శతమానం ఆగని పయనం .
చరణం-2
SHE:కన్నులె చాలని ఈ కమనీయ బంధనం .
చందనం చందనం మదికే శ్రీ చందనం .
HE:హద్దులె ఆపని ఈ వెచ్చని సావాసం .
అమరం అమరం ఏనాటికీ అజరామరం .
SHE:ఆ చుక్కలు దిక్కుల్లాగా మన ఈ స్నేహం నిత్యం .
HE:ఏ మృత్యువు విడదియ్యను ఇష్టపడదు ఇది సత్యం .
SHE&HE:ఈ స్నేహం అతిసుందరం .
శతమానం ఆగని పయనం .
నీ రాక కోసం
పల్లవి
నీ రాక కోసం నా మనసు వేచింది చూడు .
నీ దారి నిండా పూచాయి నా ప్రేమపూలు
ఈ ప్రేమజగతిలో నీ జతగ ఉండాలని
నీ తలపురాజ్యంలో రారాణిగ నిలవాలని .
ఎనలేని ఆరాటం నాకు
తెలిసెన ఈ సొద నీ ఎదకు .
చరణం-1
కాలాన్ని కల్లాపి చల్లి
మధురోహల ముగ్గుల్ని అల్లి
రత్నకంబాళాలు నీకు గుచ్చునోయని
పాన్పు వేసిందిక్కడ పారిజాతరేకు .
చేస్తుందట మనకు గంధర్వమనువు .
చరణం-2
గంధాల వెల్లువలు తెచ్చి
మకరందపు మధురిమ కూర్చి .
వనదేవి పైట మెచ్చి నీవెన చేసి
వేచి నిలిచిందిదిగో వేకువమాపు .
ఆలసించక తనను కరిగించమనుచు .
తొలిసారిగా
పల్లవి
తొలిసారిగా నిన్ను చూశాను .
ఒంటరివి అనుకున్నాను .
ఏదో తెలియని బంధం ఎదను లాగింది .
నిను గుండె కత్తుకొని ఓదార్చమంది .
చరణం-1
ఏ చోట ఉన్నా నిను వెదికాయి కనులు .
ఎ వేళనైనా నిను తరచాయి స్మృతులు .
నీ మౌనగీతం నా గుండె విన్నది .
నీ భావమంతా నింపేసుకున్నది .
ఇకపైన అవుతాను నీ తోడును .
నీ నడకలో నే జోడును . నిను వీడను .
చరణం-2
నీ నవ్వు కోసమె నే నవ్వెను చూడు .
నీ ప్రేమ కోసమె నే పాడేను నేడు .
నా మనసు నిన్ను తెలుసుకొమ్మంది .
నా వయసు నిన్ను కలుసుకొమ్మంది .
చాలు విడనాడు ఈ మౌనము .
నా గుండెకే నీవు సాదము . జీవనాదము .
ఓ బ్రహ్మదేవా!
పల్లవి
HE:ఓ బ్రహ్మదేవా!ఇదేం పాలకోవా!
నోరు ఊరిపోతోంది చూడయ్యా!
SHE:చాలించు జీవా!మరీ ఇంత యావా!
ఉట్టి కెక్కి స్వర్గమనకు ఓరయ్యా!
HE:వయసుల్లో ఉండే సూత్రము ఈ ఆత్రం .
SHE:మాక్కూడా తెలుసులె ఇంతగనా ఐతే మాత్రం .
HE:ఆగలేను వేసెయ్యి ఏదో ఓ చిలిపిమంత్రం .
SHE:వేగలేను ఆపెయ్యి చూపుల చెరకు యంత్రం .
చరణం-1
HE:ఎక్కుఎక్కు ప్రేమబండి . చెయ్యకమ్మా నీవు మొండి .
నీ కన్నా నే జగమొండి .
SHE:తగ్గు తగ్గు ఎక్కువైంది . బుద్ధంటూ ఒక్కటుంది .
నాతో నీ కెందుకు రంధి .
HE:బండరాయా! అమ్మాయీ గుండె నీది .
SHE:పడకపోదా!గుర్తుంచు సాలీడు నీతి .
HE:బతకనీదు . అట్లా అని చావనీదు . ఏమి నాతి?
SHE:ఏమి చేయాలబ్బాయీ!ఆడఈడు చుప్పనాతి .
చరణం-2
SHE:ఇంకా ఇంకా దూరముంటే ఇద్దరికీ బాగుంటుంది .
చూపులకే కొంపే మునిగేట్టుంది .
HE:దూరం దూరం అంటూ ఉంటే దాహం పెరిగేస్తూ ఉంది .
కవ్వింతే వెయ్యింతలు ఔతోంది .
SHE:సంగతేమిటి?జోడైంది సందెగాలి .
HE:కోరుతోంది అవ్వాలని పైటగాలి .
SHE:ప్రేమకవసరం . సహనం,సమయం
నువ్వే తెలుసుకోవాలి .
HE:ఎంతకాలం ఈదాలి ?ఈడు వెల్లువగోదారి .
చిరు చిరు అలకలు
పల్లవి
SHE:చిరు చిరు అలకలు - సిరిసిరి వలపులు
HE:కిరుకిర్రు తలపులు - చురుచురు తపనలు
SHE:దేహాన్ని పాలిస్తూ ఉన్నాయి - దాహాన్ని పెంచేస్తు ఉన్నాయి
HE:మొహాన్ని లేపెస్తూ ఉన్నాయి -మైకాన్ని నింపేస్తూ ఉన్నాయి .
SHE:చంపకు నన్నిలా మత్తుగా సిగ్గుల కిల్లర్
HE:సందడి చేయక చేరవె గుండెల డ్రిల్లర్ .
చరణం-1
SHE:మిలమిల చూపులు - విసవిసమని విసిరెను తూపులు
అరమరలేని వయసులకు మిసమిస విరుపులు .
HE:కిలకిల కన్నులు - కలకల్ ఊసులు .
సరిగమ పాడే మధురిమ చెణుకులు .
SHE:మూసిమూసి నవ్వులు - కుహుకుహు గువ్వలు .
HE:పసిపసి వన్నెలు - కసికసి చిన్నెలు
SHE:తెలియని ఏవో తలపుల పందాలు
HE:మలగని ఏవో మనసుల సాక్ష్యాలు .
SHE:తడబడితే కలబడితే ముడిపడితే -----
HE:లలలలలలలలలల ----------
చరణం-2
HE:తళతళ తళుకులు - కళకళమని వెలిగెను తనువులు
చలిగిలి చంపే చెలుములకు సరిసరి పిలుపులు .
SHE:పకపర పలుకులు - చకచక మలుపులు
గుసగుసలెన్నో తెలిపిన గెలుపులు
HE:కరకర కోర్కెలు - బిరబిర మార్పులు
SHE:సలసల సందెలు - మలమల రాత్రులు
HE:చికుబుకు లయలో కలిగిన చిత్రాలు
SHE:చేకుముకి సడిలో రగిలిన గాత్రాలు
HE:తొలకరిలో సొగసరిలో మరుహొయలో!
SHE:లలలలలలలలలల----------
తనివి తీరలేదని
పల్లవి
HE:తనివి తీరలేదని తెలుపుతోంది మొగమాటం .
SHE:తడిమి ఊరుకోనని జారుతోంది జలపాతం .
HE:ఈ తడితడితోడులో - నీ ఒరవడి జోరులో
SHE:ఆమని పులకింతలో - ఈ వని చివురింతలో
HE:చలిమంటయ్యే జత - (ఆ మదనుని మేడలో ఈ చెలి ఒడి వేడిలో)
SHE:మతి తప్పే వయసు కదా!
చరణం-1
SHE:కన్నులేల తాకెను - వెన్నెలేల పాడెను .
HE:అందమేల పొంగెను - బంధమేల పాడెను .
SHE:వేలేవేల వేణువులు - మోగుతున్న వేళలలో
HE:తీపితీపి వీణియలు - తీగసాగు తీరులలో
SHE:తకతకతక ఆడెను తనువులు
జలజలజల చిందెను మధువులు .
HE:చెరిసగమని పలికెను మనసులు
రసజగమని మురిసెను వయసులు
SHE:రాతినై ఈ వేళలో నీ ఒడిని అలసి సొలసిపోనా!
చరణం-2
HE:చల్లగాలి ఈలలు - మల్లెపూల లీలలు
SHE:గిల్లిపోయె చూపులు - తుళ్ళిపోయె తీపులు .
HE:వచ్చెనేమొ ఆమనులు - విచ్చిపోయె ఈవనులు
SHE:రెచ్చెనేమి కోరికలు - వెచ్చెనయ్యె వేడుకులు .
HE:తహతహతహః లాడెను తలపులు
పకపకపక నవ్వెను మలుపులు .
SHE:బరువైనవి నిన్నటి సులువులు
బిరుసైనవి ఎప్పటి నునుపులు .
HE:అరరే నను చూడనీ!
నీ కథకు కవిని కానీ!
ఒకే భావం
పల్లవి
ఒకే భావం - ఒకే స్నేహం
మరోమారు మనసుగానం .
జాతే వీడని సాహచర్యం .
కాలమే చేరపని బంధము .
అలసటే ఎరగని పయనము
ఇదే వరము - మదికే కలవరము .
చరణం-1
చెప్పకున్నా చెలియగుండె పాడుతోంది అమరగీతం .
తనివి లేని తీపి కోసం జన్మలైనా కావు దూరం .
ఒక్కసారి కలిసిందా - విడిపోదు ఎదను
మొలకెత్తిన అనురాగం .
మరణాన్నె ఎదిరించి - తిరిగి దరికి చేరు
కథయే ప్రణయం .
చరణం-2
చేరువుంటే చాలు నేస్తం - కోరనింక వేరు భాగ్యం
ఈడుజోడు కాని నేను ఔతా నీకు కంటిదీపం .
మూగవేదనౌతున్నా తెలియనీదు ప్రేమ
రగులుతున్న అనుతాపం .
ఏడడుగు లేయకున్నా ఏడేడు జన్మలకూ
మనదే స్నేహం .
చెప్పేదా! చెప్పేదా!
పల్లవి
చెప్పేదా!చెప్పేదా!చెప్పేదా!
నా అందం సతా చూపేదా!
నీ కళ్ళకు మత్తును పూసేదా!
ఆ సూర్యుణ్ణే ఐస్ చేసేదా!
ఈ మూనుకు ఫీవరు తెచ్చేదా!
దా! దా! దా! దా!
చరణం-1
నా కంటిసైగను చూస్తే కాశ్మీరు గొడవే ఉండేదా!
నా ఒంటి బిగువును చూశాడా!బిన్ లాడెన్ బిగుసుకుపోడా!
నా బుంగమూతికి పడిపోయి జార్జ్ బుష్శే బజ్జోడా!
సాకీ: వేయిమాటలెందుకు?నా ఒక్క నవ్వే చాలదా!
దా! దా! దా! దా!
చరణం-2
నా వయ్యారానికి వరల్డ్ బ్యాంకే వడ్డీనే మాఫీచెయ్యదా !
నే సుతారంగా నడిస్తే సునామీ వెనకకి పోదా!
నా కొంగు తగిలితే క్లింటన్ కు వేరే లింకు ఉండేదా!
సాకీ: ఇన్ని గొప్పలెందుకు?నాతో మైక్ టైసన్ కైనా తిప్పలే కదా!
ఖజురహో శిల్పంలా
పల్లవి
ఖజురహో శిల్పంలా కళ్ళెదుట నీవుంటే
కాశ్మీరు లోయల్లో అందాలు నీవంటే
సిగ్గు నిన్ను చూసి , నిగ్గు తేలి మొగ్గ అయ్యింది.
నిన్ను సృష్టి చేసి బ్రహ్మ జన్మ ధన్యమయ్యింది.
చరణం-1
రంభ నిను చూసిందా రగిలిపోకుంటుందా!
నీ దాసిగానైనా పనికొస్తుందా!
మన్మథుడు ఎపుడైనా నిను గనుక చూశాడా !
పూబాణమే జారి పడకుంటుందా!
మిడిసి పడిపోయే ఆ సౌందర్యదేవతలే
ముడుచుకొని పోతారు .
నీ వున్నా లోకంలో మేముండలేమంటూ స్వర్గానికేళతారు.
వేయినోళ్ళు పొగడగలవా!
వేయికళ్ళు కొలవగలవా!
చరణం-2
వెన్నెలే నిను చూసి ఈసుపడకుంటుందా !
నీ చూపుతో పోటీ పడకుంటుందా!
హరివిల్లు ఇల మీద నీ వన్నె చూసిందా!
వన్నెలన్నీ మాసి తెలబోవు కదా!
ప్రకృతే నిను చూసి తనలోని లేములను
తెలుసుకుంటూ ఉంది .
నీ లోని అందంతో తనలోని లోపాన్ని
దిద్దుకుంటూ ఉంది .
వేయినోళ్ళు పొగడగలవా!
వేయికళ్ళు కొలవగలవా!
చిన్ని చినుకమ్మ
పల్లవి
HE:చిన్ని చినుకమ్మ మురిసింది సైరిముత్యమై
మబ్బు మెరుపమ్మ వెలిసింది నీ రూపమై
SHE:వెండి నెలరాజు వెలిగాడు చిరుహాసమై
నిండు వలరాజు కలిశాడు నా నేస్తమై .
HE:సందె అందాల పొత్తిట్లో మణిదీపమై
గుండె గంధాల వాకిట్లో మరువేదమై
SHE:కన్నెకునుకమ్మ మేడల్లో మధుస్వప్నమై
వన్నె విరుసమ్మ నీడల్లో మృదులాస్యమై .
చరణం-1
HE:నీలాల నీ కళ్ళు నా కివ్వు నూరేళ్ళు .
నే చేసుకుంటాను సౌఖ్యాల లోగిళ్ళు .
SHE:నీలోని పరవళ్ళు నాలోని సందళ్ళు
కలబోసుకున్నామా చాలవు వెయ్యేళ్ళు .
HE:అరె విచ్చాయి చీకట్లు - చెప్పాయి అచ్చట్లు
కానివ్వు ముచ్చట్లు .
SHE:(సరి)సరి ఆగాలి కొన్నాళ్ళు - వెయ్యాలి పందిళ్ళు .
మ్రోగాలిగా డోళ్ళు .
HE:ఒదిగే సొగసే ఇక ఆపైన నా సొంతమౌతుందిలే తనుగా!
సాహో సూదంటురాయి
పల్లవి
సాహో సుదంటురాయి
లాగో లాగిందిరోయి
నా రాత్రి శివరాత్రిరా!
చరణం-1
చరణం-2
పల్లవి
అనుమానం అంటే ఓ పెనుభూతం బాబూ!
అనుమానం మొగుడు ఆ భూతానికె బాబూ!
పెళ్ళాం కోతిలా ఉన్నా ఇతడికి డౌటుగ ఉంటుంది .
అందంగా ఉందంటే ఇక చెప్పేదేముంది ?
ఆనుమానం మొగుడు - అందమైన పెళ్ళాలు .
చరణం-1
రామా అన్నా బూతంటూ భూతద్దం తీస్తాడు .
తాళంకప్పా , కావలికుక్కా తన నేస్తాలంటాడు .
లోకంలోని మగాళ్ళనంతా అనుమానిస్తూ ఉంటాడు .
మాడా గాళ్ళే మనసుకు నచ్చిన మగాళ్ళని అంటాడు .
ఆనుమానం మొగుడు - అందమైన పెళ్ళాలు .
చరణం-2
నీడను చూసి ఉలిక్కిపడుతూ పరుగులు తీస్తూ ఉంటాడు .
నిద్దురలోనూ నీతికథలనే భార్యకు చెబుతూ ఉంటాడు .
ఇద్దరుభార్యల నిచ్చాడెందుకో డౌటుకు తోడు పైవాడు .
ప్రతీక్షణం చస్తూ బతుకును ఈడుస్తాడు ఇతగాడు .
ఆనుమానం మొగుడు - అందమైన పెళ్ళాలు .
పల్లవి
HE:మోరు మోరు మంగమ్మా! జోరుజోరుగుందమ్మో!
SHE:క్యారు క్యారు కావయ్యో!చారు చారు కాకయ్యో!
HE:ధనియాల పప్పెపుడు దంచుతావమ్మో!
SHE:మిరియాల పొడిమల్లే మండుతానయ్యో!
HE:చందమామవే!చిందులెయ్యమాకవే!
SHE:కోతిబావయో!కన్ను గీటమాకవే!
HE:జంకలకిడి జమ్మా!జమ్మా!జాంపండువే!
SHE:గుంతలకిడి గుమ్మా!గుమ్మా!గంగవెర్రులే!
చరణం-1
SHE:అత్తగారి అట్లకాడల వాతలప్పుడే మరిచావా?
నిన్న పెట్టిన తిట్లభోజనం పాతఖాతాలో కలిపావా?
HE:పెద్దవాళ్ళ తిట్లన్నీ నా పాలిత దీవెనెలే!
ఆఫీసరయ్యి అల్లుడిగా కాళ్ళు కడిగించుకుంటాలే !
SHE:ఆ రోజెప్పుడు వస్తుందమ్మా!
HE:వేచి చూడవే మంగమ్మా!
చరణం-2
SHE:ఇన్నినాళ్ళ ప్రేమ సంగతి పెళ్ళికి చేరేదేప్పుడు?
కోరికుంటే చాలదయ్యో అమ్మ ఊరికే ఒప్పుడు .
HE:అమ్మే కాదు అమ్మమ్మైనా ఒప్పుకుంటుందిలే !
కారేసుకెళ్ళి కన్యాదానం చేయించుకుంటాలే!
కారేసుకెళ్ళి కన్యాదానం చేయించుకుంటాలే!
SHE:అంత ధీమా ఏమిటమ్మా?
HE:ప్రేమే ఇచ్చిన ధైర్యమమ్మా!
పల్లవి
SHE:పైటేల పైట లాగమాకురో - సందేళ సైగ చెయ్యమాకురో !
చిన్నదాన్నిరో!సిగ్గులున్నదాన్నిరో!
నాటుమోటు నాపసాని నేను కానురో!
ముందరుంది ముచ్చటంత దూరముందిరో!
HE:ఆ వంక చెప్పి ఆపమాకవే! నా వంక నవ్వవేమిటే!
ఎన్నిరోజులు ఇట్ల ఎదురుచూడనే!
కోపమొద్దు ఒక్కసారి కనికరించవే!
మాట ఇచ్చి వెళ్ళిపోతే చాలుచాలులే!
చరణం-1
SHE:డైమండు నెక్లెస్సు ఆశ చూపినా
ఫైస్టారు హోటళ్ళ ఫుడ్డు పెట్టినా
పువ్వు లిచ్చినా ఎంత రెచ్చగొచ్చినా
నే లొంగిపోనయ్యో టైం వేస్టులే!
నీ ఆశ దోశ అప్పడం వడే!
HE:డైమండు నెక్లెస్సు దిగదుడుపులే!
ఫైస్టారు ఫుడ్డంత నీ ప్రేమకే!
పువ్వు లెందుకే నీ నవ్వు చాలులే!
ఊ అంటె నే మూడుముళ్ళేస్తాలే!
నా బ్రహ్మచర్యాన్ని వదిలేస్తాలే!
చరణం-2
SHE:వద్దొద్దని నేను ఛీ కొట్టినా,
ఐ లవ్ యు అంటు రావొచ్చునా!
ఊరి నిండుగా ఇన్ని ఫిగరులుండగా!
నా వెంట పడతావు ఇది ఏందిరో?
ఆ బ్యూటీ షకిలానే చూడరో!
HE:ఇనాళ్ళు వెదికాను అడుగడుగునా!
నరుదైనా అందాలు కనిపించెనా?
ఇన్ని ఏళ్ళుగా పెళ్ళి ఊసు లేదులే!
ఆ మిస్సు వెల్డైన అప్పలమ్మెలే!
నీ దివ్యరూపం పడగొట్టెలే!
చుమ్మా!చుమ్మా!
పల్లవి
HE:చుమ్మా!చుమ్మా!చంబల్ రాణి!
యమ్మా!యమ్మా!యవ్వన్ టాణీ!
చికెన్ సూపు ఇస్తావా!
మటన్ ఫ్రై పెడతావా!
ఫిష్ ప్రాన్స్ చేసిపెట్టవే!ఓ కొర్రమీనా!
బొమ్మిడాయిల పులుసు చెయ్యవే!
SHE:నైరానైరా నాన్ వెజ్ నానీ!
సర్దాసర్డా చెయ్ రా జానీ!
తిండి గోల మానవా!అందం వంక చూడవా!
బెంగపడ్డ భామన్ చూడరా!ఓ ఫుడ్డు భీమా!
ముద్దుముచ్చటలన్నీ తీర్చరా!
చరణం-1
HE:తిండిని గోల అంటె ఎట్ల?
కండలు పెంచే వీలెట్ల?
పూటకో వెరైటీ ఫుడ్డుంటే కన్నెకొమ్మా!
అంతకన్నా లక్కేముందంట?
SHE:కండలు పెంచి ఏం చేస్తావు?
గుండెలో గుబులు తెలుసుకోవు
ఎట్ల నేను చావనమ్మా చందమామా!
ఇట్ల వీణ్ణి చేశాడె ఆ బ్రహ్మ!
చరణం-2
SHE:అతిగా తింటే వొళ్ళొస్తుంది
ఒంట్లో వేడి చల్లార్తుంది .
ముద్దులు నోటికి కుక్కడమేనా!ఫుడ్డుభీమా!
ముద్దుల మాటే రాదే ఏంటమ్మా!
HE:అంతగ ఫీలై పోకే భామా!
టెస్టే చేశా నీలో ప్రేమ!
పక్కన నువ్వే ఉండగ ముద్దుగుమ్మా
ఆకలి ఊసే నాకు రాదంట .
చక్కని శిల్పం
పల్లవి
HE:చక్కని శిల్పం చెలిరూపం
ఎదనే చేసెను యమునాతీరం .
చెలియ నునుసిగ్గులే వలపు సిరిమొగ్గలే!
SHE:మక్కువ చూపే పతిదైవం .
మమతల కోవెల ఇల్లే స్వర్గం .
మగని చిరు అలకలే మగువ కవి నోములే!
చరణం-1
HE:ముత్యాలే జలజలరాలే మకరందం గలగలపారే
మగువ చిరునవ్వులే!
నా ఇంట నవరత్నాలై నా కంట మాణిదీపాలై
నిలిచి వెలిగాయిలే ------
బ్రతుకు నింపాయిలే !
SHE:సంసారం సరిగమ కాగా , సంతోషం పదనిస కాగా,
మనది అనురాగమే ------
ఇల్లాలే పూజకు పువ్వే,ఇలవేల్పుగ భర్తను కొలిచే
కాపురం కలశమే -------
కలల కాసారమే (కలల సుఖతీరమే!)
చరణం-2
HE:సిరులన్నీ సరసన నడిచే,సరదాలే విరులై కురిసే
సఖియ చిరునడకలే------
నా ముంగిట మువ్వలసడిగా,నా వాకిట గాజులసడిగా
కదులు తున్నాయిలే-----కలలు పండాయితే !
SHE:బ్రతుకంతా ప్రమిదను ,నా ప్రేమను దీపం చేసి,
హారతే ఇవ్వనా-----
జన్మంటూ మళ్ళీ ,నీ జంటగా నేనే ఉండే
వరమునే కోరనా------నీ ఒడిలో కనుమూయనా!
నేనేరా సుందరవదనా!
పల్లవి
SHE:నేనేరా సుందరవదనా!నాతోనా చిందులు మదనా!
HE:(DIALOGUE )ఏయ్!నీటొద్దు,నాటు----నాటు .
SHE:(DIALOGUE )నాతో ఆడే దమ్ముందా!
HE:(DIALOGUE )ఆ(! ఇరగ దీస్తాం
SHE:అ(DIALOGUE )అదీచూద్దాం . ఏస్కోండ్రా నాటు బీటు .
SHE:నేనేరా సుందరవదనా!నాతోనా చిందులు మదనా!
నాటైనా నీటే అయినా నా సాటి నేనే కన్నా!
తందానా ఆడి,తబ్బిబ్బు చేసి,
నీ పస నే చూసెయ్యనా!
HE:కసిగాయవే ఇంకా లలనా!పసివయసుకు ఈ కసి తగునా!
అరవోణీని అరుపే చెయ్ నా!
అనుభవముంటే పదునెట్టనా!
అబ్బబ్బో పోటీ కొమ్ములు తిరిగిన మాతోనా !
SHE:చూపిస్తా నా తడాఖా!
అందంతో కాదు మజాకా !
HE:ఆడిస్తా నే సరదాగా!
ఓడించి వేస్తా పాగా!
SHE:చూస్తాగా!
చరణం-1
SHE:చూశాను చిత్తూరు చిత్తే చేశాను సారూ
పెద్దాపురం మెళ్ళి నేను గద్దే ఎక్కేసినాను .
వెళ్ళాను ఒంగోలు వాళ్ళంతా కంగారు .
జడ్చర్ల జంక్షన్ లో జెండా పాతేసినాను .
చిలకలూరిపేట,నరసరావుపేట
హడలెత్తి పంపాయి చెప్పేసి నాకు టాటా!
HE:అమ్మమ్మమ్మో!అంతోద్డుచాల్లే
ఆ ఊళ్ళో మేముంటే తెలిసేదిలే!
అమ్మో అమ్మో అమ్మో అమ్మో చెవిలోపూలెట్టకే
నీ కన్నా ముదుర్లను చూశాములే!
SHE:హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ -హా --య్ !
HE:కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ -- కొయ్ కొయ్!
చరణం-2
SHE:గుడివాడ వెళ్ళాను గుడినే మింగేసినాను .
కాకినాడ హార్బరంత బ్యార్ మనిపించాను .
సైదాపేటేళ్ళి చూడు సైరా అనిపించాను .
నైజామేరియ వాళ్ళను నై!జా!అని పంపాను .
అనంతపురం కడప కర్నూలు ఫ్యాక్షను జిల్లాలో
నా అందం చూసేసి పడ్డారు టెన్షన్ లో
HE:అబ్బాబ్బబ్బో!అంత సీన్ లేదులే!
మా లాంటి కత్తులు నీకు తగల్లేదులే!
అబ్బో!అబ్బో!ఈ కథ కొత్తేం కాదే!
నిక్కర్ల వయసులోనె విన్నాములే!
SHE:హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ -హా --య్ !
HE:కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ -- కొయ్ కొయ్!
కాకినాడ హార్బరంత బ్యార్ మనిపించాను .
సైదాపేటేళ్ళి చూడు సైరా అనిపించాను .
నైజామేరియ వాళ్ళను నై!జా!అని పంపాను .
అనంతపురం కడప కర్నూలు ఫ్యాక్షను జిల్లాలో
నా అందం చూసేసి పడ్డారు టెన్షన్ లో
HE:అబ్బాబ్బబ్బో!అంత సీన్ లేదులే!
మా లాంటి కత్తులు నీకు తగల్లేదులే!
అబ్బో!అబ్బో!ఈ కథ కొత్తేం కాదే!
నిక్కర్ల వయసులోనె విన్నాములే!
SHE:హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ -హా --య్ !
HE:కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ -- కొయ్ కొయ్!
నిషా నిషా నిషా!
పల్లవి
నిషా నిషా నిషా! నిషా నిషా నిషా!
నీ కళ్ళల్లో నిషా!ఒళ్ళంతా నిషా!
ఈ చీకట్లో నిషా!నీ కౌగిట్లో నిషా!
నిషా నిషా నిషా!
చరణం-1
ఈ చీకులు చింతలు జానేదో!
బాధలు బరువులు రహెనేదో!
దోచెయ్ రా దోసిళ్ళతో సుఖం
ఈ కైపె మన స్వర్గం
నీదేరా ఈ రోజు
ఈ రోజుకు నీవే
రేపన్నది ఓ బూజు .
నిషాతో పెంచు మోజు!
చరణం-2
ఈ లోకంలో ఎవరికి వారే!
సుఖపడరా యమునా తీరే!
ఎవరేమన్నా లేదు భయం .
అనుభవమే మనకు ప్రియం .
ఆ నింగి తారే నేను .
ఈ రాత్రికి నేనే క్వీను.
ఆ చుక్కలలో ఉన్న మూను .
రారమ్మంతోంది నన్ను.
చరణం-3
హద్దులు అన్నవి అంతా ట్రాష్
పెద్దల సుద్దులు చేసెయ్ యాష్
ఈ నాటికి ఈ సుఖమే సత్యం .
చేయకు అర్థం లేని పథ్యం .
ఎవరెవరన్నది కా దవసరం .
ఒకరికి ఒకరం ఈ దినం .
చలినే కాల్చేసే యవ్వనం .
ఇక అగదు సాగరమథనం
విషమును మింగితె శివుడికి నిషా !
మయశిల్పి తమితీర
పల్లవి
మయశిల్పి తమితీర మలిచిన శిల్పానివో !
మతిపోవ జతకూర్చు శృంగార మంత్రానివో !
మదనోత్సవాన సురనాట్యబాణివో!
మౌనముగ మది తొలుచు మన్మథుని రాణివో!
చరణం-1
నీలిమేఘాల పొత్తిళ్ళలోన
నవ్వు చిందించు పసివర్శమా!
వేయిదీపాల వాకిళ్ళ వెలుగుల్లో
ఓలలాడేటి వయ్యారమా!
విరబూసిన అరవిందమా!
తుమ్మెద ఆనని మకరందమా!
దరిచేరవే మధుమాసమా!
చరణం-2
రాధ లేకున్నమాధవుని(కృష్ణుణ్ణి)లోగొన్న
తీయనైన ఓ విరహమా!
హరుని విలు వొంచు రాముణ్ణి కాంచు
(రాఘవుని తిలకించు)
సీతలో మెరయు సింగారమా!
ఆ కణ్వుని వనదీపమా!
అభిమన్యుని చెలిరూపమా!
అలరింపవే అనురాగమా!
సరిగమలే పలికే
పల్లవి
HE:సరిగమలే పలికే ఈ సంతోషం మనదే!
SHE:మధురిమలే ఒలికే ఈ సంగీతం మనదే!
HE:ఆనందం మన సొంతం . ఆత్మీయత మన బంధం .
SHE:అనుబంధం అంటేనే మనమేలే నిర్వచనం .
HE&SHE:ఈ స్నేహం అతిసుందరం .
శతమానం ఆగనిపయనం .
చరణం-1
HE:సాగర మాగినా ఆరని ఈ అనురాగం.
నూతనం,విన్నూతనం,అనునిత్యం నూతనం .
SHE:జన్మలే చాలని ఈ తీయని సంగమం.
అంకితం,అంకితం,స్నేహానికి పునరంకితం .
HE:ఆ చంద్రుని చల్లదనం మాటలలో మంత్రం.
SHE:భూదేవి ఈసుపడే సహనం మా సొంతం .
HE&SHE:ఈ స్నేహం అతిసుందరం .
శతమానం ఆగని పయనం .
చరణం-2
SHE:కన్నులె చాలని ఈ కమనీయ బంధనం .
చందనం చందనం మదికే శ్రీ చందనం .
HE:హద్దులె ఆపని ఈ వెచ్చని సావాసం .
అమరం అమరం ఏనాటికీ అజరామరం .
SHE:ఆ చుక్కలు దిక్కుల్లాగా మన ఈ స్నేహం నిత్యం .
HE:ఏ మృత్యువు విడదియ్యను ఇష్టపడదు ఇది సత్యం .
SHE&HE:ఈ స్నేహం అతిసుందరం .
శతమానం ఆగని పయనం .
నీ రాక కోసం
పల్లవి
నీ రాక కోసం నా మనసు వేచింది చూడు .
నీ దారి నిండా పూచాయి నా ప్రేమపూలు
ఈ ప్రేమజగతిలో నీ జతగ ఉండాలని
నీ తలపురాజ్యంలో రారాణిగ నిలవాలని .
ఎనలేని ఆరాటం నాకు
తెలిసెన ఈ సొద నీ ఎదకు .
చరణం-1
కాలాన్ని కల్లాపి చల్లి
మధురోహల ముగ్గుల్ని అల్లి
రత్నకంబాళాలు నీకు గుచ్చునోయని
పాన్పు వేసిందిక్కడ పారిజాతరేకు .
చేస్తుందట మనకు గంధర్వమనువు .
చరణం-2
గంధాల వెల్లువలు తెచ్చి
మకరందపు మధురిమ కూర్చి .
వనదేవి పైట మెచ్చి నీవెన చేసి
వేచి నిలిచిందిదిగో వేకువమాపు .
ఆలసించక తనను కరిగించమనుచు .
తొలిసారిగా
పల్లవి
తొలిసారిగా నిన్ను చూశాను .
ఒంటరివి అనుకున్నాను .
ఏదో తెలియని బంధం ఎదను లాగింది .
నిను గుండె కత్తుకొని ఓదార్చమంది .
చరణం-1
ఏ చోట ఉన్నా నిను వెదికాయి కనులు .
ఎ వేళనైనా నిను తరచాయి స్మృతులు .
నీ మౌనగీతం నా గుండె విన్నది .
నీ భావమంతా నింపేసుకున్నది .
ఇకపైన అవుతాను నీ తోడును .
నీ నడకలో నే జోడును . నిను వీడను .
చరణం-2
నీ నవ్వు కోసమె నే నవ్వెను చూడు .
నీ ప్రేమ కోసమె నే పాడేను నేడు .
నా మనసు నిన్ను తెలుసుకొమ్మంది .
నా వయసు నిన్ను కలుసుకొమ్మంది .
చాలు విడనాడు ఈ మౌనము .
నా గుండెకే నీవు సాదము . జీవనాదము .
ఓ బ్రహ్మదేవా!
పల్లవి
HE:ఓ బ్రహ్మదేవా!ఇదేం పాలకోవా!
నోరు ఊరిపోతోంది చూడయ్యా!
SHE:చాలించు జీవా!మరీ ఇంత యావా!
ఉట్టి కెక్కి స్వర్గమనకు ఓరయ్యా!
HE:వయసుల్లో ఉండే సూత్రము ఈ ఆత్రం .
SHE:మాక్కూడా తెలుసులె ఇంతగనా ఐతే మాత్రం .
HE:ఆగలేను వేసెయ్యి ఏదో ఓ చిలిపిమంత్రం .
SHE:వేగలేను ఆపెయ్యి చూపుల చెరకు యంత్రం .
చరణం-1
HE:ఎక్కుఎక్కు ప్రేమబండి . చెయ్యకమ్మా నీవు మొండి .
నీ కన్నా నే జగమొండి .
SHE:తగ్గు తగ్గు ఎక్కువైంది . బుద్ధంటూ ఒక్కటుంది .
నాతో నీ కెందుకు రంధి .
HE:బండరాయా! అమ్మాయీ గుండె నీది .
SHE:పడకపోదా!గుర్తుంచు సాలీడు నీతి .
HE:బతకనీదు . అట్లా అని చావనీదు . ఏమి నాతి?
SHE:ఏమి చేయాలబ్బాయీ!ఆడఈడు చుప్పనాతి .
చరణం-2
SHE:ఇంకా ఇంకా దూరముంటే ఇద్దరికీ బాగుంటుంది .
చూపులకే కొంపే మునిగేట్టుంది .
HE:దూరం దూరం అంటూ ఉంటే దాహం పెరిగేస్తూ ఉంది .
కవ్వింతే వెయ్యింతలు ఔతోంది .
SHE:సంగతేమిటి?జోడైంది సందెగాలి .
HE:కోరుతోంది అవ్వాలని పైటగాలి .
SHE:ప్రేమకవసరం . సహనం,సమయం
నువ్వే తెలుసుకోవాలి .
HE:ఎంతకాలం ఈదాలి ?ఈడు వెల్లువగోదారి .
చిరు చిరు అలకలు
పల్లవి
SHE:చిరు చిరు అలకలు - సిరిసిరి వలపులు
HE:కిరుకిర్రు తలపులు - చురుచురు తపనలు
SHE:దేహాన్ని పాలిస్తూ ఉన్నాయి - దాహాన్ని పెంచేస్తు ఉన్నాయి
HE:మొహాన్ని లేపెస్తూ ఉన్నాయి -మైకాన్ని నింపేస్తూ ఉన్నాయి .
SHE:చంపకు నన్నిలా మత్తుగా సిగ్గుల కిల్లర్
HE:సందడి చేయక చేరవె గుండెల డ్రిల్లర్ .
చరణం-1
SHE:మిలమిల చూపులు - విసవిసమని విసిరెను తూపులు
అరమరలేని వయసులకు మిసమిస విరుపులు .
HE:కిలకిల కన్నులు - కలకల్ ఊసులు .
సరిగమ పాడే మధురిమ చెణుకులు .
SHE:మూసిమూసి నవ్వులు - కుహుకుహు గువ్వలు .
HE:పసిపసి వన్నెలు - కసికసి చిన్నెలు
SHE:తెలియని ఏవో తలపుల పందాలు
HE:మలగని ఏవో మనసుల సాక్ష్యాలు .
SHE:తడబడితే కలబడితే ముడిపడితే -----
HE:లలలలలలలలలల ----------
చరణం-2
HE:తళతళ తళుకులు - కళకళమని వెలిగెను తనువులు
చలిగిలి చంపే చెలుములకు సరిసరి పిలుపులు .
SHE:పకపర పలుకులు - చకచక మలుపులు
గుసగుసలెన్నో తెలిపిన గెలుపులు
HE:కరకర కోర్కెలు - బిరబిర మార్పులు
SHE:సలసల సందెలు - మలమల రాత్రులు
HE:చికుబుకు లయలో కలిగిన చిత్రాలు
SHE:చేకుముకి సడిలో రగిలిన గాత్రాలు
HE:తొలకరిలో సొగసరిలో మరుహొయలో!
SHE:లలలలలలలలలల----------
తనివి తీరలేదని
పల్లవి
HE:తనివి తీరలేదని తెలుపుతోంది మొగమాటం .
SHE:తడిమి ఊరుకోనని జారుతోంది జలపాతం .
HE:ఈ తడితడితోడులో - నీ ఒరవడి జోరులో
SHE:ఆమని పులకింతలో - ఈ వని చివురింతలో
HE:చలిమంటయ్యే జత - (ఆ మదనుని మేడలో ఈ చెలి ఒడి వేడిలో)
SHE:మతి తప్పే వయసు కదా!
చరణం-1
SHE:కన్నులేల తాకెను - వెన్నెలేల పాడెను .
HE:అందమేల పొంగెను - బంధమేల పాడెను .
SHE:వేలేవేల వేణువులు - మోగుతున్న వేళలలో
HE:తీపితీపి వీణియలు - తీగసాగు తీరులలో
SHE:తకతకతక ఆడెను తనువులు
జలజలజల చిందెను మధువులు .
HE:చెరిసగమని పలికెను మనసులు
రసజగమని మురిసెను వయసులు
SHE:రాతినై ఈ వేళలో నీ ఒడిని అలసి సొలసిపోనా!
చరణం-2
HE:చల్లగాలి ఈలలు - మల్లెపూల లీలలు
SHE:గిల్లిపోయె చూపులు - తుళ్ళిపోయె తీపులు .
HE:వచ్చెనేమొ ఆమనులు - విచ్చిపోయె ఈవనులు
SHE:రెచ్చెనేమి కోరికలు - వెచ్చెనయ్యె వేడుకులు .
HE:తహతహతహః లాడెను తలపులు
పకపకపక నవ్వెను మలుపులు .
SHE:బరువైనవి నిన్నటి సులువులు
బిరుసైనవి ఎప్పటి నునుపులు .
HE:అరరే నను చూడనీ!
నీ కథకు కవిని కానీ!
ఒకే భావం
పల్లవి
ఒకే భావం - ఒకే స్నేహం
మరోమారు మనసుగానం .
జాతే వీడని సాహచర్యం .
కాలమే చేరపని బంధము .
అలసటే ఎరగని పయనము
ఇదే వరము - మదికే కలవరము .
చరణం-1
చెప్పకున్నా చెలియగుండె పాడుతోంది అమరగీతం .
తనివి లేని తీపి కోసం జన్మలైనా కావు దూరం .
ఒక్కసారి కలిసిందా - విడిపోదు ఎదను
మొలకెత్తిన అనురాగం .
మరణాన్నె ఎదిరించి - తిరిగి దరికి చేరు
కథయే ప్రణయం .
చరణం-2
చేరువుంటే చాలు నేస్తం - కోరనింక వేరు భాగ్యం
ఈడుజోడు కాని నేను ఔతా నీకు కంటిదీపం .
మూగవేదనౌతున్నా తెలియనీదు ప్రేమ
రగులుతున్న అనుతాపం .
ఏడడుగు లేయకున్నా ఏడేడు జన్మలకూ
మనదే స్నేహం .
చెప్పేదా! చెప్పేదా!
పల్లవి
చెప్పేదా!చెప్పేదా!చెప్పేదా!
నా అందం సతా చూపేదా!
నీ కళ్ళకు మత్తును పూసేదా!
ఆ సూర్యుణ్ణే ఐస్ చేసేదా!
ఈ మూనుకు ఫీవరు తెచ్చేదా!
దా! దా! దా! దా!
నా కంటిసైగను చూస్తే కాశ్మీరు గొడవే ఉండేదా!
నా ఒంటి బిగువును చూశాడా!బిన్ లాడెన్ బిగుసుకుపోడా!
నా బుంగమూతికి పడిపోయి జార్జ్ బుష్శే బజ్జోడా!
సాకీ: వేయిమాటలెందుకు?నా ఒక్క నవ్వే చాలదా!
దా! దా! దా! దా!
చరణం-2
నా వయ్యారానికి వరల్డ్ బ్యాంకే వడ్డీనే మాఫీచెయ్యదా !
నే సుతారంగా నడిస్తే సునామీ వెనకకి పోదా!
నా కొంగు తగిలితే క్లింటన్ కు వేరే లింకు ఉండేదా!
సాకీ: ఇన్ని గొప్పలెందుకు?నాతో మైక్ టైసన్ కైనా తిప్పలే కదా!
దా! దా! దా! దా!
పల్లవి
ఖజురహో శిల్పంలా కళ్ళెదుట నీవుంటే
కాశ్మీరు లోయల్లో అందాలు నీవంటే
సిగ్గు నిన్ను చూసి , నిగ్గు తేలి మొగ్గ అయ్యింది.
నిన్ను సృష్టి చేసి బ్రహ్మ జన్మ ధన్యమయ్యింది.
చరణం-1
రంభ నిను చూసిందా రగిలిపోకుంటుందా!
నీ దాసిగానైనా పనికొస్తుందా!
మన్మథుడు ఎపుడైనా నిను గనుక చూశాడా !
పూబాణమే జారి పడకుంటుందా!
మిడిసి పడిపోయే ఆ సౌందర్యదేవతలే
ముడుచుకొని పోతారు .
నీ వున్నా లోకంలో మేముండలేమంటూ స్వర్గానికేళతారు.
వేయినోళ్ళు పొగడగలవా!
వేయికళ్ళు కొలవగలవా!
చరణం-2
వెన్నెలే నిను చూసి ఈసుపడకుంటుందా !
నీ చూపుతో పోటీ పడకుంటుందా!
హరివిల్లు ఇల మీద నీ వన్నె చూసిందా!
వన్నెలన్నీ మాసి తెలబోవు కదా!
ప్రకృతే నిను చూసి తనలోని లేములను
తెలుసుకుంటూ ఉంది .
నీ లోని అందంతో తనలోని లోపాన్ని
దిద్దుకుంటూ ఉంది .
వేయినోళ్ళు పొగడగలవా!
వేయికళ్ళు కొలవగలవా!
చిన్ని చినుకమ్మ
పల్లవి
HE:చిన్ని చినుకమ్మ మురిసింది సైరిముత్యమై
మబ్బు మెరుపమ్మ వెలిసింది నీ రూపమై
SHE:వెండి నెలరాజు వెలిగాడు చిరుహాసమై
నిండు వలరాజు కలిశాడు నా నేస్తమై .
HE:సందె అందాల పొత్తిట్లో మణిదీపమై
గుండె గంధాల వాకిట్లో మరువేదమై
SHE:కన్నెకునుకమ్మ మేడల్లో మధుస్వప్నమై
వన్నె విరుసమ్మ నీడల్లో మృదులాస్యమై .
చరణం-1
HE:నీలాల నీ కళ్ళు నా కివ్వు నూరేళ్ళు .
నే చేసుకుంటాను సౌఖ్యాల లోగిళ్ళు .
SHE:నీలోని పరవళ్ళు నాలోని సందళ్ళు
కలబోసుకున్నామా చాలవు వెయ్యేళ్ళు .
HE:అరె విచ్చాయి చీకట్లు - చెప్పాయి అచ్చట్లు
కానివ్వు ముచ్చట్లు .
SHE:(సరి)సరి ఆగాలి కొన్నాళ్ళు - వెయ్యాలి పందిళ్ళు .
మ్రోగాలిగా డోళ్ళు .
HE:ఒదిగే సొగసే ఇక ఆపైన నా సొంతమౌతుందిలే తనుగా!
సాహో సూదంటురాయి
పల్లవి
సాహో సుదంటురాయి
లాగో లాగిందిరోయి
నా రాత్రి శివరాత్రిరా!
చరణం-1
చరణం-2
SHE:అ
HE:అ
SHE:అ
HE:అ
SHE:అ
HE:అ
SHE:అ
HE:అ
A
పల్లవి
చరణం-1
చరణం-2
పాటలు రాసిన చిత్రాలు
1)రాజువయ్యా మారాజువయ్యా, 2)పోసాని జెంటిల్ మెన్ , 3)సోల్జర్,
4)శీనుగాడు , 5)పరంపర, 6) సిసింద్రీ బాబాయ్ ,
7)లవ్ జంక్షన్ , 8)ఆ అంతస్తులో, 9)ప్రేమించే రోజుల్లో ,
10)ప్రేమతో నువ్వు వస్తావని, 11)ప్రియమైన శ్రీమతి, 12)మాంగో ,
13)సర్కార్, 14)పోలీస్ అధికారి , 15) 4 కపుల్స్ ,
16)నా మొగుడు చిరంజీవి, 17)గజ దొంగలు , 18) 100% లవ్,
19)జననీ జన్మ భూమిశ్చా , 20)భార్య , 21)జీవనపోరాటం ,
22)నీ పిలుపు కోసం, 23)కొత్త జీవితం, 24)పక్కింటి అమ్మాయి ,
25)దొరగారింట్లో దొంగలు , 26)వంశీ కృష్ణ , 27)వీడా,
28)నవ్వుల సందడి , 29)ఘరానామొగుడు , 30)నియంత,
31)రౌడీ గారి పెళ్ళాం , 32)దోషి, 33)గాలి శీను ,
34)రంభ -రాంబాబు , 35)లక్ష్మీ రాజా , 36)మేడమ్ మేడమ్ YES మేడమ్ ,
37)నిజం నిజం ఒకటే నిజం , 38)హైటెక్ లవ్, 39) జాదూగాళ్ళు ,
40)రాంగ్ నంబర్ , 41)SORRY BOYS, 42)ఉద్రేకం ,
43)చిన్నా, 44)యమకేటుగాడు 45)మాలిష్ మంగ ,
46)ఆ ఇంట్లో ఒక రోజు , 47)పోలీస్ ఎంక్వైరీ, 48)టార్గెట్,
49)బుల్లెబ్బాయ్ , 50)కిరాయి గూండా
పొందిన పురస్కారాలు
విశిష్ట మహిళ -- జూనియర్ చాంబర్స్ తిరుపతి
విశిష్ట మహిళ -- యునెస్కో క్లబ్ బెస్ట్ లేడీ 2010 (సినీ గీత రచన)-- అభినందన సంస్థ ,హైదరాబాద్
ఉత్తమ గేయరచయిత్రి -- భరతముని అకాడమి
గ్రేట్ డాటర్ ఆఫ్ ద సాయిల్ -- కడపోత్సవ కమిటీ
బెస్ట్ గోల్డెన్ కపుల్ -- యునెస్కో క్లబ్
బెస్ట్ ఆల్ రౌండర్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ -- జమ్మలమడుగు డిగ్రీ కాలేజి కమిటీ
రచన :- రాణీ పులోమజా దేవి
ఎడిటర్ గారూ !
నమస్తే . నా కవిత నా నైటీ నేటి నిజం లో ప్రచురణార్థం పంపుతున్నాను . ఇది నా సొంత కవిత . దేనికి అనువాదం కాదు . నచ్చిన ప్రచురించగలరు .
నమస్తే . నా కవిత నా నైటీ నేటి నిజం లో ప్రచురణార్థం పంపుతున్నాను . ఇది నా సొంత కవిత . దేనికి అనువాదం కాదు . నచ్చిన ప్రచురించగలరు .
ధన్యవాదములు
భవదీయ
రాణీ పులోమజాదేవి
రచయిత్రి
H .NO . 8 - 2 -293 / D / 19
జవహర్ కాలనీ
జూబ్లీహిల్స్ క్రాస్ రోడ్స్
హైదరాబాద్ - 33
CELL NO - 9949384891
భవదీయ
రాణీ పులోమజాదేవి
రచయిత్రి
H .NO . 8 - 2 -293 / D / 19
జవహర్ కాలనీ
జూబ్లీహిల్స్ క్రాస్ రోడ్స్
హైదరాబాద్ - 33
CELL NO - 9949384891